(సదస్సు పత్రాల సంకలనం)

TUN)

ఆంధ్ర ారస్టత పం పరిషత్తు

me తిలక్‌ రోడ్డు, హైదరాబాద్‌-1 = క్‌

న.

61011

ఆంధ్రసారస్వత పరిషత్తు సప్తతి మహోత్సవ ప్రత్యేక ప్రచురణ “అరం లర్‌ తెలులళు సాహిత్య వికాసం”

(2013 ఏప్రెల్‌ 26 పరిషత్‌లో నిర్వహించిన సదస్సు పత్రాల సంకలనం)

ప్రధాన సంపాదకులు జ్ఞానపీఠ పురస్కార (గ్రహీతలు, పద్మభూషణ్‌ డా॥ సి.నారాయణరెడ్డి ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు

సంపాదకులు డా॥ జె.చెన్నయ్య ప్రధానకార్యదర్శి ఆంధ్ర సారస్వత పరిషత్తు

ఆంధ్ర సారస్వత పరిషత్తు తిలక్‌రోడ్‌, ఆబిడ్స్‌, హైదరాబాద్‌ - 1

TELANGANALO TELUGU SAHITHYA VIKASAM (DEVELOPMENT OF TELANGANA LITERATURE IN TELANGANA) (Compilation of Seminar Papers)

Pages :300

First Published : May 2013

Copies : 1000

© Reserved : Andhra Saraswatha Parishath

Price : 150 /-

For Copies : Andhra Saraswatha Parishath Tilak Road, Abids, Hyd - 1 Ph : 040-24753724

Composed : Smt. Lakshmi SrinivasaRao Cel! : 9885021639

Printed at : Sai Likhitha Printers

Khairatabad, Hyd -4

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత

డాక్టర్‌ సి. నారాయణరెడ్డి ఎక్స్‌ ఎం.పి. ఎం.ఏ., పిహెచ్‌.డి., డిలిట్‌.

అధ్యక్షులు

ఆంధ్ర సారస్వత పరిషత్తు

తిలక్‌ రోడ్‌, హైదరాబాదు - 500 001.

అవతారిక

నిజాం పాలనలో తెలుగు భాషాదీపం కొడిగట్టిన కాలంలో దాని పునరుద్దీపనానికి ఉద్యమించిన మాతృసంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్తు. శ్రీ మాడపాటి హనుమంతరావు, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి, శ్రీ లోకనంది శంకరనారాయణరావు వంటి పలువురు సాహితీమూర్తుల ఢేరణతో పరిషత్తు 1943లో రూపుదిద్దుకొని, రోజు ఆంధ్రప్రదేశ్‌లో అగ్రేసర సాహితీ సంస్థగా విశిష్టస్థానం వహించింది. మాన్య మిత్రులు డా. దేవులపల్లి రామానుజరావుగారు యావజ్జీవం పరిషత్తు అభివృద్ధికి శ్రమించారు. ఉత్తమాదర్శాలతో, ఆశయాలతో ఆవిర్భవించిన పరిషత్తు కాలానుగుణంగా బహుముఖీన కార్యక్రమాలు చేపట్టి సమర్థంగా నిర్వహిస్తూ అందరి మన్ననలందుకుంటున్నది. వీటిలో భాషా బోధన, [గ్రంథ ప్రచురణ ముఖ్యభూమికలు వహిస్తున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాథమిక, ప్రవేశ, విశారద పరీక్షలు జరపడంతోపాటు, తెలుగు పండిత శిక్షణ కళాశాల, స్నాతకోత్తరస్థాయి ప్రాచ్యకళాశాల నిర్వహిస్తున్నది. పరిషత్తు రూపొందించి నిర్వహించే సాహితీ సభలు, సమావేశాలు, ప్రసంగాలు, సదస్సులు, ఉత్సవాలు, చర్చాగోష్టులు, ప్రసంగాత్మక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి వైలక్షణ్యాన్ని చేకూర్చుకున్నాయి. పరిషత్తు ప్రచురించే గ్రంథాలను సాహితీ లోకం హార్దికంగా స్వాగతిస్తున్నది. ఇంతవరకు దాదాపు 300 [గ్రంథాలను వెలువరించింది.

మహాసంస్థను స్థాపించి 26.05.2013 నాటికి 70 సంవత్సరాలు పూర్తి అయినాయి. పరిషత్తు సప్తతి మహోత్సవాలను ఫంనంగా నిర్వహించింది. శుభ సందర్భాన్ని పురస్మరించుకుని మహోత్సవ ప్రచురణగా “తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం” అనే పేరుతో వ్యాస సంకలనం వెలువరిస్తున్నాం. సప్తతి ఉత్సవాలలో భాగంగా పరిషత్తు “తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం”పై ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో వివిధ సాహిత్య ప్రక్రియలపై నిపుణుల ప్రసంగాలను వ్యాసరూపంలో సేకరించి గ్రంథంలో సంకలన పరిచి సాహిత్యలోకానికి అందిస్తున్నాం. విషయ సాంద్రత, అభివ్యక్తి సంక్షిప్తత సంతరించుకున్న వ్యాసాలు సాధారణ పాఠకులకు, విద్యార్థులకు, పరిశోధకులకు, పండితులకు ఉపకరించేవిగా వున్నాయి.

పరిషత్తు వెలువరిస్తున్న [గ్రంథం ఎప్పటిలాగే అందరి మన్ననలు పొందగలరని విశ్వసిస్తున్నాను.

డా. జె.చెన్నయ్య ప్రధానకార్యదర్శి ఆంధ్ర సారస్వత పరిషత్తు

ముందు మాట

తెలుగు భాషా, సాహిత్యాల పరిరక్షణ కోసం వెలసిన ఆంధ్ర సారస్వత పరిషత్తు గడచిన 70 సంవత్సరాలుగా లక్ష్యాలను నెరవేర్చే దిశగా విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. నిజాము పాలనలో తెలుగు రాయడం, చదవడం కనాకష్టంగా వుండటమే కాకుండా సమావేశాల్లో తెలుగులో మాట్లాడితే కూడా చిన్నచూపు చూసేవారు. అటువంటి పరిస్థితుల్లో స్వాఖిమానకేతనాన్ని ఎగురవేసేందుకు పరిషత్తును నెలకొల్పారు. లోకనంది శంకరనారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, భాస్మరభట్ల కృష్ణారావు, బూర్గుల రంగనాథరావు, దేవులపల్లి రామానుజరావు, గడియారం రామకృష్ణశర్మ వంటి పెద్దలు పరిషత్తు ఉన్నతికి కారకులయ్యారు.

1943 మే 26న అవతరించిన పరిషత్తు 2018 మే 26న సప్తతి పూర్తి మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నది. అధ్యక్షులు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి. నారాయణరెడ్డి పరిషత్తు సప్తతి సందర్భంగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. 'తెలంగాణ విలక్షణ జానపద కళారూపాలు’ ప్రదర్శనలు, ప్రసంగాలు, “ఆంధ్రనాట్యం, పేరిణి ప్రదర్శనలు, ప్రసంగాలు, తెలంగాణాలో తెలుగు సాహిత్య వికాసంి సదస్సు, కవిసమ్మేళనం, ప్రాచ్య కళాశాలల సమస్యలపైన సమాలోచన సదస్సు మొదలైన కార్యక్రమాల నిర్వహణ పరిషత్తు సప్తతి ఉత్సవాలకు శోభను చేకూర్చాయి. సప్తతి సందర్భంగా కొన్ని ప్రత్యేక ప్రచురణలు తేవాలని అధ్యక్షులు డా.సి. నారాయణరెడ్డి, పరిషత్తు ట్రస్టు కార్యదర్శి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి సంకల్పించారు. వారి ఆలోచన మేరకు 'వ్యాసగుళుచ్చం' రెండు సంపుటాలు,

సాహిత్యవ్యాసాలు, తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం” సదస్సు పత్రాల సమాహారం, “పరిణతవాణి” ప్రసంగాల ఆరవ సంపుటి సప్తతి సమాపనోత్సవంలో ఆవిషృతమవుతున్నాయి.

తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం” [గ్రంథంలో వ్యాసాలు మౌలిక సామాగ్రిని అందిస్తాయి. ఇప్పటిదాక తెలంగాణాలో వివిధ ప్రక్రియల్లో జరిగిన తెలుగు సాహిత్య కృషిని గురించి సవివరంగా తెలియజేస్తాయి. ముందుముందు పద్యకవిత, గేయకవిత, వచన కవిత, కథ, నవల, నాటకం, సాహిత్యవిమర్శ, పత్రికల వికాసానికి సంబంధించి జరిగే పరిశోధనలకు విలువైన సమాచారాన్ని అందించే గ్రంథమిది. ఎంతో శ్రమించి వ్యాసాలు రాని నవుయానికి అందించిన వరిశోధకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యాసాలు డి.టి.పి చేసిన శ్రీమతి లక్ష్మీశ్రీనివాస్‌ గారికి, ప్రూఫులను దిద్దిన డా.కాలువ మల్లయ్య, ముద్రించి ఇచ్చిన సాయిలిఖిత ప్రింటర్స్‌వారికి, పరిషత్తులో పనులకు పూర్తి సహాయ సహకారాలను అందించిన మా కార్యక్రమ సలహాదారు శ్రీ గోవిందరాజు రామకృష్ణారావు, కార్యనిర్వహణాధికారులు యాదగిరిరావు, గోపాలరెడ్డిగార్లకు కృతజ్ఞతలు అందజేస్తున్నాను.

గ్‌

ప్రధాన కార్యదర్శి

విషయసూచిక

తెలంగాణాలో తెలుగు పద్యకవితా వికాసం

ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ము చం కట్‌

తెలంగాణ గేయ కవిత్వం

డా/ వనునూరి రబీందర్‌..........౬౬౬౬౬౬౬ ౬౬౬౭6౭౭0౪

తెలంగాణ వచన కవితా వికాసం

ఆచార్చ॥। బన్న అయిలయ్య సతు

తెలంగాణలో తెలుగు కథా సాహిత్య వికాసం

డా॥ కాలువ మల్లయ్య ........౬ ౬౭౭022000 లలలలలలnలల

తెలంగాణ నవల

DD రమ hE

తెలంగాణలో నాటక వికాసం

దెరబేనాల'త్రీనివాస్‌ a ri

తెలంగాణలో సాహిత్య విమర్శ వికాసం

రవీ పమలక 2 ERD

అక్షర దివిటీలు - తెలంగాణ పత్రికలు

సంగిశెట్టి శ్రీనివాస్‌.............౨లలలలలలలలలంల లట

తెలంగాణాలో తెలుగు పద్యకవితా వికాసం - ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తావన అనిశము మాతృదేశ హిత మాత్మను గోరెడి వాడె భక్తుదౌ, తనతనువున్‌ ధనంబును ముదంబున నర్పణ సేయునట్టి, యా మనుజుడె త్యాగి, బ్రాహ్మణుల మాలల నొక్క విధంబు సూచునా జనుడె మనీషి దుర్మదము శత్రుగ జూచునతండె శూరుడౌ (భక్తతుకారాం) తెలంగాణా పద్యకవుల సామాజిక జాతీయ చైతన్యానికి ప్రతీక పద్యం. సురవరం ప్రతాపరెడ్డి రచించిన భక్తతుకారం నాటకంలోని తుకారం నోట పలికించిన పద్యమిది. దేశహితాన్ని కోరేవాడు భక్తుడు. తను మన ధనాలను సమాజ గ్రేయస్సు కర్పించేవాడు త్యాగి. బ్రాహ్మణులనూ, మాలలనూ అంటే అందరినీ సమానంగా చూచేవాడే మనిషి, అహంకారాన్ని శత్రువుగా భావించి తరిమి కొట్టేవాడే నిజమైన శూరుడు.

భావం తెలుగువారికే కాదు భారతీయులందరికీ శిరోధార్యం. ఇది తెలంగాణ కవి దేశాభిమానం; ఇక శ్రీ సురంవరం వారు తెలంగాణ కవుల పద్య కవితలతో సంకలనం చేసిన గోలకొండ కవుల సంచిక ద్వారా ప్రాంతీయాభిమానాన్ని (ప్రదర్శించారు.

1934లో ముడుంబై వేంకట రాఘవాచార్యులు గోలకొండ పత్రికలో నిజాం రాష్ట్రములో ఆంధ్రకవులు పూజ్యము అంటూ ఒక వ్యాసం వ్రాశారు. అది అలవోకగా వ్రాసినదే తప్ప నిరూపించలేదు. పాలితుల భాష పాలకుల భాష వేరైనప్పుడు పాలకులు ప్రజల భాషను పట్టించుకోని సందర్భాలున్నాయి. కుతుబుషాహీలు, అసఫ్థాహీలలో ఒకరిద్దరు తప్ప చాలమంది తెలుగును పట్టించుకోలేదు. కాని తెలంగాణాలో సంస్థానాధీశులు తెలుగును పోషించారు. గుళ్లల్లో నడిచే బళ్లల్లో, వీధి అరుగుల

మోది బళ్లల్లో తెలుగు వికసించడానికి కృషి చేశారు. విషయం తెలియకపోవడం వల్ల మూడుంబై వారలా వ్రాశారు.

భాషాభిమానం, ప్రాంతీయాభిమానం మువ్పిరిగొనుగా సురవరం ప్రతాపరెడ్డిగారు “గోలకొండ కవుల సంచికిలో సంస్కృతాంధ్ర పద్యకవులకు స్థానం కల్పించి, తెలంగాణాలో అప్పుడున్న 354 మంది కవుల పద్యకవితలను ప్రచురించారు. అంతేగాక తెలంగాణకు చెందిన 188 మంది ప్రాచీన కవుల పరిచయమిచ్చారు. సంచిక ఉద్దేశ్యాన్ని వారిలా తెలియజేశారు.

“నివురు గప్పిన నిప్పువలెనున్న ఇచ్చటి ఆంధ్ర కవుల ప్రజ్ఞా పాండితీ విభావములను ప్రచారము చేయుటయు బయటి వారికీవిషయమున గల భ్రమను నివారించుటయు పరమ కర్తవ్యముగా భావించి గోలకొండ కవుల సంచిక వెలువరించుటకు నిశ్చయించుకొన్నారము” (పుట..)

ముడుంబైవారలా అన్నారని తెలిసిన తెలంగాణ కవులెందరో ఆ(గహించారు. సహజంగానే కొందరు పద్యాల్లో స్పందించారు. అందులో ఒక్క పద్యం మాత్రముదాహరిస్తాను. సీ కానడాయష్టావధానముల్‌ సల్చి భూ

కాంతులతో మెప్పుగాంచు కవుల నరయడా పెక్కు శతావధానముల - నర్గళముగా నొనరించు కవివరులను నెజుంగడా సకల శాస్రేతి హాసాది - సా రాంశముల్‌ చలిగొన్న యమల మతుల యోజింపడా ప్రబంధోత్తమంచుల రచి యించిన యట్టి కవీంద్ర వితతి గీ! నిట్టి పండిత సత్తము లెందటో - ని జాము రాష్ట్రంబు నందు నెసంగుచుండం గవులులేరన్న యతని వాగ్గరిమనెంచ నంధుడు జగంబు లేదని యనుట గాదె ! (పు:304

ఇది గద్వాలకు చెందిన పురాణం మల్లయ్య రాష్టాధిక్యత శీర్షిక కింద రచించిన పద్యం. స్వాభిమానాన్ని ప్రదర్శించడంలో తెలంగాణ పద్యకవి తన వంతు బాధ్యత నిర్వర్తించినాడనే చెప్పాలి. అంతేగాక తెలంగాణ సంస్కృతీ - సాహిత్యాల నణచి వేస్తున్న ప్రభువుల ధాష్టీకాన్ని నిరసిస్తూ వట్టెం నరహరికవి ఇలా స్పందించారు.

10

స్‌ చాళుక్య రాజుల శాసనాంశమ్ములు భూగర్భమున నింకి పోవుచుండె జీర్ణావశిష్టముల్‌ జినదేవళమ్ములు పూర్వ చిహ్నములు గోల్పోవుచుండె ప్రాచీన సత్మావ్య పటలంబులాంధ్రుల ఇండ్లలోపల నంతరించుచుండె పూర్వచరిత్రాంశముల నుద్ధరింపగా దేశీయులెవరు యత్నింపరైరి మాతృభాషాభిమాన సంపన్నులైన నాయకులు మార్గదర్శులై నడువరైరి యువక మణులార! మారింక నూరకున్న రాదుకీర్తింత నైజాము రాష్ట్రమునకు _(పుట:208)

ఇక్కడ కవి చెబుతున్నది తెలుగు వారి భాషా సంస్కృతులకు సంబంధించిన అంశమే అయినందువల్ల, కర్ణాటకలోని గుల్బర్గా రాయచూరు, బీదర్‌ జిల్లాల ప్రసక్తిగాని, మహారాష్ట్రలోని బెరంగాబాదు, నాందేడు, ఫర్ఫణి, బీడ, ఉస్మానాబాదు జిల్లాల విషయంగాని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం తెలంగాణ భాషా సాహిత్య - సంస్కృతులకు సంబంధించిన అంశమే.

విధంగా గోలకొండ కవుల సంచిక ద్వారా తెలంగాణ పద్యకవులు రాష్ట్ర స్వాభిమానాన్ని దేశాభిమానాన్ని కర్తవ్యోపదేశాన్ని అందించారు. భావాలు విధంగా వెలికి రావడం వెనుక వేయి సంవత్సరాలపై చిలుకు తెలంగాణ పద్య సాహిత్య వికాస చరిత్ర ఉన్నది. తెలంగాణ పద్య శాసనాలు

ఇందులో మొదటగా పద్యకవితా శాసనాలను స్వీకరించాలి. నన్నయ్య కంటే ముందు తెలంగాణాలో పద్య కవితా శాసనాలు కనిపిస్తున్నాయి.

వాటిలో మొదటిదిగా కరీంనగర్‌ సమీపంలోని గుట్ట మీద లభించిన కుర్మ్యాల శాసనం చెప్పుకోవాలి, ఇందులో కందపద్యం, వృత్తం ఉన్నాయి.

1H

అదే విధంగా దాదాపు అదే కాలానికి చెందిన నల్లగొండ జిల్లా ఊటుకూరు శాసనం గురించి చెప్పుకోవాలి. ఇది కంద పద్యాలున్న శాసనం.

తెలంగాణ తొలి పద్య కవి

తెలంగాణ తొలికవి పాల్కురికి సోమనాథుడు. జైన సంప్రదాయాన్ని అనుసరించినా తెలంగాణలో ప్రాదుర్భవించిన బసవపురాజాన్ని తొలి తెలుగు పురాణంగా చెప్పుకోవాలి. దేశీయమైన ఇతివృత్తాన్ని గ్రహించి, జనజీవితంలోకి వెళ్లేట్టుగా ద్విపద ఛందస్సులో పాల్కురికి సోమనాథుడీ పురాణాన్ని రచించాడు. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అనుభవసారం, గద్యలు, రగడలు, ఉదాహరణ కావ్యాలు, పంచకాలు, అష్టకాలు, స్తవాలు, చతుర్వేద సారం, చెన్నమల్లుసీసాలు, భాష్యాలు... ఇలా వివిధ గ్రంథాలు పాల్కురికి అందించారు. “ప్రకటవర ప్రసాద కవిత్వయుతుండ... నంటూ నలిబాల్మురికి సోమనాతుడునంగ వెలసినవాడ నిర్మల చరిత్రుండ...” నని చెప్పుకొన్న సోమన తనది జానుతెనుగన్నారు. ఉదుతర గద్యపద్యోక్తులకంటె సరసమై పరగిన జానుతెనుంగు.... చర్చింపగా సర్వ సామాన్యమగుట గూర్చెద ద్విపదలు గోర్కి దైవాజ దెలుగు మాటలనంగవలదు; వేదముల కొలదియ కాంజూడుండిల నెట్టులనిన బాటితూమునకు నుబాటియౌనేని బాటింప సోలయు బాటింప కాదె, అల్పాక్షరముల ననల్పార్ధ రచన కల్పించుట యకాదె కవి వివేకంబు... (పుట:4 పాల్కురికి సోమనాథుడుపయోగించిన జానుతెనుగు పదం, “అల్పాక్షరముల ననల్పార్ధరచన” అనే పదబంధం సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలయినై. తొలి పురాణం, తొలి ఉదాహరణ కావ్యం, తొలి శతకం రచించిన దేశీకవిగా, సామాజిక కవిగా, బసవేశ్వరుని సంస్కరణలను ప్రచారం చేసిన మహాకవిగా తెలంగాణ కవులకు మార్గదర్శకుడయ్యాడు సోమనాథుడు.

12

బసవా బసవా బసవా వృషాధిపా! మకుటంతో ఆయన రచించిన వృషాధిప శతకం, తెలంగాణ శతక కవులకే కాక యావదాం(ధ శతక కవులకు మార్గదర్శకమయింది. వరంగల్లు జిల్లా పాల్మురికి తొలి తెలుగు పురాణానికి, ఉదాహరణ కావ్యానికి, శతకానికి కేంద్రమయింది. పురాణాలే గాక తొలి తెలుగు కావ్యం కూడా... పాల్కురికి బసవపురాణం తెలంగాణలో వచ్చిన తొలి తెలుగు పురాణమైతే, తొలి తెలుగు కావ్యం కూడా తెలంగాణాలోనే ప్రాదుర్భవించడం విశేషం. వాదోపవాదాలెన్ని ఉన్నా గోన బుద్దారెడ్డి రంగనాథ రామాయణం తొలి తెలుగు కావ్యమే. భాస్మరుడు, అయ్యలార్యుడు, రుద్రదేవుడు తదితరులు రచించిన భాస్మర రామాయణమే తొలి తెలుగు కావ్యంగా ప్రచారంలో ఉంది. అంశంపై ఇంకా చర్చలు జరగాలి; తెలంగాణలోనే కాదు తెలుగుభాషలోనే ఇవి తొలి తెలుగు కావ్యాలుగా నిలబడాలి, ఎన్నో రామాయణాలు రంగనాథ రామాయణం, భాస్మర రామాయణమే గాక తెలంగాణలో పండిరినాథ రామాయణం (మోతుకూరి పందరినాథకవి) శ్రీవత్స రామాయణం (ముడుంబై గోవిందాచార్యులు) వాసిష్ట రామాయణం (కామినేని ఎల్లారెడ్డి) మొదలైన వెన్నో వచ్చాయి. ఎన్నో పురాణాలు సహజ పాండిత్య శారదుడైన బమ్మెర పోతన వ్యాసులవారి శ్రీమద్భాగవతాన్ని తెనుగు చేశారు. వ్యాస భాగవతం కన్నా మిన్నగా కీర్తి పొంది తెలుగువారిని భక్తి ప్రపంచంలో ఓలలాడించింది భాగవత పురాణం. ఒనరన్‌ నన్నయ తిక్కనాది కవులీయుర్విన్‌ పురాణావళుల్‌ తెనుగుంజేయుచు, మత్ళురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో తెనుగుంజేయరు మున్ను భాగవతమున్‌, దీనిందెనింగించి, జ్ఞననంబున్‌ సఫలంబు జేసెద పునర్ణన్మంబు లేకుండగన్‌ (భాగవతం, పీఠిక)

13

తదనంతరం తెలంగాణ పద్య సాహిత్యం మీద భాగవతం ప్రభావం నిండుగా దండిగా వున్నది. ఎందరో కవులకు మార్గదర్శనంగా నిలిచింది తెలుగు భాగవతం. తెలంగాణ భాగవతం. ప్రాచీన పంచ కావ్యాలు తెలంగాణ పద్య కవితా వికాసానికి పాల్మురికి, భాస్మరాదులు శ్రీకారం చుట్టగా ప్రాచీన కాలంలో వచ్చిన మహాకావ్యాలలో తెలంగాణ ప్రాచీన పంచకావ్యాలుగా అధ్యయనం చేయవచ్చుననిపించింది. భాస్మరాదుల భాస్మర రామాయణం, కొజవిగోపరాజు సింహాసన ద్వాత్రింశిక, వేముల రామభట్టు గౌరీవిలాసం, పట్టణం శ్రీనివాసాచార్యుల కంద రామాయణం, రెడ్రెడ్డి మల్లారెడ్డి గంగాపుర మహాత్యము, బొడ్డుచెర్ల కృష్ణకవి సతీబాల బ్రహ్మేశ్వర పరిణయాదులను ప్రాచీన పంచకావ్యాల క్రింద పరిగణించవచ్చు. వస్తు శిల్ప సంవిధానాల దృష్ట్యా వీటిలో కొన్ని తొలగించి వీటికంటె ఉత్తమమైన వాటిని ఇందులో చేర్చుకోవచ్చు. ముఖ్యంగా పొన్నిగంటి తెలగన్న యయాతి చరిత్రము, అద్దంకి గంగాధర కవి తపతీసంవరణోపాఖ్యాన్ని పరిశీలనలోకి తీసుకోవచ్చు. అర్వాచీన పంచకావ్యాలు అభినవ పోతన శ్రీవానమామలై వరదాచార్యులవారి పోతన చరిత్రాన్ని ఆధునిక పంచకావ్యాలలో అగ్రణిగా పేర్కొనవచ్చు. పులుగు జంటనుబాపు బోయను శపియించు కరుణాబ్ధి వాల్మీకి కలిని నేను చనుకుమారుని వెంటవని ప్రతిధ్వనులీన నజిచుచు నుణుకు వ్యాసాత్మ నేను మగువపై గల కూర్మి మబ్బుతో జెప్పింప దపియించు కవి కాళిదాసు నేను ఎదనీరు గాగ శారద యేడ్చుకాటుక కన్నీరు దుదచుపోతన్న నేను గీ॥ నాల్గు మోముల విశ్వమ్ము నాకుం దెలుపు ఖేద మోదాను భూతి నీక్షించి యెంచి పలుకనోరు గలట్టి దేవతను నేను రమ్య భారతీ వంశ వర్ధనుడ నేను (పోతన చరిత్రము : పీఠిక:12)

14

ఇలా ఒక అవిచ్చిన్న భారతీయ కవితాధారలో తననొకరిగా చెప్పుకొన్న అభినవ పోతన్న ఎందరో సంస్కృతాంధ్ర కవి పండితులను స్తుతించి తెలంగాణ కవి పండిత స్తుతి అనే శీర్షిక క్రింద పద్యాన్ని రచించారు. పీ! కవిలోకమిత్రు శ్రీకాకునూర్యన్వయ ననఘ ఛందోనంతు నప్పకవిని సరసాచరాత్మజా పరిణయ సత్మావ్య కర్తన్‌ కిరీటి వేంకట కవీంద్రు వర బాలభారతీ బిరుద విభ్రాజితు శ్రీ బుక్కపట్టణ శ్రీనివాసు స్తవనీయు శ్రీశారదా ప్రశ్చవివరణు శ్రీమన్మరింగంటి సింగనార్యు

గీ కాళిదాస కావ్యోద్యాన గంధవహుని మహితగురుని కోలాచల మల్లినాథు ఘనుల శ్రీమరింగంటి వేంకట నృసింహ సత్మవి ద్వయాదుల సన్నుతింతు (పుట: 143) ఇలా నాలుగు సీసాలు ఒక కంద పద్యంలో తెలంగాణ కవి పండిత స్తుతి చేసాడు. పైన చెప్పిన వారు గాక, పండరినాథుడు, బూర్జుల, సురవరం, కేశవరావు, ఒద్దిరాజు సోదరలు, కప్పగంతుల, కుకునూరి రామయ్య, కేశవపంతుల, గార్లపాటి రాఘవరెడ్డి, పట్టాభిరాము, శేషగిరి, వెంకటాచార్య, వానమామలై లక్ష్మణాచార్య, జగన్నథాచార్యులు, కోరుట్ల కృష్ణమాచార్యులు, చిలకమర్తి రామానుజాచార్యులు, పల్లా దుర్గయ్య, సుప్రసన్న, అనుముల కృష్ణమూర్తి, వేముగంటి వంటి సత్మవులందరినీ కవిపండిత స్తుతిలో శ్రీమాన్‌ వరదాచార్యుల వారు సంభావించారు. అర్వాచీన పంచ కావ్యాలలో వరదాచార్యులవారి పోతన చరిత్రముతో పాటు, శ్రీ వానమామలై జగన్నాథాచార్యుల రైతు రామాయణం, శ్రీమాన్‌ ఉత్పల సత్యనారాయణాచార్యుల వారి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్మారం అందుకొన్న రాసపూర్ణిమ, ప్రాశం నారాయణరెడ్డి మెదకు స్వాతంత్ర్యవీరుడు సదాశివరెడ్డి వీరగాథ, అష్టకాలవారి పురుషోత్తముడు, చక్రవర్తులక్ష్మి నరసమ్మ రామదాసు, బుద్దుని బోధలు ఆధారంగా నిర్మింపబడ్డ మహాకవి దాశరథి మహాబోధి, అపూర్వ రచనా శిల్పంతో

15

నిర్మింపబడ్డ డా॥ అయాచితం నటేశ్వరశర్మ శ్రీ వేంకటేశ్వర విలాసము మొదలైన వెన్నో కనిపిస్తున్నాయి. సహృదయ విమర్శకులు మరికొన్నిటిని ఇవీ ఆధునిక పంచకావ్యాలని నిర్ధారించవచ్చు.

అర్వాచీన పంచకావ్యాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసి ఉంది. అప్పుడే వీటిలోని వస్తు సంవిధానాన్ని, భావానుగుణ పద్య నిర్మాణాన్ని, శిల్చరామణీయకతను, కావ్యాత్మనూ, కావ్య సౌందర్యాన్ని అనుశీలించగలగుతాం. ఇక మొత్తం కావ్యాలెన్ని అన్న (ప్రశ్న వేసుకొన్నప్పుడు అవి చిన్నవి పెద్దవి కలపి వేయివరకైనా ఉంటాయి. తెలంగాణలో శతకసాహిత్యం

పాలకురికి సోమన ఏనాడు 'వృషాధిపా' అని ప్రారంభించాడో ఆనాటి నుండి “వృషాధిప స్థానాన్ని పొందుతూ వచ్చింది తెలంగాణ శతకం. వృష శబ్దానికి నంది అర్థమే గాక వేదమనీ, ధర్మమనీ అర్థాలున్నాయి. ధర్మ (ప్రవచనాన్ని వేద వచనంలాగా అందిస్తూ వచ్చింది తెలంగాణ శతకం. ఇప్పటికే తెలంగాణ శతకాల మీద ఎన్నో సిద్ధాంత గ్రంథాలు వచ్చాయి. రామదాసు (కంచెర్ల గోపన్న) దాశరథి శతకం జనం నాలుకల మీద నర్తనం చేసింది. శ్రీ రఘురామచారుతులసీదళదామ... పద్యంతో ప్రారంభమైన దాశరథి శతకం వందల శతకాలకు ప్రాణం పోసింది. సగం తప్పులు వోతున్నా నిరక్షరాస్యులు కూడా “భండన భీముడార్త జనబాంధవు డుజ్ఞ్వల... బాణతూణ కోదండ ప్రచండభుజతాండవకీర్తికి రామమూర్తికిన్‌...” అని చదివేస్తారు.

తెలంగాణలో నాటి నుండి నేటి వరకు వివిధ భక్తి శతకాలు, మత సంప్రదాయశతకాలు, చరిత్ర - జీవిత చరిత్ర శతకాలు, అధిక్షేప వ్యంగ్య హాస్యశతకాలు ఉజ్జాయింపుగా 5 వేల పైచిలుకే వచ్చి ఉంటాయి. గోపాలకృష్ణారావుగారి ఆంధ్ర శతక వాజ్మయానంతరం మరో పదిమందైనా తెలంగాణ శతకాలపై పరిశోధన చేసి ఉంటారు. తొలి పద్య సంకలన గ్రంథం

కాకతీయ రాజుల కాలంలో పెద్దపల్లి దగ్గరి రామగిరిపై నివసించి వాసిష్ట రామాయణం, పద్మపురాణాది గ్రంథాలు రచించిన మడికిసింగన “సకలనీతి సమ్మతం” సంకలించారు. ఇది తెలుగు సాహిత్యంలో వచ్చిన తొలి పద్య సంకలన గ్రంథం.

16

కం॥ సుకవులు చెప్పిన కవితా

నికరములు శిలాక్షరముల నిలుకడగాంచున్‌

కుకవులు చెప్పిన కవితా

నికరములు జలక్షరముల నీచత నణగున్‌

(స.నీ.సమ్మతం, పు:10) తెలంగాణ పద్యకవి హృదయ మేమిటో ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది. సుకవి

కవిత్వం శిలాక్షరం, కుకవికవిత్వం జలాక్షరం. తెలంగాణలో ఖండ కావ్యాలు - కావ్యాలు

పద్య ఖందకావ్యాలన్నీ ఆధునికమైనవే. మూడువేల వరకైనా పద్య ఖండ కావ్యాలుంటాయి. తెలంగాణ ఖండకావ్యమందే దాశరథి గుర్తుకు వస్తాడు.

స్స; నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత యెత్తార్చనాను, నేను రాక్షసి గుండెనీరుగా, పద్యాలు పాడిమానవుని కాపాడినాను, నేను వేస్తంభాల నీడలో నొక తెల్లు తోట నాటిసుమాలు దూసినాను, నేను పోతన కవీశాను గంటములోని ఒడుపుల కొన్నింటి బడసినాను, గీ11 కోటి తమ్ముల కడ రెండు కోట్ల తెల్లు టన్నలను గూర్చి వృత్తాంతమందజేసి మూడు కోటుల నొక్కటే ముడిచిగించి పాడినాను మహాంధ్ర సౌభాగ్య గీతి (మహాంద్రోదయం, పు:155) ఖండ కావ్య కర్తల పేర్లు వందలు చెప్పాలి. వందల మందికి వందనాలు చెప్పాల్సిందే తప్ప పరిమిత కాల వ్యవధిలో అందరినీ స్పృశించడం సాధ్యం కాదు. సిద్ధిపేటను రససిద్ధిపేటగా మార్చిన శ్రీమాన్‌ వేముగంటి నరసింహాచార్యుల పద్యకావ్యాలలో ఖండ కావ్యాలే అధికం. వారి తిక్కన కావ్యం విశ్వవిద్యాలయ పాఠ్య గ్రంథ స్థానంలో నిలిచి రసహృదయుల నలరించింది.

17

కరణానికి అప్పు క్రింద తాకట్టువడిన నిరుపేద రైతు “ఆవు'ను ప్రస్తావిస్తూ

డా॥ పల్లా దుర్గయ్య రచించిన పద్యాలు సామాన్యుణ్ణి కళ్లముందు బొమ్మగట్టి నిలుపుతాయి. గంగిరెద్దులోని అన్ని పద్యాలు ఉదాహరించదగ్గవే. మచ్చుకొకటి రెండు.

పీ

గీ!

గీ॥

కోటీశ్వరున కెన్న గొప్ప గాదొకలక్ష జీతగానికి గొప్ప చిల్లి గవ్వ

అన్నపూర్ణకును పక్వాన్నమ్ము లెక్కయా కటిక బీదకు గొప్ప గంజిబువ్వ

భాగ్యశాలికి పట్టువస్త్రముల్‌ గొప్పటో ముష్టివానికి గొప్ప ముతకపాత

శ్రీమంతునకు మిద్దె లేమంత గొప్పయౌ గొప్పయా బీదకు చొప్పగుడిసె

ఉన్నవానికి మణులును నుప్పురాళ్లె

లేని వానికి రాలును మానికములె

అధికునకు కొంచమగును కొండంత కీడు

కొంచెగానికి గోరంత కొండలగును

పేద కాపునకున్నట్టి పెద్ద యాస్తి

ఆవు మాత్రమె, అదియుగాదతని సొత్తు

కరణమున కప్పు క్రింద తాకట్టు పడియె

సాదకపు జీవమిప్పుడప్పెద గోవు (పుట: 8)

పద్యం సర్వస్పర్శి; కేవల ఇతిహాస పురాణాలనే స్పృశిస్తుందనే విమర్శలు సరిగావు.

పద్యకవిత సామాన్యుణ్ణి కథానాయకునిగా నిలిపిందని రైతురామాయణం ద్వారా తెట్టతెల్లమయింది. గంగిరెద్దు కూడా రైతుల జీవితాన్ని పాడిపంటల వైనాన్ని ప్రస్ఫుటం చేసింది. ఇక గంగుల సాయిరెడ్డి కాపుబిడ్డ కావ్యం కాపువాడి కడగండ్లతో కళ్ల నీరు తెప్పించింది.

సీ

ఇల్లెల్ల నీరయి యిల్లాలు పిల్లలు వడకుచు నుండిరి వసతి లేదు నిట్టుపాసంబుచే నిద్దుర పట్టదు కట్టుటకా పొడిబట్టలేదు

18

పుంటి పుల్లలు పీచు పొరక కమ్మలు పొట్టు వంటకట్టెలు నాని మంటలేదు చిక్కిన గిత్తలు బక్కగేదెలుకోడె లేగలావులు పండి లేవలేవు

గీ జామురాతిరి యుండగా జాగులేక లేచి గేదెల గోదల లేవనెత్తి కసవులోదొమ్మమందుల కలిపి పెట్ట కాపు బిడ్డల గోరముల్‌ గొంతురెవరు? (పుట:21) వర్షాకాలంలో కర్షక్షునింటి కడగండ్లే గాక, ఎండాకాలంలో చలికాలంలో రైతుపడే కష్టాలను, అతని సహనశక్తిని కలిగంగుల శాయిరెడ్డి వాస్తవికతకు అద్దం పట్టెట్టు వర్ణించారు. తెలంగాణ జిల్లాల వారిగా పద్యకవులు మెదకు జిల్లాలో శ్రీవేముగంటి నరసింహాచార్యులు, శ్రీ గుమ్మన్నగారి లక్ష్మినరసింహ శర్మ, శ్రీ అష్టకల నరసింహ రామశర్మ, శ్రీ ఉమాపతి పద్మనాభశర్మ, శ్రీవిఠాల శ్రీకాంతశర్మ, శ్రీ అమ్మన చంద్రారెడ్డి, శ్రీ ఐతా చంద్రయ్య ఇలా వందమందిని పేర్కొనవచ్చు. పాలమూరు జిల్లాలోని ప్రాచీన కవుల్లో గోకర్టుడు, గోనబుద్దారెడ్డి, కాచభూపతి, విఠల భూపతి (మొదటి జంటకవులు), కుప్పాంచిక (తొలి తెలుగు కవయిత్రి), చరిగొండ ధర్మన్న చరిగొండ నరసింహకవి, చరిగొండ హన్మయ్య, ఎలకూచి బాలసరస్వతి, కాకునూరు అప్పకవి, కంకంటి పాపరాజు, బహిరి గోపాలరావు, పెన్లలూరి వేంకటాద్రి, పైగడరాజు నృసింహకవి, (పైగడరాజు చెప్పకృష్ణకవి, బుక్కా పంచాక్షరి వంటి ఎందరో కనిపిస్తారు. ఇక ఆధునిక కాలంలో సురవరం ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణశర్మ, కప్పగంతుల లక్ష్మణశాస్తి, కేశవపంతుల నరసింహశాస్త్రి, బుక్కపట్టణం ఆచార్యులు, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, చేవూరు లక్ష్మయ్య, కపిలవాయి లింగమూర్తి, డా॥ ముకురాల రామారెడ్డి, డా॥ కసిరెడ్డి వెంకటరెడ్డి, డా॥ కె.రుక్సుద్దీన్‌, కర్ణాటి రఘురాములు, భీమలింగంగౌడు, ఉమ్మెత్తల మహేశ్వరి, డా॥ వెల్దండ సత్యనారాయణ, వెల్దండ

19

రామేశ్వరరావు, డా॥ గోచీరావు, వరకవుల నరహరిరాజు, జగన్నాథ రాజు ఇలా ఇప్పటి వారినే రెండు వందల మందిని పేర్కొనవచ్చు.

వరంగల్లు జిల్లాలో ప్రాచీనా ర్వాచీన కవులు వందలమంది ఉన్నారు. పాల్కురికి నుండి పండరీనాథుని వరకు అందరూ (ప్రాచీన పంథాననుసరించిన వారు కాగా, ఆధునిక కాలంలో డా॥ పల్లాదుర్ణయ్య, దాశరథి, ఆచార్య సుప్రసన్న డా॥ కోవెల సంపత్కుమారాచార్య, డా॥ కిషన్‌ రావు ఇలా ఎందరో కనిపిస్తారు. ఆచార్య అనుమాండ్ల భూమయ్య 1994 నుండి 2009 పది కావ్యాలు రచించారు. వీటిలో కొన్ని దశాబ్దంలోనే నాలుగైదు సార్లు అచ్చయినాయి. వేయి నదుల వెలుగు, వెలుగున గల హంస, జ్వలిత కౌసల్య వంటివి వారికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి.

ఇలా ప్రాచీన కాలంలోనూ ఆధునిక కాలంలోనూ తెలంగాణ సాహితీ సంస్కృతుల వికాసంలో ఓరుగల్లు (వరంగల్లు) యోగదానం మరువలేనిది. వానమామలై తదితర కవులు ఆదిలాబాదు జిల్లాలో స్థిరపడ్డా వారి వికాసానికి వరంగల్లు దోహదం చేసింది.

పద్య కవితా వికాసంలో ఇందూరు జిల్లా (నిజామాబాద్‌ జిల్లా) యోగదానం కూడా గణనీయమైందే. సింహాసన ద్వాత్రింశిక రచించిన కొణవి గోపరాజు జిల్లాకు చెందినవాడే. దోమకొండకు చెందిన పట్టమెట్ట సోమనాథ సోమయాజి సూతసంహిత, బ్రహ్మోత్తర ఖండం రచించారు. కామినేని మల్లారెడ్డి పుట్బక్రవర్తి చరిత్ర, శివధర్మోత్తరం, పద్మపురాణం, కామినేని ఎల్లారెడ్డి వాసిష్టలైంగము, రాపాక లక్ష్మీపతి భద్రాయురభ్యుదయము, శ్రీకృష్ణ విలాసము రచించారు. ఆదిపూడి ప్రభాకర కవి కామినేని వంశ చరిత్ర అయిన ఉమాపత్యభ్యుదయ కావ్యాన్ని రచించారు. చివుకుల వేంకట శాస్తి రామేశ్వర విలాసం, పెద్దమందడి వేంకట కృష్ణకవి రాణీ రాజవ్వ జీవిత చరిత్ర రచించారు. వీరంతా పద్యాన్ని ప్రాచీన పంథాలో నడిపించారు.

ఇక అర్వాచీన పద్య ప్రక్రియలో ప్రవేశించి పాతకొత్తల మేలుకలయికగా పద్య కావ్యాల్ని నిర్మించిన వారెందరో ఉన్నారు. నంది శ్రీధరరావు కొన్ని శతకాలతోపాటు ప్రహ్లాద చరిత్ర, శారదా గణితము, శ్రీశేషాచల మహాత్యము రచించారు. రాగచిన్నయ్య కొన్ని శతకాలు వ్రాశారు. మామిండ్ల రామాగౌడు రసతరంగిణి, కవితా సుధాలహరి వంటి కావ్యాలను కొన్ని శతకాలను రచించారు. కవి చౌడప్పను అనుకరిస్తూ కవి గౌడప్ప వ్రాశారు. మహాదేవ శ్రీనివాసులు, పరికిబండ్ల వేంకట నర్సయ్య తంగుడిగె

20

శ్రీధరరావు, తంగుడిగె నరసింహం, పెనుగొండ శ్రీనివాసులు, భోజన్న గారి రాజేశ్వరశర్మ, చిక్కల పుండరీకశర్మ, డా॥ గండి వేంకటాచార్యులు, శృంగారం జనార్థనాచార్యులు, మాకునూరి లక్ష్మినరసింహాచార్యులు, కాస నర్సయ్య, పప్పు నారాయణాచార్య, తాళ్ల గంగారాసకవి, చెవుల చిన్నయ్య, తల్లావజ్జల మహేశ్‌బాబు, కాచాపురం నందీశ్వరశర్శ్మ, లింగవరం రాజేంద్ర ప్రసాదు, ఆకుల వేంకట రాములు, స్వర్ణ శ్రీనివాస, చిక్కల శ్రీనివాసశర్మ, శాస్త్రుల పాండురంగ శర్మ గణపతి అశోకశర్మ, బెజుగామ రామమూర్తి, పచ్చామురళి, గోసికె గోపాల్‌, గోసిక నరహరి ఇలా ఎందరో కవులు తమ రచనల ద్వారా తెలంగాణ పద్య సాహితీమతల్లిగళ సీమన కావ్యమాలల నలంకరించారు.

శతకాలు, ఖండకావ్యాలు, స్తోత్రాలు, అనువాదాలు, శ్రీ వేంకటేశ్వర విలాసము వంటి ఉత్తమ పద్య కావ్యాలు అందించిన డా॥ అయాచితం నటేశ్వరశర్మ పాతిక పైచిలుకు పద్య గ్రంథాల నందించి నిత్య పద్య నిర్మాతగా వెలుగొందుతున్నారు.

మేడిచర్ల ప్రభాకరరావు వాసరమ్మ వాణి వంటి పంచశతితో పాటు రుద్రమరేలి కావ్యాన్ని అందించారు. మధ్యకాలంలో పది కావ్యాలు రచించిన సరస్వతీ పుత్రులు వీరు.

ఇటీవలే పరమపదించిన అభినవ ఆంధ్రభోజ బిరుదాంచితులు శ్రీగణపతి రామచంద్రరావు, పద్యాన్ని చిత్రచిత్రాలుగా ప్రవహింపజేస్తూ ఏడెన్మిది పద్యకావ్యాలు రచించారు.

నైజాం రాష్ట్ర ఆద్యశతావధానిగా పేరు పొందిన సిరిసనహళ్‌ కృష్ణమాచార్య ఆంధ్ర మహానాటకము, కళాశాలాభ్యుదయము, గాంధీతాత నీతి శతకము, చిత్ర ప్రబంధము, రామానుజ చరితము వంటి 18 పద్య కావ్యాలు రచించి కీర్తి నార్జించుకొన్నారు. ఆచార్యుల వారేగాక డా॥ అయాచితం నటేశ్వరశర్మ, బెజుగామ రామమూర్తి, బోచికర్‌ ఓంప్రకాశ్‌, గణపతి అశోక్‌శర్మ జిల్లాలోని అవధానులు. వీరేగాక కవితా సంకలనాలకే పరిమితమై ఒకటి రెండు పద్య ఖండికలు వ్రాసిన వారు, పత్రికల్లో అరకొరగా వ్రాసినవారు, కవి సమ్మేళనల్లో మాత్రమే వదిలేవారు ఇలా ఎందరో పద్యకవులు పద్య కవితా వికాసానికి దోహదం చేస్తున్నారు.

ఇక నల్లగొండ జిల్లా పద్యకవులు వారి కావ్యాల గూర్చి తెలుసుకుందాం! జిల్లాలో భాస్మర రామాయణ కర్తల్లో ఒకరైన అయ్యలార్యుణ్ణి ప్రథమంగా చెప్పుకోవాలి.

21

9

పిల్లలమళ్టి పినవీరన నెల్లూరుకు వెళ్లినా ఇతడు నల్లగొండలోని రాచకొండ నివాసి. హరిశ్చంద్రోపాఖ్యానకర్త గౌరన దేవరకొండ ప్రాంతానికి చెందినవాడు. గౌరన పుత్రుడు భైరవకవి శ్రీరంగ మహాత్యం రచించాడు. బమ్మెర పోతన బమ్మెర గ్రామం ఒకప్పుడు నల్లగొండ లోనిదే. సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యాన [గ్రంథకర్త కందుకూరి రుద్రకవి దేవరకొండ సమీపంలోని కందుకూరు నివాసి. నాటి కుతుబ్నా రాజుల గౌరవాలందుకొన్న ఆసూరిమరింగంటి కవులు జిల్లా సాహిత్యంలో అగ్రస్థానంలో నిలుస్తారు. శ్రీరంగనాథ విలాసకర్త జగన్నాథాచార్యులు, నిరోష్ట్ర దశరథ రాజనందన చంద్ర వ్రాసిన సింగరాచార్యులు, నిరోస్ట్రరచనలో తొలి తెలుగు కవి కూడా. అంతేగాక ద్వ్యర్థి - చతురర్థి రచనలకు కూడా తామే ఆద్యులని చెప్పుకొన్నారు. తమ సీత్ర కల్యాణం అచ్చ తెనుగు నిరోష్ట్య రచన కూడా తెలుగులో తొలి గ్రంథమే.

ఆనూరిమరింగంటి నింగరాచార్యుల వు(త్రంలు మొదటి వేంకట నరసింహాచార్యులు కూడా కొన్ని పద్యకావ్యాలు రచించారు. రెండవ వెంకట నరసింహాచార్యులు జనక సుతాభ్యుదయము, శ్రీరామానుజాభ్యుదయము, నృకంఠీరావాభ్యుదయము, విష్వక్సేనేన ప్రభాకరము, శ్రీకృష్ణ శతానందీయము, జాంబవతీ కుమార శృంగార విలాసము, చల్వపిళ్ల రాయచరిత్ర, చిలువపడగటేని పేరణము వంటి ఎన్నో గ్రంథాలు రచించారు. తెలంగాణ పలుకుబడులు నల్లగొండ మాండలికాలు తెలుసుకోడానికి గ్రంథాలన్నీ ఉపకరిస్తాయి. మరింగంటి కవుల్లో మూడవ వేంకట నరసింహాచార్యులవారు ప్రౌఢ ప్రబంధనిర్మాత. 1620 గద్య పద్యాలతో 6 ఆశ్వాసాల తాలాంకనందనీ పరిణయం (శశిరేఖా పరిణయం) వీరు రచించారు. ఐదవ వేంకట నరసింహాచార్యులు జీడికల్లు క్షేత్ర మహాత్యం వ్రాశారు. మరో వేంకట నరసింహాచార్యులు మాలతీ వసంతాన్ని ప్రబంధీకరించారు. వీరి నీలోద్వాహం నాలుగాశ్వాసాల కావ్యం. ఆధునికులైన మరింగంటి పురుషోత్తమాచార్యుల వారు గోదాదేవి అనే లఘుకావ్యాన్ని రచించారు. విధంగా నల్లగొండ పద్య కావ్య చరిత్రలో విశిష్ట స్థానాన్ని ఆక్రమించి నిలిచినవారు మరింగంటి కవులు. కేవలం వీరి చరిత్రే రెండు వేల పుటలు దాటుతుందంటే అతిశయోక్తి కాదు.

ఇంకా నిరిపెగడ ధర్మన్న, కర్పూరం కృష్ణమాచార్యులు, వాత్స్య శ్రీరంగాచార్యులు, రావూరి సంజీవ రాయకవి, బంగారు రంగప్ప, చిత్తారు గంగాధరయ్య, విశ్వనాథయ్య, ముడంబ లక్ష్మణాచార్యులు, చెన్నూరి రామన్న

22

నలంతిఘల్‌ అప్పలాచార్యకవి, దొంతర మల్లేశం, చెన్నూరి శోభనాద్రి, తడకమళ్ల వేంకట కృష్ణారావు, గోవర్ధనం వేంకట నరసింహాచార్య, భట్టరు అనంతాచార్య, వేంకట రామకృష్ణకవులు, గాదె రామచంద్రరావు, కోదాటి సోదరులు, యం.వై. జాషువా, పులిజాల గోపాలరావు, మఠం వీరభద్రయ్య, సిరిప్రెగడ భార్గవరావు, మద్దోజు సత్మనారాయణ, నరహరి గోపాలచార్యులు, ఉమ్మెత్తల వేదాంత రావు, పాశం నారాయణరెడ్డి, నీలాజంగయ్యకవి, అజ్మతుల్లాకవి, చివచారి లక్ష్మీనరసింహచార్యులు, తొడుపునూరి నర్సయ్యగుప్త, రాచమల్ల దేవయ్య (రాధేయ), నల్టీగ శ్రీనివాసాచార్యులు, డా॥ రామడుగు శ్రీమన్నారాయణశర్మ, మోరా వామనాచార్య, మంగళగిరి వేణుగోపాలాచార్య, దివి రమాదేవి, కొప్పుల రమారెడ్డి, పెరుంబుదూరు రాఘవాచార్యులు, పులివర్తి సుబ్రహ్మణ్యం... ఇలా మరో వందమంది పేర్లు చెప్పవచ్చు.

వీరందరూ కావ్యాలు, ఖండకావ్యాలు, స్తోత్రాలు, మేలుకొలుపులు, శతకాలు, చిత్రవిచిత్ర ప్రబంధాలు రచించి తెలంగాణ పద్యకవితా వికాసానికి దోహదం చేసినవారే, చేస్తున్నవారే. ఈనాటికీ వచన - గేయ ప్రక్రియలను సంభావిస్తూనే పద్య కావ్యవికాసానికి దోహదం చేస్తున్న నల్గొండ పద్య కవులపై ఇప్పటికే కొన్ని (గ్రంథాలు వెల్పడ్డాయి.

ఇదే విధంగా ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన దాశరథి శతక కర్త భక్తరామదాసు, ఆధునిక కాలంలో చక్రవర్తుల లక్ష్మి నరసమ్మ, కావూరి పాపయ్యశాస్త్రి, డా॥ కోదండ రామాచార్యుల వంటి పద్య కవులను ఎందరినో పేర్కొనవచ్చు. ఆదిలాబాదు జిల్లాకు చెందిన అభినవ పోతన వానమామలై వరదాచార్యులతో పాటు ఆధునిక కవి పట్వర్థక తదితరులను కలుపుకొంటే ప్రాచీనులు ఆధునికులు కలిపి రెండు వందల మందిని గూర్చి చెప్పవచ్చు. ఇక కరీంనగర్‌ జిల్లాకు చెందిన భాగవత కవుల్లో ఒకరైన వెలిగందల నారాయణ, మడికి సింగనల దగ్గరి నుండి, ఆధునిక కవుల్లో ఒకరైన డా! సంగనభట్ల నర్సయ్య వరకు వందలాది మందిని పేర్కొనవచ్చు.

జిల్లాకే చెందిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా॥ సి.నారాయణరెడ్డిగారు కలం పట్టిన తొలిదశలో పద్య ఖండికలు కూడా రచించారు. డా॥ జె. బాపురెడ్డిగారు పద్యంతోనే తమ కవితా వ్యవసాయాన్ని ప్రారంభించారు. వానమామలై శిష్యులైన డా॥ అందె వెంకటరాజం గారు అవధానాలూ చేశారు. ఆశు కవితా ప్రదర్శనలిచ్చారు.

23

సుప్రసిద్ధ ధార్మిక సాహిత్య నిర్మాతలూ తత్త్వవేత్తలైన శ్రీభాష్యం విజయసారధిగారు తెలుగు సీసపద్యాలను సంస్కృతంలో ప్రవహింపజేశారు. కల్వకుంట్ల రామకృష్ణ, దాస్యం సేనాధిపతి వంటి యువకవులు పద్యాలందిస్తూనే ఉన్నారు. అవధానాలు జరుగుతున్నాయి. పద్యకవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. పద్యం తన విరాడ్రూపంతో కరీంనగర్‌ జిల్లాతోపాటు తెలంగాణా అంతటా వికసిస్తూనే ఉన్నది. ఇక సంస్థానాల్లో

A

పద్యకవితా వికాసం స్థూలంగా తెలుసుకొందాం! సంస్థానాల్లో పద్య కవితా వికాసం

బ్రిటిషువారి కాలంలోని నిజాం రాష్ట్రంలో సంస్థానాలున్నాయి. వీరంతా నిజాముకు సామంతరాజులు. బహమనీల క్రింద, గోలకొండ, బీజాపూరు సుల్తానుల క్రింద ఉండి చివరికి నిజాముల క్రిందికి వచ్చిన సామంతరాజ్యాలను పరిపాలించే వారు చాలా వరకు హిందువులే! బ్రిటిషువారిచేత క్రింది హైదరాబాదు, మైసూరు, తిరువాన్మూరు, భోపాల్‌, ఇందోర్‌ వంటి పెద్ద సంస్థానాల చేతి క్రింది చిన్న సంస్థానాలివి.

జటప్రోలు (కొల్లాపూరు), గద్వాల, వనపర్తి, దోమకొండ, పాపన్నపేట, గోపాలపేట, ఆత్మకూరు - అమరచింత, పాల్వంచ, ఇలా ఎన్నో సంస్థానాలు తెలంగాణలో ఉన్నాయి. ఇవన్నీ తెలుగు సాహిత్యాన్ని పోషించాయి. అందులో పద్యకావ్యాలే ఎక్కువ. తెలంగాణలో పద్య కవితా వికాసానికి సంస్థానాలు పునాదులైనాయి. ఆత్మకూరు - అమరచింత సంస్థానం

ఆత్మకూరు పట్టణము, అమరచింత సంస్థానము. సంస్థానాన్ని పరిపాలించిన రెడ్డి ప్రభువులు తెలుగు సాహిత్య పోషకులు, కవి పండితుల నెందరినో ఆదరించిన వారు. సంస్థానంగా ఆత్మకూరు పేరే వాడుకలో నిలిచింది.

నిరోష్ట్య రామాయణం రచించిన సురపురం కేశవయ్య, గుణరత్నాకరాది గ్రంథాలు రచించిన శ్రీ బుక్కపట్టణం శ్రీనివాసాచార్యులు, లక్ష్మణ పరిణయము విదురాశ్వణ్థ మహాత్యము, శ్రీరంగ మహోత్సవ వర్ణమాలిక, సత్యనారాయణ ప్రతకల్పాది [గ్రంథాలు రచించిన దీక్షితుల నరసింహశాస్త్రి, శ్రీ సీతారామ భూపాల విలాసం రచించిన కార్యమపూడి రాజమన్నారుకవి... తదితరులు తమ పద్యకావ్యాల ద్వారా

24

ఆత్మకూరు సంస్థాన కీర్తి ప్రతిష్టలే కాకుండా తెలుగు భాషా సాహిత్య వికాసాలకు తమ వంతు యోగదానాన్ని అందించారు. రాజా శ్రీరామ భూపాలరావు బల్వంత్‌ బహాదురుగారి ధర్మపత్ని శ్రీభాగ్యలక్ష్మమ్మ గోలకొండ కవుల సంచిక ప్రచురణకు ఆర్థికంగా సహకరించారు. కారణంగానే తెలంగాణలోని 854 మంది పద్య కవుల కవితలను తెలుగు సాహిత్య ప్రియులు అధ్యయనం చేయగలిగారు. అందుకే దీక్షితుల నరసింహశాస్త్రి తల్లిని గురించి ఇలా (ప్రస్తుతించారు. “స్థిర సామ్రాజ్య మనామయంబు జయలక్ష్మీ వ్యాప్తి శశ్వద్యశ స్ఫురణం బండిత పోషణాభిరతి సంపూర్ణానుకం పాప్తియున్‌ బరమౌదార్యము నైజపాదభజన వ్యాసంగమున్‌ గూర్చి శ్రీ కరకుర్శూర్తి గిరీశుడోము నిను దీక్షన్‌ భాగ్యలక్ష్య్యంబికా !” (ఆంధ్ర సంస్థానములు సాహిత్యపోషణము, పు:38) కవులూ -పోషకులూ ఉన్న కారణంగానే ఆత్మకూరు సంస్థానము వంటి ఇతర సంస్థానముల వల్ల కూడా తెలంగాణాలో పద్య కవితా వికాసం జరిగింది. మరొక సంస్థానం గూర్చి తెలుసుకుందాం! గద్వాల సంస్థానం సంస్థానం కూడా పాలమూరు జిల్లాలో ఉన్నదే. ప్రాంతాన్ని కాకతీయులు, విజయనగర పాలకులు, బహమనీ సులతానులు, బీజాపూర్‌ రాజులు, మొగలురాజుల పాలన అనంతరం అసప్టాహి నిజామురాజుల పలుబడిలోకి వెళ్లిపోయింది. ఇది హైదరాబాదు రాష్ట్రంలో భాగంగా మిగిలి పోయింది. గద్వాల పాలకులతో పెదసోమ భూపాలుడు అనేక (గ్రంథాలు రచించాడు; ప్రతి సంవత్సరం కార్తిక మాసంలో పండితులను, మాఘమాసంలో కవిగాయకులను సమ్మానం చేసే సత్సంప్రదాయాలను ప్రారంభించాడు. పెదసోమభూపాలుడు రతిశాస్తమనే మూడాశ్వాసాల ప్రబంధం వ్రాశారు. జయదేవకృత గీతాగోవిందంలోని ఒక్కొక్క శ్లోకానికి పద్యం - దరువు - చూర్ణిక అనే రీతులతో పెంచి రచించారు. రాజుగారి ఆజ్ఞ మేరకు రామాయణంలోని ప్రతి కండంలోని ప్రతి శ్లోకానికి ఒక పద్యం చొప్పున ఆరు కాండలలోని శ్లోకాలకు ఆరుగురు కవులు పద్యాలు రచించారు.

25

కాణదం పెద్దన సోమయాజి బాలకాండం, కొత్తపల్లి రామచంద్రాచార్యులు అయోధ్యాకాండం, గార్మ్యపురం సుబ్బశాస్త్రి అరణ్యకాండం, కామసము[ద్రం అప్పలాచార్యులు కిష్మింధాకాండం, తిరుమల కృష్ణాచార్యుల సుందరకాండం, యుద్ధ కాండలోని పుర్వోత్తర భాగాలను బోరవెల్లి శేషాచార్యులు రచించగా, ఇది యధాశ్లోక తాత్పర్య రామాయణ ప్రబంధం పేరిట 1896లో ప్రచురింపబడింది.

నిజానికీ రచన పెద సోమభూపాలుని కాలంలో మొదలయి, మధ్యలో ఆగిపోగా, ఆయన మనుమడు చినసోమభూపాలుడు ఆస్థాన విద్వత్మవులను పిలిపించి పూర్తి చేయించారు. చినసోమభూపాలుడు కవులతో అన్న క్రింది రెండు పద్యాలు రామాయణ పరిపూర్తికి ఆయన ఆకాంక్ష ఎటువంటిదో తేటతెల్లమవుతుంది.

కం॥ శ్రీమద్రామాయణ మిది నెమమ్మున వృద్ధ సోమన్ఫపతి మునుకవి గ్రామణుల చేతనాంధ్రము గామహి నిర్మింపబూనె కావున నాకున్‌

గీ అతని సంకల్ప మీడౌర నర్షమగుట ప్రేమనీకాండలన్ని జెప్పింతుగాన కొదువ కాండలు మీరెంపు గూర్చవలయు నమర కేశవ దేవనామాంకితముగ (పుట:5ు

ఆస్థానంలో ఉండి భాషా సాహిత్య వికాసాలకు, పద్య కావ్య వికాసానికి దోహదం చేసిన కవులెందరో ఉన్నారు. వారిలో శేషశైలలీల, భద్రాపరిణయము (ముకుంద విలాసము) అధ్యాత్మ రామాయణాది పద్య కావ్యాలను కాణాదము పెద్ద సోమయాజి రచించారు. కిరీటి వేంకటాచార్యులు సంస్కృత రచనలెన్నో చేశారు. అచలాత్మజా పరిణయమనే ద్వ్యర్థికావ్యం తెలుగులో వ్రాశారు. కామ సముద్రం అప్పలాచార్యులు కృష్ణలీలాతరంగిణిని ఆంధ్రాష్ట్రపది పేరిట అనువదించారు. కర్ణమడకల అనంతాచార్యులు ఆచార్య వింశతి, ఆంధ్ర శబ్దచింతామణి, మదన విజయభాణము తదితర [గ్రంథాలు వ్రాశారు. వాడాల శేషాచార్యులు మైథిలీ పరిణయం రచించారు. హసదుర్ణము వేదాంతాచార్యులు ఆచార్య వైభవము, శ్రీకృష్ణ బ్రహ్మతంత్రార్య వేద పాదస్తవము గ్రంథాలు రచించారు. పుల్లగుమ్మి వెంకటాచార్యులు శతావధాని, వీరు అలంకారావళి, ఆదిలక్ష్మవర్గపూరము తదితర గ్రంథాలు వ్రాశారు.

26

ఇంకా పురాణ ముదీషాచార్యులు, బైరంపల్లి తిరుమలరాయకవి, గాడేపల్లి వీరరాఘవకవి, ఆదిపూడి ప్రభాకరకవి, పోకూరి కాశీపతి, పెద్దమందడి వెంకటకృష్ణ కవి, శ్రీరామ నరసింహమూర్తి కవులు - తదితరులెందరో గద్వాల సంస్థాన పోషణతో తెలంగాణ పద్యకవితా వికాసానికి దోహదం చేశారు. జటప్రోలు సంస్థానం

సంస్థానం తెలంగాణలోని పాలమూరు జిల్లాలో ఉంది. కొల్లాపురం దీని ప్రధాన నగరమైనందు వల్ల జటప్రోలు మరుగునపడి కొల్లాపుర నామంతోనే ప్రసిద్ధమైంది. పరిపాలకులు పద్మనాయకులలో భాగమైన రాచవెలమలు. ఇందులో వంశస్థుడైన ముమ్మడి మల్లభూపాలుడు మహామహోపాధ్యాయ ఎలకూచి బాలసరస్వతి (1610-1670) ఆంధ్రీకరించిన సుభాషిత త్రిశతికి కృతి భర్త. నీతి శతకానికి సురభిమల్లా నీతి వాచస్పతీ అనీ, శృంగార శతకానికి సురభిమల్లా మానినీ మన్మథా అనీ, వైరాగ్య శతకానికి సురభిమల్లా వైదుషీభూషణా అని మకుటాలు పెట్టి, శార్దూల మత్తేభ వృత్తాలతో మహామహోపాధ్యాయులు తెలుగు పద్య సాహిత్య వికాసానికి పట్టం గట్టారు.

సంస్థానం వల్ల వెలిగిన వారున్నారు. వెలిగించిన వారున్నారు. ద్వాదశ మంజరి, అన్నపూర్ణాష్టకము, భాస్మర ఖండము తదితర పద్య ఖండికలనూ - గంథాలనూ రచించినవారు అక్షింతల సింగరశాస్రి, నృసింహ విలాసకర్త కృష్ణమాచార్యులు, చంద్రికా పరిణయకర్త సురభిమాధవ రాయలు, వెలుగోటి వారి వంశ చరిత్రము, సురభి వంశ చరిత్రము, కంఠీరవ చరిత్రము, రామచంద్ర చరిత్రము, నామిరెడ్డి చరిత్రము, యతి నిందనిరాకరణ, రామానుజ గోపాలవిజయం వంటి (గంథాలెన్నో రచించిన వారు వెల్లాల సదాశివశాస్రి, శ్రీరామమంద హాసకర్త శ్రీధర కృష్ణశాస్త్రి, లక్ష్మవిలాస చంపువు, మదనగోపాల మాహాత్యము రచించిన హంస దుర్గం కృష్ణమాచార్యులు.... ఇలా కవులూ రాజకవులెందరో సంస్థానంలో ఒక వెలుగువెలిగి తెలుగు పద్య వికాసానికి దోహదం చేశారు.

కవి పోషకులలో రాజా వెంకటలక్షారాయ బహాదురు పేర్మొనదగినవారు. విద్యాగోష్టులు కొనసాగించి సాహిత్య వికాసానికి కృషి చేశారు. వాజపేయయాజుల రామసుబ్బారాయకవి (రాసురాట్క్మవి) ప్రసన్న భారతం వ్రాశారు. భాగవతుల నరనింహశర్మ ఆంధ్రీకరించిన 'తులసీరామాయణ నీతిరత్నములు” తమ

27

సంపాదకత్వంలో వెల్వరించారు రాసురాట్మవి. తెలుగు పద్య సాహిత్య వికాసంలో దోహదం చేసిన జటప్రోలు సంస్థాన పండిత కవులలో శ్రీధరకృష్ణశాస్రి సరిపెల్ల విశ్వనాథశాస్త్రి, వెల్లాల శివరామశర్మ, వనంసీతారామశాస్త్రి, పత్రి విశ్వేశ్వరశాస్త్రి, పత్రి సత్యనారాయణశాస్తి తదితరుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినదే. దోమకొండ సంస్థానము

ఇది ఇందూరు జిల్లాలో (నిజామాబాదు జిల్లాలో) ఉంది. దీనికి మరో పేరు బిక్కనవోలు. బిక్కునూరనే (గ్రామం దోమకొండకు సమీపంలోనే ఉంది. గద్వాల ఆత్మకూరు పాలకులకీ దోమకొండ రెడ్డి ప్రభువులు సమీప బంధువులు.

పాలకులలో రాజకవి కామినేని మల్లారెడ్డి. ఈయనకు సత్మవిరాజ అనీ, సర్వజ్ఞభోజడు అనీ బిరుదులున్నాయి. మల్లారెడ్డి షట్బ(క్రవర్తి చరిత్రము, శివధర్మోత్తరము, పద్మ పురాణము వంటి (ప్రౌఢ పద్య గ్రంథాలు రచించారు. షద్చక్రవర్తి చరిత్రలో, వేట సందర్భంగా బోయలు పలికిన మాటలు పాత్రోచితంగా ఉన్నాయి.

కం సామిద్దోవముగాదే

గామంబులు సొచ్చిసంపె గంపెడులచ్చల్‌ గామిడి మెకములు మనుజుల బూములు రచ్చింపవయ్య పున్నెపురాజా !

ప్రాచీనార్వాచీన పద్యకావ్యాల్లోనూ ఇలా పాత్రోచిత భాష ప్రవేశ పెట్టడం కనిపిస్తుంది. ఇక కవి అయితే తుపాకి, మైజారు, రుమాళ్లు, హజారము మొదలైన అన్యదేశ్యాలు మల్లారెడ్డి పెద్దన్న కామారెడ్డి (1580-1590) ఆస్థానకవి పట్టమెట్ట సోమనాథ సోమయాజి. ఈయన (బ్రహ్మోత్తర ఖండం, సూతసంహిత తదితర పద్య కావ్యాలను రచించారు. రాజుకామారెడ్డి సోదరుడు కామినేని ఎల్లారెడ్డి. ఈయన బహుభాషావేత్త, బహు పురాణాజ్ఞుడు. వాసిష్టలైంగ (ధర్మ)ము అనే కావ్యాన్ని రచించారు. దోమకొండ సంస్థానంలోని కామారెడ్డి పేట పాలకుడు కామినేని రాజన్న ఈయన (ప్రేరణతోనే రాపాక లక్ష్మీపతి అయిదాశ్వాసాల భద్రయారభ్యుదయం అనే (ప్రబంధం రచించారు. దోమకొండ సంస్థాన కవులలో ఒకరైన ఆదిపూడి ప్రభాకర కవి దోమకొండ ప్రభువుల చరిత్రకు ఆధారంగా నిలచిన ఉమాపత్యభ్యుదయం అనే పద్య కావ్యం రచించారు. విధంగా తెలంగాణ పద్యకవితా వికాసానికి దోమకొండ సంస్థానం తనవంతు బాధ్యతను నెరవేర్చింది.

28

పాపన్నపేట సంస్థానం

మెదక్‌ జిల్లాలోని సంస్థానం ఎంతో పురాతనమైంది. ప్రస్తుతం కుంచించుకపోయి నట్లనిపిస్తుంది. రాణిశంకరమ్మ, సదాశివరెడ్డి తదితరుల వీరగాథలకు నిలయం సంస్థానం. సంగారెడ్డి, వెలమకన్న రామాయమ్మపేట, పటంచెజువు తదితర స్థలాలను దుర్భేద్యం చేసి పరిపాలించిన కథలూ గాథలూ ఉన్నాయి.

పాలకులలో ఒకరైన శ్రీ రాణీవెంకట లక్షాయమ్మ సర్దేశాయ్‌ కవయిత్రి. పీల్గానా శంకరరాయకవి సంస్థానంలోని కవి. ఈయన గురుగీతలు వ్రాశారు. కొన్ని వ్యాఖ్యాన గ్రంథాలు రచించారు. రాజారామచంద్రారెడ్డి బహదురు తదితరులు కవి పండిత పోషకులై తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి దోహదం చేశారు. వనపర్తి సంస్థానం

పాలమూరు జిల్లాలోని వనపర్తి సంస్థానాన్ని 'సూగూరు” పేరుతోను పిలిచేవారు. పూర్వపు రాజధాని సూగూరై నందువల్ల రెండు పేర్లు స్థిరపడ్డాయి. సంస్థాన పాలకులు మోటాటిరెడ్లు. వనపర్తి సంస్థానం క్రిందిదే గోపాలపేట సంస్థానం.

తెలంగాణలో సాహిత్య వికాసానికి ఆత్మకూరు, గద్వాల, దోమకొండ, వనపర్తి సంస్థానాలు దోహదం చేశాయి. అదే విధంగా వనపర్తి సంస్థానం ద్వారా కవులు, రాజకవులు ఎందరో పద్యకవితా వికాసానికి దోహదం చేశారు.

అష్టభాషాకవిగా పేరు పొందిన రాజాబహిరి గోపాలరాయలు (అష్టభాషా గోపాలరాయ) రామచంద్రోదయమనే యమక కావ్యాన్ని రచించారు. అయితే ఇది సంస్కృతంలో ఉంది. చెన్నకృష్ణకవి యాదవభారతీయమనే ద్వ్యర్థి కావ్యాన్ని రచించారు.

ప్రస్తుతం కాకున్నా పద్యకవితా వికాసానికి సంబంధించింది కాకున్నా చెప్పుకోవాల్సిన అంశమొకటున్నది. అదే వీర రావువీయ వ్యాఖ్యానం. మహాభాగవతానికి వనపర్తి ఆస్థాన పండితులు వీర రాఘవాచార్యులు వ్రాసిన వ్యాఖ్యానం. విశిష్టాద్వైత సాహిత్య ప్రపంచంలో తలమానికంగా నిలిచినది. వ్యాఖ్యానాన్ని అనుసరించి భాగవతేతి వృత్తంతో ప్రాదుర్భవించిన పద్య కావ్యాలను ప్రత్యేకంగా పరిశీలించవలసి ఉంది.

29

వనపర్తి సంస్థానాధీశులు రాజానగరంలోని శ్రీరామకృష్ణస్వామి కార్తికపూర్ణిమ బ్రహ్మోత్సవాలలో కవిపండిత గోష్టులను నిర్వహించి పద్యకవితకు పట్టం గట్టారు. అదే విధంగా ఫాల్గుణ పూర్ణిమకు శ్రీరంగనాయకస్వామి ఉత్సవాలలో కవి గాయకాది సమ్మేళనాల నేర్పాటు చేసి సన్మానించారు. ప్రభువులు కవి పండితులకు మడిమాన్యాలిచ్చి ప్రోత్సహించారు. బ్రహ్మ విద్యావిలాస ముధ్రాక్షర శాలను (1870)లో స్థాపించి అనేక గ్రంథాలనూ ప్రచురించారు.

ఇంకా అక్షింతల సుబ్బాశాస్త్రి, గద్వాల చెన్నకేశవ శతకం రచించిన అర్చకం అయ్యమాచార్యులు, భూభ్రమణ భ్రాంతి నిరసనమనే గ్రంథం రచించిన సింగంపల్లి నరసింహ సిద్ధాంతి అలంకార మణిహారం, ఉన్మత్త పాండవం, కేశవోత్సల మాలిక, ప్రసన్నానందలహరి, రఘునాథ విజయం, శ్రీకృష్ణ పంచరత్నమాల, శ్రీనివాస విలాసం, శ్రీరామాయణవైభవం వంటి శతాధిక (గ్రంథాలు రచించిన హంనదుర్గం కృష్ణమాచార్యులు సంస్థానంలోనివారే.

ఆంధ్ర ప్రతాపరుద్రయశోభూషణం రచించిన చెలమచర్ల రంగాచార్యులనీ సంస్థానం గౌరవించింది. వారి గ్రంథాన్ని ప్రచురించి ఓరుగల్లున పుట్టిన విద్యానాథ సంస్కృత ప్రతాపరుద్ర యశోభూషణాన్ని వనపర్తి గౌరవించి ఆంధ్రీకృత పద్యవచన (గ్రంథాన్ని ఆంధ్రాలంకార శాస్త్రాల సన్నిధిలో నిలుపడం వనపర్తి సంస్థానాధీశుల అపూర్వ భాషా సేవగానే చెప్పాలి.

విధంగా తెలంగాణలో పద్యకవితా వికాసం మూడు పూవులు, ఆరు కాయలుగా కనిపించడానికి కారణం సంస్థానాలు - సంస్థానాల నేలిన ప్రభువులు. ఇంకా గోపాలుపేట, నిజాంపేట, గుల్బర్గా జిల్లాలోని సురపురం, గంపలగూడెం, జానకంపేట, మెతుకు, ఆందోలు, దొంతి, నారాయణపురం... వంటి చిన్న చిన్న సంస్థానాలలోనూ తెలుగు పద్యకవిత వికసించింది. ఇక పద్యకవిత్వం అందించే సందేశమేంటో చూద్దాం! తెలంగాణ పద్యకవితా సందేశం

మనిషి మనిషిగా బ్రతకాలి. అందుకొజుకు తమ పెద్దలు చూపిన మంచి మార్గం దోహదం చేస్తుంది. పూర్వికులు సమకాలీనులు రచించిన వాటిలో మంచి ఉంటే అది అనుసరణీయమవుతుంది. తెలంగాణ పద్యకవితల్లోని మంచి దిశాదర్భ్శనం చూద్దాం.

30

కవులు కవిత్వం వ్రాస్తారు. ఉత్తములు కవిత్వాన్ని ఆదరిస్తారు. చెట్లకు పూలు పూస్తాయి. పూల పరిమళాన్ని గాలిమోసుకుపోతుంది అని ఒక ఆభాణక శ్లోకం చెబుతుంది. తెలంగాణ కవుల పద్య కవితా పరిమళం ఎలా వ్యాపించిందో, ఎందరికెలా మంచి దారి చూపించిందో క్లుప్తంగా తెలుసుకుందాం! కవులు వ్రాన్తారు. తెలుసుకొన్న వారు అనుసరిస్తారు. అనుసరణకు పథనిర్దేశం చేసిన మొదటి కవి పాల్మురికితోనే ఇది ప్రారంభిద్దాం! తెలుగు తొలి పద్యకవి అయిన పాల్కురికి సోమనాథుడు “ఉరుతర గద్యపద్యోక్తుల కంటె - సరసమై పరగిన జాను తెనుంగు” అంటూ భాషోద్యమానికి కూడా శ్రీకారం చుట్టిన వాడు. వీరశైవంలో శుద్ధభక్తే ఉత్కృష్టమైందని తన తొలి గ్రంథమైన అనుభవసారం ద్వారా భక్తి ఉద్యమానికి తెరతీసినవాడు కూడా పాల్మురికే. శివునిపై భక్తి మూడు విధాలుగా ఉంటుందన్న పద్యమిది. అమరం గేవల భక్తియుక్తియు తదీయధ్యానమున్‌ శుద్ధ క్తి మనంబార సదాశివార్చనము మూర్తిధ్యానమున్‌ మిశ్రమ క్తి ముదంబీశ్వర చింతనంబును ప్రీతిం గొల్బు సంకీర్ణ క్రి మహాత్మా! యగుశుద్ధ భక్తి పరముత్కృష్టంబుదానెమ్మెయిన్‌ (అనుభవసారము, పద్య: 156) శుద్ధ, మిశ్రమ, సంకీర్ణ భక్తులలో శుద్ధభక్తే ఉత్కృష్టమైనదని సోమన నిర్వచనం. త్రివిధ భక్తులలో చివరి మెట్టు శుద్ధభక్తి. నిరహంకార స్థితితో శివుని కొలవాలనీ అదే శివయోగమని సోమన ఉద్బోధించారు. ఆదిశంకరులు కోకహం (నేనెవరు?) అని అపరోక్షానుభూతిలో ప్రశ్నించి దేహధ్యాస వదలి ఆత్మ (బ్రహ్మ) ధ్యాస దగ్గరికి చేరడమే పరిపూర్ణయోగాభ్యాసంగా ప్రస్థావించారు. సోమన శివయోగమనే విశిష్టయోగ పద్ధతి నందించారు. బాహ్య పరిస్థితులకు సంచరించకుండా స్థిరంగా నిలబడి “యోగం'లో ఉన్న వ్యక్తి అయినా తన చైతన్యశీల జీవనంలో విజయం సాధిస్తాడు. ఇది భూమికగా మానవుని ప్రతి పని కొనసాగితే అది ఉద్యమమై, పలువురిలో చైతన్యాన్ని సృష్టించి విజయగమ్యం చేరుతుంది. తెలంగాణ తొలి పద్యకవి పాల్కురికి సోమనాథుని పథసిర్దేశమిదే.

31

ఇక ఇక్కడి నుండి ఆధునిక కాలం వరకు వేయేండ్ల తెలంగాణ పద్య వికాస చరిత్ర అందించే సందేశాల్లో వ్యక్తి సంస్కారం, కుటుంబంలో గుణశీలాలు, సమాజంలో చైతన్యం, రాజులు మంతట్రులు- వివిధ ఉద్యోగాలలో ఉన్న వారి ధర్మాలు, సదాచారాల వ్యాప్తి, శ్రమజీవుల సంక్షేమం, ఆర్తజన రక్షణ, దయ, క్షమ, పరోపకారం, ఏకాగ్రత, పట్టుదల, సేవాధర్మం, సమయపాలన, కృతజ్ఞత, సమర్పణభావం, త్యాగం, దానం, ధర్మం, నైతికత, న్యాయం, నాగరికత, సంస్కృతి, సత్రవర్తన, సోదరభావం, క్రమశిక్షణ, బెదార్యం, ధైర్యం, శాంతి, అహింస, కృతజ్ఞత, ఐకమత్యం, స్వదేశి, స్వరాజ్యం, సురాజ్యం భూతదయ, స్నేహం, పర్యావరణ పరిరక్షణ... ఇలా వందల వేల అంశాలపై తెలంగాణ పద్యకవి స్పందించాడు. పద్యం ద్వారా పరమార్థం సాధించాలనుకొన్నాడు.

పురాణ, ఇతిహాస, ప్రబంధ, కావ్య, పదకవిత, శతక, ఖండకావ్య... తదితర అన్ని ప్రక్రియల్లోనూ తన ఆలోచనలు విశ్వశ్రేయస్సుకే అన్న సత్యాన్ని నొక్కి చెప్పాడు. దృష్టితో అధ్యయనం చేసినప్పుడు వేల పుటల గ్రంథంగా పద్యకవితా వికాసం రూపుదిద్దుకొంటుంది. అలా రూపుదిద్దుకోడానికి ఇది నాందిగా భావిస్తున్నాను.

(ఈ వ్యాస రచనకు ఇందులో పేర్కొన్న గ్రంథాలు ఆధారం. ముఖ్యంగా గోలకొండ కవుల సంచిక, ఆంధ్రప్రదేశ్‌లో సంస్థానాల సాహిత్య సేవ బాగా

ఉపయోగపడ్డాయి.)

32

తెలంగాణ గేయ కవిత్వం - డాక్టర్‌ పసునూరి రవిందర్‌

ఆధునిక సమాజ ప్రతిఫలనం సాహిత్య ప్రక్రియ విభజన. కానీ, గేయ చరిత్ర అతి ప్రాచీనమైంది. సాహిత్యప్రక్రియలన్నింట్లో మొట్టమొదటి ప్రక్రియ గేయమే! తెలంగాణ నేల జెన్నత్యానికి, సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన చరిత్రను తెలుసుకోవడానికి గేయసాహిత్యం ప్రధాన ఆధారం. చరిత్రపూర్వయుగం నుండి తెలంగాణ ప్రాంత చరిత్రను కళ్లకు కట్టినట్టు వివరించడంలో గేయసాహిత్యం ముఖ్యభూమికను పోషిస్తుంది. గేయకవిత్వం ఇక్కడి ప్రజల సృజనాత్మక శక్తిని, సంస్కృతిని సులభంగా అర్థం చేయిస్తుంది. తెలంగాణ నేల భౌగోళిక స్వరూపం, (ప్రజల జీవన విధానం ఇక్కడి గేయసాహిత్య సృజనకు ఒక ఒరవడిని ఏర్పరిచింది. నేపథ్యంలో తెలంగాణ గేయసాహిత్యాన్ని పరిశీలించినప్పుడు అనేక విషయాలు బోధపడుతాయి. శాతవాహనులకు పూర్వం నుండి అనేక మంది రాజవంశస్థుల పాలనలో కొనసాగిన నేల తెలంగాణ. ఇక్కడి ప్రజల మధ్య ఉన్న జీవన విధానమే కాకుండా ప్రాంత భౌగోళిక స్వరూపం కూడా ఇక్కడి గేయసాహిత్యానికి ఆధారమయింది. తాత్విక పునాది మీదుగానే వేలయేండ్లుగా గేయసాహిత్యం సృజించబడింది. మౌఖిక సాహిత్యం తరతరాలుగా ఒక వారసత్వ సంపదగా సంక్రమిస్తున్నది. లిభఖితసాహిత్య ఆవిర్భావానికంటే కొన్ని వందలయేళ్ల ముందునుండే మౌఖిక సాహిత్యం ఉంది. దాన్ని మనం జానపద సాహిత్యంగా, జానపద కళారూపాలుగా వ్యవహరిస్తున్నాం. జానపదగేయసాహిత్యం గేయసాహిత్యం తెలంగాణ ప్రాంత ప్రజల సంస్కృతిని, చరిత్రను అప్రయత్నంగానే నమోదు చేసింది.

ఒకే అంశాన్ని ఆయా కాలాల్లో వివిధ పేర్లతో ఉచ్చరించే పద్ధతి వ్యవహారంలో చూడవచ్చు. పాటకు పర్యాయ పదాలుగా గేయం, గీతం అనేవి పుట్టుకొచ్చాయి. గాన యోగ్యమైంది గేయం. ఛందస్సును రెండు భాగాలుగా విడగొట్టినప్పుడు పద్యం ఒక భాగమైతే, రెండో భాగం గేయం అవుతుంది. పద్యంలో గల ఛందస్సు అక్షర ఛందస్సు, గేయంలో గల ఛందస్సు మాత్రా ఛందస్సు. అంటే గేయం మాత్రా ఛందస్సుకు సంబంధించినది. మాత్ర అంటే లఘువు అని అర్థం. రెండు మాత్రలు గురువు. యతి ప్రాసలు లేకుండా గురులఘువులతో కూడినదే గేయం. గురువును

33

రెండు మాత్రలుగానే పరిగిణిస్తారు. పద్యం కంటే గేయం ముందున్నదనే విషయం , పై పరిశీలన ద్వారా తేలింది. అటువంటి గేయమే కాలక్రమంలో శాస్త్రాభివృద్ధి జరిగిన తర్వాత లక్షణాలను, నియమాలను రూపొందించుకొని పద్యమైందనీ చాలా మంది అభిప్రాయం, సంగీత సాహిత్యాల కలయిక గేయం. గేయం అతి ప్రాచీనమైన ప్రక్రియ. మాత్రా ఛందస్సుకి గాన గుణం ఉంటుంది. గేయాత్మకతా ఉంటుంది. వ్యవహారంలో గేయం, పదం, పాట అనేవి సమానార్థకాలు. పాడేది గీతం లేదా గేయం” (అమరకోశం -పుట. 1)

లిఖిత సాహిత్య ఆవిర్భావం తర్వాత అనేక విషయాలకు శాస్త్ర ప్రతిపత్తి ఏర్పడింది. అందులో భాగంగానే గేయసాహిత్యానికి కూడా కొన్ని కొలమానాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాత్రా గణాలు, మాత్రా సంఖ్యాగణాలు అనే విభజన గేయరచనలో ఆధునికులు ప్రవేశపెట్టారు. మాత్ర అంటే రెప్పపాటు కాలమని అర్థం. అంటే (హ్రన్వస్వరాన్ని ఉచ్చరించేకాలం. మాత్రా గణాలలో ఉండవలసిన గురులఘువుల క్రమాన్ని బట్టి మాత్రా గణాలు ఏర్పడ్డాయి. సూర్య, ఇంద్ర, చంద్ర గణాలు కూడా మాత్రా గణాలే.

“లయబద్ధమైన ఒక భావం పూర్తి అయి వేరొక భావం మొదలైనప్పటికి విరుపులు సరిపెణలాగా నడుస్తూ ఉందే బంధం గేయమనబడుతుంది” - రాజగోపాలనాయుడు (పాటలో ఛందస్సు - పుట. 26)

గేయం మిగిలిన ప్రక్రియల కంటే రంజింప జేసే గుణం కలిగినది. హృదయాలను ఆకర్షించే, అలరించే గుణం గేయంలో ఉంటుంది. మాత్రా, సంఖ్యా గణాలను మాత్రా నంఖ్యతో నూచిస్తారు. మూడు మాత్రల కాలంలో ఉచ్చరించబడేదాన్ని చతుర్మాత్ర గణాలు లేదా చతురస్రగతి అంటారు. ఇదే విధంగా ఐదు మాత్రలుంటే ఖండగతి, ఏడుమాత్రలుంటే మిశ్రగతులు, తొమ్మిది మాత్రలుంటే సంకీర్ణగతి అంటారు. మాత్రలను త-క-కి-ట అనే అక్షరాలతో సూచిస్తారు. వీటినే జతులు అని అంటారు. ఇదంతా పండితులు తయారు చేసుకున్న కొలమానాలు.

కానీ, ఇవేవీ లేని కాలమైన జానపద సాహిత్య సందర్భంలో గేయమే ప్రముఖస్థానంలో నిలబడి తలెత్తుకుంది. లిఖిత సాహిత్య కాలాన వెలువడిన ప్రాచీన కావ్యాలల్లో కూడా, గేయలక్షణాలు కలిగిన కవిత్వం వెలువడింది. అందుకు

34

ఉదాహరణలే నన్నయ (మహాభారతం), పాల్కుర్కి సోమన (బసవపురాణం), నన్నెచోడుడు (కుమారసంభవం)ల రచనలు, వీటితో పాటు పల్నాటి వీర చరిత్ర, సరాయి పాపడు వంటి వీరగాథలు కూడా గేయరూపంలోనే ప్రజల్లో అనేక తరాల పాటు సజీవంగా మనగలిగాయి. తరువాత యక్షగానాలు కూడా గాన ప్రధానమైనవే. తాళ్లపాక కవులు, క్షేత్రయ్య, త్యాగయ్య, భక్తరామదాసు మొదలగు వారి పదకవిత్వం, గేయవాజ్మయానికి జవజీవాలను అద్దింది. తాత్వికగేయాలు గానీ, వీర బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలు గానీ, అచలసద్దురు కీర్తనలు గానీ గేయప్రక్రియకి పరిపుష్టిని చేకూర్చినవే. హరికథాగానంలో కూడా గేయానికే ప్రాధాన్యం. ప్రాచీన పద్యనాటకాలలో కూడా గేయాలకి చోటు ఉండడాన్ని గమనించవచ్చు. శ్రీకృష్ణ తులాభారంలో “మీరజాలగలడా...”, సతీసావిత్రిలో “పోవుచున్నాడే....” వంటి గేయాలు, ప్రజల నాలుకలపై నేటికీ నిలిచి ఉన్నాయి.

ఆధునికంగా కూడా గేయ సాహిత్యం తెలుగు సాహిత్యంలో విశేషమైన స్థానాన్ని సంపాదించుకుంది. గురజాడ “ముత్యాల సరాలు’ గేయరూపకావ్యమే. ఇదే కాకుండా లవణరాజుకల, కన్యక, పూర్ణమ్మ, దేశభక్తి వంటి గేయరచనలు ఆధునిక సాహిత్యంలో ప్రత్యేకతను చాటుకున్నాయి. ప్రబోధానికి, కథకీ, దేశభక్తికీ, ప్రణయానికీ, ప్రకృతికీ కూడా గేయం అద్భుతసాధనమని గురజాడ నిరూపించారు. అలాగే రాయప్రోలు సుబ్బారావు రచించిన అనేక గేయాలు ప్రసిద్ధిగాంచాయి. విశ్వనాథ సత్యనారాయణ ముత్యాల సరంలో రచించిన “కోకిలమ్మ పెండ్లి” గేయ కావ్యంగానే వెలువడింది. వీరితో పాటు అడవి బాపిరాజు, బసవరాజు అప్పారావు, కవికొండల వెంకటరావు, వేదుల, దువ్వూరి రామిరెడ్డి మొదలగు కవులు అపూర్వమైన గేయకవిత్వాన్ని అందించారు. మరోవైపు భావకవిత్వోధ్యమంలో కూడా గేయం అపారమైన ప్రాచుర్యాన్ని పొందింది. దేవులపల్లి, తల్లావరుల శివశంకరశాగ్తి వంటి వారి వల్ల గేయం నూతన పోకడలు పోయి వికసించింది. తరువాత శ్రీశ్రీ గేయాల్లో మరో ప్రపంచం, బాటసారి, అవతారం, ఏవి తల్లీ వంటివి విశిష్టమైనవి. కాలక్రమంలో ఆయా కవుల రచనాసరళితో గేయం పలు మార్పులకు లోనైంది. గేయాలు గేయనాటికలుగా కూడా వెలువడ్డాయి. ఆధునిక కవిత్వంలో గేయాలను గేయకావ్యాలు, ప్రణగేయాలు, ప్రకృతి వర్ణనాత్మక గేయాలు, దేశభక్తి గేయాలు, సాంఘిక లేదా సంస్మరణాత్మక గేయాలు, భక్తి లేదా సంస్మరణాత్మక గేయాలు, గేయనాటికలు, బాలల గేయాలు, ప్యారడీ

35

గేయాలు, ఉద్యమ గేయాలు అని పలు విధాలుగా విభజించారు. గేయసాహిత్యాన్ని బలంగా వెలువరించిన వారిలో డా. సి.నారాయణరెడ్డి (నాగార్జున సాగరం, కర్పూరవసంతరాయలు మొదలగునవి), పుట్టపర్తి నారాయణాచార్యులు, విద్వాన్‌ విశ్వం, సోమసుందర్‌, నాగభైరవ, వానమామలై పరదాచార్యులు, బోయిభీమన్న గజ్జెల మల్లారెడ్డి, ఆరుద్ర, దాశరథి వంటి వారు సుప్రసిద్ధులు. నండూరి సుబ్బారావు సమయానికి గేయాలు అనకుండా పాటలు అనడం మొదలైంది. యెంకిపాటలు గేయకవిత్వంలో సంచలనం కలిగించాయి. తరువాత సినిమా పాటలను కూడా తొలి రోజుల్లో సినీగేయాలు అని వ్యవహరించారు. కానీ, అభ్యుదయ, విప్లవ, దళిత ఉద్యమాల కాలం నాటికి గేయం అనే మాట పూర్తిగా మరుగునబడి పోయి “పాటి అనే మాటే స్థిరపడిపోయింది. అందువల్ల గేయం అనేది కాలపరిణామంలో తొలినాటి మాటగా, అలాగే గీతం అనేది కూడా శిష్టవ్యవహారికంగా ఉచ్చరింపబడితే, జనసామాన్యంలో మాత్రం అది పాటగా, ప్రజలపాటగా, ఉద్యమపాటగా వ్యవహరించబడుతోంది.

గేయసాహిత్యంలో సింహభాగం మౌఖికమైనదే. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే విలువైన జానపదగేయసంపద సజీవంగా ఉంది. తెలంగాణ ప్రాంత జానపద కళారూపాల్లో గేయం అవిభాజ్యమైంది. జానపద కళారూపాల్లో చాలావరకు గేయంతో సంబంధం కలిగినవే. చిందు, ఒగ్గు, మందహెచ్చుల వంటి జానపద కళారూపాల్లో గేయం అంతర్లీనంగా ప్రవహిస్తుంది. కథను నడిపించడానికి గేయం ఒక ఇంధనంగా ఉపయోగపడుతుంది. కథలోని పలు భావోద్వేగాలు పలికించడానికి గేయమే వారికి ఆధారంగా నిలుస్తుంది. ఇట్లా జానపద కళారూపాలకు పాట ఆధారం కావడానికి ప్రధాన కారణం పాట ఇక్కడి ప్రజల జీవితంలో భాగంగా ఉండడమే. తెలంగాణ ప్రాంతానికి ఉన్న సాధుజీవన సంస్కృతి కళాత్మకమైన జీవనవిధానాన్ని అలవర్చింది. ముఖ్యంగా ఆశ్రితకులాలకు పాటే ఒక జీవనాధారంగా మారింది. ఇదే క్రమంగా జానపదగేయ చరిత్రకు పెట్టని కోటగా నిలిచింది. తెలంగాణ ప్రాంత ప్రజల జీవితంలో పాట పెనవేసుకొని ఉంది. పొద్దుగాల నిద్దురలేపే బాలసంతుల పాట దగ్గరి నుండి ఇక్కడి ప్రజల జీవితమంతా పాట చుట్టే తిరుగుతుంది. తెలంగాణ ప్రజల జీవితంలో పాట విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉంది. ఇక్కడి ప్రజల జీవితంలోని అనేక సందర్భాలకు పాటే ప్రత్యక్షసాక్షి అందుకే రకరకాల పాటలు సృజించబడ్డాయి.

36

వాటిలో వారి జీవితం కష్టసుఖాలు, పండుగలు, పబ్బాలు, ఆచార వ్యవహారాలు ప్రతిఫలించాయి. ముఖ్యంగా శ్రమతో ప్రత్యక్ష సంబంధం కలిగిన బహుజన కులాల సాంస్కృతిక సంపదే గేయసాహిత్యం. బహుజనులకు పాటతో ఉన్న అనుబంధాన్ని తెలిపేవే జానపదగేయసాహిత్యంలోని పలురకాల పాటలు. నాట్లపాటలు, కోతలపాటలు, రోకటిపాటలు, హోళిపాటలు, పెళ్ళిపాటలు, బతుకమ్మ పాటలే కాకుండా ఆ(శిత కులాల కళరూపాలైన చిందు యక్షగానం, బైండ్ల జమిడిక కథలు, గొల్లకుర్మల ఒగ్గుడోలు కథలు, మంద హెచ్చులు, శారదగాళ్ల కథలు వంటివన్నీ పాట మోద నడిచేవే. పనిలో భాగంగా పాట పుట్టిందన్న అవగాహనను ఆధారం చేసుకొని మరికొంత ముందుకుపోతే, మౌఖిక సాహిత్యకాలంలో పాట పోషించిన పాత్ర ఏపాటిదో అర్థమౌతుంది. ప్రజల నోళ్లనుండి వెలువడిన పాట, అపుడు జనం స్వంత అనుభవంలోనుండి పుట్టిందే. ఇది ఒకరి నుండి మరొకరికి చేరుతూ, సజీవమవుతూ ఉంటుంది. సుధీర్ధ ప్రయాణంలో పాట అనేక మార్పులకు లోనైంది. అదే జానపదంగా లిఖిత సాహిత్య పండితుల చేత పిలువబడింది. “జనానాం పదమ్‌” జనులకు నెలవైంది అని జానపద శబ్దానికి వ్యుత్పత్తి. జానపద సంబంధమైంది జానపదం. జనపదమంటే పల్లెపట్టు. పల్లె పట్టుకు సంబంధించినవారు జానపదులు. కష్టసుఖాల్లో భావావేశాలకు లోనైనప్పుడు, అప్రయత్నంగా వారి గుండెలోతుల్లోంచి వెలువడే పాటలే జానపద గేయాలు” (లీలావతమ్మ, పొన్నా 1986:1)గా పిలువబడ్డాయి. జానపద గేయాలు కూడా అనేక రకాలుగా ఉన్నాయి.

“పాట జానపదుల వారసత్వ ఆస్తి. గ్రామీణ ప్రాంతంలో పాట ఒక పొద్దుపొడుపు. ఆడపడుచుల నోళ్లలో బతుకమ్మపాట. మంచెకాడ కొంటె పాట, గట్టుమీద గుండెతడి పాట, దంపుల్ల కాడ, వరినాటుకాడ, మోటకాడ, పశువుల కాపరినోట, ఎక్కడ చూసినా పాటే. “పాటకు తల్లి పల్లె” (గూడ అంజయ్య ముందుమాట, రాములు, బి.ఎస్‌ 2011:18). ఇలా పల్లె కేంద్రంగా జానపదం విస్తరించి, వందల యేండ్ల పాటు సజీవంగా తన మనుగడను కొనసాగిస్తోంది. ప్రజల కష్టసుఖాలకు అద్దం పడుతూ పాట, ఆయా కాలాల సామాజిక చరిత్రను నమోదు చేసింది. అందుకే, పాటంటే కేవలం అలరించే సాధనం మాత్రమే కాదు, చరిత్ర పుటల్లో తప్పిపోయిన జీవితాన్ని పట్టి చూపించేది. పాట సాహిత్య చరిత్రేకాదు, సామాజిక చరిత్ర కూడా. జానపద

37

పాట రూపమే, పోరాట పాటగా మలచబడి, ఉద్యమాలకు ఊపిరి పోసి బ్రతికించింది. తెలంగాణ ప్రాంతంలో కూడా మౌఖిక సాహిత్య ఒరవడికి చెందిన గేయసాహిత్యం విశేషంగా ఉంది. “తెలంగాణవు మండలములందంతటను అనాదిగా జానపదగేయములు సెలయేరులటుల గలగల పారుచూనే యున్నవి. తెలంగాణ ప్రథమ విప్లవ మహాకవి పాల్కుర్కి సోమనాథడు తన కాలమున ప్రచారమున నున్న గేయముల నెన్నింటినో పేర్మొనెను. సోమనాథుడు రోకటి పాటలు, తుమ్మెద, ప్రభాత, ఆనంద, శంకర, నివాళి, వాలేశు, గొబ్బి, వెన్నెల పదముల నానాడే వినెను. ఇంతియ కాదు. అతని కవిత్వమున కాధారములానాడు ప్రజల భక్కుద్రేకములతో పాడుకొన్న గేయములేనట. “ఆతత బసవపురాతన భక్త, గీతార్థ సమితియే మాతృకగాగ” సోమనాథుడు బసవ పురాణమును ద్విపదలందు గూర్చెను. ద్విపద ఛందము గూడ ప్రజల సొమ్మే. కంఠోక్తిగా గోన బుద్దారెడ్డి చెప్పకపోయినను రంగనాథ రామాయణమున జేర్చిన వాల్మీకీయ గాథలకు జానపద గేయములే మూలములై యుండునని నా తలంపు. భాస్మరాదులును నిట్టి కథలు కొన్ని జానపదుల కడ గైకొన్నవారే. పోతనామాత్యుడు తడవిన గోవిందు మీది పాటలు, జోలపాటలు లక్కసానమ్మగారి కంఠోద్దతములే. ఓరుగంటి వీథులందు ప్రబంధముల వీరానీకముం బాడువారునూ, పరశురాముని కథలు పాడు బనీలును, కమవల్లి కథలు సెప్పు జక్కుల పురంధ్రులును తిరుగుచుండి రనుటకు వల్లభరాయల సాక్ష్యమున్నది. కొజవి గోపరాజు వెన్నులగుడి పాటలు వినెను. విధముగా సోమనాథుని నాటినుండి కందుకూరి రుద్రయ్య వరకు వచ్చిన తెలంగాణ ప్రజాకవులందరును తెలంగాణమున తమ కాలమున ప్రచారమున నున్న గేయ కవితలను దడవినవారే. ఆయా గేయముల వరుసలలో తామును పాటలు పాడినవారే. భద్రాచలం రామదాసు సంగతి వేరే చెప్పనక్కరలేదు. అతని గేయ కవిత్వమంతయు తెలుగు జానపదుల సొమ్మెపోయినది. నేటికిని పూర్వకవులు పేర్కొన్న ఆయా పాటలు, వరుసలు తెలంగాణమున ప్రచారమందున్నవి. (బిరుదు రామరాజు వ్యాసం, ఆళ్వారు స్వామి, వట్టికోట 1956:74-75)” విధంగా జానపదగేయ పరిణామ క్రమం తెలంగాణలో విస్తరించింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన కథ రేణుకా ఎల్లమ్మ.

తెలంగాణ నేల స్వాభావికంగానే పాటకు అనువైంది. భౌగోళికంగా రెండు

38

జీవనదుల మధ్యన ఉన్న నేల కావడం, విశాలమైన భూభాగంలో సహజసిద్ధంగా ఏర్పడిన కొండలు, గుట్టలు, లోయలు, అడవులు తెలంగాణకు పెట్టని కోటలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా నడుల ఒడ్డున్నే నాగరికత వెలిసిందనడానికి సాక్ష్యంగా ఈజిప్టు, మెసపటోనియా, సింధూ, హరప్పా మొదలైనవి కనిపిస్తాయి. అలాగే తెలంగాణ ప్రాంతం కూడా కృష్ణా, గోదావరి నదుల మధ్యలో ఉంది. అందువల్ల ఇక్కడ నాగరికత వెల్లివిరియడానికి పుష్కలంగా అవకాశాలు కలవు. అలాగే సాంస్కృతికంగా సింధూ, బైండ్ల, శారద, ఒగ్గు వంటి కళారూపాలు ఆవిర్భవించడానికి ఇక్కడి పరిస్థితులే కారణం. కథలకు వెన్నెముక పాట, కథ ఏదైనా కథ కథనాన్ని సంవిధానం చేసేది పాటే. అలా కథను ఆశయించిన పాటలతో పాటు, ప్రజల జీవితంలో కూడా పాట వీడని తోడుగా కొనసాగింది. “పుట్టిన పాప ఏడ్పుతోనే, నవ్వుతోనే ఇంట్లో పాట పుట్టి పెరుగుతుంది. ఆ... ఆయమ్మా... ఆయీ.... పుట్టి పురుడు చేయంగా పాట, అటు ఇటు దొర్లంగ తొట్టెలో వేయంగా పాట. లాలిపాట. పాపకు పేరు పెట్టంగా పాట. పిల్లలకు ఓనమాలు దిద్దించినప్పుడు పాట, పిల్లలు పెద్దమనుష్యులైతే పాట, పిల్లలకు పూలుపండ్లు పెట్టినప్పుడు పాట, పిల్లలకు పసుపేసి నీళ్లుపోసినప్పుడు పాట, పిల్లాపిల్లగాని ఎదుర్మోళ్ళప్పుడు పాట. పెండ్లిలో పాటలు. పిల్లా, పిలగాడు ఆకులు పోకలు అందించుకొన్నప్పుడు పాట. పిల్లా పిలగాన్ని సాగనంపేటప్పుడు పాట, కొత్తకోడలు అత్తగారిల్లు గడప తొక్కినప్పుడు పాట, దీపం పెట్టగానే పాట, పున్నం, అమావాస్యకు పాట, ప్రతిపండుగకు తీర్థానికి పాట. గుడి, చర్చి, మసీదు, గురుద్వారలో పాట. దుఃఖం ఆపుకోవడానికి దుఃఖం పాటలు, ముసలితనం రాగానే వైరాగ్యం, భక్తిపాటలు. మనిషి చస్తే పాటలు. శవం ఇంట్లో ఉండగానే భజనపాటలు, చనిపోయిన వ్యక్తి మీద పాటలు, చావు ఊరేగింపుగా తీసికెళ్లేటప్పుడు పాటలు, చావును దింపుడు గల్లం వద్ద దించినప్పుడు గురువుపాటలు శవాన్ని బొందలో పెట్టిన తర్వాత, తీర్ధంపోస్తూ గురువుపాడే పాటలు, బొందల మీద ఊదుకాల్చేటప్పుడు పాటలు మూడొద్దులు, ఏడొద్దులనాడు కథలు, పాటలు. చనిపోయినవాళ్ల మాద బిచ్చగాల్లు పాడే పాటలు. ఇట్లా మనిషి పుట్టిన నాటి నుండి చచ్చేదాకా పాట వెంటనే ఉంటుంది. (గద్దర్‌ 1992:12) ఇలాంటి నేపథ్యమున్న పాట మరోవైపు (శ్రమ చేసే పీడిత కులాలకు కూడా పాట తోడునీడయింది. “ఇంటిపనులలో ఇల్లు, వాకిలి ఊడిచేటప్పుడు ఊడ్పు పాటలు, కుండలు, పాత్రలు కడిగేటప్పుడు కూనిరాగాలు, దంపుడు పాటలు,

39

కుట్టుమిషన్‌ పాటలు విసుర్రాతి పాటలు. ఇక భూమి పనితో పాట, వర్షం పడ్డప్పుడు పాట, నాగండ్లు కట్టినప్పుడు పాట, తూకం పోసినప్పుడు, దుక్కులు దున్నేటప్పుడు, నారు పీకేటప్పుడు, నాట్లు వేసేటప్పుడు, కలుపులు తీసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు మోపులు కట్టేటప్పుడు, కుప్పలు కొట్టేటప్పుడు, మోపులు మోసేటప్పుడు, బండ్లకు ఎత్తేటప్పుడు, తూర్పు పట్టేటప్పుడు, బండ్లు తోలేటప్పుడు మొదలైన పాటలు. కొత్తలు అంటే కొత్తబియ్యం వొండి నైవేద్యం పాట. పనితో పెనవేసుకునే పాట సాగుతుంది. అటువంటి పాటను ఆధారం చేసుకొని వెలుగుజూసిందే పోరాట పాట. పోరాటంలో భాగంగా తెలంగాణ నేలమీద (ప్రజల పాట పోరాట పాటగా మలచబడింది.

నిత్యం పోరాటలతో విలసిల్లే తెలంగాణ నేలకు ఉన్న స్వభావం వల్లనే ఇక్కడ పాట సజీవమైంది. తరచుగా జరిగే పోరాటాలలో పాల్గొనే ప్రజలను చైతన్య పరచడం కోసం పాటను ఆశ్రయించడమనేది రివాజుగా మారింది. ఒక ఉద్యమం తరువాత మరో ఉద్యమం పురుడుపోసుకోవడానికి వెనుకబాటుతనం, పాలకుల పీడనే కారణం. విధంగా వెనుకబాటు తనానికి కారణాలను పాట అన్వేషించింది. వాటి మూలాలను విశ్లేషించి పని సాహిత్యం స్వీకరించింది. సాహిత్యంలో అన్ని ప్రక్రియల కంటే పాటే అత్యంత ఎక్కువగా ప్రజల జీవితాలకు చేరగలిగింది. వ్యవసాయక ప్రధానమైన దేశంతో, అక్షరాస్యత అంతంత మాత్రంగానే ఉండడం వల్ల పాట ద్వారా మాత్రమే రాజకీయాలను బోధించడం, అర్థం చేయించడం వీలైంది. దీనికి తెలంగాణ ప్రాంతంలోని జానపద ఆశ్రిత కులాల మౌఖిక సంప్రదాయం సృష్టించిన పాటల ఒరవడి ఎంతగానో ఉపయోగపడింది. తరతరాలుగా ప్రజల జీవితాలతో పెనవేసుకున్న జానపద కళారూపాల శక్తిని తెలంగాణ సాయుధపోరాటం (గ్రహించింది. వాటిని పోరాట రూపాలుగా మలిచి, మళ్ళీ అదే ప్రజల వద్దకు చేర్చింది. ప్రయోగం మళ్లీ విప్లవోద్యమంలో మరోసారి విజయవంతమైంది.

గతకాలపు అనుభవాల మీదే వర్తమానం నిర్మించబడుతుంది. సూత్రమ్మీద ఆధారపడే తెలంగాణ సాంస్కృతికరంగం విస్తరించింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వందల యేండ్లుగా సజీవంగా ఉన్న జానపదమే పోరాట పాటకు ప్రధాన వాహకమయింది. జానపద బాణీలతో మమేకమయ్యే శ్రామిక జీవనం తెలంగాణ ప్రజలది. అందువల్లనే పోరాటంలో ఉన్న ప్రజాకళాకారులు, అనివార్యంగా రూపాన్నే స్వీకరించి పాట రాయవలసిన అనివార్యత ముందుకొచ్చింది. అట్లా తెలంగాణ రైతాంగ

40

సాయుధపోరాటంలో పోరాట పాట అంటే దాని వస్తువే కొత్తది తప్ప, రూపం మాత్రం అప్పటికే ప్రజల్లో విశేషంగా ఉన్నదే. ప్రజల బాణీని స్వీకరించి పాటను విప్లవీకరించే దశ విధంగా ఆరంభమయింది. అలా సృజించబడిన గేయసాహిత్యం తీరుతెన్నులను మరింత ఉదాహరణ సహితంగా అధ్యయనం చేయడం వల్ల వలస పాలనలోని వర్గపోరాట గేయం యొక్కస్వరూపం మరింత అవగతమవుతుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గేయాలను ప్రధానంగా క్రింది విధంగా విభజించవచ్చు.

1. వెట్టి చాకిరి పీడనను తెలిపే పాటలు, 2. భూస్వాముల దోపిడిని తెలిపే పాటలు, 3. నిజాం వ్యతిరేక పాటలు, 4. అమరవీరుల పాటలు, 5. సైనిక చర్య పాటలు

(ప్రజల విముక్తి కేంద్రంగా కొనసాగిన పోరాటం అంతిమంగా ప్రజాశ్రేయస్సునే ఆకాంక్షిస్తుంది. శత్రువు దురాగతాల మీద పాటలు, ప్రశ్నల జడివాన కురిపించాయి. దొరలు, దేశ్‌ముఖ్‌ల నిజస్వరూపాన్ని పట్టి చూపించాయి. సంఘటనాత్మకంగా స్పందించడమనేది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట గేయానికి ఒక ముఖ్యభూమిక. తెలంగాణలో కొనసాగిన భూస్వామ్య ఆధిపత్యానికి పరాకాష్ట వెట్టి చాకిరి విధానం. ఒక మనిషి సాటి మనిషిని బానిసగా భావించడమనేది మధ్యయుగాల లక్షణం. కానీ, ప్రపంచ వ్యాప్తంగా అప్పటికే మానవ ప్రగతి ముందుకు దూసుకుపోతుంటే తెలంగాణలో మాత్రం చీకటిరోజులు కొనసాగాయి. భూమి మీద అధికారం కలిగిన భూస్వాములు ఆధిపత్యాన్ని నిలువెత్తు రూపాలుగా చలామణి అయ్యారు. తమ సుఖం కోసం గ్రామాల్లోని సబ్బండ కులాలను తీవ్రంగా పీడించారు. ఒక్కో దొర దగ్గర పద్దెనిమిది రకాల వెట్టి పనులు చేసే వారుండేవారని చరిత్ర చాటి చెబుతున్నది. మరోవైపు వ్యవసాయపరంగా ఊరంతా దొర భూమిలోనే పని చేసి చెమట ధారపోసి పంటలు పండించి, గుమ్ములు నింపి, కనీసం గంజికి కూడా నోచుకోని దైన్య పరిస్థితులు ఆనాడు ఉండేవి. ఇటువంటి రాచరికపు ధోరణి కింద ప్రజలు నలిగిపోయారు. దుస్థితిని గమనించిన ప్రజా కవులు రచయితలు తమ రచనలు వెట్టి చాకిరి పీడనను హృద్యంగా చిత్రించారు.

“పల్లెటూరి పిల్లగాడా

పసులగాచె మొనగాడా

41

పాలు మరచి యెన్నాళ్ళయిందో పాల బుగ్గల జీతగాడా”

సుద్దాల హన్మంతు రచించిన పాట నాటి వెట్టిచాకిరి తీవ్రతను కండ్లముందుంచుతున్నది. పాలబుగ్గల వయసు కలిగిన ఒక పసి పిల్లాడు దొరలకు జీతం చేస్తూ, పడుతున్న నరకయాతనను హనుమంతు హృద్యంగా గేయీకరించాడు. దృశ్యాన్ని మాత్రమే కాక, దాని వెనుకదాగిన ఆధిపత్య శక్తుల క్యూరత్వాన్ని కూడా రచయిత చిత్రించిన తీరు అద్భుతం. పాలు అప్పుడే మరిచిన పసివాని చేత కూడా వెట్టి చేయించుకున్నారనడం, నాటి పరిస్థితి యొక్క తీవ్రతను వ్యక్తీకరించడమే. ప్రజాజీవితాన్ని గేయం ద్వారా వ్యక్తీకరించడానికి సుద్దాల హన్మంతు కవిత్వాన్ని ఆశ్రయించాడు. కండ్లకు కట్టినట్టు వర్ణించిన తీరు పాటలో బలంగా చిత్రితమయింది. చిన్నపిల్లలు ఏడ్చేటపుడు వారు కండ్లు నలుపుకుంటూ ఏడుస్తారు. దీన్ని ఉన్నదున్నట్టుగా పాటలో తీసుకొచ్చిన ఘనత ప్రజావాగ్గేయకారునిదే. చెక్కిల్లపై కారే కన్నీటిని కాలువలా కారుతున్నాయని పోల్చినతీరు తెలుగు సాహిత్యంలో చాలా అరుదుగా కనిపించిన పోలిక. ప్రజల జీవనదైన్యానికి గేయమే ఒక ప్రతీక,

ప్రజల భాషలో సృజించిన పాటలు పోరాటానంతరం కూడా దశాబ్దాల పాటు ప్రజల నోళ్లల్లో సజీవంగా ఉన్నాయి. అంతటి ప్రాసంగికత తెలంగాణలో తిరిగి కొనసాగడం కూడా ఇందుకొక కారణం. తెలంగాణ రైతాంగ పోరాట తిరుగుబాటు గేయం అనగానే గుర్తుకొచ్చే పాట బండియాదగిరి రచించిన “బండెనుక బండికట్టి... పదహారు బండ్లు కట్టి” అనే పాట. తెలంగాణ సాయుధపోరాట క్షేత్రంలో నిలబడ్డ సామాన్యుడికి గల గుండె ధైర్యానికి పాటొక మచ్చుతునక. బలవంతుడైన దొర ఆధిపత్యాన్ని తుదముట్టించడానికి అందరం ఒక్కటయ్యాం, ఇక పెత్తనం చెల్లదనే సవాల్‌ గీతంలో అంతర్గతంగా ధ్వనిస్తున్నది. సామాన్యుడు సాయుధుడైతే, శక్తి అతని ముందు నిలువలేవనే సత్యం ధిక్మారంలో కనిపిస్తున్నది. ప్రజల పక్షం వహించిన రచయితలో కలిగిన ఆగ్రహానికి పాటలోని పదాలు అద్దం పడుతున్నాయి. ప్రజల జీవితం ప్రతిఫలించిన గీతం కావడం వల్ల పాటను ప్రజల గుండెల నిండా హత్తుకొని సొంతం చేసుకున్నారు. తిరుగుబాటుకు సిద్ధమైన (ప్రజలకు మరింత ఉత్సాహాన్ని ఊపుని అందించింది గీతం. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట తాలూకాలోని ఒక మారుమూల (గ్రామంలో, సాధారణ దళితకుటుంబంలో

42

జన్మించిన యాదగిరి రచించిన పాటకు, ప్రజలు కాలంలో నీరాజనం పలికారు. “బందెనుక బండి కట్టి... పదహారు బండ్లు కట్టి... బండ్లె వస్తవు కొడుకో...” అనే సుప్రసిద్ధ గేయం ప్రతాపరెడ్డి దొరనుద్దేశించి రాసిందే (వరవరరావు, 1983:5 అనుబంధం). పాట తరువాత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిజాం మీద కూడా పాటను అల్లుకోవడం జరిగింది. బండియాదగిరి కమ్యూనిస్టు గెరిల్లా దళంలో సభ్యుడైన తరువాత, పెరిగిన చైతన్యంతో తానే నిజాం మీద రచించాడని పలువురు పరిశోధకులు భావించారు. పాట చివరలో “గోల్కొండ ఖిల్లా కింద నీగోరి కడుతం కొడుకా” అంటూ శపథం చేస్తాడు రచయిత. గోల్కొండకు గోరికి ప్రాస కుదరడం, తరువాత ప్రజాగ్రహానికి సరిగ్గా సరిపోవడమే ఇందుకు కారణం. ఇట్లా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజాకవులు వాగ్గేయకారులు గేయసాహిత్యాన్ని సృజించే ప్రజలను ఉద్యమబాట పట్టించారు. అనుభవమే తరువాత కాలంలో దారిచూపే మార్గమైంది.

“ప్రజ అనే మాటను కూడ ఉత్పత్తిలో పాల్గొనేవాళ్లు అనే అర్ధంలో కాకుండా, స్థూలంగా మనవ సమూహం అనే అర్థంలో వాడినపుడు ప్రజలు పాడే ప్రతీ పాట ప్రజల పాట కాదు. ప్రజల జీవితాలు, ప్రజల పోరాటాల చిత్రీకరణ మాత్రమే కూడా ప్రజల పాట కాదు. ప్రజల ప్రాపంచిక దృక్పథాన్ని ప్రతిఫలించేది ప్రజల పాట అవుతుంది” (వరవరరావు, అరుణతార 1992:22 ఏప్రిల్‌ సంచిక). తెలుగు సమాజంలో తెలంగాణ నేల బెన్నత్యాన్ని ఎలుగెత్తి చాటిన తెలంగాణ రైతాంగ సాయుధపోరాట వారసత్వంగా వచ్చిన పాట పదునెక్కిన కాలం రెండున్నర దశాబ్దాలు. కాలంలో పాట విస్తరించడంతో పాటు, ఉద్యమ లక్ష్యాలకు ఒక ఆయుధంగా మారింది. ప్రజల్లో విప్లవ పాటకు విశేష ఆదరణ లభించింది. ఉద్యమం మీది (ప్రేమను పాట కూడా గెలుచుకోగలిగింది. వలసోత్తర కాలంలో మొట్టమొదటిసారిగా పాట ఒక శక్తిగా ఎదిగింది విష్లవోద్యమంలోనే. లక్ష్యం ప్రజల విముక్తే అయినప్పటికీ, వేల రకాలుగా సృజించబడి కొత్త చరిత్రను లిఖించింది. పాటంటే (ప్రజలపాటే అనే నానుడిగా మారింది. సామాన్యుడి దరిచేరి, ఓదార్చి, బతుకు మూలాలను పట్టించి, పోరాటానికి సిద్ధం చేసింది పాట. కాలంలో పాట మహావాగ్గేయకారులకు జన్మనిచ్చింది. ప్రజల్లోకి పాటను ప్రవహింపజేసిన ప్రజావాగ్షేయకారుడు గద్దర్‌ను కన్నది, కనుగొన్నది కాలపు పాటే. వందల సభల్లో

43

గానమై పోటెత్తింది పాట. పాటలేని విప్లవోద్యమాన్ని ఊహించలేం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వికసించిన పాట, శ్రీకాకుళం ఉద్యమాన్ని కూడా రాటుదేల్సింది. మళ్ళీ అదే శ్రీకాకుళ ఉద్యమ ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో సొంతగూడు చేరింది. అందుకే పోరాటపాట శాశ్వత చిరునామా తెలంగాణే అనడం సముచితం.

పోరాటంలో వేలాదిమంది తమ ప్రాణాలను ప్రజా విముక్తి కోసం బలిదానమిచ్చారు. వీరులను తలుచుకోవడం అంటే నేలకు ఉన్న వీరోచిత చరిత్రను స్మరించడమే. తమ ముందు కాలంలో జరిగిన పోరాట చరిత్రను, త్యాగాలను గుర్తుచేయడం ద్వారా ప్రజల్లో ఆత్మగౌరవం పెంపొందుతుంది. అటువంటి ప్రయత్నం అమరవీరుల సంస్మరణ ద్వార మాత్రమే సులభతరమవుతుంది. ఇక నక్సలైట్‌ ఉద్యమంలో నేలరాలిన వారిని గురించి సృజించిన పాట మరింత పదునైనదిగా తీర్చిదిద్దబడింది.

“వోలి వోలీలరంగవోలి సెమ్మకేలిల వోలి

వోలి వోలిరంగవోలి సెమ్మకేలిల వోలి

యాడబుట్టి యాడబెరిగి

యాడికొచ్చి యాడ సచ్చె

ఎవరికొరకు వచ్చినారు

ఎవరి కొరకు సచ్చినారు

చక్కనైన కొడుకులమ్మ వోలి సెమ్మకేలిల వోలి

సుక్కలల్లో గల్సిరమ్మవోలి సెమ్మకేలిల వోలి (గద్దర్‌ 1992:209)

తెలంగాణలో సాధారణంగా వినిపించే హోలీపాట బాణీ ఇది. పల్లవి వరకు

ఉన్నది ఉన్నట్టుగానే స్వీకరించి, చరణాల్లో మాత్రం అమరవీరుల (ప్రస్తావన చేశారు. చివరి వరుస కరుణ రసంతో సాగిన పాట ముగింపులో మాత్రం వీర రసానికి చేరుకోవడం కనిపిస్తుంది.

“బిడ్డలార మిమ్ములాను సంపినోళ్ళ వొదలబోము

కండ్లు మూసి కండ్లు తెరిస్తే కండ్లల్ల మెదులుతును

కాలు దీసి కాలేస్తే కాళ్లల్ల మెదులుతును

కక్ష దీర్చుకోనికి వోలి సెమ్మకేలిల వోలీ

44

కాళమ్మలవుతాము వోలీ సెమ్మకేలిల వోలీ” (అదే పుట.)

స్థానికంగా ఉన్న ప్రజల బాణీలో సృజించిన గేయం ముగింపుకొచ్చే సరికి ధిక్కార స్వరాన్ని సంతరించుకొని, వీరరసాన్ని పలికింది. తద్వారా పాటలో వీరులను కన్న తల్లులే వీరులను చంపిన హంతకులను నేలరాల్చుతామనే (ప్రతిజ్ఞ బూనడం వారి వారసత్వాన్ని అంది పుచ్చుకోవాలని ప్రజలకు బోధించడమే. అమరవీరుల పాటల్లో జీవితం అద్భుతంగా కవిత్వీకరించిన ఆణిముత్యగీతం గద్దర్‌ రచించిన “వందనాలు వందనాలమ్మో.... మా బిడ్డలార...” గీతం.

“కావు కావున కాకులరిసితే తలుపు తెరిసి పలుకరిస్తం

ఎవ్వరొస్తరొ చెప్పుమాని తొవ్వచూస్తూ నిలుచుంటం

మీరు కాకమ్మలయ్యి వస్తరా మా బిడ్డలూ

మా కడుపు తీపి తీర్చిపోతారా” (జననాట్యమండలి పాటలు, పుట 182)

విప్లవ పాట సాధించిన విజయానికి ఇదొక మచ్చుతునక. ప్రజల జీవితం పాటల్లోకి ఒంపిన తీరు ఎవ్వరినైనా ఆశ్చర్యపరుస్తుంది. ప్రజల నిత్యజీవితంలో ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసాల ఒరవడిని గుర్తుచేస్తూ తద్వారా అమరులను తలుచుకోవడం, వారికి నివాళులు అర్చించడం బహుశా విప్లవపాటకు మాత్రమే సాధ్యమయింది. ఇక విప్లవోద్యమం సమస్యల కేంద్రంగా సృజించిన పాటల్లో బాలకార్మిక వ్యవస్థ అవస్థలు కూడా చిత్రితమయ్యాయి. బాలకార్మికుని బాధలను కేంద్రంగా చేసుకొని మొదట తెలంగాణ సాయుధపోరాట కాలంలో సుద్దాల హన్మంతు పాట రాయడం వెనుకాల వెట్టిచాకిరి పీడన ఉంది. కానీ, నక్సల్బరీ పోరాట కాలం నాటికి వెట్టిచాకిరి రూపం మారి అనేక రంగాల్లోకి విస్తరించింది. బాలకార్మికులు పొట్టపోసుకోవడానికి రకరకాల పనులు చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడే దుస్థితి దాపురించింది. ఇది చూసి చలించిపోయాడు “సాహూ” కలం పేరు కలిగిన శనిగరం వెంకటేశ్వర్లు. ఆయన ఎక్కువ పాటలు రాసిన ఆధారాలేవి కనిపించనప్పటికీ, విప్లవోద్యమంతో దగ్గరి సంబంధం కలిగినవారు అతని పాటగా చెప్పే పాటే “నీ కన్నీరు... నా కన్నీరు పాట...” పాట.

“నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయె ఒంటిగా శోకం పెట్టే సిన్నీ తమ్మయ్యా

45

నీ జంటగా నేనుంటా రారా సిన్నీ తమ్మయ్యా కన్నోరెరుగవు, ఉన్నూరురెరుగవు సర్మారుండి ఏమీ లాభం చెత్తకుండే నిన్ను తల్లే పెంచెన చిన్ని తమ్మయ్యా నా నీళ్ల పంపే పాలిచ్చిన సాదెన చిన్నీ తమ్మయ్యా” (జననాట్యమండలి పాటల క్యాసెట్‌ నుంచి)

పాటలో రచయిత అనాథలైన బాలకార్మికులకు చెత్తకుండి తల్లిగా మారిందని, నీళ్లపంపే పాలిచ్చి సాధిందని చేసిన పోలిక కరుణరసాత్మకంగా మాత్రమే కాకుండా కవితాత్మకంగా కూడా బలమైన వ్యక్తీకరణ.

విప్లవోద్యమంలో పాట రైతాంగం వరకే పరిమితం కాకుండా కార్మికవర్గం సమస్యలపై కూడా దృష్టి నిలిపింది. మండుటెండల్లో రైలు పట్టాల వెంట పనిచేసే రైల్వే కార్మికులపై అద్భుతమైన పాటను రచించింది జననాట్యమండలిలోని రచయితల బృందం.

“గ్యాంగోల్లమండి మేం బాబో అయ్యో గరిబోళ్లమండిమేం బాబో మా రక్తమంత ధారపోసి రైలుపట్టలేస్తాము... మందె ఏండకాలమొచ్చెనంటే బాబో మా గుండెలెండిపోతాయి బాబు చేతిలున్న గడ్డపార సుర్రసుర్రకాలబట్టే నెత్తిమీద ఇనుపతట్ట అగ్గిలెక్కమండబట్టే కింది నుండి మీది దాకా మీది నుండి కింది దాకా కుతకుత ఉడుకుతుంటే కతకతమని కాలుతాము” (గద్దర్‌గళం పాటల సీడీ నుంచి) ఇందులో శబ్ద ప్రయోగం పాటకు అదనపు అందం తెచ్చింది. కార్మికుల కష్టాలను ఏకరువుపెట్టడం కోసం రచయిత శబ్దపద ప్రయోగంతో గాఢతను తీసుకువచ్చాడు. అవే కుతకుత, కతకత అనే పదాలతో పాటలో మరింత శ్రవణ సౌందర్యం ఒదిగింది.

46

నిచ్చెనమెట్ల కులవ్యవస్థ కలిగిన సమాజంలో కింది కులాలకు బతుకొక దినదినగండం. ఊరికి, గుడికి, బడికి దూరంగా నెట్టబడిన దళితుల జీవితాల్లో వ్యక్తం చేయలేనంత విషాదాన్ని నింపింది. బాధల్ని అవమానాల జాడల్ని దళిత పాట 1990వ దశకం ఉత్తరార్థంలో ఎలుగెత్తి వినిపించింది. తెలుగు సమాజంలో దళిత ఉద్యమం పుట్టుకకు కారంచేడు, చుండూరు ఘటనలు ఆలంబనగా నిలిచాయి. అగ్రవర్ణాల అమానవీయ దాడులకు రెండు ఘటనలు నిలువెత్తు నిదర్శనాలు, చెరగని సాక్ష్యాలు. రెండు ఘటనలు జరగడానికి వందేండ్ల ముందే తెలుగు సమాజంలో భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి వంటి నాయకులు దళితుల అభ్యున్నతి కోసం ఆదిహిందు మహాసభ వంటి సంస్థలను నెలకొల్పి ఉద్యమించారు. ఇవి దళితుల ఆత్మగౌరవాన్ని అభివృద్ధిని బోధిస్తే కారంచేడు, చుండూరు ఘటనలు దళితుల జీవితాలు ఎంతటి బలహీనమైన స్థితిలో బతుకీడుస్తున్నాయో నిరూపించాయి. దాంతో దళితోద్యమం విశేషస్థాయిలో ఊపందుకొని దళితకవిత్వం, దళిత కథ, నవల, దళిత పాట రూపంలో సాహిత్య చరిత్రలకు ఎక్కింది. దళితోద్యమానికి సాహిత్యం అండగా నిలిచి ఒక సైద్ధాంతిక. భూమికను అందించాయి. ఉద్యమ (ప్రభావం అనివార్యంగా పడింది. అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మేధావులను ఆలోచింపజేసింది. అందులో భాగంగా ఆవిర్భవించిందే దరకమే ఐక్యవేదిక, దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదికను బి. ఎస్‌.రాములు, మాస్మార్దీ, కంచె ఐలయ్య, ఉ. సాంబశివరావు, వి.ఆర్‌.నారగోని తదితరులు వేదిక ఏర్పాటుకు పునాదులు వేశారు. మరోవైపు గ్యార యాదయ్య, వేముల ఎల్లయ్య, నాగప్పగారి సుందర్రాజు, ఆచార్య ననుమాస స్వామి, గుండెడప్పు కనకయ్య, ఎర్ర ఉపాళి, ఏపూరి సోమన్న వంటి కవులు రచయితలు, కళాకారులు దండోరా ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ఉద్యమం తెలంగాణలోని ఊరూర ప్రచారానికి పూనుకున్నప్పుడు పాటే మరోసారి ప్రధాన ఆయుధంగా మారింది.

తెలంగాణలో దళితోద్యమ పాటను రెండు భాగాలుగా విభజించవచ్చు.

1. కారంచేడు చుండూరు ప్రభావిత దళితోద్యమ పాట 2. ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కోరుతూ మొదలైన దండోర ఉద్యమ పాట

కారంచేడు సంభుటన జరిగినప్పుడు విప్లవ శిబిరం నుండి గద్దర్‌

47

“దళితపులులమ్మ...” అనే పాటను రాశాడు. ఇది విశేషంగా ప్రజాదరణను పొందడంతో పాటు, బాధితులకు పోరాడే ఉత్తేజాన్ని అందించింది. అలాగే దళిత పాట అంటే గుర్తుకు వచ్చే వాగ్గేయకారుడు మాస్మార్డీ. తెలంగాణ ప్రాంతంలోని మెదక్‌ జిల్లాలో జన్మించిన మాస్టార్టీ వందల దళితపాటల్ని సృజించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశాడు. అంతేకాకుండా అనేక పాటల దళాలను ఏర్పాటు చేసి ఊరూర దళితుల చైతన్యానికి దళిత కళామందలిని స్థాపించి పాటుపడ్డాడు. మాన్మారీ రాసిన “అందుకో దండాలు బాబా అంబేద్కర్‌...” అనే గీతం ఇప్పటికీ దళిత సభలకు, సమావేశాలకు ఒక ప్రార్థన గీతమయింది. అలాగే మాస్మార్జీ రచించిన మరో పాట “జోజోర దళితన్న... జోర దళితన్న” రాజకీయనాయకులు దళితులను మోసం చేసే తీరుకు అద్దం పట్టేలా వ్యంగ్యాత్మకంగా రచించాడు. అలాగే “దేశం నీదన్నాగాని రాజ్యమడగమన్నానా, దళితుడ దేశాన్ని నిన్నేలొద్దన్నానా?” వంటి పాటలతో పాటు “ఏమే ఎల్లి ఎవడే పోరగాడు, ఏడికెళ్ళి వచ్చిండు ఏమైతడు నీకీడు, ఈని కోసమే నిన్ను ఇంట్ల కెల్లి పిలిపిస్తి...” అంటూ గ్రామాల్లో అగ్రవర్ణాల కులాధిపత్యాన్ని ఎండగట్టాడు. మాస్మార్టీ బాటలోనే కలేకూరి ప్రసాద్‌, గోరటి వెంకన్న జయరాజు, ఎన్నార్‌ వంటి వాగ్గేయకారులు దళితుల కోసం పాటలు అల్లి పాడారు. ముఖ్యంగా 1990-95 మధ్య కాలంలో కులవర్గ దృక్పథంతో మారోజు వీరన్న దళిత బహుజనులను ఉద్యమబాట పట్టించేందుకు గోరటి వెంకన్న రాసిన “అందుకోర గుతుపందుకో... దొంగల తరిమేటందుకు” వంటి పాట దళితోద్యమానికి జవజీవాలనిచ్చింది. మరోవైపు దండోర ఉద్యమానికి మద్దతుగా గ్యార యాదయ్య తన గళాన్ని విప్పి పాటల ప్రశ్నలను సంధిస్తూ గూటం దెబ్బ, రంపెకోత వంటి పాటల సంపుటాలను వెలువరించాడు. గ్యార యాదయ్య బాటలో ఎర్ర ఉపాళి, చిలుక భాస్కర్‌, ఏపూరి సోమన్నలు దండోరా ఉద్యమానికి అండగా నిలబడి పాటల్ని సృజించారు. ఎర్ర ఉపాళి రచించిన మాదిగ అమరవీరుల పోరాట పాట బహుళ ప్రచారాన్ని పొందింది. వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను పాట గుండెలకత్తుకునేలా చేసింది.

ప్రపంచీకరణను గురించి వాగ్గేయకారులు రాసిన గేయాల్లో ఎక్కువగా ఊరును ప్రధాన వస్తువుగా స్వీకరించడం కనిపిస్తుంది. ముందుగానే చెప్పుకున్నట్లు ప్రపంచీకరణ

48

వల్ల దేశానికి ముఖ్యాధారమైన వ్యవసాయ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. వాగ్గేయకారులంత గ్రామీణ నేపథ్యం కలిగినవారు కావడం మూలంగా మార్చును సులభంగా (గ్రహించగలిగారు. క్రమంలోనె గోరటి వెంకన్న చేతివృత్తుల పతనాన్ని వర్ణిస్తూ “పల్లె కన్నీరు పెడుతుందో...” గీతాన్ని రచించాడు. ఎంకన్న పాటను వందలాది సభల్లో పాడి లక్షలాదిమందిని ఆలోచింపజేశాడు.

“కుమ్మరి వాముల తుమ్మలు మొలిసెను

కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను

సాలెల మగ్గం సడుగులిరిగినవి

పెద్ద బాడిసెలు మొద్దు బారినవి

తొలకరి జల్లుకు కురిసిన నేలకు

మట్టి పరిమళాలేమైపోయెరా

వానపాములు నత్తగుల్లలు

భూమిల ఎందుకు బతుకుతలేవు

పురుగుమందుల గత్తరవాసనరా నా పంటపొలాల

మిత్తికి తెచ్చిన అప్పే కత్తాయే నా రైతు కుతికెపై” (వెంకన్న గోరటి 2002:45)

గేయం ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న పల్లె కులవృత్తుల్ని కోల్పోవడాన్ని పల్లె విధ్వంసం దిశగా పయనించడాన్ని అత్యంత హృద్యంగా గేయీకరించాడు. రాష్ట్రమంతటా ఒక జాతీయగీతంలా మార్మోగిన పాట సరికొత్త చరిత్రను రికార్డు చేసింది. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన పాలకుల గద్దెకూల్చివేసింది. రైతు మెడపై అప్పు కత్తిగా మారిందనడం, పల్లె కన్నీరు కారుస్తుందని ఊహించడం కంటే గొప్ప కవిత్వం మరేముంటుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో మొదలైన పోరాటపాట విప్లవ, దళిత ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచింది. తరువాత ప్రపంచీకరణ పడగ నీడన పల్లెలు, చేతివృత్తులు విధ్వంసమవుతుంటే కన్నీరు పెట్టింది. మరోవైపు సీమాంధ్ర ఆధిపత్యాన్ని సహించనితనంతో కొనసాగిన పోరాటాలు, నిరసనలు క్రమంగా చినుకు చినుకు చేరి చెరువైనట్టు ఉద్యమరూపు

49

దాల్చాయి. మొదట విద్యా, ఉద్యోగ అవకాశాల్లో జరుగుతున్న వివక్షతలను నిలదీసినప్పటికీ, క్రమంగా అస్తిత్వ లేదా ఉనికి లేదా మనుగడకు సంబంధించిన అంశంగా మారింది. ఇందులో భాషాసంస్కృతుల రక్షణ అంశం జతకావడంతో క్రమంగా తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమంగా మారింది. రాష్ట్రం ఏర్పడక ముందు నుండే మొదలైన ప్రత్యేక రాష్ట్ర కాంక్ష గడచిన ఐదున్నర దశాబ్దాల కాలంలో మరింత చిక్కబడింది. అంతేకాదు పదునెక్కి రాటుదేలింది కూడా. భారతదేశంలో స్వాతంత్రోద్యమం తర్వాత ఇంత సుదీర్ణంగా కొనసాగింది తెలంగాణ రాష్టోద్యమమే. ప్రాంతేతరులకు తెలంగాణలో ఉన్న రాజధాని వరంగా లభించడం స్థానికులకు శాపంగా మారింది. ఉద్యోగ, విద్యావకాశాల్లో పెద్ద సంఖ్యలో వలసీకరణ పెరిగిపోవడంతో పాటు రాజ్యాధికారం కూడా సీమాంధ్ర పెట్టుబడిదారుల కనుసన్నల్లో నడుస్తుండడం మూలంగా తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. ఫలితంగా అభివృద్ధి కాంక్షమీద ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకొని క్రమంగా అది సకల ఆంధ్రాధిపత్యాలను ధిక్కరిస్తూ, ప్రస్తుతం విముక్తిని కోరుకుంటున్నది. అందుకే దీనిని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేకంటే తెలంగాణ విముక్తి పోరాటంగా సంబోధించడమే న్యాయం.

కళారంగంలో వివిధ ప్రయోగాలు ఉద్యమానికి అదనపు శక్తినిస్తాయి. పాతబడిన నాటి స్థానంలో కొత్తగా చేసే ప్రయోగాలు విజయవంతం అవుతాయి. అట్లా మలిదశ తెలంగాణ విముక్తి ఉద్యమానికి ఎనలేని చైతన్యాన్ని అందించి, ప్రజల మద్దతు కూడగట్టిన వేదికలే ధూంధాం వేదికలు. కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అంతడుపుల నాగరాజు, రసమయి బాలకిషన్‌, వరంగల్‌ శంకర్‌ తదితరులు క్రియాశీలకమైన పాత్ర నిర్వహించారు. తెలంగాణ కళాకారులను, పాటల రచయితలను, మేధావులను ఒక్క వేదిక మీదికి తెచ్చి పాట పాటకు మధ్యలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే కళారూపాలను ప్రదర్శించే ధూంధాం కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమంలో విస్మరించలేని చైతన్యాన్ని కలిగించాయి. ఒకనాటి తెలంగాణ ఆం(ధ్రాపాలన ధ్వంసమైన తీరు కండ్లముందుంచడానికి, తద్వార ప్రజలను ఆలోచింపజేయడానికి ధూంధాం కార్యక్రమాలు సద్వినియోగాలు. స్ఫూర్తితో జిల్లాల వారీగా అనేకమంది కళాకారులు పుట్టుకొచ్చి ఊరూరా ధూంధాం సభలు నిర్వహించారు. ఆఖరికి ఉద్యమ సభలు, సమావేశాల్లోనే కాకుండా కొన్ని గ్రామాల్లో

50

పెండ్లిల్లు జరిగినా కూడా బంధుమిత్రుల కోరిక మేరకు తెలంగాణ ధూంధాం కార్యక్రమాలు నిర్వహించేలా ఇవి ప్రజల మనసులను గెలుచుకున్నాయి. అంతటి ఆదరణను పొందిన ధూంధాం వేదికల మీద కళాకారులు తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలను, తెలంగాణ సాధనను అడ్డుకుంటున్న వాళ్ల కుట్రలను ఆట, పాట, మాటల ద్వారా వివరించారు. ఛలోక్తులు, వ్యంగ్య బాణాలతో, ఉ(ర్రూతలూగించే పాటలతో ధూంధాం కార్యక్రమాలు 2000ల తర్వాత దశాబ్దకాలంగా ప్రజలపై చెరగని ముద్రను వేశాయి. క్రమంలో తెలంగాణ రాష్ట్రగేయం విస్తృతస్థాయిలో వందలాది పాటలుగా విస్తరించింది.

తెలంగాణ అన్యాయాలను గురించి విప్లవోద్యమంలో అంతర్భాగంగానే మిత్ర, కొమిరె వెంకన్న జయరాజు, గోరటి వెంకన్న నందిని సిధారెడ్డి, భూపాల్‌, దాసరాజు రామారావు, తదితరులు అప్పుడప్పుడు తెలంగాణ అంశాన్ని స్పృళిస్తూ పాటలు రాశారు. తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రెండు దశలుగా విభజించి అధ్యయనం చేయడం వల్ల గేయ పరిణామ క్రమం సులభంగా బోధపడుతుంది.

1. 1996 నుంచి 2009 వరకు వెలువడ్డ తెలంగాణ విముక్తి గీతం 2. 2009 ఉద్యమం తర్వాత విస్తృతమైన తెలంగాణ మలిదశ పాట

1996కు ముందు కూడా ఆయా సందర్భాల్లో తెలంగాణ పాట సృజించబడినప్పటికీ, సృజన చాలా పరిమితమైనది. అందుకు కారణం పాటకు అవకాశం కల్పించే వేదిక లేకపోవడమే. కానీ, 90వ దశకం ఉత్తరార్థంలో తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ వంటి సంస్థలు ఏర్పడి, పాట అనివార్యంగా ఒక అవసరంగా ముందుకొచ్చింది.

తెలంగాణ మలిదశ పాటలు ప్రధానంగా కొన్ని ముఖ్యమైన భావనలను ఆధారం చేసుకొని సృజించబడ్డాయి. అవి...

1. వ్యవసాయిక సంక్షోభం 2. సామాజిక సంక్షోభం 3. సాంస్కృతిక సంక్షోభం 4. రాష్ట్ర ప్రకటన డిమాండ్‌ ర్‌. ఆర్థిక దోపిడి

51

6. ఆత్మగౌరవం, స్వయం పాలన 7. అమరవీరుల సంస్మరణ

విభజన ఆధారంగా తెలంగాణ గేయసాహిత్యాన్ని అధ్యయనం చేసినపుడు ఆయా గేయాల్లో ఉద్యమకవిత్వం వ్యక్తమైన తీరు, ఆయా విషయాల పరంగా అర్థమవుతుంది. తెలంగాణ గేయం ఏఏ విషయాలపై దృష్టి సారించిందో తెలుస్తుంది.

తెలంగాణ రాష్ట్ర సాధనకు కదలిరమ్మని పిలుపును ఇచ్చింది తెలంగాణ గేయసాహిత్యం. రాష్ట్రాన్ని సాధించుకోవాల్సిన ఆవశ్యకతను, అనివార్యతను రకరకాల ధోరణుల్లో సాహిత్యం వ్యక్తమయింది. పాట సాధారణంగా ఒక విషయాన్ని అర్థం చేయించడం కోసం అనేక విషయాలపై ఆధారపడుతుంది. అలా ప్రకృతిలోని ప్రతీకలతో కలిసిపోయి విషయాన్ని కొంత మరుగు పరుచడం ఉంటుంది కానీ, తెలంగాణ ఉద్యమ సందర్భంలో పాట కవులు రాజకీయనాయకుల కంటే మిక్కిలి చైతన్యాన్ని ప్రదర్శించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. సమస్యను, సమస్యకు కారణమైన శత్రువును కండ్రముందుంచి, రాష్టాన్ని సాధించుకునేందుకు శత్రువు మీద పోరాడమని తెలంగాణ విముక్తిగేయం పిలుపునిచ్చింది. తెలంగాణ ఉద్యమానికి మాతృగీతాన్ని రచించిన అందెశ్రీ మొదలుగా యువరచయితల వరకు పనిని విజయవంతంగా చేయగలిగారు.

“జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రత్యేకరాష్టాన ప్రజల కలలు పండాలి

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ” (అందెశ్రీ) (స్కైబాబ (సం.) 2009:1)

తెలంగాణ ఒక రాష్ట్రంగా అవతరించిన తరువాత తెలంగాణ ప్రజలకు ఒక జాతీయగీతం కావడానికి గీతం ఇప్పటికే పదిజిల్లాల ప్రజల ఆమోదాన్ని పొందింది.

52

కవిత్వం పాటనిండా ప్రవహింపజేసేలా పాట అల్లడం అందెశ్రీ గీతాలన్నింట్లో సహజంగా కనిపించే లక్షణం. మాతృగీతం కూడా ఇప్పటికే స్కూళ్లల్లో, కొన్నిచోట్ల ప్రభుత్వ ఆఫీసులల్లో ప్రార్థనగీతంగా మార్మోగుతున్నది.

ఇక ఉద్యమ గేయాల్లో అద్భుతమైన కవిత్వాన్ని పలికించిన కొన్ని గేయాలను

పరిశీలిదాం. (a)

“అమ్మా సూడమ్మ బైలెల్లినాదో... గోదారమ్మా మా గంగమ్మ తల్లె బైలెల్లినాదో గోదారమ్మా అదిగదిగో అటుచూడు బైలెల్లినాదో అలలై అందెల సప్పుల్లతోటి గలగలగజ్జల మోతలతోటి ఆదిలాబాదుకొచ్చి అడుగేసినాదో...” (కొమిరెవెంకన్న పాటలు ఆడియో క్యాసెట్‌ నుంచి)

అంటూ కొమిరె వెంకన్న రాసిన పాట 80వ దశకం తొలిరోజుల రచన. అప్పటికే గోదావరి నీళ్ళు తెలంగాణకు దక్కకపోవడం వల్ల నెలకొన్న వ్యవసాయసంక్షోభాన్ని రచయిత నాటకీయంగా అత్యంత హృద్యంగా నది ప్రవాహం సాధారణంగానే సౌందర్యాత్మకంగా ఉంటుంది. నది ప్రవాహం, నది మలుపులు, నదిలో కలిసే అనేక చిన్న చిన్న కాలువలు మొత్తంగా నది ప్రతీ కదలిక చూడముచ్చటగా ఉంటుంది. విషయాన్ని గ్రహించిన రచయిత పై విషయాలను పాటలో వర్ణించాడు. అలలై అందెల చప్పుల్లతోటి, గలగల గజ్జెల మోతలతోటి అంటూ ఒక మనిషి నడిచివచ్చినట్టే పాటలో చిత్రించాడు. అలా సందడిగా వచ్చిన గోదావరి నది ఆదిలాబాద్‌లో అడుగుపెట్టిందన్నాడు. అట్లా వచ్చిన గోదారి తెలంగాణను చూసి తల్లడిల్లిందన్నాడు. “పరుగుపరుగున వచ్చి పల్లెల్ని తాకి గోదారమ్మా తెలంగాణను చూసి తల్లడిల్లిందో గోదారమ్మా...” (అదే పాట నుంచి) సరైన నీటి వనరులు లేక బీళ్ళుగా మారిన తెలంగాణ భూములను చూసి తల్లడిల్లిందని కవితాత్మకంగా గోదారిని కండ్లముందుంచాడు. ప్రపంచంలో ప్రాంతంలోనైనా నదీపరివాహక ప్రాంతాలు పచ్చగా కళకళలాడుతాయి. కానీ, తెలంగాణలో మాత్రం రెండు జీవనదులు పారుతున్నప్పటికీ, వ్యవసాయ సంక్షోభం తలెత్తడం శోచనీయం.

53

అందుకే ప్రముఖ తెలంగాణ కవి తైదల అంజయ్య “నీరు ఆంధ్రానెరుగు, నిజం తెలంగాణ ఎరుగు” అని చమత్కరించాడు. పరవళ్ళు తొక్కుతూ వచ్చిన గోదావరి, ఎడారిగా కనిపించిన గోదావరిని చూసి కన్నీరు పెట్టిందన్నాడు రచయిత.

“పల్లెల్ల మొలిచిన పల్లెర్ల చూసి గోదారమ్మా ఎడారి బతుకుకు ఎవడు కారణమంది గోదారమ్మా” (అదే పాట)

తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఇటువంటి అనేక వివక్షల మీద సంధించిన ప్రశ్నల కొడవళ్ళను పాటలోని పాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. అనేక వివక్షల్లో నీళ్ళలో జరిగిన మోసమే మొదటిది. విషయాన్ని తెలంగాణ సాహిత్యం కూడా ఎలుగెత్తి గానం చేసింది. వాస్తవాన్ని కాల్పానిక సాహిత్యంలో ప్రతిఫలింపజేయడం అంత సులభం కాదు. అందుకు రచయిత యొక్క సృజనశక్తి మాత్రమే కొలమానం. అటువంటి ప్రయత్నమే పాటలో రచయిత చేసి సఫలీకృతుడయ్యాడు. తెలంగాణ ప్రజల దుర్భరమైన జీవితాన్ని పాటలోకి అనువదించడం కోసం గోదారి మనోభావాన్ని కంద్లముందుంచాడు.

“ఏమి చేయలేక ఏడ్వసాగింది

ఎక్కి ఎక్కి తల్లి ఏడ్వసాగింది

ఎనుకకు మళ్ళొక్కసారి చూసింది

మళ్ళీ జన్మ ఉంటే తిరిగొస్తనంది

తెలంగాణకు నేను తల్లి అయితనంది గోదారమ్మా కరువుదీర నేల తడిపేస్తనంది గోదారమ్మా...” (అదేపాట)

మానవసంబంధాలను పాటలో ఒదిగించడానికి రచయిత చేసిన ప్రయోగం (శ్రోతల చేత కన్నీరు పెట్టిస్తుంది. ఎంతటి కఠిన హృదయులనైనా చరణంలోని “మళ్ళీ జన్మే ఉంటే తిరిగొస్తనంది” అనడం. రచయిత తన చుట్టూ ఉన్న సమాజంలోని సంబంధాలను అర్థం చేసుకోవడమే కాదు, వాటిలోని తీవ్రతలను, గాఢతలను పట్టుకోగలిగాడు. తెలంగాణ ప్రాంతంలో సాటిమనుషులు చేసే సహాయానికి “సచ్చి నీ కడుపున పుడుతా” అనే మాట వ్యవహారంలో ఉంది. ఇదే భావనను రచయిత పై పాదాల్లో అద్భుతంగా పలికించాడు. స్థానిక ముద్ర కలిగిన ప్రయోగం పాటను సులభంగానే ప్రజలను కదిలిస్తుంది. తద్వారా రచయిత తెలంగాణకు వ్యవసాయంలో

54

జరిగిన అన్యాయాన్ని అర్థం చేయించగలిగాడు. సమాజంలో ఒక అన్యాయాన్ని ప్రజలకు అర్ధం చేయించడానికి కళకు మించిన సాధనం లేదు. కళల్లో మళ్ళీ పాటకు మరింత చొచ్చుకుపోయే తనం ఉన్నది. అందువల్లనే అన్ని కళారూపాలకంటే పాటే విరివిగా సృజించబడింది. విషయ తీవ్రతను క్షణాల్లో అర్ధం చేయించి, ఆయా ఉద్యమాలకు ప్రజల నుండి కావల్సిన మద్దతును కూడగట్టింది. వ్యవసాయసంక్షోభం ఎంత తీవ్రమైందో గాఢతను గేయసాహిత్యం అంతే బలంగా చిత్రించింది.

నీటి వనరుల్లో దోపిడిని బలంగా ఏకరువు పెట్టింది గోరటి వెంకన్న రాసిన “స్పేత్రాన మేడుందిరా, తెలంగాణ సేలన్ని బీడాయెరా...” అనే పాట. నిజాం కాలంలో ప్రారంభించిన భీమా వంటి ప్రాజెక్టులు సమైక్యపాలనలో పూర్తి కాలేకపోయాయి. అంతేకాకుండా జూరాల, రాజోలిబండ డైవర్షన్‌ స్కీం, కోయల్‌సాగర్‌, కల్వకుర్తి ఎత్తిపోతలు, నెట్టెంపాడు, శ్రీరాంసాగర్‌ (పోచంపాడు), సింగూరు, ఎల్లంపల్లి, దుమ్ముగూడెం, దేవాదుల ఎత్తిపోతలు, తుంగభద్ర వంటి ప్రాజెక్టులను సాధ్యమైనంతగా నిర్లక్ష్యం చేశారు. పని గత మూడు దశాబ్దాలుగా మరింత పెరిగిపోయింది. తెలంగాణ ప్రాంత అభివృద్ధితో ఎటువంటి సంబంధం లేనట్టుగా వ్యవహరించారు పాలకులు. ఫలితంగా ఉన్న ప్రాజెక్టులేమో శిథిలమైపోతుండగా, కొత్తగా కట్టవలసిన ప్రాజెక్ళులేమో నిధుల కేటాయింవులేక అనేకసార్లు శంఖుస్థావనలకే పరిమితమయిపోయాయి. దారుణాన్ని రాజకీయావగాహన కలిగిన వాగ్గేయకారుడు గోరటి వెంకన్న స్థూలంగా విమర్శించాడు....

“కంపతారు సెట్లు కొట్టి అమ్ముకోని

కడుపు నింపుకునే కాలమొచ్చినాది

సేతానమేడుందిరా, తెలంగాణ సేలన్ని భీడాయెరా...!” (వెంకన్న గోరటి 2008:95)

ప్రాజెక్టుల్లో పాలకులు చూపించిన వివక్ష కారణంగా తెలంగాణ ప్రజల జీవితం ఎంత చిధ్రమైందో సులభమైన పదజాలంతో వర్ణించాడు రచయిత. ప్రాజెక్టులు లేకపోవడం వల్ల నీళ్ళు లేవు, నీళ్ళు లేకపోవడం వల్ల వ్యవసాయం అడుగంటిపోయింది. దాంతో భూమినే నమ్ముకున్న అన్నదాతలు ఆకలి బాధలకు గురయ్యారు. హృదయవిదారకమైన దృశ్యాన్ని అలతి అలతి పదాలతో రూపుకట్టించి పదునైన పాట అల్లాడు రచయిత. పాటను రచయిత పాలమూరును కేంద్రంగా చేసుకొని

55

రచించినప్పటికీ ఇందులోని సాహిత్యం యావత్‌ తెలంగాణ పదిజిల్లాలను దృశ్యీకరిస్తున్నది. ఒక విజువల్‌ మీడియా సైతం చేయలేనంత వాస్తవాన్ని పాట పలికిస్తున్నది. ప్రజల జీవితం ఎంతటి దయనీయంగా మారిందో వర్ణించాడు రచయిత. దాపురించిన దుర్భరకాలం మీద రచయితలో ఒక ప్రజాగ్రహం గూడుకట్టుకున్నది. అది అగ్నిపర్వతమై నెమ్మదిగా పొగులుతూ, పొగులుతూ... “సేతానమేడుందిరా?” అనే ప్రశ్నై పేలింది. తరువాత తనే మళ్ళీ ప్రశ్నకు సమాధానాన్ని చెబుతూ “తెలంగాణ సేలన్ని బీడాయెరా...” అంటూ ఒక అసహనాన్ని నైరాశ్యాన్ని లక్షలమంది దుఃఖాన్ని లావాలా ప్రవహింపజేసింది. సేతానం అంటే భూమి యొక్క సారం. నీటివనరులు లేకపోవడం వల్ల భూమి ఎండిపోయి సారమనేది లేకుండా బీడుగా మారింది. అలా తన తోటి వారిని ప్రశ్నించి వెనువెంటనే తనే సమాధానాన్ని సుదీర్హపరిశీలనానుభవంతో చెబుతున్నాడు. సాహిత్యం ప్రజల్ని తట్టిలేపాలి. బయటికి కనిపించకుండా ప్రజల జీవితాలకు గోతులను తవ్వే చీకటి రాజకీయాలను పాట పటాపంచలు చేయాలి. ప్రజలముందు నగ్నసత్యాలను కళాత్మకంగా నిలబెట్టాలి. అవి హృదయానికి హత్తుకొని, తరువాత మస్తిష్మాల మీద చెరగని ముద్రను వేయాలి. అలాంటి పాట మాత్రమే నిజమైన ప్రజల పాటగా కొత్త చరిత్రను సృష్టిస్తుంది. ప్రజాప్రయోజనాలను పట్టించుకోని పాట నీటిమీద బుడగ వంటిది. అది క్షణానికి అలరిస్తూ అందంగా భ్రమింపజేస్తూ వెంటనే పగిలిపోతుంది. కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ ప్రజలపాట ఉద్యమ ఆకాంక్షలు నెరవేరిన తరువాత కూడా చరిత్రకు ఆధారంగా నిలిచిపోతుంది.

కండ్లముందే నీళ్ళు ఉన్నప్పటికి వాటిని తాగలేకపోయే పరిస్థితుల్లో జీవించడం మాటలకందని విషాదమే. కానీ, దాన్ని పాటలకు అందించాడు ఇందులో రచయిత. సీమాంధ్ర ప్రాంతంలో 1956 ముందు బ్రిటిషు పాలకుల్లోని కాటన్‌దొర వంటి వారు ఆనకట్టలు కట్టించారు. అవి చాలనట్టు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ అనంతరం కూడా ప్రాంతపు పాలకులు అక్కడి ప్రజల ఓట్లకోసం, నోట్లకోసం, అధికారం కోసం మరిన్ని ప్రాజెక్టులు కట్టించి తెలంగాణ ప్రజల కడుపుకొట్టారు. దాని ఫలితమే ఎత్తిపోతల రాళ్ళు తెలంగాణ బతుకును ఎక్కిరించడం.

“దగ్గుదమ్ము టీబీ కక్కుడేరుగుడు పెట్టి

56

ముప్ఫైయేండ్లకే ఈడ ముసలితనమొస్తాది

నెలకు మూడుకుపైగా పీనుగలు లేవంగా

పల్లెచుట్టూ పాడెకట్టెలూ బూడిదాయె

ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లవారుతుందిరా పట్నాలు పరదేశిమెల్లి బతుకావోయి

వలసబోయిన కూలీలు వచ్చిపోతుంటారు

ఇంట్లదీపం పెట్టే ముసలి తల్లిదండ్రికి

కంట్రోలు బియ్యమూ ఖర్చులకు పంపేరు వలసబోయిన డబ్బుతో తెలంగాణ పేదలొడ్డి కడతారా సస్తే బొందాకొరకు పుడితే కానుపుకొరకు వలసబోయిన జనము వచ్చిపోతుంటారు సావుపుటుకల నడుమ తప్పని పెండ్లికి

ఇండ్లు సున్నాలేసి ఇగురంగ చేసేరు....” (వెంకన్న గోరటి 2008:95)

ప్రజల భాషలో ప్రజాజీవితాన్ని కవిత్వీకరించిన తీరు గేయంలో చూడొచ్చు. అరవయేండ్లు తెలంగాణ పల్లె మోడువారిన తీరును గోరటివెంకన్న అత్యంత శక్తివంతంగా గేయంలో చిత్రించాడు. ప్రాజెక్టులు లేక వ్యవసాయం దెబ్బతిన్నప్పుడు పల్లె ఎలా విధ్వంసమవుతుందో వెంకన్న సజీవంగా వర్ణించాడు. వాస్తవజీవితాన్ని పాటలోకి తీసుకొచ్చిన తీరు ప్రజలను కన్నీళ్ళు పెట్టించింది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో వాగ్గేయకారులు అనేక విషయాలను తమ పాటల్లో నింపారు. అలా పాటల ద్వారా వాస్తవాలను ప్రచారం చేసే పనికి పూనుకున్నారు. గర్వంతో కూడిన స్వరంతో తెలంగాణ వనరులను ఒక్కొక్కటిగా అభివర్ణించారు. ఇన్ని ఉన్నా మేము ఎందుకు వెనుకబడి ఉంటున్నాము అనే ప్రశ్నలు అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ప్రకటననే కోరుకుంటున్నాయనే భావన కలుగుతుంది.

“ఖమ్మం మెట్టు అడవిలోన - కట్టుకుంది పచ్చని చీర ఆదిలాబాదు ఆకుని నలిపి - పెట్టు కుంది నొసట బొట్టు నాగారం అడవియమ్మతో - దిద్దుకుంది కండ్ల కాటుక

57

కుసుమ పువ్వులు నూరమ్మో - పసుపు బూసుకుందమ్మో నిండు ముత్తెదు తెలంగాణము - ముండమోసినట్లున్నదమ్మో” (గద్దర్‌ పాటల సీడీ నుంచి)

తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గీతంగా పేరుగాంచిన పాటను సాంస్కృతిక సేనాని గద్దర్‌ కలం నుండి జాలువారింది. సుదీర్ణమైన ఉద్యమ అనుభవంతో పాటు ప్రజల హృదయస్పందన తెలిసిన తనంతో పాటను సూటిగా విసరడం గద్దర్‌కు తెలుసు. అందుకే తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆత్మగౌరవంతో సహజవనరులను ఉటంకించాడు. అడవి సంపదకు నిలయం ఖమ్మం జిల్లా. విషయాన్ని గద్దర్‌ ఖమ్మం అడవిని పచ్చచీరగా ధరించిందని కవిత్వీకరించాడు. అట్లాగే గిరిజనులకు నిలయం ఆదిలాబాద్‌ జిల్లా. వారి సంస్కృతిని తెలుపుతూ ఆకురసాన్ని నొసట బొట్టుగా వర్ణించాడు. తెలంగాణ ప్రాంతాన్ని తన తల్లిగా పోల్చి ఆమె ఎలా ఆయా జిల్లాల సహజవనరులను ధరించిందో ప్రతీకాత్మకంగా చెప్పిన తీరు నాలుగు కోట్లమంది ప్రజలను ఆకట్టుకుంది. నాగారం ప్రాంతంలో ఉన్న అడవిని తెలంగాణ తల్లి తన కండ్లకు కాటుకలా పెట్టుకున్నదన్నాడు. తెలంగాణ ప్రకృతిలో లభించే కుసుమ పువ్వులనే నూరుకొని తెలంగాణ తల్లి పసుపులాగా రాసుకుందని, ఇన్ని చేసిన నిండుముత్తెదువు తెలంగాణ తల్లి ఆంధ్రాపాలకుల వివక్షల వల్ల ముండమోసినట్టుందని చివరి వాక్యంలో కుండబద్దలు కొట్టినట్టు చరిత్రను కండ్లముందుంచాడు. గేయసాహిత్యంలో సహజవనరుల ప్రస్తావన వల్ల ప్రజల్లో ఆత్మగౌరవం నిండుకొని, వనరులను దక్కించుకోవడానికి ఉద్యమానికి అంకితమవుతారు. ఇలా వనరుల ప్రస్తావన కూడా తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌నే బలోపేతం చేస్తున్నది.

ఇక తెలంగాణను పట్టిపీడిస్తున్న సమస్య ఫ్లోరైడ్‌. సమస్యను సమగ్రంగా చిత్రించిన గీతం కొదారి శ్రీను రచించిన “సూడు... సూడు నల్లగొండ...” పాట. పాటలో రచయిత అత్యంత హృద్యంగా ఫ్లోరైడ్‌ బాధిత ప్రజల దీనావస్థను కండ్లముందుంచాడు. బలమైన భావ ప్రతీకతలతో సాగిన గీతంలో విషాదం కరుణరసంలో గాఢంగా పలికింది. మిగిలిన రచయితల కంటే ఒకింత ప్రజాజీవితాన్ని పాటల్లోకి తర్జుమా చేస్తున్న రచయిత సాహిత్యం నిండా జీవితంలోని చీకటి

58

కోణాలు ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తున్నాయి. “సూడు సూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్‌బండ బొక్కలంకరబోయిన బతుకుల నల్లగొండజిల్లా దుఃఖమెల్లదీ సేదెన్నాళ్ళు... నల్లగొండజిల్లా కడుపులున్న నలుసు మీద కమ్ముకున్నది విషపు నీడా కన్నతల్లి పాలల్ల గూడా తొంగిచూసే ఫ్లోరైడ్‌జాడ పాడిపంటలల్లా గూడా పొంగిపొర్లే ఫోరైడు పీడా భూతమోలే దాపురించింది ఫ్లోరైడుపీడా చావుబతుకులసంధ్యలు జూపింది ఫ్లోరైడు పీడా...” (శ్రీనివాస్‌ పాటలు టీజీస్టేజ్‌.కామ్‌. నుంచి)

పల్లవిలోనే నల్లగొండ ప్రజల పాలిట ఫ్లోరైడ్‌ గుండెమీద బండలా దాపురించిందని వర్ణించాడు రచయిత. గుండెమీద బండ అనే ప్రతీక వాడడానికి కారణం ఇక్కడి ప్రాదేశిక జీవితమే. అప్పులుచేసి, బోర్లువేసి వ్యవసాయాన్ని కొనసాగిద్దామని ఆశించిన రైతులకు బావిలో రాయిపడితే అది ఆశల్ని నీరుగార్చుతుంది.

ఉపాధి లేకపోవడమే కాదు, కనీసం తాగడానికి నీళ్లు కూడా విషతుల్యం అయిన తీరును కండ్లకు కట్టినట్టు వర్ణిస్తాడు కొదారి శ్రీనివాస్‌. ఎముకలు వంకర్లుపోవడం, నోటిలోని దంతాలు పచ్చగా మారి పుచ్చిపోవడం, చిన్నవయసులోనే వృద్దులుగా మారడం ఫ్లోరైడ్‌ వల్ల కలిగే ఆరోగ్యసమస్యలు. అందుకే ఫ్లోరైడ్‌ను భూతంతో పోల్చాడు. అంతేకాకుండా ఫ్లోరైడ్‌పీడా తమకు జీవన్మరణ సందర్భాలను చవిచూపిస్తున్నదని తీరని ఆవేదనతో వివరించాడు. పాటలో కవిత్వం అంతరాత్మగా పలికినపుడు మాత్రమే పాట ప్రజలను కదిలిస్తుంది. అటువంటి ప్రయోగమే పాటలో రచయిత విజయవంతంగా చేయగలిగాడు. ప్రజా ఉద్యమాలలో ప్రజాదరణ

59

పొందిన పాటలు అనేకం ఉన్నప్పటికీ, రెండు రకాల పాటలు మాత్రం మిగిలినవాటికంటే ఎక్కువ ప్రభావాన్ని చూపగలిగాయి. అవి 1. అమరవీరుల పాటలు 2. అమ్మపాటలు. గత నాలుగైదు దశబ్దాల ప్రజా ఉద్యమాలను పరిశీలిస్తే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు కారణం సాధారణంగా కళకు ఉన్న సృజనాత్మకశక్తి రెండు రకాల పాటల్లో అత్యంత సహజంగా ఒదిగిపోయింది. అందుకే పాటలు (ప్రజలకు మరింతగా చేరువయ్యాయి. తమ జీవితాలతో పెనవేసుకుపోయిన రెండురకాల సమీప మానవసంబంధాల ప్రస్తావన పాటల్లో ఉండడం వల్ల ప్రజలు పాటలను అమితంగా ఇష్టపడ్డారు. జన్మనిచ్చిన తల్లి ప్రస్తావన ఉన్న పాటల వల్ల ప్రజలు తమ తల్లులను గుర్తుచేసుకొని పాటల్లో మునిగిపోయారు. అమరవీరుల పాటలో తమ విముక్తి కోసం పోరాడి, ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన వీరున్ని ప్రస్తావించడం మూలంగా అన్ని ఉద్యమాల్లోనూ అమరవీరుల పాటలు అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

“వీరులారా వందనం... విద్యార్థి థి అమరులారా వందనం పాదాలకు మల్లెపూవ్వుల్లారా మట్టివాసనలారా సేను సెలకల్లారా గోరువంకల్లారా మీరైనా చూసిన్రా బాలాకిషోరాల” (వీరులారా వందనం పాటల పుస్తకం. పుట 8)

అంటూ దరువు ఎల్లన్న రాసిన పాట మలిదశ తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మందినోట నిత్యం వినిపించింది. అంతగా పాట (ప్రజాదరణ పొందడానికి పాటలోని వస్తువుతో పాటు, పాట రాగం కూడా ముఖ్యకారణం. పాటకు కట్టిన రాగానికి తెలంగాణ ప్రజల ఏడుపుకు దగ్గరి సంబంధం కనిపిస్తుంది. తెలంగాణ ప్రజల భాష ఎంత నాదాత్మకమైందో ఏడుపు కూడా అంతే లయాత్మకమైంది. కనుమూసిన విద్యార్థి అమరవీరుల కోసం రచయిత ప్రకృతిలోని చెట్టును పిట్టను అడుగుతున్నతీరు హృద్యంగా కుదిరింది. అయితే పాట 1969 అమరవీరుల కోనం రాశాడు రచయిత. కానీ, అమరవీరుల త్యాగాల వరంవర కొనసాగుతుండడంతో 2009 ఉద్యమానికి కూడా సరిగ్గా సరిపోయింది.

60

ఇక పూర్తిగ కవిత్వమే పాటల్లోకి ఒంపిన రచయితలు కూడా లేకపోలేదు. పాట అంటేనే ప్రకృతిని పాటల్లోకి తీసుకువచ్చి పోల్చడం ద్వార అత్యంత ఎక్కువగా జనాదరణకు నోచుకుంటుంది. అందుకు ఉదాహరణే గిద్దె రాంనర్సయ్య రాసిన కింది గేయం...

“క్రొమ్మాలల్లో కోయిలమ్మా పాటా పాడుతున్నది

జై తెలంగాణ అన్నది

అలిసిపోయిన లేడికూన గంతులేస్తనన్నది

కాలి గజ్జెకడుతనన్నది

(ప్రాణం పోయే మేకపిల్ల డప్పునైతనన్నది

దండోర వేస్తనన్నది

ఇప్పుడు పుట్టిన లేగ దూడ దుంకులాడుతున్నది

ధూంధాం చేస్తనన్నది...” (గిద్దెరాం నర్సయ్య పాటల సీడీ నుంచి)

ఉద్యమం మీద అభిమానం ప్రేమతో ప్రకృతి ఎలా పరవశించి మద్దతు తెలిపిందో రచయిత ఇందులో అద్భుతంగా వర్ణించాడు.

“గోరుకోళ్ళు పొడువంగా కూతపెడుతన్నది కోడి నిదురాలేపుతున్నది

పిడికెడంత లేని పిచ్చుక పోరుజేస్తనన్నది పోరుబాటనైతనన్నది

చెట్టూచేమలూగి ఆడి ఊపిరోస్తనన్నది ఉద్యమాలు చేస్తనన్నది

పొడిసేటి పొద్దుకూడా పొద్దూగూకనన్నది పోరుకు సై అంటున్నది...” (అదేపాట.)

ఇలా ప్రకృతిలోని ఒక్కో అంశాన్ని సామాన్యంగా వర్ణిస్తూనే పాట ఆద్యాంతం అద్భుతమైన విశేషణాలతో కవితాత్మకంగా కొనసాగుతుంది. నిజానికి ఇవేవి జరుగని అతిశయాలే కానీ, రచయిత ఉద్యమ ఉధృతిని వర్ణించడానికి ఇలా ప్రకృతి కూడా పులకరించిందని పోల్చి చెప్పాడు. ఉద్యమానికి సమస్త పంచభూతాలు సైతం మద్దతుగా నిలిచాయని చేసిన పోలికకు శ్రోతలు అత్యధికంగా స్పందించారు. తెలంగాణ

61

ఉద్యమగీతాల్లో ఇదొక విభిన్నమైన ప్రయోగం. పాటలో ప్రకృతి వర్ణనలు ఉంటాయి. కానీ, వాటిని కూడా ఉద్యమంలో భాగం చేయడమనే ప్రయోగం రచయిత యొక్క ఊహాశక్తిని, సృజనాత్మకతను కళ్ళముందుంచుతుంది.

ఇట్లా తెలంగాణ మలిదశ ఉద్యమపాట కొత్తపుంతలు తొక్కింది. ఒక బలమైన సాంస్కృతిక పునాది ఏర్పరచింది. ప్రస్తుతం దేశంలో ఇంతటి సాంస్కృతిక ఉద్యమం మరొకటి లేదు. పోరాట పాటకు ఒక ఒరవడిని ఏర్పరచిన గద్దర్‌ ఇవాళ తెలంగాణ ఉద్యమంలో అనేకమంది కళాకారులు రూపొందడానికి ప్రేరణగా నిలిచాడు. అంతేకాకుండా మరోసారి ఊరూరా రాజకీయాలతో పాటు పాటను భుజానేసుకొని ముందునడిచాడు. అలాగే ప్రజావాగ్గేయకారులైన గోరటి వెంకన్న అందెశ్రీ, జయరాజు, మిత్ర, కొదారి శ్రీను, యశ్‌పాల్‌, నిసార్‌, నందిని సిధారెడ్డి, విమల, తేలు విజయ, పైలం సంతోష్‌ అంబటి వెంకన్న దయానర్సింగ్‌, నెర్నాల కిషోర్‌, నాగన్న దేవరకొండ భిక్షపతి, ఏపూరి సోమన్న ఎర్ర ఉపాళి, మిట్టపెల్లి సురేందర్‌, రసమయి బాలకిషన్‌, దేశపతి శ్రీనివాస్‌, సాయిచంద్‌, వరంగల్‌ శ్రీనివాస్‌, సుందిళ్ల రాజన్న, తాళ్లసునీల్‌, గుడిపల్లి రవి, దరువు ఎల్లన్న, గిద్దె రాం నర్సయ్య, నలిగంటి శరత్‌ తదితరుల పాటలతో తెలంగాణ ఉద్యమం పదిజిల్లాలకు విస్తరించి పదునెక్కింది.

తెలంగాణ పాటది సుదీర్ధమైన చరిత్ర. ఉద్యమాలకు ప్రజామద్దతు కూడగట్టడానికి పాటే ప్రధాన ఆయుధమయింది. తెలంగాణ ప్రజల నాడి పట్టుకొని వారికి పరిచయమున్న ప్రక్రియ రూపమే మిగిలిన సాహిత్య ప్రక్రియలకంటే అదనంగా సఫలమైంది. ప్రజాచైతన్యాన్ని తట్టిలేపిన పాట ఒక విజ్ఞాన వీచికలా, ప్రబోధ సాధనంగా ఉపయోగపడింది. తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం పురుడుపోసుకున్నా పాట అందుకోసం దోసిలి పట్టి ఆహ్వానించింది. నాలుగున్నర దశాబ్దాల కిందట మొదలైన ఉద్యమానికి పోరుశంఖం ఊదుతూ ముందునడిచింది. ఇక్కడి ఉద్యమాలు ప్రపంచ విప్లవపోరాట అనుభవాలకు తోడు తెలంగాణ నేలకున్న నేపథ్యం, ప్రజల సాంస్కృతిక జీవన విధానం పాటను ఇష్టమైన కళారూపంగా ఆదరించాయి. తెలంగాణ ప్రజల శ్రమైకజీవనం పాటతో ముడిపడి ఉండడం వల్ల అనివార్యంగా పాట మాత్రమే వారిని ఆకట్టుకోగలిగింది.

62

తెలంగాణ వచన కవితా వికాసం

- డా॥ బన్న అయిలయ్య

తెలుగులో వచన కవితా ప్రక్రియ 1930లో ప్రాదుర్భవించింది. తెలంగాణా వచన కవిత 1953లో వచ్చింది. వచన కవితా వయస్సు డెభ్బైమూడు సంవత్సరాలైతే; తెలంగాణా వచన కవితకు ఆరవై సంవత్సరాలు నిండాయి. తెలంగాణేతర వచన కవితా అవిర్భావానికి, తెలంగాణా వచన కవిత ప్రారంభానికి మధ్య 23 సంవత్సరాల ఎడం ఉంది. కారణం తెలంగాణేతర తెలుగు ప్రాంతాలు తెలంగాణా ప్రాంతం కంటే ముందుగానే సంస్కరణా ఫలితాలు అనుభవించడం, ఆధునిక ప్రపంచపు పోకడలను అవగాహన చేసుకోవడానికి వెసులుబాటు ఉండడం, భారతదేశం వలస పాలనలో ఉన్నాయి. గుడ్డిలో మెల్లెలా వలసపాలకుల అభివృద్ధిలో భాగం కావడం, ఫలాలలో భాగస్వాములు కావడం ఇతర ప్రాంతాలకు అందివచ్చిన అవకాశమే. తెలంగాణా ప్రాంతం విషయానికొస్తే హైదరాబాద్‌ రాష్ట్రం ఫ్యూడల్‌ భావన నుండి పాలన నుండి అంత త్వరగా బయట పడలేదు. కొన్ని సందర్భాల్లో మాతృభాషను పరిరక్షించుకోవడానికి, సంఘంలో సంస్మరణలను అమలు చేయడానికి పెద్ద ఉద్యమమే తెలంగాణా ప్రజలు చేసారు. ఫ్యూడల్‌ పాశావిక పాలనలో తెలంగాణా బాధల కొలిమిగా ఉండేది. మనుగడే కష్టమైన చోట భాషా సాహిత్య సంస్కృతులు బతికి బట్టకట్టడం కష్టమే కదా! సంప్రదాయ పండితులు వీధి అరుగుల మోద అక్షరాలు దిద్దిస్తూ కొత్త తరంలో భాషాభిమానం పెంపొందించే ప్రయత్నం చేసారు. నిజాం పాలనలో మిణుకు మిణుకు మంటున్న భాషా దీపం కొరవడకుండా కాపాడడమే ఒక యజ్ఞమైపోయింది. ఇక సాహిత్య సృజన, అందులో ఆధునిక సాహిత్యపు పోకడలు సంస్థానపు పొలిమేర తాకడం దుర్లభమే. ఆలస్యంగానైనా వచన కవితా ప్రక్రియ ప్రాంతంలో ప్రారంభమై అనూహ్యమైన పరుగుతో వెనుదిరిగి చూడకుండా పరుగెత్తడం చారిత్రక, వర్తమాన సత్యాలే. తెలంగాణేతర వచన కవితకు “జ్వాలా” పత్రిక వేదిక అయితే తెలంగాణా వచన కవులకు “తెలుగు స్వతంత్రి ప్రోత్సాహాన్నిచ్చింది.

ఒక కొత్త ప్రక్రియ సాహితీపరంగా మీదికి వస్తుందంటే అప్పటి వరకు ఉనికిలో ఉన్న ప్రక్రియకు ఆదరించే పాఠక, సృజనవర్గం కొత్త ప్రక్రియను వ్యతిరేకించడం

63

సహజమే. వ్యతిరేక భావనను చూసి కొత్తతరం సృజనకారులు ఊగిసలాడడమూ సహజమే. కొందరు వద్దంటే చరిత్ర ఆగిపోదు. మరికొందరు ఆదేశిస్తే అది సాగిపోదు. చరిత్రకు సాగిపోయే గుణమే కాని ఆగిపోయే లక్షణం దానికి ఉండదు. ఇందుకు నేటి తెలంగాణా వచన కవితా వికాసమే తిరుగులేని సాక్ష్యం. కొత్తతరం ఊగిసలాటలో (ప్రతిభావంతులైన కవులుండడం విశేషమే. దాశరథిలాంటి కవులు వారి జీవిత సాహిత్య నేపథ్యాల దృష్ట్యా కావచ్చు, లేదా నాటి సాహితీ ప్రపంచపు జడమయమైనస్థితి అయినా కావచ్చు. అందుకే తెలంగాణా ప్రాంతంలో 1948 ప్రాంతం నుండి ప్రక్రియ పట్ల కొంత డోలాయమాన పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. దాశరథి ప్రారంభ కవితా సంపుటాల్లో పద్యం, గేయం, వచన కవిత మిశ్రమం కనిపిస్తుంది. నాటికి ఇదొక ప్రయోగమే. 1958 నాటికి కవిరాజమూర్తి మహైక, 1958 నాటికి ప్రణతిలాంటి దీర్హకవితలు రానే వచ్చాయి. 1955లో సాహితీ బంధుబృందం వెలువరించిన తొలి కారు సంకలనంలోని కవితలు భావనతో ఉన్నట్లు కనిపిస్తుంది.

1960వ సంవత్సరంలో పేర్వారం జగన్నాథంగారు సాగర సంగీతం అచ్చు వేశారు. దీనిలో కూడా గేయం వచన కవిత కలగలసి ఉన్నాయి. అయితే మాదిరాజు రంగారావు లాంటివాళ్లు వచనకవితా ప్రక్రియను ఇష్టపూర్వకంగా ఆహ్వానించారని పిస్తుంది. మానవీయం, పడగెత్తిన ఉదయం లాంటి పూర్తిస్థాయి కవితా సంపుటాలు వెలవడడం గమనార్హం. క్రమంలోనే కోవెల సుప్రసన్న 'తేజశ్చక్రం వచన కవితను బలపరిచేదిగా వచ్చిందేమో అనిపిస్తుంది. వచన కవితా ప్రక్రియపట్ల ఇంత భయాన్ని, సందేహాన్ని ప్రదర్శించిన కవులు కేవలం ప్రక్రియపై మాత్రమే కాక దాని దృక్పథం పట్ల కూడా అనుమాన స్పందంగా వ్యవహరించారేమో అనిపిస్తుంది. సుప్రసన్న మృత్యుమూర్తి, మాచిరాజు రంగారావు శ్వేతేతర తరంగాలు రాజకీయ దృక్పథాన్ని వ్యతిరేకించాలనిపిస్తుంది. అయితే సామాజిక సమస్యల పట్ల అనుకూలమనే అనిపిస్తుంది. ఎందుకంటే కవిరాజమూర్తి మహైక సామాజిక సమస్యల చిత్రణ, అభ్యుదయ భావజాలం నిండుగా ఉన్న దీర్ణకావ్యం. మార్గాన్ని సమర్థించడం సరికాదని సంప్రదాయ భావజాలం చట్రం నుండి వచ్చిన వాళ్లు కావడం సహజమే. ఇలాంటి ఊగిసలాట చోటు చేసుకున్న సందర్భంలోనే సాహిత్య సంఘాలు అనిర్వచనీయమైన పాత్రను నిర్వహిస్తాయి. “తెలంగాణా రచయిత సంఘం” గ్రామ

64

గ్రామాల్లో సాహితీ సభలు నిర్వహిస్తూ, ప్రక్రియాభేదం పాటించకుండా సాహితీ ప్రచారం చేస్తూ సంస్కారాన్ని పెంపొందించేది. పద్యం, గేయం, వచనకవిత అనే తారతమ్యాలు చూపలేదు. ప్రచారం వచనకవులకు భరోసానిచ్చి ఉంటుంది. అంతే కాకుండా 1966వ సంవత్సరంలో వచనకవితా పితామహులు కుందుర్తి ఆంజనేయులు స్థాపించిన ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ కూడా వచన కవితా ప్రక్రియ స్థిరరూపం దాల్చడానికి దోహదం చేసి ఉంటుంది.

మద్యంలా పారే పాత ఛందస్సు పనికిరాదు అన్న దాశరథి వచన కవితను విద్యుత్‌ ఛందస్సుగా అభివర్ణించాడు. అయితే దాశరథి ఇలా అన్నాడు కానీ, చివరివరకు ఆయన పద్యం, గేయం, వచన కవిత సమంగా ఆదరించాడు. కొందరు కొందరు వచన కవితా ప్రక్రియను తేలికభావంతో కొట్టివేస్తే ప్రజాకవి కాళోజీ దాన్ని కవితా పద్ధతిలోనే ఎదుర్శొన్నాడు.

“కెతకు లక్షణాలు కోటొక్కటి

వానిలో వ్యాకరణం కూడా ఒకటి

మీకు దాని సూత్రాలే సర్వస్వం

అలల లది లి లి లలి లలి లి థి లి దిలి లి లి లి లి లి థి 6 అలల లలి లి లి థి 02౭౦౦9౪౪

మా రచనలో వ్యాకరణం మాత్రమే లేదు

మీ రచనంతా వ్యాకరణమే.

అన్న కాళోజీ అభిప్రాయం, వచన కవితా ప్రక్రియ నిలదొక్కుకోవడానికి ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాడో అనిపిస్తుంది.

తెలంగాణా వచన కవితకు ఆద్యుడుగా కవిరాజమూర్తి (మహైక)ని చెప్పుకోవచ్చు. క్రమంగా దాశరథి కృష్ణమాచార్యులు (మస్తిష్కంలో లేబరేటరీ), మాదిరాజు రంగారావు, పేర్వారం జగన్నాథం, కోవెల సుప్రసన్నగార్లు తెలంగాణా వచన కవితా ప్రారంభదశలో కన్పించే కవులు.

అప్పటి వరకు గేయకథా కవితా చక్రవర్తిగా వెలుగొందిన డా॥ సి. నారాయణరెడ్డి (సి.నా.రే) ఆలస్యంగా వచన కవితా ప్రక్రియా వితర్ధి మీదకి వచ్చినా అనర్హ రత్నాలైన వచన కవితా సంపుటాలను, దీర్ణకవితలను అందించి తన సృజన పౌరుషాన్ని

65

నిరూపించుకొని, వచన కవితా రచనా విరాట్‌ స్వరూపాన్ని చూపి, విశ్వంభర దీర్ధ కవితకు భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠం పురస్కారాన్ని గెలుచుకొంది. ఇది వచన కవితా ప్రక్రియకు, తెలుగు కవిత్వానికి ముఖ్యంగా తెలంగాణా ప్రాంతం కవిత్వానికి గర్వకారణం. వచన కవితా చరిత్రలోనే వజ్రాలగని “విశ్వంభర” మొత్తం పదిజిల్లాల్లో వచ్చిన కవితా సంపుటాలు, సంకలనాలు క్రింది విధంగా ఉన్నాయి.

పై పట్టిక తెలంగాణాలోని పది జిల్లాల్లో వచ్చిన 748 కవితా సంపుటాలు. 145 సంకలనాలు. అకారాది క్రమంలో జిల్లాలను వరుసగా తీసుకొని ఒక్కొక్క జిల్లాల్లో ఎన్ని సంకలనాలు సంపుటాలు వచ్చాయో వివరాలు ఇచ్చాను. చాలామంది కవులు ఉద్యోగం కోసమో, తదితర కారణాల వల్లనో తాము జన్మించిన జిల్లాను వదిలి ఇతర జిల్లాల్లో స్థిరపడ్డారు. ఇలాంటి కవులను తాము జన్మించిన జిల్లాలనే చూపించాను. తమ జిల్లాలో జన్మించి ఇతర జిల్లాల్లో నివాసం ఉంటున్న కవులను తమ జిల్లావాడిగానే పరిగణించి అభిమానించడం జరుగుతుంది. కనక కవిని వారు జన్మించిన జిల్లాలోనే లెక్క చూపడం జరిగింది. ఉదా:-

66

“బనారే !

హనుమాజిపేట

సాహితీవేత్త

ఎంతటి వటవృక్షమైనా

కరీంనగర్‌ సొత్తే” - అని దేశం బట్టని కవులను అభిమానించిన వారిని చూసాక, కవినైనా వారు జన్మించిన జిల్లాలోనే చూపడం సరియైనదే అన్పిస్తుంది. పైగా ఒక వ్యక్తి కవిగా రూపొందాడంటే తన బాల్యం స్మృతులు తప్పక అతన్ని. వెంటాడుతాయి. కన్నతల్లిని, జన్మనిచ్చిన ఊరును సామాన్యుడే మరచిపోనప్పుడు కవికి తన ఊరిపై ఒక ప్రత్యేకమైన మమకారం ఉన్నట్లు అతని కవిత్వమే సాక్ష్యమిస్తుంది. అందుకోసం ఆయా కవులను వారు జన్మించిన జిల్లాలోనే చూపించాను.

II

తెలంగాణా (ప్రాంతం చారిత్రకంగా ఎంత వైభవోపేతమైందో, సామాజిక చైతన్యంలోను ఇతర ప్రాంతాలకంటే చైతన్యవంతమైనదే. కారణం ఫ్యూడల్‌ శక్తుల పాలనలో సుదీర్షకాలంగా ఉండడమే. భూస్వామ్య శక్తుల అరాచకాలకు, వలసపాలకుల వివక్షకు, ఇంకా సమాజంలోని అనేక పొరలుగా ఉన్న మానవసంబంధాలు, వ్యవస్థలో పాతుకుపోయిన అసమన్న్శితి, ఇలాంటివన్ని నిర్మూలించబడి మానవత్వం దేదీప్యమానంగా వెలగాలనే తపన (ప్రాంత కవిత్వంలో చూస్తాం. వచన కవిత, అభ్యుదయ దృక్పథం ఇంచుమించు ఏకకాలంలో వచ్చినవే కనక రెండింటిని కొంచెం ఆలస్యంగా తెలంగాణా ప్రాంతం అందిపుచ్చుకుంది. “ఆంధ్రదేశంలో యే విధంగా సాహిత్యం అభివృద్ధి జెందినదో ఏయే కొత్త పంథాలను త్రొక్కిందో, ఎన్నెన్ని పరిణామాలను పొందిందో వాటి అన్నిటి ప్రభావమూ తెలంగాణా రచయితలపై గూడా బాగా పడింది.” (తెలంగాణాలో అభ్యుదయ రచన, శోభ, సంపుటి-1, సంచిక-2, 2 మే 1947) అని బూర్జుల రంగనాథరావు గారి లాంటి వాళ్ళు అంటున్నారంటే ఆలోచించదగిందే. ప్రాంత సంస్కరణలకు, నూతన విద్యకు, ఆధునిక భావజాలానికి, ప్రపంచంలోని అభివృద్ధికరమైన పరిణామాలకు దూరంగా ఉంది కనక తన చుట్టుపక్కల ఎక్కడ మార్చు జరిగినా దాన్ని స్వీకరించే స్థితిలో తెలంగాణా ఉండి ఉంటుంది. అందుకే బూర్గుల వారే “అభ్యుదయ కవుల్లో శ్రీకాళోజీ

67

నారాయణరావు, పొట్లపల్లి రామారావు, వెల్టుర్తి మాణిక్యరావు, దవళా శ్రీనివాసరావు, దాశరథి కృష్ణమాచార్యుల గార్లను మొదలు పేర్కొని తర్వాత తక్కిన వారిని పేర్మోవాలె. ఎంటుకంటే వీరు ౦0౧౮1౦౪9 అభ్యుదయ కవులు. వారి కవిత్వ ప్రారంభదశ నుండి అభ్యుదయ గీతాలనే వ్రాస్తూ వచ్చారు. వారి జీవిత దృక్పథమే, వారి ఆశయమే వారి అభ్యుదయ ఆదర్శమే అభ్యుదయము”. కవుల్లో ఒకరిద్దరు గేయం, పద్యం రాస్తూనే వచన కవితను కూడా రాసారు. అప్పటికే ఆంధ్రప్రాంతం వైపు ఉనికిలో ఉన్న భావకవిత్వం ప్రభావం తెలంగాణ మీద తక్కువే. అయితే అభ్యుదయ కవిత్వం ఇక్కడి కవులను ఆకర్షించడానికి దాని దృక్పథమే అయ్యి ఉంటుందనుకోవచ్చు. ప్రజాకవి కాళోజీలాంటి వాళ్ళు “అవనిపై జరిగేటి అవకతవకల జూచి! ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు” అంటూ అభ్యుదయ భావనవైపు మొగ్గడానికి స్థానిక పాలనే ప్రధాన కారణం అనుకోవచ్చు. ఇలాంటి వివక్షపూరితమైన పాలనా, ప్రజాశ్రేయస్సుకు గొడ్డలిపెట్టుగా మారిన పాలన ఇంకెక్కడున్నా దాన్ని సరిచేయాలనే తపన కూడా కన్పిస్తుంది. అప్పటికే మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు మానవాతీతమైన శక్తులేవో పరిష్కారం చూపుతాయని ఆశించే స్థితి నుండి, సమస్యలు మానవుడి వల్ల ఉత్పన్నమైనవి కనక మానవుడే పరిష్మరించుకోవచ్చనే భరోసా అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా ఏర్పడింది. సాహిత్యం కూడా మార్గాన్నే ఎంచుకొని ఆకలి, దారిద్ర్యం, అజ్ఞానం లాంటి తీవ్రమైన సమస్యలకు కారకుడు మానవుడే కనక అతడే వాటిని నిర్మూలించవచ్చనే భావజాలాన్ని సాహిత్యం ప్రచారం చేసింది. కొత్త భావజాలు కొత్త ప్రక్రియలో చెప్పడం 'దేశకాలాను ప్రవృత్తి ననుసరించి సాహిత్యం మారును సుమ్ము' అనే దానికి బలం చేకూర్చే లాగా సాహిత్యంలో మార్పు వచ్చింది. మార్పులను అందిపుచ్చుకున్న తెలంగాణా కవులు వచన కవితా ప్రక్రియలో భావజాలంను ఒదిగించే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. తెలంగాణాలో మొదటి వచన కవిత, వచన కావ్యం రాసిన దాశరథి, కవిరాజమూర్తి తదితర కవులు భావజాలంలోనే కవిత్వం రాసారు. మానవాళి పాత్రను వదిలేసి కొత్తమార్గంలో పయనించాలని కోరుతూ - 'మస్తిష్మంలో లెబొరేటరిలోకి రమ్మని ఆహ్వానించాడు దాశరథి. దారిలో వెళ్ళితే “అజంతా! శిలా సుందరికి లేని క్లుద్బాధసంచలనం పల్లెపడుచుకుందని గమనించుకో భాయీ!” అంటూనే మానవ మేధస్సు అభివృద్ధిని మెరుగుపరిచే విధంగా గుణాత్మంగా తీర్చిదిద్దుకోవాలి కానీ విధ్వంసానికి కాదంటూ

68

తెలిపారు. రాచరిక వ్యవస్థలోని ఆలోచనలాగా, ప్రజాస్వామిక కాలంలో అందివస్తున్న శాస్త్రసాంకేతికాభివృద్ధి మానవాళి తిరోగమనానికి వాడుకోకూడదంటూ సమాజంలో ప్రాథమికావసరాలు తీరక బాధపడ్డున్న సామాన్యుడి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ అభ్యుదయ భావనతో దాశరథి కవిత రాసాడు. కవిరాజమూర్తి 'మహైకిలో కవి, సామాన్యుడు, కార్మికుడు, పతిత పాత్రల ద్వారా అభ్యుదయ దృక్పథం చాటారు. “అన్నలూ, అమ్మలూ/ మీ అరుపుల్లోని వేదన/ మీ చేతుల్లోని కదలిక / మీ గుండియల్లోని బాధ / మీ గళంలోని గాద్దదికత [ఏవో బాధలతో రోదనలతో / మారుపలుకవేం తల్లి? / మాట్లాడరేం అన్నా?/ నీరసించిన మీ కండ్లలోని పరిశ్రాంతి నిలువుటద్దంలోని నీడలాగ అగుపిస్తున్నది./ మీ పగిలిన గుండెల చూస్తుంటే |. హృదయం పుండై సలుపుతూంది. నేటి చీకటి రేపు రాదు/ మానవుడు మానవున్ని కలిస్తే / బాధలు తీరకపోవు” మానవుడికే ప్రాధాన్యమిస్తూ భవిష్యత్తులో మార్పు తథ్వమనే విషయాన్ని చెప్పారు. ఇలా వచన కవితా ప్రారంభంలోనే తెలంగాణా కవి అభ్యుదయ భావనతో రచన చేయడం కన్పిస్తుంది. మానవుడికే ప్రాధాన్యం, ఇంకా చెప్పాలంటే సమాజంలోని అట్టడుగు వర్గాలకు, దుర్మార్గమైన వ్యవస్థకు బలైపోయిన వాళ్ళకే ప్రాధాన్యమిచ్చే కవిత్వం వచ్చింది. మొదటితరం వచనకవులపై వస్తువు, దృక్పథం ప్రభావం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. పేర్వారం జగన్నాథం, వరవరరావు లాంటి కవులు వచన కవితా ప్రక్రియను దృక్పథాన్ని స్వీకరించారు. కాలంలోనే వచన కవిత్వం రాస్తున్న మాదిరాజు రంగారావు, కోవెల సుప్రసన్నాచార్యులుగారు సామాజిక సమస్యలకు కట్టుబడి కవిత్వం రాసినా దృక్పథం విషయంలో స్పష్టత కన్పించడం లేదనిపిస్తుంది.

1965 (ప్రాంతం వరకే తెలంగాణా కవి కుహనా ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల నిరసనను, ఆగ్రహాన్ని తెలిపాడు. ఇది దిగంబర కవుల రూపంలో వచ్చింది. వీరిలో నిఖిలేశ్వర్‌, నగ్నముని, చెరబండరాజులు నన్నయ నుండి అభ్యుదయ కవి వరకు తత్‌ కాలం నాటి సాహిత్యాన్ని నిరసిస్తూ కవిత్వం రాసారు. అసంతృప్తికి కారణం ఫ్యూడల్‌ కాలంలోను, ఆదర్శమనుకున్న ప్రజాస్వామ్య పాలనలోను ప్రజలకు ఒరిగిందేమీ లేదు. స్వతంత్ర భారతంలో నూతన రాజ్యాంగ నిర్మాణం జరిగింది. కాని పెట్టుబడిదార్లకు, ధనికులకు మాత్రమే రక్షణగా నిలిచింది తప్ప సామాన్యుడికి ఒరిగిందేమీ లేదని వీరు తీవ్ర నిరసనను తెలిపారు. కాలాన్నే సాహిత్యంలో 'స్తబ్ద'

69

ఆవరించిందన్నారు. ఇది కవిత్వానికి మాత్రమే తప్ప ఇతర ప్రక్రియలకు కాదని రాపాళెం చంద్రశేఖర్‌రెడ్డిగారు ప్రకటించారు. తెలంగాణాలో మాత్రం మాదిరాజు రంగారావు, సినారె, తిరుగబడుకవులు, కాళోజీ, గోపి లాంటి కవులు ప్రత్యేకంగా సంపుటాలు ముద్రించకపోయినా విడివిడి కవితలు రాస్తూనే ఉన్నారు. ఇంకా ఇతర ప్రక్రియలపై దృష్టిసారిస్తే తెలంగాణా సాహిత్యంలో స్తబ్దత లేదని తేలుతుంది. సైనిక చర్య తరువాత నిజాం నుండి విముక్తమైన తెలంగాణా 1948 సెప్టెంబర్‌ 17 నుండి 1949 వరకు సైనిక పాలన సాగింది. దీనికి మేజర్‌ జనరల్‌ జె. ఎన్‌. చౌదరిని మిలిటరీ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1950లో సీనియర్‌ సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగి ఎం.కె.వెల్లోడె ముఖ్యమంత్రిగా, కొందరు మంత్రులుగా పౌర ప్రభుత్వం ఏర్పాటైంది. 1952లో జరిగిన సార్వత్ర ఎన్నికల తరువాత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి మొదలైన వారు మంత్రులుగా హైదరాబాద్‌ రాష్ట్రంలో సాధారణ పరిపాలన కొనసాగింది. అంటే 1948 సెప్టెంబర్‌ 17 నుండి 1956 అక్టోబర్‌ 81 వరకు హైదరాబాద్‌ రాష్ట్రంగానే ఉంది. (1969 తెలంగాణా ఉద్యమం - కాళోజీ కవిత్వం, వ్యాసం, ప్రజాకవి కాళోజీ సాహిత్య సమాలోచన, గంటా జలంధర్‌రెడ్డి, పుట-272) ఎప్పుడైతే ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రం నుండి ఆంధ్ర, రాయలసీమ విడిపోయి హైదరాబాద్‌ రాష్ట్రంలో 1 నవంబర్‌ 1956 నాడు కలిసాయో నాటి నుండి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది. కొన్ని షరతులు, ఒప్పందాలతో ఏకమైన సీమాంధ్రులు తెలంగాణా ప్రజల పట్ల వివక్ష చూపుతూ వ్యవహరించారు. మరోరకంగా చెప్పాలంటే షరతులను, ఒప్పందాలను ఉల్లంఘించి తెలంగాణా నీళ్ళు, నిధులు, ఉద్యోగాలను దోచుకుంటుండగా కడుపు మండిన తెలంగాణా ప్రజ 1969లో తెలంగాణా ఉద్యమం లేవదీసారు. ప్రజా ఉద్యమానికి సంఘీభావంగా కవులు స్పందించారు. వరంగల్లు కేంద్రస్థానంగా నడుస్తున్న జనధర్మ ప్రత్యేక ఉద్యమ సందర్భంలో “జనధర్మ ప్రత్యేక సంచిక 5-6-69 నాడు ప్రకటించింది. “తెలంగాణా ఉద్యమ కవితా సంకలనం”లో ప్రజాకవి కాళోజీ, ఇందుర్తి, పేర్వారం జగన్నాధం, టంకసాల అశోక్‌, ముకురాల, బాసిరి సాంబశివరావు, తెన్నేటి సుధాదేవి మొదలైన వారి కవితలున్నాయి. దీన్ని తెలంగాణా ఉద్యమంలో తుపాకి గుండ్లకు ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు అంకితమిచ్చారు. “కాసు బ్రహ్మానందు కాదు / మోసపు ప్రతిరూపువాడు / చక్కని మార్గం విడిచి / ప్రక్నతోవ

70

తొక్కినోడు / కల్లిబొల్లి మాటలాడి / ఇల్లుగుల్ల జేసినాడు / ఉద్యోగుల వేతనములు/

ఉద్దరించు నెపము we tte తిండి కొరత యధారీతి, ఉండేట్టుల “పేస్కేళ్ళును / గండీ కొట్టించినోడు.................. యూనివర్సిటి (ప్రతిపత్తిని చెజచబోయి చెడినవాడు...................... తెలంగాణ కన్యాయం / చేతులార చేసినోడు/

“ఇల్లు తగలబడుతుంటే / ఢిల్లీ నగరము వెళ్ళీ / అల్లరి లేదంచు చెప్పు / కల్లలాడు కపటివాడు” (మోసపు (ప్రతిరూపువాడు (పుట-8) అంటూ బాసిరి సాంబశివరావు అనే కవి సీమాంధ్ర పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చిత్రించాడు. అట్లాగే పేర్వారం జగన్నాథం ‘కనకపు సింహాసం' అశాంతి నుండి అంటూ తెన్నేటి సుధ కవితలు తెలంగాణా ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సీమాంధ్ర ప్రజల సామ్రాజ్యవాద మనస్తత్వాన్ని చిత్రించాడు. నాటి వచన కవులు 1969 నాటి తెలంగాణా ఉద్యమాన్ని రికార్డు చేసిన తీరు సంకలనంలో కన్పిస్తుంది. వరవరరావు, అశోక్‌, లోచన్‌, ఎక్స్‌-రే, ఐ.సంజీవరావు, సుధాకర్‌, సుదర్శన్‌, యాదగిరిరావులు చైతన్యవంతమైన యువకులు. సంఘం పట్ల బాధ్యతతో మెలిగిన పౌరులు. సాహిత్యం సామాజిక ప్రయోజనం కోసమే ఉంటుందని బలంగా విశ్వసించారు. కనక “తిరుగబడు కవితా సంకలనం డిసెంబర్‌ 1969లో అచ్చువేశారు. పది మంది ఆశయం ఒక్కటే సమాజంలో దోపిడిప్రాణులుంటే దోపిడికి గురువుతున్న వాళ్ళు తిరగబడాలని వీళ్ళు పిలుపునిచ్చారు. “విషం కలిసిన పాయసం మనరాజ్యం, డబ్బున్న భడవా పోషించే ఊపుడుకత్తే మన ప్రజాస్వామ్యం, మన ప్రణాళికలూ, సాహిత్యమూ ఒకటేమిటి అన్ని రంగాలు ఇరవై ఏళ్ళకే పడుపుకూడు తిని రాగూడని రోగాలు తెచ్చుకొని ముసలిదైన వీని విలాపాన్ని వర్ణించడానికే ఖర్చయిపోతున్నాయి.” (తెలుగు కవితా వికాసం 1947-1980, కడియాల రామమోహన్‌రాయ్‌, పుట-338) పోరాటం ద్వారానే మనకు కావల్సినవి సాధించుకోవాలని తిరగబడు కవులు పిలుపునిచ్చారు. కుళ్ళి కంపుకొడుతున్న వ్యవస్థను శస్త్ర చికిత్స ద్వారానే బాగు చెయ్యగలమని ఇందుకోసం బలిదానాలు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఒక దృక్పథం లేని కవులు, గట్లులేని ప్రవాహంలా కన్పించారు. వీరి ఆకాశాన్ని ధర్మాగ్రహాన్ని గాడిపెట్టింది విరసమే. విరసంలో తిరగబడు కవులు చేరాక విప్లవంతోనే సమాజంలో మార్చు వస్తుందనే విశ్వాసం మరింత బలపడింది. ఇక 1970 తరువాత “విరసం” విజృంభణతో తెలంగాణా ప్రాంతంలో

71

రాజకీయ దృక్పథం పదునుదేలింది. తెలంగాణా మొదటి తరం వచన కవుల్లో మాదిరాజు రంగారావు గారిది విలక్షణమైన కవిత్వం. ఇప్పటి వరకు దాదాపు 58 కవితా సంపుటాలు ప్రకటించారు. అగ్ని నుండి ఆనందానికి, మానవీయం, చీజ్‌ఫైర్‌, క్రాస్‌ఫైర్‌ లాంటి దీరకవితలను రాస్తూ వచన కవిత్వమే శ్వాసగా జీవిస్తున్న రంగారావుగారి కవిత్వంలో అద్భుతమైన పదబంధాలు, పదచిత్రాలు, సింబల్స్‌ ఉంటాయి. చిక్కని కవిత్వం, సమతూకంలో పాదాలుండడం వీరి కవిత్వానికున్న ప్రత్యేకత. వచన కవిత్వానికున్న అనేక పేర్లలో వీరు ఖాయం చేసే పేరు “స్వేచ్భాకవిత యతిప్రాసలు. ఛందోబంధాలు లేని కవిత్వం కనక దీన్ని స్వేచ్భాకవిత్వమన్నారు. వీరి కవిత్వంలో ప్రజాస్వామ్య, మానవీయ భావనలు వన్నెకెక్కాయి. సమాజ పరిణామాల పట్ల స్పందన, సంవేదన, అనుభూతి, ఆలోచన, ఆవిష్కారం వీరి కవిత్వంలో ఉంది. 1958 నుండి 2018 వరకున్న సామాజిక పరిణామాలన్నీ వీరి కథా వస్తువులే. “చేతిలో నిలిచిన కరవాలాన్నిి నెత్తురు చుక్కలలంకరిస్తాయి / కాలం మెడలో క్షణాల దండను / బాష్పబిందులలంకరిస్తాయి / కిరణ స్ఫూర్తితో బతికినంత కాలం / చీకటి ఉండదు, మలనం లేదు, మృషలేదు” (కిరణస్పృహతో, ప్రవాహంలో ప్రజాస్వామ్యం, పుట-11, 2012) శాంతిని అపేక్షించే కవి, ఇరువర్గాలు కృషి చేస్తేనే శాంతి వెల్లివిరుస్తుందనే వాస్తవాన్ని తెలుసుకోవాలంటాడు. ప్రజాస్వామ్యాన్ని మించిన భావన ప్రపంచంలో లేదని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అవసరం నాగరికులకుందని ఉద్బోధిస్తాడీ కవి. అక్షరాల గవాక్ష గవాక్షంలో వచన కవితా రంగప్రవేశం చేసిన సినారె దాదాపు 42 వచన కవితా సంపుటాలను వెలువరించారు. మధ్యతరగతి మందహాసం, మరో హరివిల్లు, మంటలూ-మానవుడూ, ముఖాముఖి, మనిషీచిలుక, ఉదయం-నాహృదయం, మార్చు నా తీర్పు, తేజస్సు-నా తపస్సు, ఇంటిపేరు చైతన్యం, మధనం, మృత్యువు నుంచి, భూమిక మట్టీ-మనిషి ఆకాశం, విశ్వంభర.... వాక్కుకు వయస్సు లేదు (29 జూలై 2013) మొదలైన సంపుటాలు వెలువరించారు. వచన కవితా సంపుటాలను గుత్తులకొద్ది అందించారు. వీరికి కవితాసాధన ఒక తపస్సు. తపోభగ్నం కాకుండా నిష్టగా కవిత్వం రాస్తున్న సినారె మంటలూ - మానవుడూ, విశ్వంభర సంపుటాలను ప్రత్యేకంగా పేర్మొనాలి. మొదటిది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును, రెండోది ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీర్‌ పురస్మారాన్ని గెల్చుకున్నాయి. తన కీర్తి జన్మస్థలమైన హనుమాజిపేట నుండి హస్తినాపురం పాకినా

72

మూలలను మరవని కవి సినారె, మట్టి వాసనలతో వారి కవిత్వం గుభాళిస్తుంది. మానవీయ స్పర్శతో సమాజాన్ని పులకింపజేస్తుంది. మానవుడు జ్ఞానంవైపు, మానవీయత వైపుకు, పురోగమించాలనే వీరి కవితా లక్ష్యం.

విజేతగా వెలగాలంటే

విశ్వాన్నే భస్మం చెయ్యాలా?

ధరాలోభం తీరాలంటే

నరరుధిరమే కావాలా?

వేయితోటలను నరికిన చేయి పూయిస్తుందా ఒక్క పువ్వును

మాన హూంకృతులు మరిగిన నోరు చేర బిలుస్తుందా ఒక్క శిశువును ?

బుషిత్వానికీ పశుత్వానికి

సంస్కృతికీ దుష్కృతికి

స్వచ్చందతకూ రౌద్రతకూ

తొలివీజం మనస్సు

తులా రూపం మనస్సు (విశ్వంభర)

మానవత్వాన్ని వేయి చేతులా ఆహ్వానించే వీరి కవిత వ్యక్తిలో మార్చు వస్తే

సమాజంలో మార్పు వస్తుంది. ప్రపంచంలోని సకల అనర్థాలకు మనవుడి మనస్సే కారణమంటూ గౌతమబుద్దుడిలా ప్రబోధించే వీరి కవిత తరతరాలకు జ్ఞాన

దీప్తినిస్తుంది.

చేతనావర్తకవులు నలుగురు తెలంగాణా వారే సుప్రసన్న, పేర్వారం జగన్నాథం, సంపత్ముమారా, వేనారెడ్డిలు, దిగంబర కవులు 1965, 1966, 1968లలో వరసగా మూడు కవితా సంకలనాలను ప్రచురిస్తే ఆంధ్రదేశమంతా కొంచెం వ్యతిరేకంగా,

73

ఎక్కువ అభిమానంగానే గుర్తించింది. దిగంబర కవులు కవిత్వంలోని వస్తువుతో సామాజికాభ్యుదయం కోరే ప్రతివారు ఏకీభవించినా వారు వాడిన భాషతోనే విభేదించారు. కవితా రూపకంగా వాళ్ళ నెదుర్శొన్నవాళ్ళు ఒక్క చేతనావర్త కవులే. అయితే దీన్ని వాళ్ళు అంగీకరించినట్లు కనబడదు. విమర్శకులు మాత్రం దిగంబర కవిత్వాన్ని ఎదుర్కోవడానికే వచ్చినట్లు గుర్తించారు. “నిఖిలేశ్వర్‌ నన్నయను అంతగా నిందించకుండా ఉండే పరిస్థితి ఎట్లా ఉండేదన్నది ఇప్పటికీ ఆసక్తికరమే. సంప్రదాయ బలంచే మాకుందని ప్రకటించే ధోరణినీ సహించదు. దిగంబర కవి నిఖిలేశ్వర్‌ ఆలోచనలో ఆచార్య త్రయం తీవ్రంగానే భేదించింది. చేతనావర్తం ప్రకటించిన విభేదం ప్రత్యక్షంగా ఒకరు తలపడితే, పరోక్షంగా వ్యూహాత్మకంగా సుప్రసన్న, సంపత్ముమారలు తలపడ్డారు”. (అదేపుట, సీతారాం, పుట 88) పేర్వారం జగన్నాథం యదా యదాహి ధర్మస్యగ్గానిర్భవతి భారత” అన్న కవిత దిగంబరులను ఎదుర్శొన్నదే. చేతనావర్తకవులది సమగ్ర మానవ వికాసానికి అన్ని రంగాల సమన్వితమైన వికాసం అవసరం అనే వారు ప్రకటించారు. ఏది ఏమైనా దిగంబర కవులు లేకపోతే చేతనావర్తం ఆవిర్భవించేదా? అనేది పాఠకులకు సందేహంగానే ఉంది. దిగంబర కవుల్లో (నిఖిలేశ్వర్‌, జ్వాలాముఖి, చెరబండరాజు) నిఖిలేశ్వర్‌ నేటికి వచన కవిత్వం రాస్తూనే ఉన్నారు. మండుతున్న తరం, ఈనాటికి, నాలుగు దశాబ్దాల సాక్షిగా కవితా సంపుటాలు ప్రకటించి సామాజిక సమస్యలపై కవితా యుద్ధం చేస్తూనే ఉన్నారు. చేతనావర్తంలో పేర్వారం జగన్నాథం వృషభపురాణం, గరుడ పురాణం సంపుటాలు ప్రకటించారు. వృషభపురాణం కవితా కుహనా ప్రజస్వామ్య విలువలను ఎండగట్టిన కవితే “దిగ్రేట్‌ ఇండియన్‌ సర్మస్‌” భారత పార్లమెంటును వ్యంగ్యంగా చిత్రించాడు. పార్లమెంట్‌లో కూర్చుండే సభ్యులు రకరకాల జంతువుల్లాంటి వారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఇలా పోల్చి చెప్పాడు. జగన్నాథంగారు “ఈ మగడునాకొద్దు / వీడసలే తుమ్మమొద్దు / గడ్డం మీసాలకన్న / గడ్డపారలే కాస్తనయం / భరించడం మహాకష్టం / వీడి పుట్టుకే దేశానికరిష్టం / బలవంతంగా తాళి కట్టించకు / ఇదే రాత్రి నా ప్రాణం గుటుక్కు/ వీడి వల్ల సంతానం పెంచకు / వంశాన్ని మరోతరం పొడిగించకు” (స్వయంవరం, వృషభపురాణం, పుట-86) దేశ రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉందో తెలిపారు. సుప్రసన్నగారిది సమగ్ర దృక్పథం (1౧180166 approach వర్ణ, వర్ద, లింగ, కుల వివక్షతలకు వ్యతిరేకం, విశ్వ (్రేమోవాదం వారిది. శతాంకుర,

74

సాంప్రదాయం కావ్యాలు వారిలోని తాత్వికతకు నిదర్శనాలు. శిలా సంప్రదాయం కాకుండా నునుదీగ సంప్రదాయానికి పెట్టింది పేరు చేతనావర్తకవులు. భారతీయత మీద అపారమైన భక్తి భావం. దేశ తత్వవేత్తలైన వివేకానందుడు, గాంధీ, రవీంద్రుడు, అరవిందుడు, జిడ్డు కృష్ణమూర్తి వీరి కవితా పందిళ్ళను అల్లుకొని నిత్యహరితం చేస్తున్నారు. ఇజాలకీకరారణ్యం వద్దంటూ స్వచ్చమైన రసానుభవం గల కవితా ఖండికలను చేతనావర్తకవులు అందించారు. (తెలంగాణా వచన కవిత, వ్యాసం, బన్న అయిలయ్య, విమర్శిని - 12, పుట-88)

1967లో కవిత్వం రాయడం మొదలెట్టిన గోపిగారు తెలంగాణా పల్లెలని, మట్టిని, తెలంగాణా బాస యాసను సంస్కృతిని అవ్యాజంగా (ప్రేమించాడు. తన మొదటి కవితా సంపుటి పేరే “తంగేడు పూలు” అని పేరు పెట్టి ప్రాంతంపై అభిమానాన్ని చాటుకున్నారు. “తెలుగువారి బతుకమ్మల కమ్మని వెలగాల / వెలుగు నింపుపూలు / కాపు కన్నెల ముద్దు గొలుపు ముద్దు కొప్పుల్లో కాపురం ముండే పూలు” - పూలు పేదపూలు, పేదలపూలు, ఇవి “బంగారు పూలు” అంటారు. తంగేడు పూలు తెలంగాణా సంస్కృతికి ప్రతీకలు. గోపిగారు చుట్టకుదురు, ఎండపొడ, రాతికెరటం మొదలైన కవితా సంపుటాలు వేసారు. రాజన్న బొంత, రొట్టె కవితలు తెలంగాణా జీవితాన్ని తెలిపే కవితలు. కాలాన్ని నిద్రపోనివ్వననే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అనే కవితా పురస్కారం లభించింది. వీరు రాసిన 'జలగీతం' కాస్మిక్‌ వాటర్‌ నుండి కమర్షల్‌ వాటర్‌ వరకు చిత్రించిన కావ్యం. నిరంతరం కవితా మూడీలో ఉండే గోపిగారు అలసిపోని కవి. మానవత్వం నిండుగా కన్పించే ఈయన కవితలు భావితరాలకు వెలుగుబాటలు.

వరుసలోనే చెప్పుకోదగిన కవి రామాచంద్రమౌళి. దీపశిఖ, శిలలు వికసిస్తున్నాయి, ఒక దేహం, అనేక మరణాలు, కిటికీ తెరచిన తర్వాత మొదలైన కవితా సంపుటాలు ప్రకటించారు. మొదటి రెండు సంపుటాల తర్వాత ఇతను కవితా సన్యాసం చేసాడు. తనదికాని ప్రపంచంలోకి వెళ్ళి ధనం గౌరవాన్ని పొందాడు కాని జీవితంలోని సజీవతను పొందలేక పోయాడు. నలభై ఏళ్ళ తరువాత జీవితాన్ని వెదుక్కుంటూ సాహిత్యంలోకి ప్రవేశించాడు. “గెలవడం తెలిసినవాడు ఓటమిని ఒక పాఠంగా స్వీకరిస్తాడు / దుఃఖించడం తెలిసినవాడే / దుఃఖ మూలాలను విశ్లేషించి నవ్వడం నేర్చుకుంటాడు / నవ్వు “రహస్యం” ఒకసారి తెలిసిన తరువాత/ ఇక

75

యాంత్రించడంలో ఉన్న జీవన మధురిమ అవగతమౌతుంది/ ఉదయం, ఆరోహణ, అవరోహణ, అస్తమయం / అధ్యాయాలు అధ్యాయాలుగా / వరుస అంకాలుగా, పడవలసిన అడుగులు అడుగులుగా / సాగేదారి స్పష్టపర్చుకోగానే / యిక దృష్టి అంతర్వేదన నుండి బహిశ్చేతనగా వికసిస్తుంది. (జీవితోత్సవం, కిటికీ తెరచిన తరువాత..... పుట 86) కవిలో అనుభూతి సాంద్రత ఎక్కువ అందుకే కోవెల సుప్రసన్నాచార్యగారు” కవి రచన అందరికీ తెలిసిందే ఒక భావాన్ని అనుభవాన్ని విస్తరిస్తూ పోతాడు. ఎక్కడిదాకా పోతాడో మనం చెప్పలేం, జడంగా పడి ఉన్న నామవాచకాలు క్రియలైపోతాయి. తపస్సు తపస్సిస్తుంది, స్తబ్ధత స్తబిస్తుంది, అదృశ్యం అదృశ్యిస్తుంది. జగత్తంతా క్రియాశీలం కావాలి. ఏది కదలకుండా ఉండకూడదు. శ్రీరామచంద్రమౌళికి, కవిత్వం నిరంతర పరిణామ చైతన్యక్రమం అది బీభత్స సన్నివేశం కాదు “పంజరాల్లోంచి వందల వందల పావురాలు ఎగిరిపోతున్నట్లుండాలొ. ఆయనకు “రిథమ్‌ ఈజ్‌ లైఫ్‌”, జీవనం అంతాలయాత్మకం. విశ్వమంతా లయాత్మకం. విశ్వలయనే వేదం బుతం అన్నది.” (అంతర్దహనం కవితా సంపుటికి రాసిన పీఠిక) విద్యార్థి “అలలు” కవితా సంపుటితో సాహితీ ప్రపంచంలోకి వచ్చి పలకరింత, ఘర్మ సముద్రం, మంచు మైదానం, ఖండాంతర సంపుటాలు ప్రచురించారు. అన్యాయాన్ని ఎదురించడం, ప్రకృతి ఆరాధన, మధ్య తరగతి జీవితం, దేశభక్తి, అనుభూతి, విశ్వమానవ భావన కవితా వస్తువు. “ఎన్నాళ్ళు వీళ్ళు మాటల్ని / మొగమాటం లేకుండా వింటావు? వీళ్ళ సంతృప్తి కోసం / బుద్ధిగా వినే విద్యార్థిలా నిలబడతావు? ఇది వెర్రిబాగులతనం / ఆత్మవంచన / నీగళం విప్పు / నిన్ను నువ్వు ఆవిష్కరించు / నువ్వు ప్రశ్నించడం లేదు గనుక / విస్సన్నలా వాగుతున్నారు / వీళ్ళ దయ్యపు నీడల్నుంచి / బయటపడు / వీళ్ళ మత్తుమాటల దుప్పట్లను / కృత్రిమ భావాల ఉడుపుల్ని చింపేయి / “అధారిటీ? అనే మాటను బద్దలుకొట్టు / నిన్ను నువ్వు ఆవిష్కరించు” (విముక్తి కోసం, విద్యార్థి కవిత్వం, పుట-73) ఎదుటివాళ్ళ మాట విన్నంతకాలం మనల్ని మనం విముక్తి చేసుకోవడం కోసం స్వతంత్రంగా ఆలోచించితే “అథారిటి” బద్ధలై విముక్తం అవుతామని విద్యార్థి భావన. “జీవితం పట్ల నిజాయితీ కలిగి, జీవితానుభవాల్ని కవిత్వంలో (ప్రతివింబింపచేసే కవుల కవిత్వంలో, వారి దర్శనం స్పష్టంగా ఉంటుంది. జీవితం పట్ల వారి భావాల్ని నిర్దిష్టంగా ఉంటైగాని, కలగాపులగంగా ఉండవు. కోవకు చెందిన కవియే విద్యార్థి. అతని

76

కవితలు చదువుతుంటే, అతని అనుభవాలకు సంబంధించిన అనేక కోణాలు, అక్షర రూపం పొందడంలో, నిర్మలమైన భావధారను అనుభూతి చెందుతాం” (నిజాయితి గల కవి, అద్దెపల్లి రామమోహన్‌రావు, అద్దంలో విద్యార్థి, పుట-41) దిగంబర కవులు, చేతనావర్తకవులు, తిరగబడుకవుల సందోహం తెలంగాణా ప్రాంతంలో ఒక విధమైన చలనశీలతకు లోనైంది. అట్లాగే వీరి భావజాలంతో ఏకీభవించడకుండానే కొందరు కవులు తమ స్వీయ మార్గంలో వెళ్ళారనడానికి కొందరి కవులను ఉదహరించాను.

1970 నుండి 1980 వరకు దశాబ్ది కాలం వరకు విరసం ప్రభంజనం ఆంధ్రదేశం అంతా వీచింది. దిగంబర, తిరగబడు కవులు విరసంలో చేరి సంస్థ వ్యవస్థాపక సభ్యులైయ్యారు. దీనికి శ్రీశ్రీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. “నాటికి శ్రీశ్రీని విరసం హైజాక్‌ చేసిందనేది అభియోగం అయితే తెలంగాణ కవుల ప్రోద్భలం వల్ల విరసం పుట్టింది. కనక శ్రీశ్రీని విరసం హైజాక్‌ చేసింది అనేకంటే, తెలంగాణా ప్రాంతం శ్రీశ్రీని హైజాక్‌ చేసిందనడం సమంజసం” (అదే పుట, పుట-41) అని సీతారం అనడంలో తెలంగాణా చైతన్య శక్తి అర్ధమవుతుంది. దిగంబర, తిరగబడు కవులు విరసంలో క్రియాశీలక పాత్ర పోషిండం కూడా చైతన్యానికి ఉదాహరణే. నిఖిలేశ్వర్‌, జ్వాలాముఖి, చెరబండరాజు, తిరగబడుకవులు పదిమంది దీనిలో సభ్యులు కావడంతో విరసంకు నిండుదనం రావడం జరిగింది. ఇది రాష్ట్ర/ దేశవ్యాప్త సంస్థ అయినా అంతర్జాతీయ దృక్పథం కలిగిందై అయినా వరవరరావులాంటి కవులు దానికి వెన్నెముకగా ఉన్నారు. “ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఆందోళనలో విరసం వైఖరిని ప్రజలు హర్షించలేకపోయారు. స్వార్థపరశక్తుల ఆందోళనను ప్రజా ఉద్యమంగా వక్రరీతిలో వ్యాఖ్యానించ జూపింది. తరువాత తమ పొరపాటును గుర్తించి ఆంధ్రప్రదేశ్‌ చీలిపోవాలని కోరలేదు” (తెలుగు కవితావికాసం, కడియాల రామమోహన్‌రాయ్‌, (పుట. 350) ఆంధ్రప్రాంత కవులు ముఖ్యంగా విరసం సభ్యులను దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానం చేసినట్లనిపిస్తుంది. విరసం నేటికి తెలంగాణా రాష్ట్రం కావాలనే కోరుకుంటుంది. పార్లమెంటరీ వ్యవస్థను, రాజ్యాంగాన్ని విశ్వసించని విరసం బ్యాలట్‌ ద్వారా కాకుండా బుల్లెట్‌ ద్వారానే సమసమాజం స్థాపించాలనే లక్ష్యంతో సాయుధ పోరుకు దిగింది. శ్రీకాకుళ గిరిజన పోరాటాలు, తెలంగాణా సాయుధ పోరాట స్ఫూర్తితో మార్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానంతో సిరిసిల్ల జగిత్యాల రైతాంగపోరాటాలు జరిగిన ఎందరో విప్లవకారుల ఎదురుకాల్పుల్లో

77

చనిపోయారు. ఇవి భూటకపు ఎన్‌కౌంటర్లని విరసం ప్రకటించింది. ఇటు సాయుధ పోలీస్‌ బలగాలు, అటు విప్లవ దళాళలతో తెలంగాణా పల్లెలు అట్టుడికాయి. పల్లెల్లో ప్రశాంత జీవితం కరువైంది. అభ్యుదయ కవిగా ప్రసిద్ధి చెందిన వరవరరావుగారు చలినెగళ్ళు, జీవనాడి కవితా సంపుటాలు వెలువరించారు. విరసం స్థాపనకంటే ముందే 1967లో సృజన పత్రికను మిత్రులతో కలిసి స్థాపించిన వరవరరావుగారి తరువాత దాన్ని విరసంను వేదికను చేశారు. విరసంలో చేరాక స్వేచ్చ, సముద్రం సముద్రం, భవిష్యత్‌ చిత్రపటం, ముక్తకంఠం కవితా సంపుటాలు వెలువరించి విప్లవభావ ప్రచారం చేసారు. ఆరోజు, ఉన్నదేదో ఉన్నట్లు, అంతస్సూత్రం ఇటీవల వెలువరించారు. “మన చేతిలో మార్చిజమ్‌- లెనినిజమ్‌/సూక్ష్మదర్శినీ- దూరదర్శినీ ఉన్నాయి. మావో ఆలోచనా విధానం మనజ్ఞాననేత్రం” అంటూ సైద్ధాంతిక భావజాలాన్ని కవిత్వం ద్వారా ప్రచారం చేసారు. ఇంకా పౌరహక్కులు, ఎన్‌కౌంటర్లు, తెలంగాణ కల్లోలంపై కవితలు రాసారు. ఇంకా అల్లం నారాయణి తెలంగాణాపల్లె, విరసం ప్రచురణనే, జ్వాలాముఖి ఓటమి తిరుగుబాటు”, మండుతున్నతరం నిఖిలేశ్వర్‌; యన్‌.కె “లాల్‌బనోగులామిఓచోడో బోలో వందేమాతరం తెలంగాణ నుంచి వచ్చిన రచనలే. ఇంకా దామెర రాములు "ోరస్‌”- నెత్తుటి వెన్నెల విరసం భావజాలాన్ని ప్రచారం చేసిన రచనలే. నెత్తుటి వెన్నెలలో 1978-88 కల్లోల దశాబ్దకాలం. ఇది తెలంగాణాలో హింసా, ప్రతిహింసల కాలం” ఇంద్రవెల్లి దురంత నన్ను నిద్రపోనీవ్వదు/ గోండులు గుంపులుగా / నాకళ్ళముందు కదలాడతారు జనసముద్రం మాద/ తూటాలు పేల్చిన చెట్టు/ రక్క్మసిలాజడలు విచ్చుకునేఉంది/ తోసుకుని వచ్చే జనం వరద నా హృదయం /గోడలు ఎగరేసిన తిరుగుబాటు జెండాలు/ నాచేతులు/ నన్నిప్పుడే శక్తినిలెయ్యదు/ నేనప్పటి నగ్గల్బరీని” (నెత్తుటి వెన్నెల, దామెర రాములు,పుట-3) విప్లవోద్యమ నిర్మాణంలో భాగంగా ఏర్పాటుచేసిన ఇంద్రవెల్లి (ఆదిలాబాద్‌) సభకు వెళ్తున్న గిరిజనులపై 20 ఏప్రిల్‌ 1981 నాడు జరిగిన కాల్పుల్లో మరణించిన గిరిజన వీరుల స్మరణలో పై కవిత వెలువడింది. IV

విప్లవోద్యమ కవితా ఉదృతి తగ్గాక వస్తు దృక్పథాల స్థానాన్ని రూపం ఆక్రమించిందనే అభిప్రాయం ఒకటుంది అభ్యుదయ, విప్లవ కవిత్వంలో నినాదప్రయమైన కవిత్వం వచ్చిందనే ఉద్దేశంతో కావాలనే కొందరు కవులు రూపానికి

78

ప్రాధాన్యమిచ్చే కవిత్వం కాలంలో వచ్చి ఉంటుంది. కారణంగానే వైయక్తిక అనుభవాలు, అనుభూతులు ప్రాధాన్యతను సంతరించుకోవడం వల్ల 1980 తరువాత కవిత్వంలో అస్పష్టత చోటు చేసుకుందేమో. 1960లో కవిత అందంగా ఉండేట్టు, అందరికీ అందేట్టు చెపితే రెండు దశాబ్దాల కవిత్వంలో వచ్చిన మార్చు అందంగా ఉంటూ, అందకుండా చెప్పే ధోరణి ఎక్కువైందనే విషయాన్ని కవిత నిరూపిస్తుంది. (అదే పుట, సీతారాం, పుట-44) అభిప్రాయం 1980-90 మధ్యలో వచ్చిన కవిత్వానికంతటికి వర్తించేది కాదు. కాలంలో నందిని సిధారెడ్డి 'ూమిస్వప్నం'లో చాలా స్పష్టమైన కవిత్వం వెలువరించారు. రక్తస్పర్శకవులుగా పేరుగాంచిన అఫ్సర్‌, సీతారాం, ప్రసేన్‌ల కవిత్వంలో అస్పష్టత ఉందనే ప్రతీతి. ప్రసేన్‌ కవిత్వం ఇందుకు మినహాయింపు. ఇలాంటి అస్పష్టతే కవిత్వాన్ని చిక్కపర్పాలనీ కవులందరిలో కన్పిస్తుంది. దీపశిల (సిద్దార్థ) ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చును. Vv

1990 నుండి భారత రాజకీయాల్లో మార్చు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థికవ్యవస్థకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని భావించి గ్లోబలైజేషన్‌, (పైవేటైజేషన్‌, లిబరలైజేషన్‌ (ఎల్‌.పి.జి) ముసుగుతో అగ్రదేశాల సామ్రాజ్యవాదానికి అనుగుణంగా మన పాలకులు నిర్ణయాలు తీసుకొని గ్రామీణ వృత్తులను ధ్వంసం చేసారు. వ్యవసాయాన్ని నిరాధరించారు, చేయడానికి పని దొరకక ఉన్న ఊరును విడచి వివిధ ప్రాంతాల్లోకి ముఖ్యంగా పట్టణాల్లోకి వలస వెళ్ళారు. తద్వారా మానవ సంబంధాలు తెగిపోయి జీవితాలు సంక్షోభానికి గురైయ్యాయి. మనీమయ ప్రపంచం బుసలు కొట్టుతుంది. డబ్బున్నోడిదే సమాజం అన్నంత ధోరణి ప్రబలింది. ధోరణిని తెలంగాణా కవి నిరసిస్తూ కవిత్వం రాసాడు. “రూపాయికి పూర్తి మారకం / బ్యాంకు వడ్డీ తగ్గింపు / పశువులను వధశాలల కమ్మండి / తోళ్ళకు మంచి గిరాకీ వుంది / మాంసానికి మా మంచి ధర పలుకుతుంది / నాగళ్ళను ఎక్కడికక్కడికి నరికి పొయ్యిలో పెట్టి / ఏదో పరిశ్రమ స్థాపించుకోండి / ఇంట్లో కడుపుల గుద్ది / బజార్లో వీపు మీద చెయ్యేసి శభాష్‌ అంటుంది రాజ్యం / హిందూస్తాన్‌ లివర్‌ లిమిటెటోడు / స్రీలకు బట్టలుతికే పోటి నిర్వహిస్తాడు. మనం చొంగ కారుస్తూ గుడ్లప్పగించి చూస్తాం.

79

డంకెల్‌? ఐ.ఎం.ఫ్‌? అగ్రరాజ్యాలు???/ నీకంట్లో వేలు వేయి పెడతా/ నీవు నా నోట్లో చెయ్యి పెట్టుబాపతిగాళ్ళే” (ఇండియా (పైవేట్‌ లిమిటెడ్‌, జూకంటి జగన్నాథం, 2, 4)

పరిశ్రమల స్థాపన పేరుతో వ్యవసాయాన్ని దెబ్బతీయడం, ప్రచారాల పేరుతో సామాన్య గృహిణులను దోచుకోవడం, వారి శ్రమకు విలువ లేకపోవడం, వస్తు వ్యామోహ ప్రపంచానికి ద్వారాలు తెరవడం. మన దేశంలోని సమస్త రంగాలని అగ్ర రాజ్యాలకు తాకట్టుపెట్టడం టోటల్‌గా “ఇండియాను (ప్రైవేటు లిమిటెడ్‌”గా తయారు కావడాన్ని తెలంగాణ కవి నిరసిస్తున్నాడు. (తెలంగాణా వచన కవిత్వం, వ్యాసం, బిన్న అయిలయ్య, విమర్శిని. 12, పుట. 92)

నేడు సమాజంలో మానవ సంబంధాలు లుప్తమైనాయి. ఆర్థిక సంబంధాలు బలపడే క్రమంలో మానవసంబంధాలన్నీ వ్యాపారమయం కావడం సహజమే. మానవత్వాన్ని 'కరెన్సీ ఖడ్గం” చీల్చేస్తుంది. “సరళీకృత సంగ్రామ కాలమిది / పడగ విప్పిన నాణెం ముందు / ప్రపంచమే ఆడుతున్న రోజులివి / ఎవరి మనో మౌనలోయల్లో ప్రవేశించినా / మనీర్జామాల వాసనే !

అలల 0090920

సరళీకృత రూపాయినే కాదు / సబ్సిడీ రూపాయిని కూడా మార్చలేవు / ఇప్పుడు మనిషంటే / నిలువునా నడిచే రక్తమాంసాలు కాదు / పల్లానికి దొర్లుకుంటూ పోయే గుంద్రని / రూపాయి నాణెం మాత్రమే!”

(దూదిమేడ, నాళేశ్వరం శంకరం)

విధంగా సరళీకృత ఆర్థికవ్యవస్థ మాయను అంతర్జాతీయ మార్కెట్‌ విధానాన్ని తెలంగాణా కవి కవితలో పలికించడం కన్పిస్తుంది. డంకెల్‌ ప్రతిపాదన విన్న తెలంగాణా కవులు 'చేలలోకి పురుగు లోస్తున్నాయి, రైతులారా పారిపొండని” నినదిస్తున్నారు. “పురుగు మందులనే పెరుగుబువ్వగా' మార్చుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్న పత్తి రైతుల ఆర్తిని తెలంగాణా కవితలో పత్తి రైతుల ఆత్మహత్యలకు

80

చలించిన కవి ప్రతిధ్వనిస్తుంది. “తెలంగాణా మాగాణంలో పత్తి పువ్వు చచ్చిపోయింది” అంటున్నాడు. (పైదే, పుట. 939)

ఇంకా ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ వంశీకృష్ణ 'డబ్బుపిట్టు, 'సీతారాం 5/0 మాణిక్యం”, దర్భశయనం శ్రీనివాసచార్య, కందుకూరి శ్రీరాములు, అనిశెట్టి రజిత, అమ్మంగి వేణుగోపాల్‌ మొదలైనవాళ్ళు కవిత్వం రాసారు.

MV

తొంబయ్యో దశకంలో స్త్రీ, దళిత వాదాలు సాహితీరంగం మీదికి వచ్చాయి. తెలంగాణాలో ప్రీవాదం అంతగా పుంజుకున్నట్లు లేదు. మొదటి నుండి సామాజిక స్పృహతో కవిత్వం రాస్తున్న అనిశెట్టి రజిత గులాబీలు జ్వలిస్తున్నాయి. నేనొక నల్లమబ్బునవుతా, చెమట చెట్టు, లచ్చవ్వ, ఉసురు, అనగనగా ఒక కాలం, మార్కెట్‌ స్మార్ట్‌ శ్రీమతి కవితా సంపుటాలు వెలువరించారు. వీటిలో నేనొక నల్లమబ్బునవుతా సంపుటిలో ప్రీవాద కవిత్వముంది.

“అవిద్యకూ అజ్ఞానానికీ / అనామకతకూ అంధ విశ్వాసాలకూ / అణచివేతకూ బానిసత్వానికీ / బండ చాకిరీకీ గుండె బరువుకూ బలిజీవి స్త్రీ / రవ్వంత విశ్రాంతిలేని చేదుడు బావి / దుఃఖాల అఖాతాల దీవి / అడుగడుగునా ఎరలకు గురయ్యే అమాయకురాలు / అంతులేని జనసాంద్రతలో తోడులేని నిస్సహాయురాలు / వ్యవస్థలోని వక్రాలకు బలిజీవి/ శాంతి కోసం విశ్రాంతి కోసం / కొంచెం ప్రేమ కోసం / అనుక్షణం వేసారిపోయే తప్రజీవి / సృష్టిలో తానొక అభాగ్యజీవి / తన పతికి సఖి, అర్థాంగి / ప్రియురాలూ, జీవనజ్యోతి / ఇంటికి దీపం, గృహలక్ష్మి / అమృతరాగ, త్యాగమయి, ప్రాకృతికశక్తి / మధుర సౌందర్య సృష్టి / అయినా కాలరాస్తే నశించే పూవు / దులిపేస్తే దూరం పోయే పురుగు / కటిక కసాయి చీకటి లోకంలో/ పరాధీన నిత్యవంచిత బలిజీవి స్రీ!” (ప్రీ, నేనాక నల్లమబ్బునవుతా, అనిశెట్టి రజిత, పుట-59)

యుగాల తరబడి ప్రీ అన్ని రకాల అణచివేతలకు, దోపిడికి గురువుతూ ఆత్మగౌరవం కోల్పోయి పరాధీనతగా (బ్రతకడాన్ని ఈమె నిరసించింది. జ్వలిత 'అగ్నిలిపి, పరివ్యాప్తలో ప్రీవాద కవిత్వం కన్పిస్తుంది.

కొలిపాక శోభారాణి “చలనం” కవితా సంపుటి స్త్రీవాద కోణాన్ని ఆవిష్కరించిందే. తెలంగాణాలో కవిత్వం రాసే స్రీలు తక్కువే. అందులో స్త్రీవాద

81

దృక్పథంతో వ్రాసిన కవులు రజిత, కొలిపాక శోభారాణి మాత్రమే కన్పిస్తున్నారు. దృక్పథంతో కాకుండా సామాజిక స్పృహతో కవిత్వం రాసిన స్త్రీలు డా॥ పి.యశోదారెడ్డి (భావిక, ఉగాదికి ఉయ్యాల), నెల్లుట్ల రమాదేవి, కందాళ శోభారాణి, కిరణ్‌ సిస్టర్స్‌ మొదలైనవారు వచన కవిత్వం రాస్తున్నారు. VI

దళిత కవిత్వం తెలంగాణా ప్రాంతం నుంచి విస్తారంగానే వచ్చింది. అంబేద్మరిజాన్ని అన్వయిస్తూ వచ్చిన దళిత కవిత్వం సామాజిక దురన్యాయాలపై, అస్పృశ్యత, అసమానతలపై దండెత్తాయి. ఆత్మగౌరవంతో బతకాలనీ పిలుపునిచ్చింది. దళితులు ఇలా జీవించడానికి అగ్రవర్ధాలవాళ్ళు, పాలకులు వీలు కల్పించాలనీ కోరారు. జి.ఆర్‌.కూర్మే “పునాదిరాయి, ఆకుల గంగాధర్‌ “దళిత భారతి”, చిన్ని “ఒళ్ళు కడుకుందాం రండీ”, సుంకర రమేష్‌ 'తల్లికోడి హెచ్చరిక, బన్న అయిలయ్య “నిప్పుకణిక, మొదలైన సంపుటాలు దళిత కవిత్వాన్ని పరిపుష్టం చేశాయి. దళితమేనిఫెస్టో, దళిత కవిత, నిమాషి, మేమే మొదలైన సంపుటాలు వెలువడ్డాయి. ఇంకా మాష్టార్డీ, మట్టిపూలు దళిత కవిత్వాన్ని చిక్కపరచాయి.

మొదలు విశాలార్థంలో దళిత పదాన్ని వాడిన తరువాత అది కేవలం యస్‌.సి.లకే పరిమితమయింది. యస్‌.సి.ల్లో ఉపకులాల వాదం వచ్చాక దండోరా కవిత్వం వెలువడింది. కవిత్వం లక్ష్యం యస్‌.సి వర్గీకరణే. దండోరా, మాదిగకేక, కవితా సంపుటాలతోపాటు కడుపు మీద కొట్టకుండ్రి, దండోరా దరువు, గుండెడప్పు, మాదిగ పొద్దు మొదలైన కవితా సంపుటాలు దండోరా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచాయి.

జూపాక సుభద్ర, గుండెడప్పు కనకయ్య, పసునూరి రవీందర్‌, వేముల ఎల్లయ్య, మాస్మార్ట్‌, జాజుల గౌరీ మొదలైన వాళ్ళు దండోరా కవిత్వం రాసారు.

VII

దళిత బహుజన కవిత్వం రెండు సంపుటాలు వెలువడ్డాయి. బహువచనం, మేమే, సమాజంలో శ్రామిక ఉత్పత్తి కులాలు దోపిడికి గురవుతున్నాయి. దోపిడిని ఎదుర్కోవడానికి బహుజనులంతా ఏకం కావాలనీ కవితా సంకలనం

పిలుపునిస్తున్నాయి.

82

తెలంగాణా వచన కవిత్వంలో ముస్లీం మైనార్డీ కవిత్వం కూడా వెలువడింది. దేశంలో పుట్టి ఇక్కదే పరాయి వాళ్ళుగా చూడబడడం అన్యాయం, అమానవీయం. దుస్థితి నుంచి తమ ఉనికిని కాపాడుకోవడానికి కవిత్వం ప్రయత్నిస్తుంది. అట్లాగే తమ మతంలోని సంప్రదాయాలు, కట్టుబాట్లు వ్యక్తి స్వేచ్చకు భంగం కలగకుండా ఉండాలనీ కవులు కోరుకుంటారు. అఫ్సర్‌, అన్వర్‌, స్కైబాబ, షాజాహానా, యాకూబ్‌ ముస్లీం మైనార్టీ కవిత్వాన్ని రాసారు. అఫ్సర్‌ ఊరిచివరి దుఃఖం”. ఇవ్వాళ కవితా సంపుటాల్లో కొంత తరహా కవిత్వం ఉంది. ఇక్సాల్‌ చంద్‌ 'ఆరోవర్ణం”, ఖాజాపత్వా, యాకూబ్‌ 'సరిహద్దు రేఖ, షాజహానా 'నఖాబు” మొదలైన కవితా సంపుటాల్లో మైనారిటి దృక్పథం బలంగా ఉంది.

గుజరాత్‌లో ముస్లింలపై జరిగిన దాడిని నిరసిస్తూ అజాం (గుజరాత్‌ - ముస్లిం కవిత్వం), అన్వర్‌, స్కైబాబ సంపాదకత్వంలో కవితా సంకలనం వెలువడింది.

గాలికట్టు, ముంపు కవితా సంపుటాలు ప్రపంచీకరణలో గిరిజన జీవితాలు ఎట్లా శిథిలం అవుతున్నాయో పి. విద్యాసాగర్‌ చిత్రించాడు.

తెలంగాణా ప్రాంతంలోని చేతివృత్తులు, చేపలుపట్టేవాళ్ళపై కూడా కవిత్వం రావడం ముదావహం. వారి వృత్తికి సంబంధించి “ఎని, వర్జీ లాంటి కవితలు వచ్చాయి. అట్లాగే జి.హరగోపాల్‌ గౌడవృత్తికి సంబంధించిన కవిత్వం రాశాడు. ఇంకా ఇట్లాంటి కవిత్వం రావల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకే విశ్వం-ఒకే స్వప్నం ఒలంపిక్‌ కవిత్వం, సదాసద్దాం, దిక్కారస్వరం మొదలైన కవితా సంకలనాలు అంతర్జాతీయ కవితా - వస్తువును తీసుకొని వచ్చిన కవితా సంకలనాలు.

IX

తెలంగాణా మలివిడత ఉద్యమం 2000 నుండి ప్రారంభమయింది. ఆం(ధ వలస పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా వివక్షకు గురైందని సోదాహరణంగా లెక్కలు చూపి ప్రత్యేక రాష్ట్రం కోసం మహోద్యమాలు నడుస్తున్నాయి. సకల జనుల సమ్మె, తెలంగాణ ఉద్యమచరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన ఘట్టం. వి. ఆర్‌. శర్మ తెలంగాణ), “డిసెంబర్‌ 9, “పరమాత్మ, పొట్లపల్లి శ్రీనివాసరావు 'తెలంగాణ- బెబ్బులి, నందిని సిధారెడ్డి “ప్రాణహిత, వరికొండ కాంతారావు “ప్రణవం”, వెలపాటి రామరెడ్డి 'కోటిగాయాల మౌనం తెలంగానం), గొడిశాల సదానందం “చిలుకల గట్టు, సాంబయ్యపిట్ట “ఉద్యమం దిద్దిన అక్షరం), జూలూరు గౌరీశంకర్‌ నా తెలంగాణ

83

మొదలైన కవితా సంపుటాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చిత్రించారు. పొక్కిలి, మత్తడి, ఉరుములు-మెరుపులు, సుక్కపొడుపు, ఊపిరి, వల్లుబండ లాంటి కవితా సంకలనాలు మలివిడతా తెలంగాణా ఉద్యమ స్వరూపాన్ని చిత్రించినవి. తెలంగాణ భాషను, యాసను సంస్కృతిని పరిరక్షించుకుంటూ ఆత్మగౌరవంతో జీవించాలనే తపనతో కవులున్నారు. ఇందుకు పరిష్కారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటేనని కవులు ముక్త కంఠంతో నినదిస్తున్నారు.

1973లోనే “గుడిసెగుండె, గాయపడ్డ ఉదయం తెలంగాణ మాండలికంలో వచ్చిన మొట్టమొదటి కవితా సంపుటాలు. అన్నవరం దేవెందర్‌ “మంకమ్మతోట - లేబర్‌అడ్డా, కవితా సంపుటి ద్వారా తెలంగాణా భాషలో కవిత్వం రాసి సాఫల్యం చెందారు. ఇదే మార్గంలో నేడు అనేకమంది కవులు తెలంగాణ భాషలో కవిత్వం రాస్తున్నారు.

జూకంటి జగన్నాథం 'పాతాళగరిగే, గంగడోలు, వాస్కోడిగామా డాట్‌కామ్‌, బొడ్డుతాడు, ఇండియా (ప్రయివేట్‌ లిమిటెడ్‌, ఒకరోజు పదిగాయాలు, పిడికెడు కలలు, దోసెడు కన్నీళ్ళు, తల్లి కొంగు, రాజపత్రం కవితా సంపుటాల్లో తెలంగాణ ఆత్మఘోషను వినిపించారు.

నందిని సిధారెడ్డి 'భూమిస్వప్పంి, సంభాషణ, (ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టు వడి రచనల్లో తెలంగాణ జీవితం ప్రతిబింబిస్తుంది.

శ్రీరాములు కందుకూరి “వయోలిన్‌ రాగమో వసంత మేఘమో, కవ్వం, సందర్భం, దహనకావ్యం, పీఠభూమి, వెన్నెల బలపం మొదలైనవి తెలంగాణను వివిధ కోణాల నుంచి చూపించాయి.

జూలూరు గౌరీశంకర్‌ “దళితవాదం, దళిత బహుజనవాదం, తెలంగాణావాదాన్ని బి.సి కవుల కవిత్వాన్ని బలంగా వినిపించిన కవి. ఆయన కవితా సంపుటాలు; ఏలియస్‌, పాదముద్ర, పొలికట్టె, మాలకాకి, తెలంగాణ, సిలబస్‌లో లేని పాఠం, మూడవ గుణపాఠం, కాటు, ముండ్లక(ర్ర, నాలుగోకన్ను, పొంతకుండ, జీతకమరాండేలాంగ్‌, సెగ.

సుంకర రమేష్‌ సంపాదకత్వంలో తెలంగాణ కవిత 2006, 2007, 2008, 2009 సంకలనాలు వెలువడి ఉద్యమ రూపాన్ని చిత్రించాయి.

84

“వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది

వేరై కూడ తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికి తెలంగాణ వేరై నిలచి భారతానవెలయు ముమ్మాటికి వీర తెలంగాణము వైనంతో భారత పౌరుని ధీ ధైర్యంతో (ప్రజావాణి నా గొడవ మిన్న “ప్రజా ప్రకటన చేస్తున్నది. వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది

వేరై కూడ తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికి తెలంగాణ వేరై నిలిచి భారతాన వెలయు ముమ్మాటికి”

(వీర తెలంగాణ నాది, కాళోజీ, పొక్కిలి, పుట-107) X

తెలంగాణా వచన కవితను స్థూలంగా పరిశీలిస్తే తెలంగాణేతర ప్రాంతాల్లోనే కాదు, మొత్తం భారతదేశంలోనే ఇంకా సాహసించి మాట్లాడితే ప్రపంచ భాషల్లోనే ఇలాంటి వైవిధ్యపూరితమైన కవిత్వం వచ్చినట్లు లేదు. ఒక్క గ్లోబలైజేషన్‌, తెలంగాణా ఉద్యమంలో వచ్చినంత సాహిత్యం / కవిత్వం ప్రపంచ ఉద్యమాల్లో ఎప్పుడూ రాలేదని మేధావి వర్గం తెలుపుతుంది. దీన్నిబట్టి తెలంగాణా ఎప్పుడూ చైతన్యవంతమైన పాత్రనే సాహిత్యం ప్రపంచంలో పోషించిందని చెప్పాలి.

ఇప్పటి వరకు మనం చూసిన వచన కవిత్వం సంపూర్ణం కాదు, సమగ్రమే. మరింత ఓపికతతో, అవసరమైన సమయం కేటాయిస్తే మరింత సమాచారం దొరుకుతుంది. తెలంగాణపై (ప్రేమతో, సాహిత్యంపై స్పర్ధతోనే తలస్పర్శగా కృషి చేసాను. చేయాల్సినది ఎంతో ఉందని మనవి చేస్తున్నాను.

85

తెలంగాణలో తెలుగు కథా సాహిత్య వికాసం - డా॥ కాలువ మల్లయ్య

తెలంగాణ సాహిత్యం గురించి మాట్లాడుకోవాలన్నా కథ గురించి మాట్లాడుకోవాలన్నా ముందు తెలుగుభాష గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణ భాష గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణ భాషకున్న వర్గ స్వభావం గురించి, కుల స్వభావం గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణ భాషది అట్టడుగువర్గ. స్వభావం. తెలంగాణలో మన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోలా వాడుకభాష ఉన్నతవర్గాలది కాదు. కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కమ్మ, బ్రాహ్మణ, రెడ్డి లాంటి ఉన్నతవర్గాల భాషకు, దళిత బహుజనుల వాడుక భాషకున్న తేడాలు తెలంగాణలో అంతగా కనబడవు. తెలంగాణలో దొరలు, దళిత బహుజనులు మాట్లాడే మాండలికంలో, యాసలో అంతగా తేడాలుండవు. ఒక్క (బ్రాహ్మణుల భాషలో తప్ప మిగతా అన్ని కులాల భాషల్లోని యాస దాదాపు ఒకేతీరుగా ఉంటుంది. క్రియాపదాల వాడుక వచ్చిండు, పోయిండని పొట్టిపదాల వాడుకలో తేడాలు లేవు. అయితే తిట్లు, దీవెనలు లాంటి కొన్ని పదాలు ఉన్నతవర్గాలవారికి, దళిత బహుజనవర్గాల వారికి తేడా ఉంటుంది. అంటే తెలంగాణ భాష డీక్లాసిఫపై అయి భాషకు సృష్టికర్తలైన దళిత బహుజనుల, పల్లీయుల భాషను స్వీకరించిందనడంలో సందేహం లేదు. అందుకే అచ్చ తెలుగులో, దేశి ఛందస్సులో మొట్టమొదటి రచన రావడం కాని (పాల్కురికి సోమన), పోతన భాగవతంలో భక్తి పారవశ్యంతో కూర్చిన తెలుగుదనం ఉట్టిపడటం కాని, ప్రపంచ కథలకే పుట్టినిల్లయిన బృహత్మథ రావడం కాని, జానపద బాణీలను, పల్లీయుల భాషను హృదయానికి హత్తుకొని జ్ఞానపీఠ్‌ అవార్డు ఎత్తుల నెరిగించిన మానవీయ రచనలు చేసిన సినారె లాంటి వాళ్లిక్కడి నుంచి రావడం కాని, ప్రజల భాషయిన మాండలికమే ప్రాణభూతంగా అనేక ఆధునిక రచనలు రావడంగాని తెలంగాణ నుంచే జరుగుతుంది. అందుకే తెలంగాణ భాషకు అట్టడుగు జీవన సౌరభముందనడంలో సందేహం లేదు. పరంపరే ఆధునిక సాహిత్య ప్రక్రియయెన కథానికలోనూ కొనసాగుతుంది. తెలుగు పేరు మీద సంస్కృతాన్ని తీసుకొని ప్రకృష్ణమైన బంధం పేరు మీద ప్రజలకు అర్థం కాని భాషలో, శిల్పంలో రచనలు చేయడం తెలంగాణలో అంతగా కనిపించదు.

86

తెలుగుకు 'ఆణెంి తెలంగాణం అని, తెలుగు మాగాణం. తెలంగాణం అని చెప్పడంలో సందేహం అక్షక్లేదు. ఎందుకంటే తెలుగు భాష పుట్టిందిక్కడే. మొట్టమొదటి తెలుగు రాజులైన శాతవాహనులు తెలంగాణలోని కోటిలింగాల, కొండాపురం రాజధానులుగా సువిశాల తెలుగు సామ్రాజ్యాన్ని ఏలారని చరిత్ర చెబుతుంది. శాతవాహన రాజుల్లో ప్రసిద్ధుడైన హాలుడు చక్రవర్తి మాత్రమే కాక సాహిత్యకారుడు కూడా. ఆతనికాలం వాడైన గుణాధ్యుడు బృహత్మథ కథలను రాసాడు. వీటిని హాలుడు వివిధ రచయితలతో రాయించి సంకలనం చేయించాడని మరో ఐతిహ్యముంది. కాలంలో రాసిన బృహతృథే భారతీయ కథాసాహిత్యానికి మాత్రమే కాదు ప్రపంచ కథా సాహిత్యానికే మూలాధారం. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి కథ బృహత్మథ రూపంలో తెలంగాణ నుంచి వచ్చిందన్నది సత్యం. శాతవాహన రాజుల కాలంలో ఉపయోగింపబడిన ప్రజల భాష ప్రాకృతం నేటి తెలుగుకు సమానమైనదని భాషా పరిశోధకుల పరిశోధనల్లో తేలింది. తెలంగాణలోని ఓరుగల్లును రాజధానిగా చేసుకొని తెలుగునేలను పాలించిన కాకతీయులు తెలుగుభాషా సాహిత్యాలకు చేసిన సేవలు అనన్య సామాన్యం. రాజుల కాలంలోనే నెల్లూరు ప్రాంతాన్నేలుతున్న మనుమసిద్ధి ఆస్థానకవియైన తిక్కన మహాభారతాన్ని తెలుగువారి భారతం అనిపించేలా తెలుగీకరించాడు. తిక్కన భారతాన్ని ఓరుగల్లులో ఆవిష్మరించాడంటారు. మనుమసిద్ధికి యాదవ రాజుల నుండి రాజ్యం ఇప్పించడంలో తిక్కన, కాకతీయ గణపతిదేవుని ప్రమేయముంది. కాకతీయ రాజుల కాలంలో తెలుగు రాజభాషగా, పుస్తక భాషగా మూడు పూవులారు కాయలన్నట్టుగా విలసిల్లింది. నల్గొండ కేంద్రంగా తెలుగు నేలనేలిన విష్ణుకుంటన రాజల కాలంలోనూ తెలుగు సాహిత్యం బాగానే వర్ధిల్లింది. నాలుగు వందలేండ్లకు పైగా హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన ముస్లిం రాజుల పాలనలో తెలుగు అధికార భాష కాకున్నా తెలుగు చదువుకునే అవకాశాలుండేవి. ఆధునిక సాహిత్య ప్రక్రియలైన వచనకవిత, వ్యాసం, కథ, నవల లాంటివన్నీ తెలుగు సాహిత్యంలోకి గాని, భారతీయ సాహిత్యంలోకిగాని ఆంగ్ల భాషా సాహిత్య పరిచయంతోనే వచ్చాయి. ప్రక్రియలు తెలుగు సాహిత్యంలోకి (ప్రవేశించిన పందొమ్మిదవ శతాబ్ది, ఇరవయవ శతాబ్దీ (ప్రారంభకాలంలో తెలుగు సమాజంలోని కోస్తా రాయలసీమ ప్రాంతాలు ఇంగ్రీషువారి పాలనలో ఉంటే, తెలంగాణ నైజాం పాలనలో ఉంది. కాలంలో తెలంగాణ గ్రామాల్లోకి 'అక్‌బర్‌' (వార్తాపత్రిక) రావడం

87

కూడా కష్టంగా ఉండేది. తెలంగాణ నుంచి తెలుగు పత్రికలు రావడం కత్తిమీద సాము లాంటిదే. అలాంటి సామాజిక పరిస్థితుల్లో తెలంగాణలో ఆవిర్భవించిన తెలుగు కథ ఆవిర్భావ వికాసాల గురించి తెలుసుకుందాం.

ప్రపంచ కథకు మూలాలు తెలంగాణ నేల నుంచి వచ్చిన బృహత్మథ (కథా సరిత్సాగరం)లో ఉన్నా కథ, కథానిక (ప్రసక్తి అగ్నిపురాణంలో ఉన్నా ముద్రణాయంత్రం వచ్చిం తర్వాత, ఆధునిక పత్రికారచన వచ్చిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి ఎదిగిన తర్వాత, పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావం మొదలైన తర్వాత పాశ్చాత్య దేశాల నుంచి ఆంగ్ల భాషలో మధ్య తరగతి చదువరుల కోసం ఏర్పడిన ఆధునిక సాహిత్య ప్రక్రియ కథ, కథానిక. ఇవి రెండూ సమానార్థకాలుగానే పిలువబడు తున్నాయి. తాతాచార్ల కథలు, చార్‌దర్వీష్‌ కథలు, తెనాలి రామలింగని కథలు, భేతాళ కథలు, అలాజద్దీన్‌ అద్భుతదీపం లాంటి కథలు తెలుగులో 18, 19వ శతాబ్దంలోనే వచ్చినా అవన్నీ ఆధునిక కథలు కావు. లిఖిత సాంప్రదాయానికి చెందిన కథానికలు కాదు అవన్నీ ఆశు సాంప్రదాయా కథలు... అనగనగా ఒక రాజు ఉండేవాడు అని చెప్పబడే నోటి కథల్లాంటివి. ఇలాంటి కథలకయినా, ఎలాంటి కథలకయినా తెలంగాణ లోగిళ్ళు కేంద్రాలు. తల్లులు పిల్లలకు చెప్పే కథలు, తాతలు మనుమలకు చెప్పే కథలు, పెద్దలు పిన్నలకు చెప్పే కథలు, బావా బావమరుదులు చెప్పుకునే కథలు, అద్భుత కథలెన్నో తెలంగాణ గ్రామాల్లో ప్రతి లోగిలిలోనూ వినబడుతుంటాయి. తెలంగాణలోని ప్రతివాకిలి కథలలోగిలి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే కథ మానవ జీవితానికి ఎంతో సన్నిహితమైనది. చేరువైనది. అది మనిషిని లాలిస్తుంది. తల్లిలా, తండ్రిలా, ఇల్లాలిలా ఓదారుస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. మనిషిని ఆదరిస్తుంది. సందేశాన్నిస్తుంది. కష్టాల్లో అండగా నిలుస్తుంది. మనిషి తప్పులను సరిచేస్తుంది. సరైన పథనిర్దేశనం చేస్తుంది. కథ మనల్ని ఏడిపిస్తుంది. నవ్విస్తుంది. ఆలోచింపజేస్తుంది. కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. అందుకే కథ మానవజీవితం నుంచి విడదీయలేనిది. నోటికథ నుంచి తీసుకొని ఆధునిక లిఖిత కథ వరకు తెలంగాణ నేల పెద్దపీటే వేస్తుంది. తెలుగు కథకే మార్గనిర్దేశనం చేస్తుంది. తెలుగు జీవితానికి అద్దం పడుతుంది. ప్రజల భాషను, ప్రాంతీయతను హృదయానికి హత్తుకుంటుంది. తెలంగాణ ప్రాంత విశిష్టతను, భాషా సొగసులను, నుడికారాన్ని స్వంతం చేసుకొని కొత్త పోకడలు సోతుంది. ఆశు కథా సాంప్రదాయాన్ని

88

స్వంతం చేసుకొని లిఖిత కథా సొగసులతో, తెలంగాణ జనజీవన సంఘర్షణతో మునుముందుకు పోతుంది. ఆధునిక కథకు లక్షణాలుగా ఏకాంశవ్య(గ్రత, స్వయంసమగగ్రత, క్లుప్తతలను నిర్వచించారు లాక్షణికులు. కథంటే క్లుప్తంగా ఉండటం, దానికదే సమగ్రమైన కావ్యమనిపించేలా ఉండటం, కథ చదివితే ఇంకేం చెప్పేది లేదనిపించేదిగా ఉండటం, ఒకే అంశం చుట్టూ తిరగడం. లక్షణాలన్నిటినీ పుణికిపుచ్చుకొని కథలు వచ్చినా నియమాలకు లొంగని ఎన్నో కథలు వచ్చాయి. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కథల్లో చిన్న కథ ద్వారా కొన్ని సంవత్సరాల జీవితాన్ని పరిణామాలను చిత్రించే కథలెన్నో వచ్చాయి. తాత్విక పరిమళంతో నిండుకున్న కథలూ వచ్చాయి. కథా సరిత్సాగరం వారసత్వంతో మొదలయిన తెలంగాణ కథ కథంటే సమగ్రజీవన చిత్రణగా నూతన పోకడలు పోతూ తెలంగాణ సాంఘిక చరిత్రను రాయగలిగేంత విషయాన్ని నిక్షిప్తం చేసింది. తెలంగాణలో ఆధునిక కథ మొదలయిన ఇరవయవ శతాబ్ది మొదటి దశాబ్ది నుండి వంద పదేళ్ళ కాలంలో వచ్చిన కథలను పరిశీలిస్తే తెలంగాణ సాంఘిక చరిత్రను కథల ఆధారంగా రాయవచ్చు.

తెలంగాణలో ఆధునిక కథ ఎప్పుడు మొదలయిందన్న విషయాన్ని పరిశీలిస్తే తెలుగులో మొదటి కథ తెలంగాణలోనే ప్రారంభమైందన్న విషయం అర్థమవుతుంది. ఆంగ్లభాషా సాహిత్యాల పరిచయంతో తెలుగులోకి ఆధునిక కథ ప్రవేశించినా అది భాషా సాహిత్యాలతో కోస్తా ప్రాంతానికున్నంత పరిచయం లేని తెలంగాణ నుంచి రావడం విశేషం. అంతే కాకుండా తెలుగులో కథ వస్తున్న చారిత్రకకాలంలో తెలంగాణలో తెలుగు చదువుకునే అవకాశాలు కూడా చాలా తక్షువే. పోతే కథానిక మధ్యతరగతి చదువరుల కోసం, మధ్యతరగతి ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి వచ్చే అవకాశముందని విమర్శకుల అభిప్రాయం. అభిప్రాయం ప్రకారం తెలుగు కథ మధ్యతరగతి ఆవిర్భవించిన కోస్తాప్రాంతం నుంచి, ఆంగ్లేయ విద్యా ప్రభావం ఎక్కువగానున్న కోస్తా ప్రాంతం నుంచి రావల్సింది. కాని అలా జరుగలేదు. మొదటి తెలుగు కథ ఆంగ్రేయ విద్య, పాలన ప్రభావం అంతగాలేని, మధ్యతరగతి అసలేలేని సమయంలో తెలంగాణ నుంచి రావడం విశేషం. తెలంగాణలోనూ, తెలుగు సాహిత్యంలోనూ మొదటి కథ 1901-1902 ప్రాంతంలో భండారు అచ్చమాంబచే రాయబడిన స్రీవిద్యయే. భండారు అచ్చమాంబ తెలంగాణ వైతాళికుల్లో ఒకరయిన

89

కొమర్రాజు లక్ష్మణరావు చెల్లెలు. ఆమె పుట్టింది నల్లగొండ జిల్లాలో, పెరిగింది, కథలు రాసింది, జీవితం కొనసాగించింది తెలంగాణలోనే. ఈమె సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులుగారికి సమవయస్స్మురాలు. వీరేశలింగం సంఘ సంస్మరణ ఉద్యమంతో ప్రభావితురాలైన ఈమె సంస్మరణ నేపథ్యంతోనే కథలు రాసింది. కాలంలో తెలంగాణలో ముఖ్యంగా, కోస్తా ప్రాంతంలోనైనా స్ర్తీకి విద్య నేర్పడం సాహసంతో కూడుకున్న పని. ఎంత సంపన్నులయినా స్ర్తీని ఇంటికే పరిమితం చేసేవారు కాని బడికి తోలేవారు కాదు. స్రీవిద్య యొక్క ఆవశ్యకతను తెలుపుతూ రాయబడిన కథ తెలుగు కథల్లో మొట్టమొదటి కథ అనడంలో సందేహం లేదు. ఆధునిక కథ కుండాల్సిన లక్షణాలన్నీ సంతరించుకున్న కథను మొదటి కథగా అంగీకరించడానికి అభ్యంతరాలూ ఉండాల్సిన పనిలేదు. ఎప్పుడో ఎవరో నిర్ణయించిన కథానిక లక్షణాలను నూటికి నూరు పాళ్ళు అనుసరించిన కథకులెవరూ లేరు. విషయ సేకరణలోనూ, కథ చెప్పడంలోనూ ఆధునికతను సంతరించుకొని, సరళమైన భాషలో రాయబడిన కథ ఖచ్చితంగా మొదటి కథే. సమకాలీన సామాజిక ప్రయోజనమున్న వస్తువును తీసుకొని ప్రీ విద్య యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతూ రాయబడిన కథే మొదటి కథ. కాలంలో కలం పట్టిన రచయితలు, కవులపై అప్పుడు తెలుగు సమాజంలో జరుగుతున్న సంస్మరణ ఉద్యమాల ప్రభావమున్నట్టే భండారు అచ్చమాంబపై కూడా సంస్మరణోద్యమాల ప్రభావముంది. స్ర్రీవిద్యతో పాటు మరో 12 కథలు రాసింది అచ్చమాంబ. దంపతుల ప్రథమ కలహం, సత్పాతృ దానం లాంటి నీతి బోధక కథలను రాసిందీరచయిత్రి. ఈమె రాసిన ప్రసిద్ధ కథ “ధనత్రయోదశి. ఇందులో బొంబాయికి వలస వెళ్లినవారి విషయం, మానసిక సంఘర్షణ, ధనం కంటె గుణం మిన్న అన్న సందేశం ఉంది. కాలంలోనే బొంబాయి వలసల గురించి ప్రస్తావించిన అచ్చమాంబ అసలుసిసలైన తెలంగాణ బిడ్డ. నీతి, నిజాయితీ, నైతికత ఎప్పటికైనా మేలు చేస్తాయన్న సందేశాన్ని కథ ద్వారా ఇచ్చిన అచ్చమాంబ సంఘ సంస్కరణకు, సాంస్కృతిక పునర్వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహిళామణి. ఇలా తెలంగాణ నుంచే కాకుండా, తెలుగు నుంచే మొట్టమొదటి కథ నందించిన ఘనత మహిళా మణికి, తెలంగాణ నేలకు దక్కుతుంది. స్రీలకు చదువుకునే అవకాశాలు, బయటకు వెళ్ళే అవకాశాలు కూడా అంతగా లేని సమయంలో చదువుకోవడమే కాకుండా తెలుగు సాహిత్యానికి మొదటి

90

కథానిక నందించిన ఘనత భండారు అచ్చమాంబకే దక్కుతుంది. ఇలా ఆమె ప్రతికూల పరిస్థితుల్లో చదువుకొని రచయిత్రిగా, సామాజిక కావ్యకర్తగా జీవితాన్ని గెలుచుకున్న మహిళామణి. 1901-1902 ప్రాంతంలోనే తెలంగాణలో కథ ప్రారంభమైనా 1912లో మాడపాటి హనుమంతరావు కథలు రాసేంతవరకు తెలంగాణ నుంచి ఆధునిక కథ రాకపోవడం గమనించదగిన విషయం.

ఇలా సంస్మరణ నేపథ్యంతో స్రీవిద్య ఆవశ్యకతను నొక్కి చెబుతూ ప్రారంభమైన తెలంగాణ తెలుగుకథ జ్వాజ్వల్యమానంగా వెలుగుతుంది. ఆశు సాంప్రదాయం నుండి ఆశు సాంప్రదాయ లిఖిత కథకు అనేక పోకడలు పోతుంది. అయితే భండారు అచ్చమాంబ తర్వాత కొంత ఖాళీ ఏర్పడినా, మాడపాటి తర్వాత కథలు ఎక్కువగా రాకున్నా అన్ని కాలాల్లోనూ తెలంగాణతనాన్ని ప్రతిబింబించే గొప్ప కథాసాహిత్యం వచ్చింది. నేల విడిచి సాము చేయని కథాసాహిత్యం వచ్చింది. డిటెక్టివ్‌ సాహిత్యం, ఆరడుగుల ఎత్తున్న కథానాయకుల ప్రేమ సాహిత్యం, భూతప్రేత నవలా సాహిత్యం, సినీ నవలా సాహిత్యం వస్తున్న సమయంలోనూ తెలంగాణ నుంచి జనజీవన సంఘర్షణ సాహిత్యమే వచ్చింది. తెలుగు సాహిత్యాన్ని కథా సాహిత్యాన్ని వ్యాపారమయమై పోకుండా తెలంగాణ కథ కాపాడింది. అన్ని ఉద్యమాలను, మార్చులను, రాజకీయాలను తనలో సంలీనం చేసుకొని తెలంగాణ రచయితలు అద్భుతమైన కథా సృజనం చేసారు. అస్తిత్వవాద, దళితవాద, దండోరా, బహుజనవాద, మైనారిటీ, ప్రాంతీయ, విప్లవవాద ఉద్యమాలనువేటి నీ వదిలిపెట్టకుండా తెలంగాణ కథ సమకాలీన ఉద్యమాలకు భాష్యాలను పలికింది. ప్రపంచాన్ని కుదిపివేసిన, కుదిపివేస్తున్న పారిశ్రామికవిప్లవ, మార్చిస్టు విప్లవ, ప్రపంచీకరణ పరిణామాలకు అద్దం పడుతూ, విశ్లేషిస్తూ, పరిష్కారాలను చూపుతూ తెలంగాణ కథకులు కథలు రాసారు. రాస్తున్నారు. చారిత్రక దృష్టితో విభజన చేసినపుడు తెలంగాణ కథాకాలాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు. తెలంగాణలో కథ ప్రారంభమైన 1902 నుంచి హైదరాబాద్‌ దక్కన్‌ ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన 1956 వరకు ప్రారంభ కాలంగా, కాలంలో కలం పట్టిన రచయితలను మొదటితరం రచయితలుగా పేర్కొనవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన 1956 నుంచి తెలంగాణలో విప్లవోద్యమాలు వేళ్ళూనుకొని నీ బాంచెన్‌ కాల్మొక్తా అన్న వాళ్ళే తిరుగుబాటు చేసే దశకు చేరుకున్న దశ 1975 వరకున్న కాలాన్ని తెలంగాణ కథావికాస దశగా, కాలంలో కలం పట్టిన

91

రచయితలను రెండవతరం రచయితలుగా పేర్కొనవచ్చు. 1975 నుండి 1995, వరకు తెలంగాణ కథకు ఉజ్వల దశగా, కాలంలో కలం పట్టిన రచయితలను మూడవతరం రచయితలుగా చెప్పవచ్చు. 1995 తర్వాత కలంపట్టి రాసిన రచయితలను తరం కథా రచయితలుగా, కాలంలో వచ్చిన కథలను ప్రపంచీకరణ యుగకథలుగా పేర్కొనవచ్చు. అంటే ఆయా కాలాల్లో కలం పట్టిన ప్రసిద్దులైన రచయితలు కాలానికే పరిమితమైండ్రని కాదు. కొందరు అక్కడికే ఆగిపోతే మరికొందరు కాలంతో నడిచి తర్వాతి కాలాల్లోనూ తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. విభజననుసరించి తెలంగాణ కథా సాహిత్యంలో వచ్చిన వివిధ పరిణామాలను, తెలంగాణ కథా దీపధారులను, సమాజంపై ప్రభావం చూపిన ప్రసిద్ధ కథలను పరిశీలిద్దాం. నాలుగు కాలాల మధ్య స్పష్టమైన తేడా ఉంది. తేడాలను గమనించి రచయితలు సమకాలీన, రాజకీయార్థిక, సామాజిక విషయాలను తమ కథల్లో నిక్షిప్తం చేసారు. తొలితరంలో కలంపట్టిన రచయితలు హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉన్నవారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడకముందే కలం పట్టినవారు. నైజాం పాలనను చవి చూసినవారు. మలితరంలో కలం పట్టినవారు ఆంధ్రప్రదేశ్‌ అవతరణను చూసినవారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్థితిని చూసినవారు. మూడవతరంలో కలం పట్టినవారు స్వాతంత్ర్యానంతరం పుట్టినవారు. ఉమ్మడి రాష్ట్రంలో పెరిగినవారు. 1968-69 తెలంగాణ పోరాటం, 1970ల విప్లవ పోరాటాలు చూసినవారు. పోరాటాల్లో, పోరాట ప్రాంతంలో జీవిస్తున్న వాళ్ళు. నాలుగవతరంలో కలం పట్టినవాళ్ళు ప్రపంచీకరణ ప్రభావంతో పెరిగి పెద్దయిన వారు. అన్ని తేడాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ కథకులు చారిత్రక దృష్టితో కథలు రాసారు. స్థలకాలాల చైతన్యంతో కథలు రాసారు. అన్ని సామాజిక, సాంఘిక, భాష్య రాజకీయ, ఆర్థిక పరిణామాలకు స్పందించి కథలు రాసారు.

తొలితరం (ప్రారంభదశ) కథకులు, కథలు (1902-1956)

కాలంలో కలంపట్టిన తెలంగాణ రచయితలు నిజాం రాష్ట్రంలో పుట్టిపెరిగినవారు. నిజాం పాలనను చవిచూసినవాళ్ళు. విశాలాంధ్ర వాసన లేనివారు. వాడుక భాషగా ఇదే వాడాలన్న నియమం తెలియనివారు. అప్పుడు తెలంగాణలో చదువకునే అవకాశాలు, అందులో తెలుగు చదువుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నా తెలుగు చదువుకొని జీవితానుభవాలతో కలం పట్టినవారు. రచయితలు

92

చాలామందికి జీవితం, రచనలు వేరు కావు. తాము నమ్మిన సిద్ధాంతాలను సమర్ధిస్తూ రాసారు. ఉద్యమాలతో నడుస్తూ రాసారు. తాము మాట్లాడుకునే భాషలో రాసారు. తరంలో కలం పట్టినవారు, చదువుకున్నవారు చాలామంది ఉన్నత కులాల నుంచి, బ్రాహ్మణీయ కులాల నుంచి వచ్చినవారే అయినా అట్టడుగు జీవితాలనే వస్తువుగా తీసుకున్నారు. అట్టడుగు ప్రజల పాత్రోచిత మాండలిక భాషనే కథారచనకు ఉపయోగించారు. కాలంలో రాయబడిన అన్ని కథలు లభ్యం కాకున్నా దాదాపు వెయ్యి వరకు మంచి కథలు వచ్చాయని పరిశోధకుల అంచనా. 1902లో భండారు. అచ్చమాంబతో ప్రారంభమైన తెలంగాణ కథా (ప్రస్థానం మొదటితరంలో వెయ్యి కథలుగా విస్తరిల్లింది. కాలంలో కలంపట్టిన రచయితల్లో చాలామంది నిర్మాహమాటంగా, నిర్భయంగా తెలంగాణ మాండలికం వాడి మాండలిక భాష వాడకానికి మొదటి తరంలోనే పునాదులు వేసారు. స్పష్టమైన ప్రాపంచిక దృక్పథంతో, కమిట్‌మెంట్‌తో, ప్రయోజనకరమైన సాహిత్యం సృష్టించడం కాలంలోనే జరిగింది.

కోస్తాప్రాంత రచయితలపై బెంగాలీ, ఇంగ్లీషు సాహిత్య ప్రభావముంటే, తెలంగాణ మొదటితరం కథా రచయితలపై హిందీ, ఉర్దూ సాహిత్యాల, సాహిత్యకారుల ప్రభావముండటం గమనించవచ్చు. గురజాడ లాంటి కోస్తాంధ్ర రచయితలు రవీంద్రనాధ్‌ ఠాగూర్‌, శరత్‌చంద్రఛటర్జీ, ఇంగ్లీషు సాహిత్యకారుల ప్రభావంతో రచనలు చేస్తే తెలంగాణ సాహిత్యకారులు ్రేంచంద్‌, కిషన్‌చందర్‌ లాంటి రచయితల ప్రభావంతో అభ్యుదయ పంథాననుసరించి రచనలు చేశారు. కోస్తాలో తర్వాతికాలంలో వచ్చిన అభ్యుదయ రచయితల సంఘ ప్రభావం తెలంగాణలో అంతకుముందే పడింది. మొదటి కథా రచయిత్రి భండారు అచ్చమాంబ రాసిన కథలు సంస్కరణోద్యమ ప్రభావంతో రాయబడినవే. వీరేశలింగం పంతులు సంఘసంస్కరణ, బాల్య వివాహాల నిషేధం, వితంతు వివాహాలు తెలంగాణలో వంద సంవత్సరాల కింద కూడా పెద్ద సమస్య కాదు. దళిత బహుజన కుటుంబాల్లో ఇది ఎప్పుడూ సమస్య కాదు. బ్రాహ్మణ కుటుంబాల్లో మాత్రం వితంతు వివాహాలు తెలంగాణలో అప్పుడూ సమస్యలుగానే ఉండేవి. అందుకేనేమో కులాల నుంచి వచ్చిన తెలంగాణ కథారచయితలు వీరేశలింగం సంఘసంస్కరణ ఉద్యమానికి మద్దతుగా కథలు రాసారు. అలా రాయబడిన కథలే మాడపాటి హనుమంతరావు

93

రాసిన హృదయశల్యం, నేనే కథలు. ఇవి రెండే మాడపాటి రాసిన స్వతంత్ర కథలు. మిగతా ఏడు కథలు (పేంచంద్‌ కథలకు స్వేచ్భానువాద కథలు. ప్రేంచంద్‌ ప్రభావం తెలంగాణ రచయితలపై విశేషంగా ఉందనడానికి ఇదో చక్కని ఉదాహరణ. ఒకటిరెండు కథలు, అంతగా ప్రాధాన్యం లేని కథల సంగతి వదిలిపెడితే రచనను తపస్సుగా స్వీకరించి కథారచన చేసినవారు చాలామందే ఉన్నారు. వీరిలో భండారు అచ్చమాంబ, మాడపాటి హనుమంతరావు, నందగిరి ఇందిరాదేవి, నందగిరి వెంకటరావు, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ నారాయణరావు, జి.రాములు, కాంచనపల్లి చిన వెంకట రామారావు, పొట్లపల్లి రామారావు, పి.వి. నరసింహారావు, గూడూరి సీతారాం, జి.సురమౌళి, వెల్టుర్తి మాణిక్యరావు, మందా రామిరెడ్డి, డి.రామలింగం, నెల్లూరి కేశవస్వామి, అడ్డూరి అయోధ్య రామకవి, ఇరివెంటి కృష్ణమూర్తి, శొంఠి కృష్ణమూర్తి, సి.వి.కృష్ణారావు, నెల్లుట్ల కేశవస్వామి, చౌడూరు గోపాలరావు, దాశరథి రంగాచార్య, ఆవుల పిచ్చయ్య, భాగ్యరెడ్డి వర్మ వల్లపురెడ్డి బుచ్చారెడ్డి, కొలిపాక మధుసూదనరావు, బూర్గుల రంగనాథరావు, పి. యశోదారెడ్డి, దేవులపల్లి రామానుజరావు, వానమామలై వరదాచార్యులు, పి.వెంకట రామారావు, పి.వెంకటేశ్వరరావు, పడాల రామారావు, బి.యన్‌. శాస్తి, దిలావర్‌, పెండ్యాల శేషగిరిరావు లాంటి వారు రచయితలుగా, సాహిత్యకారులుగా, పరిశోధకులుగా ప్రసిద్ధి చెందారు.

మాడపాటి హనుమంతరావు తర్వాత తెలంగాణలో కథా రచయితలుగా ప్రసిద్ధులైన ముఖ్య వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. తెలుగు జాతి, తెలంగాణ వైతాళికుడైన రచయిత రాసిన నిరీక్షణ, గ్యారాకద్దూ బారా కొత్వాల్‌, సంఘాల పంతులు లాంటి కథలెంతో ప్రసిద్ధి చెందాయి. ఇతడు రాసిన మొగలాయి కథలు మొగలాయి రాజుల పాలనలోని డొల్లతనాన్ని అప్పటి అవినీతిని అక్షరబద్ధం చేసిన మంచి కథలు. ఉర్జూ, తెలుగు మిశ్రమంతో అప్పటి వాడుక భాషలో కథలు రాసి సురవరం ప్రతాపరెడ్డి అప్పుడే మాండలిక భాషకు సాహిత్యంలో స్థానం కల్పించారు. మీది బ్రౌణ్యాంధ్రం, మాది తౌరక్యాంధ్రం అని తౌరక్యాంధ్రంలో కథలు రాసి తెలంగాణ మాండలికానికి సాహిత్య గౌరవం తీసుకురావడానికి కాలంలోనే పునాదులు వేసారు. జి.రాములు రాసిన పెరటిచెట్టు కథ మరికొన్ని కథలు వృత్తి కులాలపై కథలు రాయడానికి అప్పుడే మార్గాన్ని సుగమం చేసాయి. గూడూరి సీతారాం లచ్చి, మారాజు ఇతర

94

కథలు తెలంగాణ మాండలికాన్ని జీవితాన్ని అట్టడుగు కులాల బతుకువెతలను హృదయానికి హత్తుకొని రాయబడిన కథలు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భారత దేశానికి తొలి దక్షిణాది ప్రధాని పి.వి.నరసింహారావు గొప్ప చాణక్య రాజనీతిజ్ఞుడే కాక గొప్ప సాహిత్యకారుడు కూడా. ఇతడు రాసిన గొల్లరామవ్వ, మంగయ్యగారి అదృష్టం కథలు సుప్రసిద్ధాలు. గొల్ల రామవ్వ కథలో పి.వి. వాడిన గొల్ల కుర్మల భాష మనల్ని పరవశుల్ని చేస్తుంది. ఎత్తుగడ, కథనం, ముగింపు, ప్రారంభం వర్ణనలు అన్నిట్లోనూ కథ పరిపక్వం చెందిన కథ. పి.వి. ఇదే ఒరవడిలో కథలు రాసి సాహిత్యకారుడిగా కొనసాగివుంటే నోబుల్‌ బహుమతిని గెలుచుకుని ఉందేవారనడంలో నందేవాం లేదు. రజాకారు తెలంగాణ పోరాటాల ప్రతిస్పందనలుగా ఆవుల పిచ్చయ్య రాసిన కథలు తెలంగాణ కథాసాహిత్యంలో ఆణిముత్యాలే. వట్టికోట ఆళ్వారు స్వామి జైలు కథలు, నైజాం పాలనాకాలంలోని స్థితిని తెలిపే కథలు. జి.సురమౌళి అంగుడు పొద్దు మరికొన్ని కథలు ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో ఉన్న పరిస్థితులను, జీవనవెతలను తెలిపే కథలు. మానవత్వం పరిమళించే కవిత్వం రాసిన కాళోజీ నారాయణరావు మనకంటే పశువులే నయం, న్యాయం లాంటి కథలు రాసి ప్రసిద్ధులయ్యారు. కాళోజీ కథల్లో మానవతా పరిమళం గుభాలిస్తుంటుంది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మానవీయకోణంలో కవితలు రాసిన డా.సి.నారాయణరెడ్డి మా ఊరి ముచ్చట్లు లాంటివి, కొన్ని కథలు రాసినట్టు తెలుస్తుంది. చిల్లర దేవుళ్ళ నవలాకారుడిగా, వేదం జీవనాదం రచయితగా ప్రసిద్ధుడైన దాశరథి రంగాచార్య కథల్లో తెలంగాణ మాండలిక భాషా సొగసులతో పాటు జీవన పరిమళం గుభాళిస్తుంటుంది. డి.రామలింగం మొదటితరంలో తెలంగాణ నుంచి మంచి కథలు రాసిన రచయితగానే కాకుండా తెలంగాణ సాహిత్యం కోసం విరివి గా కృషిచేసిన కృషీవలుడు. నెల్లుట్ల కేశవస్వామి చార్‌మినార్‌ కథలు హైదరాబాద్‌ ప్రాంత జీవన వ్యథలు. పి.యశోదారెడ్డి తెలంగాణ ప్రాంత మాండలిక భాషను హృదయానికి హత్తుకొని ఎచ్చమ్మ కథలు, పి. యశోదారెడ్డి కథలు వెలువరించారు. తెలంగాణ వాడుకలోంచి కనుమరుగైపోతున్న నుడికారాలు, భాషాసొగసులు ఈమె కథల్లో దర్శనమిస్తాయి. దిలావర్‌ అప్పటి నుండి ఇప్పటివరకు అద్భుతమైన కథాసృృజనం చేస్తూనే ఉన్నాడు. అభినవ పోతన వానమామలై వరదాచార్యులు, తెలంగాణ వైతాళికులు రామానుజరావు, భాగ్యరెడ్డి వర్మ, జానపద బ్రహ్మ బిరుదురాజు

95

రామరాజు కొన్ని కథలు రాసినట్టు తెలుస్తుంది. శొంఠి కృష్ణమూర్తి, ఇల్లందుల సరస్వతీదేవి, పోల్కంపల్లి శాంతాదేవి, ఒద్దిరాజు సోదరులు, కాంచనపల్లి లాంటి వారు కథలు రాసి తెలంగాణ కథా సాహిత్యానికి పుష్టిని చేకూర్చారు. ఇలా మొదటితరం తెలంగాణ కథా రచయితలకు ప్రామాణిక భాషో, వ్యావహారిక భాషో వాడాలన్న నియమాలు అడ్డురాలేదు. తాము జీవిస్తున్న ప్రాంత పాత్రోచిత మాండలిక భాషను హాయిగా వాడారు. కాలంలో జరిగిన భూపోరాటాలు, రాజకీయ వ్యతిరేక పోరాటాలపై వచ్చిన కథలను జనసాహితీవారు సంకలనం చేసారు. అవన్నీ

పోరాటాలకు ప్రతిస్పందనలుగా వచ్చినవే.

తొలితరంలో వచ్చిన కథా సంపుటాల్లో తెలంగాణ మంటల్లో అయోద్య రామకవి (1948), జైలు పొట్లపల్లి రామారావు (1947), పసిడి బొమ్మ నెల్లూరి కేశవస్వామి, వాహ్యోలి (బూర్గుల రంగనాధరావు), మా యింట్లో, ధరణికోట శ్రీనివాసరావు(1949), హీరాలాల్‌ మోరియా కథలు(1958), కృష్ణాంజలి, శొంఠి కృష్ణమూర్తి (1955), మల్లికా గుచ్చం (మాడపాటి హనుమంతరావు), జైలులోపల, వట్టికోట ఆళ్వారుస్వామి (1952), గండి పడ్డ జీవితాలు, పి.ఎస్‌. ఆర్‌. ఆంజనేయశాస్తి (1954), కథామాల వేమరాజు నరసింహారావు (1952), నిజమైన మనుషులు, చక్రవర్తుల రంగస్వామి (1956), మధ్య బతుకులు, ఇసుకపల్లి లక్ష్మీనరసింహారావు (1955) ముఖ్యమైనవి. మొదటితరం కథారచయితల కథల సంపుటాలు చాలా వరకు తర్వాతి కాలంలో వచ్చాయి. గూడూరి సీతారాం, సురమౌళి, జి.రాములు, కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళ కథా సంపుటాలు తర్వాతి కాలంలో వచ్చాయి. మరికొందరి కథలు సంపుటాలుగా రావాల్సే ఉంది. ఇలా మొదటితరంలో తెలంగాణ నుంచి అనేకమంది కథారచయితలు వేలాది కథలు రాసారు. తెలంగాణ కథా వికాసానికెంతో తోద్చడ్డాయి.

మలితరం కథా రచయితలు, కథలు (1956-1975)

తరంలో రచయితలు కలం పట్టేసరికి హైదరాబాద్‌ దక్కన్‌గా ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విలీనమయింది. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది. దాంతో తెలంగాణ ప్రత్యేకత దెబ్బతింది. కోస్తాంధ్ర పత్రికల జోరు తెలంగాణలో వ్యాపించింది. వ్యావహారిక భాషలో రాయాలన్న నియమమూ ముందుకొచ్చింది. పత్రిక భాషంటూ తెలంగాణ ప్రజల భాషనే భాష తెరమీదికొచ్చింది. వ్యాపార రచనల జోరు హెచ్చింది. పత్రికలంటే,

96

రచనలంటే కేవలం కమిట్‌మెంట్‌తో, ప్రయోజనానికి మాత్రమే రాయడం కాదన్న భావం పెరిగింది. దిక్కు డిటెక్టివ్‌ నవలల హోరు, మరో దిక్కు యద్దనపూడి మార్కు (పేమ నవలల జోరు పెరిగింది. స్త్రీల కలం పేర్లతో రాయడమూ ప్రారంభమైంది. ఇదే సమయంలో 1968-69 ప్రత్యేక తెలంగాణ పోరాటమూ జరిగింది. సమయంలో కలం పట్టిన తెలంగాణ కథారచయితలు అటు కోస్తా ప(త్రికల నుంచి దిగుమతి అయిన వ్యాపారమసాలాల నవలా ధోరణిని అనుసరించాలో, ఇటు తెలంగాణ పూర్వ రచయితల ననుసరించాలో తేల్చుకోలేని సంధిగ్ధంలో పడ్డారు. ఇదే కాలంలో వచ్చిన దిగంబర కవిత్వోద్యమం, విప్లవ సాహిత్యోద్యమపునాదులు, శ్రీకాకుళ రైతాంగ పోరాట ప్రభావం తెలంగాణ రచయితలను కొందర్ని ప్రభావితం చేసినా కథా రచన విషయంలో మాత్రం సందిగ్ధ ధోరణే కొనసాగింది. మొదటితరం కథా రచయితలు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ కథావికాసం జ్వాజ్వలమానంగా కొనసాగడానికి బదులు అతి మామూలుగా కొనసాగింది. భాషనుపయోగించాలన్న సందేహం, వస్తు సేకరణలో మార్గం అవలంబించాలన్న సందిగ్ధం ఉధృతంగా రాయకుండా ఆపేసాయి. తమకు తెలిసిన మాండలికంలో రాస్తే కథలు వేస్తారో వేయరో అన్న భయం ఒకవైపు, కోస్తా వ్యాపార నవల స్థాయిని అందుకోగలమా అన్న అనుమానం మరోవైపు పీడింపసాగాయి.

పరిస్థితుల్లో కలం పట్టిన కథారచయితలు కొందరు ఇటు తెలంగాణ కథారచనా మార్గాన్ని వదిలిపెట్టకుండా, అటు కోస్తా వ్యాపార నవలా మార్గాన్ని విడువకుండా మధ్యేమార్గాన్ని ఎన్నుకున్నారు. వీళ్ళకు తమ రచనలు పత్రికల్లో అచ్చుకావడం ప్రధానధ్యేయమయింది. అందుకెంతో కష్టపడాల్సి వచ్చింది. కాలంలోనూ తెలంగాణ నుంచి డిటెక్టివ్‌, వ్యాపార అవాస్తవిక (ప్రేమ నవలా సాహిత్యం లాంటివి రాకపోవడం గమనించవచ్చు. అలా ప్రయత్నం చేసి విఫలమైన వారూ ఉన్నారు. కాలంలో మహోజ్వలంగా జరగాల్సిన తెలంగాణ కథా వికాసం జరగాల్సినంత జరుగలేదు. ముఖ్యంగా తెలంగాణ మాండలికాన్ని వాడటానికి సమయంలో కలం పట్టిన రచయితలు చాలామంది సంకోచించారు. వాళ్ళు రాసినా పత్రికల్లో ప్రచురించి ఉండకవపోచ్చు. సమయంలోని రచనలను దృష్టిలో పెట్టుకునే కావచ్చు తెలంగాణ నుంచి కథలెక్కువగా రావడం లేదన్న వాదం బయలుదేరింది. ఏదేమైనా కాలాన్ని తెలంగాణ కథకు క్షీణదశనే పేర్కొనవచ్చు. అనేక కారణాల

97

వల్ల తెలంగాణ కథకులకు, కథలకు రావాల్సినంత పేరు రాలేదు. స్థానీయత, ప్రాంతీయత, మాండలికం వదులుకొని పెద్దలోకుల్లో కలిసే రచనలు చేయడం వల్ల కావచ్చు కాలంలో తెలంగాణ ముద్ర గల కథా సాహిత్యం అంతగా రాలేదు. పని తరపు కాలం చివర్లో కరీంనగర్‌ నుంచి వచ్చిన బర్‌లా కథా సంకలనం (1973) ముద్రణతో ఉధృతమయింది.

తెలంగాణ నుంచి మలితరంలో కలంపట్టి రచనా వ్యాసంగాన్ని కొనసాగించి ప్రసిద్ధులైన కథా రచయితలు రాశిలో తక్కువే అయినా, వాసిలో ఎన్నదగినవారు చాలామందే ఉన్నారు. వారిలో తాడిగిరి పోతరాజు, అంపశయ్య నవీన్‌, మలయశ్రీ, ముదిగంటి సుజాతారెడ్డి, రామా చంద్రమౌళి, మాదిరెడ్డి సులోచన, బోయ జంగయ్య, పోల్మంపల్లి శాంతాదేవి, నిఖిలేశ్వర్‌, చెరబండరాజు, జ్వాలాముఖి, జాతశ్రీ, చంద్ర, యం.వి. తిరుపతయ్య, పేర్వారం రాములు, సాకేతపురి కస్తూరి, ముదిగంటి పాపిరెడ్డి, పి.వి.రమణ, బుర్రా రాములు లాంటి వాళ్ళు ముఖ్యులు. ఇదే సమయంలో తెలుగు సాహిత్యంలో ఉత్తుంగ కెరటంలా లేచిన దిగంబర కవిత్వోద్యమంలో రథసారథులుగా తెలంగాణకు చెందిన నిఖిలేశ్వర్‌, చెరబండరాజు, జ్వాలాముఖీ ఉండటం విశేషం. చెరబండరాజు కథలు తెలంగాణ పోరాట జీవితాన్ని చిత్రించిన గొప్ప కథలు. అయితే చెరబండరాజు పాటల్లో, కవితల్లో ఉన్న పదును, వేగం, వ్యవస్థను ప్రశ్నించే నిలదీసే తత్వం అతని కథల్లో కనబడదు. జ్వాలాముఖి తర్వాతి కాలంలో రాసిన హైదరాబాద్‌ కథలు మరికొన్ని కథలు కూడా ఆతని కవిత్వమంత పదునైనవి కావు. నిఖిలేశ్వర్‌ కథలు కూడా కాలం తర్వాతే వచ్చాయి. కథల్లోనూ ఆతని కవిత్వాన్నికున్నంత పదునులేదు. తాడిగిరి పోతరాజు జైలు గురించి, పోలీసు వ్యవస్థ గురించి రాసిన కథలెంతో విలువైనవి. వ్యవస్థను నిలదీసేవి. తెలంగాణలో వేళ్ళూనుకుంటున్న రైతాంగ పోరాటాల ప్రతిస్పందనలతో పోతరాజు కథలు రాసారు. తాను అనుభవించిన జీవితాన్ని తెలంగాణ పల్లెల్లో దళితుల స్థితిగతులను కథలుగా మలిచిన బోయ జంగయ్య తెలంగాణ నుంచి ప్రసిద్ధుడైన మొట్టమొదటి దళిత రచయిత. మలయశ్రీ కాలంలో రెండు మూడు కథలు రాసినా ఇటీవలి కాలంలో ఐరేనికుండలు అనే కథల సంపుటి వెలువరించాడు. కాలంలో కలం పట్టి నవలా రచయితగా, అంపశయ్య నవీన్‌గా ప్రసిద్ధుడైన రచయిత నవీన్‌. కాలేజీ జీవితాల గురించి, విద్యార్థి ఉపాధ్యాయ సంబంధాల గురించి, యువతరం గురించి చక్కని కథలు రాసిన నవీన్‌

98

ఎనిమిదో అడుగు, లైఫ్‌ ఇన్‌ కాలేజ్‌ అనే కథా సంపుటాలను వెలువరించాడు. బోయ జంగయ్య దున్న ఎచ్చరిక, బోయ జంగయ్య కథలు, రంగులు, చీమలు, తెలంగాణ వెతలు, ఉప్పునీళ్ళు లాంటి కథాసంపుటాలను ప్రచురించి ప్రసిద్దుడయ్యాడు. ముదిగంటి సుజాతారెడ్డి కథల్లో తెలంగాణా జనజీవన సంఘర్షణ, పట్టణ జీవితవెతలు, వ్యాపార నాగరికత తెచ్చిన దుర్మార్గం కనబడుతాయి. పల్లె మింగిన పట్నం, విసుర్రాయి కథా సంపుటాలు వేయడమే కాకుండా తొలితరం తెలంగాణ కథలను వెలికితీసి రెండు సంకలనాలు ప్రచురించిందామె. చంద్ర, దిలావర్‌ అనేక కథలు రాసి ప్రసిద్ధులయ్యారు. మాదిరెడ్డి సులోచన, పోల్కంపల్లి శాంతాదేవి నవలలతో పాటు కథలూ రాసారు. ఇలా తెలంగాణ నుంచి రెండవతరంలో మంచి కథాసాహిత్యమే వచ్చింది. రామాచంద్రమౌళి తరంలోనే కథలు రాసి తర్వాత కొంతకాలం కథలు రాయకున్నా తర్వాత విజృంభించి మంచి కథలు రాస్తున్నారు. కాలంలో కలం పట్టినవారు చాలామంది తర్వాతి తరంలోనూ, తరంవారితోనూ పోటీపడి కథారచన చేస్తున్నారు. కాలంలో ఉవ్వెత్తున లేచిన ప్రత్యేక తెలంగాణ పోరాటం గురించి సమయంలోనూ, తర్వాత కూడా చెప్పుకోదగిన కథలు రాకపోవడం లోపమే. అన్ని ఉద్యమాలకు స్పందించి రచనలు చేసిన తెలంగాణ రచయితలు ఉద్యమం గురించి కథలు రాయకపోవడానికి అనేక కారణాలున్నాయి. కాలంలోనే నక్సల్‌ బరీ పోరాటం ప్రారంభం కావడం, అది శ్రీకాకుళం నుండి తెలంగాణ జిల్లాలకు వ్యాపించడం జరిగింది. నక్సల్‌బరి, శ్రీకాకుళ పోరాటాలు, తెలంగాణలో వేళ్ళూనుకొంటున్న భూపోరాటాల నేపథ్యంలో కరీంనగర్‌ నుండి 1973లో వెలువడిన కథా సంకలనం 'బద్‌లా తెలంగాణ కథా రచయితలు కొందర్ని విశేషంగా ఆకర్షించింది. ఇందులోని ఆరు కథలు కరీంనరగ్‌ మట్టి భాషా పరిమళంతో పోరాట ప్రతిస్పందనలుగా వచ్చినవే. తాడిగిరి పోతరాజు బ్లాక్‌ అండ్‌ వైట్‌, వినోద్‌ పునాది, ఎం.వి. తిరుపతయ్య న్యాయం, తిరుపతి పిడికిల్లు బిగుసుకున్న రాత్రి, శరత్‌కుమార్‌ రేపటి ఉదయం, ఉమ్మెత్తెల వెంకటరెడ్డి పోచమ్మ కథలీ సంకలనంలో ఉన్నాయి. ఇలా రెండవతరంలో తెలంగాణ మాండలికం వాడటం భయంభయంగా మొదలైన బద్‌లా కథా సంకలనం ప్రచురణతో బాహాటంగా వాడటంగా మారింది. అయితే ఇందులోని కథలేవీ పత్రికల్లో ప్రచురింపబడలేదు. తెలంగాణ మాండలికాన్ని (ప్రధాన పత్రికల్లో ప్రచురించడం మూడవతరం రచయితల రచనలతో ఉధృతమైంది.

99

సాధారణీకరించబడింది. అందుకోసం మూడవతరం కథా రచయితలు ఎంతో కష్టపడాల్సి వచ్చింది.

మూడవతరం తెలంగాణ కథా రచయితలు, కథలు (1975-1995)

కాలంలో తెలంగాణలో భూపోరాటాల ఉద్యమాలు ఉధృతంగా లేచాయి. నీ బాంచెన్‌ కాల్మొక్తా అని జీవించిన తెలంగాణ బడుగువర్గాల ప్రజలు ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. తిరుగబడే స్థాయికి వచ్చారు. ఉత్తర తెలంగాణ అగ్నిగుండంగా మారింది. భూపోరాటాలతోపాటు అంబేద్మర్‌ సంఘాలూ ఊరూర వెలిసాయి. మండల్‌ కమిషన్‌ నివేదికతో దేశమంతటా, తెలంగాణలోనూ బహుజన ఉద్యమాలూ లేచాయి. స్వాతంత్రానంతరం దళిత, బహుజన కులాల్లోంచి పుట్టిన తరం చదువుకొని రచయితలుగా, జర్నలిస్టుగా, ఉన్నతోద్యోగులుగా, రాజకీయులుగా, తత్వవేత్తలుగా జీవితాలను గెలుచుకునే క్రమం ప్రారంభమైంది. కులాల నుంచి వచ్చిన రచయితలు తమ చరిత్రలను తాము రాసుకునే క్రమం మొదలయింది. చుట్టూ జరుగుతున్న ఉద్యమాలు, మాదిగ దండోరా ఉద్యమం, మండల్‌ ఉద్యమం లాంటివన్నీ రచయితలతో అనివార్యంగా కలం పట్టించాయి. తమ జీవితాలను, ఉద్యమాలను, బతుకువెతలను, తెలంగాణ జనజీవన సంఘర్షణను కథలుగా మలిచే క్రమం ఉధృతమయింది. (క్రమంలో తమకు తెలిసిన, తాము తమ ఇండ్లలో మాట్లాడుకుంటున్న తెలంగాణ మాండలిక భాషకు పట్టంకట్టి రచయితలు కథలు రాయడం ప్రారంభించారు. మొదట్లో ఎన్నో అవరోధాలను ఎదుర్శొన్నారు. అయినా సరే వెనుకంజవేయకుండా భాషలోనే రాసారు. తరం రచయితలు చేసిన నిరంతర పోరాటం, అన్ని ప్రధాన పత్రికల్లోనూ తెలంగాణ మాండలికంలో కథలు రాయడం మొదలు పెట్టిన తర్వాత తెలంగాణ నుంచి గొప్ప సాహిత్యం వస్తుందన్నారు. తెలంగాణ ఊర్లు, ప్రాంతాలు కథల్లో చోటుచేసుకోవడం కాలంలోనే ప్రారంభమైంది. నన్ను ముట్టుకోకు నామాలకాకి అన్నట్టున్న అవార్డులు కూడా తెలంగాణ రచయితలను వరించడం మొదలయింది. తెలుగు కథ విప్లవకథగా, దళిత కథగా, బహుజన కథగా మొదలయింది. తెలుగు కథ విప్లవకథగా, దళితకథగా, బహుజన కథగా వివిధ రంగాల్లో బలమైన కథలు రాయడానికి తెలంగాణ కథకులు దోహదం చేసారు. ఇదువరకు తెలుగు కథానికల్లో చోటు చేసుకొని సహగ్రవృత్తుల సమస్త కులాలవారు కథల్లో చోటు చేసుకున్నారు. చాకలి, మంగలి, మాదిగ, గొల్ల, సాలి,

100

కుమ్మరి, కాపు, మాల, వడ్రంగి... ఇలా అన్ని కులాలవారు కథా వస్తువులయ్యారు. తెలుగు కథ కళింగ ప్రాంతం నుండి, విజయవాడ మీదుగా పయనించి తెలంగాణలో స్థిరపడింది. తెలంగాణ కథ తెలుగు కథకే మార్గనిర్దేశనం చేసింది. కాలాన్ని తెలంగాణ కథకు ఉజ్వలమైన సమయంగా చెప్పవచ్చు. అందరి దృష్టి తెలంగాణ దిక్కు మర్లింది. కథంటే ప్రయోజనకరమైనదే, దళిత బహుజన అట్టడుగు వర్గాలదే అన్నంతగా తెలంగాణ నుంచి కథలు వచ్చాయి. విప్లవోద్యమాన్ని దళితోద్యమాన్ని ద.ర.క.మే ఉద్యమాన్ని కులోద్యమాలను, దండోరా ఉద్యమాన్ని, బహుజన రాజ్యాధికార ఉద్యమాన్ని తనదిగా చేనుకొని తెలంగాణ కథ జ్వాజ్వల్యమానంగా వెలుగుతుంది. కాలంలో కలం పట్టిన కథా రచయితలు రెండు మూడు తరాలతో తరంతోనూ నడుస్తూ కథారచన చేస్తున్న వారున్నారు. తెలంగాణ కథకు స్వర్ణయుగం లాంటిదైన కాలంలో అద్భుతమైన కథా సంపుటాలు, సంకలనాలు, కథా రచయితలు వచ్చారు. కాలం అనేకమందికి ముఖ్యంగా దళిత బహుజన పీడిత వర్గాల నుంచి వచ్చిన రచయితలకు రాయడానికి అవకాశమిచ్చింది. అవకాశాన్నుపయోగించుకొని తమ జాతి పీడిత చరిత్రలను కథలుగా, నవలలుగా రాస్తున్నారు తరం రచయితలు.

మూడవతరంలో కలం పట్టి ప్రసిద్ధులైన వారు చాలామందే ఉన్నారు. వారిలో బి.యస్‌.రాములు, అల్లం రాజయ్య, కాలువ మల్లయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, నలిమెల భాస్కర్‌, బి.దామోదరరావు, జూకంటి జగన్నాథం, జింబో, నందిని సిధారెడ్డి, సాహు, సరిపల్లి కృష్ణారెడ్డి, ఐతా చంద్రయ్య, జయధీర్‌ తిరుమల్‌ రావు, వసంతరావు దేశ్‌పాండే, ఆడెపు లక్ష్మీపతి, దేవరాజు మహారాజు, వుప్పల నరసింహం, భూపాల్‌, కాసుల ప్రతాపరెడ్డి, పి. లోకేశ్వర్‌, సి. హెచ్‌.మధు, రాగో, సాధన, నందిగం కృష్ణారావు, ముక్తవరం పార్థసారథి, కార్మిక, ననుమాసస్వామి, సదానంద శారద, పి. చంద్‌, తెలిదేవర భానుమూర్తి, గంగుల నరసింహారెడ్డి, కె.రామ్మోహన్‌రాజు, టి. సంపత్‌కుమార్‌ లాంటి వాళ్ళెంతో మందున్నారు. రచయితలు వెలువరించిన కథా సంపుటాలెన్నో ప్రసిద్ధి చెందాయి. బి.యస్‌.రాములు (పాలు, తేనెటీగలు, స్మృతి, మమతలు మానవ సంబంధాలు), అల్లం రాజయ్య (సృష్టి కర్తలు, భూమి, అల్లం రాజయ్య కథలు), కాలువ మల్లయ్య (కట్నం కథలు, ఘర్మ జలానికి, రాజుకోడి, కాలువ మల్లయ్య కథలు, మా కథలు, అవ్వతోడు గిది తెలంగాణ, నేలతల్లి, అంటరానితనం-అంబేద్యర్‌,

101

వయోజన కథలు) వెలువరించాడు. రఘోత్తమరెడ్డి కథలు, జింబో కథలు సంపుటాలుగా వచ్చాయి. ఐతా చంద్రయ్య చిలుకపచ్చ చీర, స్వేచ్చా జీవులు, కథా మంజూష, భూపాల్‌ అంబల్ల బండ, పి.చందర్‌ భూనిర్వాసితులు, కాసుల (ప్రతాపరెడ్డి శిలువకు తొడిగిన మొగ్గ, కె.వి.నరేందర్‌ కాలుతున్న పూలతోట, ఆడెపు లక్ష్మీపతి నాలుగు దృశ్యాలు, యాదగిరి రెడ్డి మట్టికథలు, వుప్పల నరసింహం ముద్ర, అంబల్ల జనార్ధన్‌ బొంబాయి కథలు, జూకంటి జగన్నాధం, వైపని, ననుమాసస్వామి గంటీలు, దేవరాజు మహారాజు కథలు సంపుటాలుగా వచ్చాయి. కాలపు రచయితలు రాసిన కథలు అనేకం తర్వాతి కాలంలోనూ కథా సంపుటాలుగా వచ్చాయి. తెలుగు కథలు, తెలంగాణ కథను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళిన కథలెన్నో కాలపు రచయితలు రాసారు.

వి.యస్‌.రాములు పాలు, అడవిలో వెన్నెల, దక్షయజ్ఞం, వారసత్వం లాంటి కథలు చిన్న కథలో విశాలమైన విషయాన్ని చూపే తాత్విక కథలు. తెలంగాణ కథకు తాత్విక పరిమళమద్దిన రచియత బి.యస్‌.రాములు. భూమి, సృష్టికర్తలు, అతడు, మహదేవుడి కల లాంటి అద్భుతమైన కథలు రాసిన అల్లం రాజయ్య తెలుగు కథకు విప్లవ పంథాను చూపారు. బర్ల కొండయ్య, బొత్త ఎల్లయ్యలాంటి పాత్రలను విప్లవ దృష్టికోణంలోంచి ఉన్నతీకరించి తెలంగాణ కథకు ఉన్నత శిఖరాల కెదిగించారు. యుద్ధభూమి, ఆంబోతు, శనార్తి, సాసంత్ర దినం, ఊరుమ్మడి బతుకు, మౌనవసంతం లాంటి విప్లవ, దళిత బహుజన కథలు రాసి తెలుగు కథకు బహుజన పంథా చూపిన కథకుడు కాలువ మల్లయ్య. ఈతడు రాసిన 850 కథలు తెలంగాణ జనజీవన పరిమళంతో, జీవన సంఘర్షణతో పరిఢవిల్లేవే. భూపాల్‌ రాసిన అంబల్లబండ కథలు, సి. హెచ్‌. మధు కథలు తెలంగాణ విప్లవ పోరాట నేపథ్యంలోంచి వచ్చినకథలు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి రాసిన పనిపిల్ల, జాడ, చావువిందు, ధిక్కారం తెలంగాణ జీవిత ఘర్షణలోంచి వచ్చిన కథలు. జూకంటి జగన్నాధం కళేబరం, వలస కథలు తెలంగాణ బహుజన బతుకు చిత్రాలు. పులుగు శ్రీనివాస్‌ సంకరవిత్తులు, కార్మిక కథలు తెలంగాణ బతుకు వెతలు. యాదగిరి రెడ్డి మట్టికథలు, పంజాలె జగన్నాధం మట్టివాసన తెలంగాణ మట్టిలోంచి వచ్చిన కథలు. రచయిత తెలంగాణ మట్టి కథలు తెలంగాణలోని అవ్వల గురించి రాసిన తెలంగాణ మట్టి వాసనలు. ఇలా తరం రచయితలంతా తెలంగాణ పోరాటాలకు, జీవన

102

సంఘర్షణకు, దళిత బహుజన బతుకు వెతలకు అద్దం పడుతూ కథలు రాసారు. పి.చంద్‌ కార్మిక కథలు గనికార్మిక జీవితాలకు అద్దం పట్టాయి. బొగ్గుగని కార్మిక జీవితాలపై ఉరి, ఉరితాడు, జీవన్మృతుడు లాంటి మంచి కథలు కాలంలోనే వచ్చాయి. కాలంలో కలం పట్టి ప్రసిద్ధులైన రచయితలు తర్వాత వచ్చిన (ప్రపంచీకరణ పరిణామాలను, ప్రాపంచిక మార్పులను అవగాహన చేసుకొని తరం రచయితలతో పోటీపడి కథారచన చేస్తున్నవారున్నారు. కోల్‌బెల్ట్‌ కథలు, భూమిక, బొగ్గు పొరల్లో, అడవిలో వెన్నెల, నేలతల్లి విముక్తి కోసం, ఆధునిక కథా సరిత్సాగరం లాంటి కథా సంకలనాలు కాలంలో వచ్చాయి. ఏదేమైనా తెలంగాణ కథకు, తెలుగు సాహిత్యానికి అనర్హరత్నాలనదగిన కథలందించిన కథారచయితలు మూడవతరం నుంచి వచ్చారు. వీరు ప్రధాన పత్రికల్లోనూ తెలంగాణ మాండలిక రచనలు చేసి, పూర్తి మాండలికంలో కథలు రాసి రాబోయే తరం వారికి మాండలికం వాడటానికి మార్గం సుగమం చేసారు. కాలపు రచయితలు రాసిన కథలు, ముద్ర, అవ్వతోడుగిది తెలంగాణ, అల్లంకారం, బండ కింది బతుకులు, పలుకుబడి, తెలంగాణ మట్టికథలు లాంటి పూర్తి మాండలిక రచనలు తెలంగాణ భాషను ఉన్నతీకరించే ఉత్తమ రచనలు. ఇలా మూడవతరంలో తెలంగాణ కథ జ్వాజ్వల్యమానంగా వెలిగి ఉన్నతోన్నత శిఖరాలకు చేరుకుంది. తెలుగు కథా భవిష్యత్తుకు సుదృఢమైన పునాదులు వేసి తిరుగులేని హామీ నిచ్చింది. సాహు రాసిన మనం తుడుంకొట్టాలె, రక్తపింజెర ఇతర గిరిజనకథలు తెలుగు సాహితీవికాసం తెలంగాణ కథాసాహిత్యానికి సువర్ణాభరణాలు. తెలుగులో గిరిజన జీవితాలపై కథలు రాని లోటును తీర్చే గొప్ప కథలివి. ఇలా మూడవతరం కథారచయితలు స్ప బ్రశించని చోటులేదు. పోరాట జీవితాలతోపాటు, అన్ని వృత్తికులాలకు, సంబంధించిన కథలను, ఎరుకలి, లంబాడి లాంటి వారి జీవితాలను కూడా తీసుకొని కథాసృజనం చేసారు. రవిగాంచని చోటును కూడా కవిగాంచుతాడన్న విషయాన్ని నిజం చేస్తూ తెలంగాణ కథకులు రవిచొరని చోటుకు పోయి కూడా కథావస్తువు నెన్నుకొని కథలుగా మలిచారు. అందుకే పొదకలసార్లు, కోయగొండ తెగలవారు కూడా కథావస్తువులయ్యారు. జాతశ్రీ ఆర్హారావం కథా సంపుటి బహుజనవృత్తుల పతనాన్ని దయనీయంగా చిత్రించిన గొప్ప కథలసంపుటి.

103

ఈతరం కథారచయితలు, కథలు (1995 తర్వాతవి)

1991-92 ప్రాంతంలో రష్యా పతనం తర్వాత ప్రపంచమంతటా ఏకధృవ ప్రపంచమేర్చడటం జరిగింది. ప్రపంచీకరణ పేరుమోద అమెరికీకరణం కావడం మొదలయింది. ప్రభావం ప్రపంచమంతటా వ్యాపించింది. తెలంగాణ దీనికి మినహాయింపు కాదు. క్రమక్రమంగా తెలంగాణలో భూపోరాటం ఉధృతి తగ్గి ప్రపంచీకరణ ప్రభావం పెరగసాగింది. ముందు నగరాల్లోకి, పట్టణాల్లోకి ప్రవేశించిన గోబలైజేషన్‌ ప్రభావం క్రమక్రమంగా గ్రామాలను ఆక్రమించుకోసాగింది. దాంతో వస్తు వినిమయ సంస్కృతి పెరిగి రూపాయితనం మరింత వికృతరూపం దాల్చడం మొదలయింది. అంతవరకు గ్రామాల్లోనూ, మనుషుల్లోనూ ఉన్న ఉదారస్వభావం, ఉమ్మడికుటుంబ వ్యవస్థ, (ప్రేమానురాగాలు ధ్వంసమై రూపాయితనం రాజ్యమేలడం మొదలయింది. అప్పటికే కొడిగట్టుకు పోతున్న వృత్తులు, గ్రామీణ స్వభావం ధ్వంసమై మానవ విలువలు రూపాయి విలువలుగా మారిపోతున్నాయి. మానవ సంబంధాలు డబ్బు సంబంధాలుగా మారడం దీంతో ద్విగుణీకృతమైంది. గ్రామీణవ్యవస్థ చిన్నాభిన్నం కాసాగింది. దాంతో రైతులు ఆత్మహత్యలు, పత్తిరెతుల ఆత్మహత్యలు, నేతకార్మికుల ఆత్మహత్యలు, అమానవీయ పోటీతో విద్యార్థుల ఆత్మహత్యలు, అవాస్తవిక (ప్రేమ సంస్కృతితో యువతీయువకుల ఆత్మహత్యలు పెరగసాగాయి.

1995 ప్రాంతం వరకు ప్రపంచీకరణ ప్రభావం మరింత ఉధృతమై అన్ని రంగాలను కుదిపివేయసాగింది. విషయాలన్నిటినీ గమనించారు రచయితలు. కొత్తగా కలం పట్టిన వారితో పాటు, ఇదువరకే లబ్ద ప్రతిష్టులైన తెలంగాణ రచయితలు కూడా (ప్రపంచీకరణ విధ్వంసాన్ని రైతుల ఆత్మహత్యలను, గ్రామాల విచ్చిన్నతను ఖండిస్తూ అనేక కథలు రాసారు. క్రమంలో మునుపటి ప్రేమలు లేవు, మునుపటి విలువలు లేవు అని విలపిస్తూ గతమే మేలన్న అర్థాన్ని స్ఫురింపజేస్తూ కథలు వచ్చాయి. నిజానికి పీడితజాతులకు గతమేమంత గొప్పది కాదు. కాని గతాన్ని కీర్తిస్తూ పీడిత రచయితలు కూడా కథలు రాసారు. కాలంలో ముఖ్యంగా విలువల పతనం, మానవసంబంధాలపై అనేక కథలు వచ్చాయి. కాలంలోనే తెలంగాణలో అస్తిత్వ పోరాటాలు ప్రారంభమై ఉద్భతమయినాయి. తెలంగాణకాంక్ష విశ్వవ్యాప్తమైంది. అలాగే మైనారిటీ ఉద్యమాలు వచ్చాయి. గుజరాత్‌ సంఘటనతో మైనారిటీల్లో అభద్రతాభావం ఏర్పడింది. అందుకే మైనారిటీ కథాసాహిత్యం రావాల్సిన అవసరమూ ఏర్పడింది.

104

కుల అస్తిత్వ పోరాటాల ప్రభావమూ పడింది. వీటన్నిటినీ తమ కథల్లో నిక్షిప్తం చేస్తూ ప్రపంచీకరణ విధ్వంసాన్ని మైనారిటీ బతుకువెతలను, గ్రామీణవ్యవస్థ విధ్వంసాన్ని అక్షరబద్ధం చేస్తూ తెలంగాణ నుంచి మంచి కథలు వచ్చాయి. కె.వి. నరేందర్‌ కథల సంపుటాలు, పెద్దింటి అశోక్‌కుమార్‌ వలసలు, ఊటబాయి, చైతన్యప్రకాశ్‌ కథలు, సైబాబా కథలు, షాజహానా కథలు, వతన్‌ కథల సంకలనం, గుండెడప్పు కనకయ్య మేమిట్లుండం, నల్లాల లక్ష్మీరాజం, తిరుగుప్రయాణం, అంబల్ల జనార్ధన్‌ కథలు, పి.చిన్నయ్య జాజుల గౌరి మన్నుబువ్వ, బి.వి.ఎన్‌.స్వామి నెల పొడుపు, బెజ్జారపు వినోద్‌కుమార్‌ గవ్వలమూట, దార్ల రామచంద్ర కిర్రు చెప్పులు ఇంకా అనేక కథా సంపుటాలు వచ్చాయి. ఆధునిక కథా సరిత్సాగరం, చౌరస్తా, తొలితరం తెలంగాణ కథలు రెండు సంకలనాలు, తెలంగాణ కథావార్శికలు, భారతీయ కథా సాహిత్యం తెలుగుకథలు లాంటి అనేక కథా సంకలనాలు వచ్చాయి. ఇవన్నీ తెలంగాణ కథాసాహిత్యాన్ని ఉన్నత శిఖరాల కెదిగించేవే. తరం సామాజికవసరాన్ని సామాజిక సమస్యలను కధీకరిస్తూ ఇదువరకే ప్రసిద్ధులైన కాలువ మల్లయ్య, బి.యస్‌.రాములు, కె.వి.నరేందర్‌, పి.చంద్‌ లాంటి వారితోపాటు ఈతరం రచయితలు చక్కని కథలు రాస్తున్నారు.

కాలంలో కలంపట్టి రచయితలుగా ఎదిగి తెలంగాణ బతుకు వెతలను అక్షరీకరిస్తున్న రచయితలు చాలమందే ఉన్నారు. వారిలో పెద్దింటి అశోక్‌కుమార్‌, యెన్నెం సత్యం, ఉపేందర్‌, బెజ్జారపు రవీందర్‌, బి.వి.ఎన్‌ స్వామి, గుండెడప్పు కనకయ్య, పంజాల జగన్నాథం, బెజ్జారపు వినోద్‌కుమార్‌, నల్లాల లక్ష్మీరాజం, దార్ల రామచంద్ర, శ్రీధర్‌ దేశ్‌పాండే, గీతాంజలి, షాజహానా, పులిపాటి గురుస్వామి, వేముల ఎల్లయ్య, పి. చిన్నయ్య, బోధనం నర్సిరెడ్డి, దోరవేటి, నేరెళ్ల శ్రీనివాస్‌గౌద్‌, వనమాల చంద్రశేఖర్‌, కర్ర ఎల్లారెడ్డి, రహమతుల్లా, చొప్పదండి సుధాకర్‌, జాజులగౌరి, జూపాక సుభద్ర, బి. మురళీధర్‌, తుర్లపాటి లక్ష్మి, దొడ్డి రామ్మూర్తి, అన్నవరం దేవేందర్‌, పి. చిన్నయ్య, ఎలికట్టె శంకర్‌, పూడూరి రాజిరెడ్డి... లాంటి వాళ్ళెంతో మందున్నారు. గ్లోబలీకరణ మాయ తెలంగాణ గ్రామాలను విధ్వంసం చేసిన తీరును, ప్రపంచీకరణ మార్పులను సమర్థవంతంగా కధీకరించిన కథకుడు పెద్దింటి అశోక్‌కుమార్‌. వలస పక్షులు, మాయిముంత, ఇగ వీడింతే లాంటి రచయిత కథలు తెలంగాణ బతుకు సంఘర్షణలు. కాలువ మల్లయ్య రాసిన గోబలి,

105

గ్లోబలైజేషన్‌, పోట్రమతు కథలు గ్లోబల్‌ మాయను కళ్ళముందుంచేవే. గ్లోబలీకరణతో దళిత బహుజనుల బతుకుల్లో వచ్చిన మార్పులను బి.యస్‌.రాములు వేట చెట్టు కథల సంపుటి ద్వారా తెలిపారు. (ప్రపంచీకరణ తెలంగాణ దళిత బతుకుల్లో మార్పులను తీసుకొచ్చాయన్న పాజిటీవ్‌ అంశాల్ని బి.ఎస్‌.కథల్లో చూడవచ్చు. ప్రపంచీకరణ కార్మికుల బతుకుల్లో తెచ్చిన అమానవీయతను తుమ్మేటి రఘోత్తమ రెడ్డి కథల్లోనూ, ఆడెపు లక్ష్మీపతి జీవన్మృతుడులోనూ, కాలువ మల్లయ్య మళ్లీ తల్లి ఒడిలోకి కథల్లోనూ చూడవచ్చు. బి.వి.ఎన్‌. స్వామి బల్లిపాతర, అశోక్‌కుమార్‌ కాగుబొత్త ఇలాంటి కథలే. ప్రపంచీకరణం తెలంగాణ పల్లెలను,భాషను, సంస్కృతిని, కళలను విధ్వంసం చేసిన తీరును తెలంగాణ కథా రచయితలు సమర్థవంతంగా చిత్రించారు.

మైనారిటీ జీవితాల్లోని బతుకు వెతలను, దేశంలో ముస్లింలు, రెండవ జాతి పౌరులుగా ఉంటున్న తీరును వాళ్ల పేదరికాన్ని ...షాజహానా, స్కైబాబా కథలుగా మలిచిన తీరు అద్భుతం. మైనారిటీ కథల అవసరాన్ని నొక్కి చెబుతూ, గీతాంజలి, అన్వర్‌, పై రచయితలు రాసిన కథలెన్నో తెలంగాణ నుంచి వచ్చాయి. తెలుగులో మైనారిటీలపై లేని కథలలోటును తీర్పాయి. కాలంలోనే తెలంగాణ నుంచి మైనారిటీ కథ ఉద్యమంగా వస్తుంది. అలాగే అస్తిత్వ పోరాటాలను కూడా కథలుగా మలచి అస్తిత్వ కథలకు నాయకత్వం వహించిన ఘనత తెలంగాణ కథారచయితలకే దక్కుతుంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, భాషకు సంస్కృతికి జరుగుతున్న ద్రోహాన్ని చిత్రిస్తూ పులుగు శ్రీనివాస్‌, బెజ్జారపు రవీందర్‌, కాలువ మల్లయ్య, పెద్దింటి అశోక్‌ కుమార్‌, కాసుల ప్రతాపరెడ్డి కథలు రాసారు. సంకర విత్తులు, నిత్యగాయాల నది, ముక్కోటి తెలంగాణ, రాజయ్య రాకపాయె లాంటి కథలన్నీ కోవలోకి వస్తాయి. తెలంగాణ కాంక్షను బలంగా వ్యక్తం చేస్తూ కవిత్వం వ్యాసాలు వచ్చినంత ఆర్తితో కథలు రాకున్నా తెలంగాణ అస్తిత్వ పోరాటాలను సమర్థిస్తూ మంచి కథలే వస్తున్నాయి. ఇది యజ్ఞం కాదు. ఇందులో భాగమే. ఇలా కాలంలో ఇదువరకే రాస్తున్న కథారచయితలతోపాటు, కాలంలో కలం పట్టిన రచయితలు ఢీక్లాసిఫై అయి అద్భుతమైన కథారచన చేస్తున్నారు. ఇలా తరం కథ, మొత్తంగా తెలంగాణ కథ భాషా, ప్రాంత కథా సాహిత్యానికి తీసిపోకుండా అనేక రంగాల్లో తెలుగు కథకు మార్గదర్శనం చేస్తూ ముందుకు పోతూనే ఉంది.

106

ఇలా తెలంగాణ నుంచి నూట పదేళ్ళలో మూడువందలకుపైగా కథా రచయితలు కథకులుగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. మానవ జీవితానికి చేరువైన కథను (ప్రజాపరం చేస్తున్నారు. కథంటే మధ్యతరగతి చదువరుల కోసం, రాయబడే మధ్యతరగతి జీవితాలది మాత్రమే కాదని, ఇది అందరిదని ముఖ్యంగా దళిత జనులదని నిరూపిస్తూ కథలు రాస్తున్నారు. ఆయా వర్గాలను తమ కథలు చేరుకుంటానికి లిఖిత కథకు ఆశుకథా పరిమళమద్ది రచనలు చేస్తున్నారు. ఇప్పుడు పత్రికలు చదివేది, కథలు చదివేది ప్రధానంగా ఇదువరకు చదువుకునే అవకాశాలు లేని పీడితవర్గాల నుంచి వచ్చిన వారేనన్న విషయాన్ని గుర్తెరిగి కథారచన చేస్తున్నారు. ఆయా వర్గాల నుంచి వచ్చిన రచయితలు జీవితాలను గెలుచుకొని తమ చరిత్రను తాము రాసుకునే క్రమంలో పీడిత కులాల చరిత్రనుకథీకరిస్తున్నారు. రామాయణంలా, మహాభారతంలా, ఇతి హాసాల్లా పీడితకుల, వర్గాల ఇతిహాసాలను కథల ద్వారా పొందుపరుస్తున్నారు. తెలంగాణ కథా సాహిత్యమంటే పీడిత జాతుల విముక్తి కోసం, పీడితుల కోసం రాయబడే సాహిత్యమనుకునే విధంగా హీన, దీన మానవుల గురించి, కుక్కపిల్లా అగ్గిపుల్లా సబ్బుబిల్లా గురించి కథా సాహిత్యం వస్తుంది. అందులో భాగమే తెలంగాణ నుంచిప్రవాహంగా వస్తున్న దళిత బహుజన కథాసాహిత్యం. ఇదే ఇరవైఒకటో శతాబ్ది సాహిత్యం. ఎందుకంటే ఇరవై ఒకటవ శతాబ్ది బహుజన సాపాత్యానిదే. ఇది దేశానికేకాదు వ్రవంచ వీడిత జాతులన్నిటి కీ మార్గదర్శకమవుతుంది.

ఇలా 1902లో ప్రారంభమైన తెలంగాణ (తెలుగు) తెలుగు కథాప్రస్థానం నూటా పదేళ్ళుగా నిర్విఘ్నంగా, నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. తెలుగు కథను ముందుకు నడిపిస్తుంది. కథంటే మధ్యతరగతి జీవితాలది మాత్రమేకాదు అట్టడగు జీవితాలదికూడా అని తెలంగాణ కథ రుజువు చేసింది. ప్రామాణిక వ్యావహారిక భాష మాత్రమే కథకు వాడాలన్న వాదాన్ని మరింత ప్రగతిశీలంగా ముందుకు తీసుకెళ్ళి అట్టడుగు ప్రజలు, భాషాసంపదల సృష్టికర్తలైన ప్రజల మాండలిక భాషను వాడాలని వాడి చూపింది. కథకు ప్రాణభూతమైంది భాషతోపాటు విషయమన్న . విషయాన్ని రుజువు చేసింది. కథను విప్లవకథగా తీర్చిదిద్దడంలోనూ, దళితకథగా పరిణామం చెందించడంలోనూ, బహుజన కథగా స్థిరపరచడంలోనూ, మైనారిటీ అస్తిత్వవాద కథోద్యమాలు తీసుకురావడంలోనూ తెలంగాణ కథకులే ముందున్నారు. ఆయారంగాల్లో తెలుగుకథకు మార్గదర్శకత్వం వహించారు. తెలుగుకథల్లో వస్తువుగా

107

కొన్ని కులాలే, కొన్ని కులాల సమస్యలే ఉంటే కథంటే అందరిదని ముఖ్యంగా దళిత బహుజన కులాలకు విశేషంగా స్థానం ఇచ్చి బహుజన ఉద్యమానికి బాట వేసింది తెలంగాణ కథకులే. కథలో మాండలికం పరిమితంగా వాడాలనీ, సంభాషణల వరకే పరిమితం చేయాలని శాసించిన పీఠాధిపతుల శాసనాలను ధిక్కరించి పూర్తి మాండలికంలో కథలు రాసి మెప్పించిన ఘనత తెలంగాణ కథకులకే దక్కుతుంది. కథకు భాష వాడాలో నిర్ణయించుకునేది కథను రాసే రచయితే తప్ప విమర్శకులు కాదని రాసి చూపించి మెప్పించిన ఘనత తెలంగాణ కథారచయితలకే దక్కుతుంది. కథను పూర్తి వ్యావహారికంలోనూ, రచయిత కథనం వ్యావహారికంలో సంభాషణలు, పాత్రోచిత మాండలికంలోనూ, పూర్తి కథను మాండలికంలో రాసి కథకు భాషవాడాలో రాసి చూపించారు. సంస్మరణ వాదంతో ప్రారంభమైన కథను వివిధ దశలను అధిగమించి అట్టడంగం జీవన చిత్రణ కథగా ప్రజాస్వామ్యీకరించిన ఘనత తెలంగాణ కథకులకే దక్కుతుంది. కథంటే ఉబుసుపోకకు రాసేదో, సమయం గడపడానికి చదువుకునేదో కాదని, దానికో సామాజిక ప్రయోజనముందని ప్రయోజన దృష్టి కోణంలోంచి కథలు రాసిన కథారచయితలెంతోమంది తెలంగాణలో ఉన్నారు. రచయిత పేరు చెప్పకుండా కథ చదివితే అది తెలంగాణ నుంచి వచ్చిన కథే అనిపించేలా ప్రాంతీయముద్రతో రాసిన కథలెన్నో ఉన్నాయి. తనకు తెలిసిన జీవితాన్ని ప్రాంతీయముద్రతో చిత్రించి దాన్ని విశ్వజనీకరించడమే మంచి రచన ఉద్దేశ్యం. అలాంటి కథలెన్నిటి నో తెలంగాణ కథకులు రాసారు. తెలుగు సాహిత్యంలో మాత్రమే కాదు, భారతీయ సాహిత్యంలోనూ ప్రపంచసాహిత్యంలోనూ నిలువగల మానవీయ దృష్టికోణంలోంచి కథలు రాసి మెప్పించారు తెలంగాణ కథకులు.

విద్యార్థులు, మేధావులు,కార్మికులు, కర్షకులు, ప్రీలు, మధ్యతరగతి వాళ్లు, అట్టడుగు జనాలు, విలువలు, మానవసంబంధాలు, వివిధ వృత్తులు, దళితులు, బహుజనులు, సహస్రవృత్తులు, సమస్త జనాలు, ఉద్యమాలు, మైనారిటీలు, గిరిజనులు, భూస్వామ్య వ్యవస్థ, హ్యూడల్‌ వ్యవస్థ, సోషలిస్టు వ్యవస్థ, అస్తిత్వ పోరాటాలు, ఒకటేమిటి సమస్త విషయాల గురించి తెలంగాణ కథకులు కథలు రాసారు. తెలంగాణ కథ వైవిధ్యపూరితంగా అన్ని రంగాలను స్పృశిస్తూ భాషా సాహిత్యానికి తీసిపోకుండా కొన్ని విషయాల్లో ఇతరభాషా సాహిత్యాలకు మార్గనిర్దేశనం చేస్తూ క్రమ వికాసం చెందుతూనే ఉంది. తెలుగు కథకు, సాహిత్యానికి భరోసా ఇస్తుందనడంలో సందేహం లేదు.

108

తెలంగాణ నవల - బ.లస్‌.రాములు, సామాజిక తత్వవేత్త 1

తెలంగాణ నవల అంటే ఏమిటి?

తెలంగాణ నవలను ఈకిందివిధంగా నిర్వచించుకోవచ్చు.

1. తెలంగాణవాళ్ళు రాసిన నవలలు.

2. తెలంగాణ గురించి తెలుగులో రాసిన నవలలు. 8. 4 ర్‌

తెలంగాణ గురించి ఇతర భాషల్లో రాసిన నవలలు.

. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణవారి గురించిన నవలలు.

. తెలంగాణ వెలుపల నివసిస్తూ తెలంగాణ రచయితల రాసిన నవలలు

ఇలాంటి దృష్టితో తెలంగాణ నవలను పరిశీలించినప్పుడు వాటి వస్తువు, శిల్పం, కాలం, ఉద్యమం, స్థలం, ప్రత్యేకతల రీత్యా ఇలా వర్గీకరించవచ్చు.

తెలంగాణ నవలలను ఈవిధంగా వర్గీకరించవచ్చు:

1.

om HE © WW nm ©

i m5 lt pi .. ఫం

సాంఘిక నవలలు

చారిత్రక నవలలు, జానపద నవలలు తెలంగాణ ఉద్యమ నవలలు పాపులర్‌ నవలలు

కుటుంబాల నవలలు

వృత్తి నవలలు

బ్రాహ్మణ నవలలు

దళిత నవలలు

బీపీ నవలలు

ముస్లిం జీవితాల నవలలు

. స్రీలు ప్రధాన భూమికగా నవలలు

సామాజిక పరిణామాల నవలలు

. ఢేమ నవలలు

109

14. శైలీ శిల్ప ప్రయోగాలు ప్రత్యేకతగాగల నవలలు

15. (ప్రేంచంద్‌ వొరవడిలో వచ్చిన నవలలు

16. గోరి వొరవడిలో వచ్చిన నవలలు

17. ఠాగూర్‌, శరత్‌బాబు వొరవడిలో వచ్చిన నవలలు

18. గాంధీవాద దృక్పథంతో, ప్రభావంతో వచ్చిన నవలలు

19. మార్చ్‌వాద దృక్పథంతో, ప్రభావంతో వచ్చిన నవలలు

20. అంబేడ్మరిస్టు దళితవాద దృక్పథంతో, ప్రభావంతో వచ్చిన నవలలు 21. నాస్తిక హేతువాద దృక్పథంతో, ప్రభావంతో వచ్చిన నవలలు.

22. పిల్లల కోసం రాసిన నవలలు.

నవలా రచన గురించి:

పైన చెప్పినట్లు తెలంగాణ నవలలను సాంఘిక నవలలు, జానపద నవలలు, డిటెక్టివ్‌ నవలలు, పరిశోధనాత్మక నవలలు, ప్రయోగాత్మక నవలలు, ఉద్యమ నవలలు, సామాజిక పరిణామాల నవలలు, మధ్యతరగతి నవలలు, (గ్రామీణ జీవితాల నవలలు, ఆయా ప్రత్యేక వృత్తుల చిత్రణ నవలలు, కార్మిక నవలలు, రైతు జీవితాల నవలలు, స్త్రీల గురించిన నవలలు, స్త్రీవాద నవలలు, విప్లవ నవలలు, విప్లవవాద నవలలు, దళిత నవలలు, దళితవాద నవలలు, బీసీ నవలలు, బీసీవాద నవలలు, ముస్లిం నవలలు, ముస్లింవాద నవలలు, కైస్తవ నవలలు, కైస్తవ వాద నవలలు మొదలైన ఎన్నో రకాలుగా నవలలను వర్గీకరించవచ్చు. తెలంగాణ నుండి డిటెక్టివ్‌ నవలలు తక్కువ. విప్లవ నవలలు, రైతాంగ ఉద్యమ నవలలు, (గ్రామీణ జీవితాలనుండి మధ్య తరగతిగా ఎదిగే క్రమానికి సంబంధించిన నవలలు ఎక్కువ.

గతాన్ని బాగా గొప్పగా ఉందని, ఆనాటి జీవితం సంస్కృతి, శిథిలమౌతూ, పతనమైపోతున్నదని భావిస్తూ రాసే నవలలు. కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ కష్టాలు, సమస్యలు, అడ్డంకులు అధిగమించి ఒక స్థాయి మధ్య తరగతిగా స్థిరపడటం, మధ్య తరగతి జీవితంలోని సమస్యలు, మానవ సంబంధాలు, స్నేహాలు, స్వార్థాలు, చైతన్యం, నగరీకరణ అందులో రూపొందుతున్న నూతన సంబంధాలు, నూతన విలువలు, నూతన సంస్కృతి, అది అనివార్యమౌతున్న స్థితి, దాన్ని ఆహ్వానిస్తూ, రాసే నవలలు. వీటిని తటస్థ దృష్టితో (ప్రేక్షకుల్లాగా రాసే నవలలు. సామాజిక పరిణామాలను, ప్రేక్షకుడిలా, కెమేరా మెన్‌లా అనేక కోణాలను ఏకకాలంలో చిత్రించే నవలలు. ఏదోఒక పక్షం తీసుకుంటూ రాసే నవలలు. ఇలా నవలల్లో దృష్టికోణం, పాత్రల చిత్రణ, సమాజ చిత్రణ, రచయిత స్థాయి ననుసరించి సాగుతూ ఉంటుంది. రచయితలు చాలామంది

110

గతాన్ని గతంలోని గ్రామీణ జీవితంలోని, ఆత్మీయతలను, సంబంధాలను ఆరాధిస్తూ రాయడం కనపడుతుంది.

ఇది వర్తమానం బాగాలేదని, చెప్పడానికి వర్తమానం నుంచి, గతాన్ని చూసే దృష్టి అంతే తప్ప, తిరిగి అదే గతంలో నిజంగానే జీవించాల్సి వస్తే, వాళ్ళు వ్యతిరేకిస్తారు. నగరంలో జీవిస్తూ, ఆధునిక అభివృద్ధిని అందుకుంటూ, గ్రామీణ జీవితం ఎంతో బాగుందని, చిత్రించే రచయితలు కూడా ఉంటారు. అందువల్ల రచయిత జీవితం కూడా కొద్దిగా తెలుసుకుంటే మంచిది. కొందరు విష్లవంలోకి చైతన్యపూరితంగా వెళ్ళడాన్ని ప్రోత్సహిస్తూ రాస్తారు. కానీ వాళ్ళు ఉన్నచోటనే ఉంటూ జీవిస్తుంటారు. వారి వృత్తి వుద్యోగాలను, యధాతథంగా కొనసాగిస్తుంటారు. ఇలా ఆచరణకు చేసే ప్రబోధానికి చూపే ఆదర్శాలకు మధ్య వైరుధ్యం ఉంటుంది. ఆయా నవలలు, రచయితకు, రచనకు మధ్య వైరుధ్యాన్ని అంతరాన్ని తెలుపుతాయి.

నవలా రచన అనేక విధాలు:

నవలా రచన, పఠనం కొంతమంది వినోదం, కాలక్షేపం కోసం భావించవచ్చు. కొంతమంది సమాజాన్ని మానవ స్వభావాలను, జీవితాలను, సైకాలజీని అర్థం చేసుకోవడానికి రాయవచ్చు. అందుకోసం చదవవచ్చు. మరికొంతమంది సమాజాన్ని మార్చాలని, సామాజిక విలువల్లో, ఆలోచనల్లో, సంస్కృతిలో మార్పులు తేవాలని, బాధితులపట్ల, పీడితులపట్ల, పేదలపట్ల వికలాంగులపట్ల, పిల్లలపట్ల సమాజం చిన్నచూపు చూసేవారిపట్ల మద్దతుగా నిలుస్తూ, వారికి చేయూతనివ్వాలని, సంఘాన్ని సంస్కరించాలని, అందుకు చూసే దృష్టిలో మార్పు తేవాలని, రచన చేస్తుంటారు.

ఇలా నవలా రచన అనేక విధాలుగా సాగుతుంది. అన్నిట్లో చదివించే గుణం ముఖ్యం. కొన్ని నవలలు, బాగా ఉత్సాహంగా చదివిస్తాయి. మరికొన్ని నవలలను ఎంతో ఓపికతో కష్టపడి చదవాల్సి వస్తుంది. ఎక్కువమంది పాఠకులు, ఉత్సాహంగా చదివించే రచనల పట్ల ఆకర్షితులౌతారు. వస్తువు, శైలి, శిల్పం, సంభాషణ, సన్నివేశ చిత్రణ, సంఘటనల కల్పన. ప్రజెంటేషన్‌, చాఫ్టర్‌ల నిర్వహణ, పాత్రల నిర్వహణ, పాత్రలు, వాటి స్వభావాలు ఎదుగుతూ, మారుతూ పోయే క్రమం. కొన్ని పాత్రలు మొదటినుంచి చివరిదాకా ఒకేరకంగా కొనసాగడం జరగవచ్చు. డిటెక్టివ్‌ నవలలోని డిటెక్టివ్‌ రచయిత రాసే ప్రతి నవలలోకూడా అదే రకంగా స్వభావం ఉండవచ్చు. మర్యాద రామన్న వంటి పాత్రలు, ప్రతిదశలో ఒకే రకంగా ఉండవచ్చు. వీటిని ఫ్లాట్‌ పాత్రలు అని పిలుస్తారు.

పాత్రలు ప్రారంభంనుండి నవల ముగింపు అయ్యేసరికి వ్యక్తిత్వాలు, సంస్కృతి, ఆలోచనలు అనేక మలుపులు తిరిగి మొదటి దశ నుండి వ్యతిరేక దశకు గానీ,

111

ఎదుగుదలకు గానీ, మలుపులు తిరిగి, మరొక ఉన్నత దశకు గానీ, పతనానికి గానీ, పర్యవసించవచ్చు. ఇలాంటి పాత్రలను, ఓపెన్‌ ఎండ్‌ పాత్రలు అని చెప్పవచ్చు. ముగింపు ఇలాగే ఉంటుంది అని ఊహించే, సంభవించే వాటిని నిర్ణయమైన జీవితాలు సంస్కృతి అని చెప్పవచ్చు.

సమాజంలో అంగీకరించిన సంస్కృతి, విలువలు, (ప్రేమలు, పెళ్ళిళ్ళు, స్నేహ, లైంగిక సంబంధాలకు భిన్నంగా సాగే జీవితాలను, సంఘటనలను, పాత్రలను, చిత్రించే నవలలు, సమాజంలో సంవుర్నణను, ఆలోచనలను, నూతన భావాలను, ప్రవేశపెడతాయి. చలం రాసిన నవలలు, స్త్రీవాదులు, దళిత బహుజన వాదులు, విప్లవ వాదులు, రాసే నవలలు, ఇలాంటివే. (ప్రేంచంద్‌, శరత్‌బాబు, కొడవటిగంటి కుటుంబరావు వంటి మహా రచయితలు సమాజంలో చిన్నచూపు చూడబడే జీవితాలను, సానుభూతిలో అర్థం చేసుకునే విధంగా, నిత్య జీవితంలో వ్యతిరేకంగా, నెగెటివ్‌గా చూసే పాత్రలను సానుకూల దృష్టితో చూసి, వారిపట్ల స్పందించేవిధంగా చిత్రించడం చేశారు.

ఉదాహరణకు దొంగలపట్ల, వేశ్యలపట్ల, సమాజం హర్షించని లైంగిక సంబంధాలపట్ల, ఒక నూతన కోణాన్ని ప్రజలకు అందిస్తారు. ప్రజల మనస్సులను మారుస్తారు. దొంగతనం చేయడం, కేవలం వ్యక్తి యొక్క స్వభావం కాదని, అది సమాజం నుండి రూపుదిద్దుకుంటున్న ఒక స్థితి అని, వేశ్యలుగా మారడంలో, అక్రమ సంబంధాలు నెలకొల్పుకోవడంలోని పేదరికం, మోసగించబడడం, సామాజిక విలువల చట్రం పనిచేసే విధానం చిత్రించడం ద్వారా ఆయా పాత్రల పట్ల అపారమైన సానుభూతిని, గౌరవాన్ని కలిగించడం, చలం, (ప్రేంచంద్‌, శరత్‌బాబు, ఠాగూర్‌, కొడవటిగంటి కుటుంబరావు మొదలైన రచయితలు ఎంతో సాహసంతో చిత్రించారు.

ఇలాంటి రచయితలు సంఘ సంస్కర్తలు కూడా, సంఘాన్ని సంస్కరించడానికి రచనలు ఒక ప్రక్రియగా చేపట్టడం చేస్తుంటారు. ప్రేంచంద్‌ ఒక నవలలో విధవ వివాహాలను ప్రోత్సహించాలని, రాశారు. నవలలో పాత్ర జీవితంలోకి ఒకరితరువాత ఒకరు ఎంతో సన్నిహితంగా వస్తారు. వారితో ఆమెకు పెళ్ళయిపోతే బాగుంటుందని పాఠకులు భావిస్తారు. కానీ నవల చివరికి ఆమె ఒంటరిగానే మిగిలిపోతుంది. పాఠకులు తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతారు. రచయితపై కోపం వస్తుంది. రచయితకు హృదయం లేదు అని కూడా పాఠకులు భావిస్తారు. రచయిత సరిగ్గా భావం కలగడానికే నవల రాశారు.

రచయితపై కలిగిన కోపం నిజానికి సమాజ విలువలపై కలిగించిన కోపం. అందువల్ల పాఠకులు, తమ చుట్టూత గల అలాంటి విధవలకు మళ్ళీ పెళ్ళి చేయడాన్ని

112

చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తారు. కనీసం అంగీకరిస్తారు. ఇలా రచనల పాఠకుడి స్వభావంలో ఒక మలుపును తీసుకొస్తుంది. విలువల చట్రాలను మార్చుతుంది. ఇలాంటి కృషి చేసే రచయితలను సమాజ వైతాళికులని సంఘ సంస్మర్తలని, యుగకర్తలని పిలుస్తారు. నవల రచన గురించి తెలుసుకోవడానికి అనేక గ్రంథాలు తెలుగులో, ఇంగ్లీషులో వెలువడ్డాయి. వాటన్నిటి అంతస్సారం సంక్షిప్తంగా పేర్కొంటాను.

1. ఒక ప్రధాన పాత్ర వెంట మొత్తం జీవితం, అనుభవాలు, ఆలోచనలు, సన్నివేశాల సంఘటనలు చిత్రించడం.

2. ఒకొక్క చాస్టర్‌లో కొన్ని సంఘటనలను, పాత్రలను, సన్నివేశాలు, పాత్ర స్వభావాలు అవి మారుతున్న తీరు చిత్రిస్తూ, అనేక చాష్టర్‌ల ద్వారా బహు పాత్రల ద్వారా చిత్రించడం.

8. ఫస్ట్‌ పర్సన్‌ (ఉత్తమ పురుషులో నేను అనే పాత్ర ద్వారా మొత్తం నవల నడపడం. ఇందులో రెండు రకాలు. నేను పాత్ర ప్రధానపాత్రగా మిగతా పాత్రలను చిత్రించడం. నేను అప్రధానపాత్రగా ఇతర పాత్రలను చిత్రించడానికి ప్రేక్షకులులాగా ఉంటూ చిత్రించడం.

4. కథలో సంఘటనలు చెప్తారు. నవలలో సంఘటనలను వివరంగా చిత్రిస్తారు. కథలో సన్నివేశ చిత్రణ, సంభాషణ సంక్షిప్తంగా ఉంటుంది. నవలలో విస్తారంగా ఉంటుంది. నవలలో ఎక్కువ సంఘటనలు, ఎక్కువ సన్నివేశాలు, ఎక్కువ పాత్రలు ఉంటాయి.

5. నవల ఒకరోజులో జరిగినట్లు చూపవచ్చు. ఉదాహరణకు నవీన్‌ రాసిన “అంపశయ్య నవల. హోవర్డ్‌ ఫాస్ట్‌ రాసిన “సాక్మోవాంజెట్టి” నవల. అలాగే ఒక నవలలో యాభై యేళ్ల జీవితాన్ని, వందేళ్ళ జీవితాలను కూడా చిత్రించవచ్చు. సలామ్‌ హైదరాబాద్‌ నవలలో నాలుగువందల ఏళ్ళ హైదరాబాద్‌ జీవితాన్ని చిత్రించారు. ఇందులో ప్రధాన పాత్ర హైదరాబాదే.

6. సమకాలీన సమాజాన్ని సామాజిక పరిణామాలను నవలగా మలచడంలో కొన్ని కుటుంబాల్ని వాటికి సంబంధించిన పాత్రలను, స్వభావాలను, సన్నివేశాలను, సంఘటనలను, వాటిమధ్య సంఘర్షణలను, జీవితాల అభివృద్ధి పతనాలను, మలుపులను సృష్టించాల్సి ఉంటుంది. అప్పుడే అవి సమకాలీన సమాజాన్ని ప్రతిఫలించిన సామాజిక చరిత్ర ప్రతినిధి నవలలుగా రోజురోజుకు ప్రాధాన్యత సంతరించుకుంటాయి.

తెలంగాణ నవల ప్రారంభ వికాసాలు: సాహిత్య ప్రక్రియలను దశాబ్బాలవారీగా పరిశీలించడం ద్వారా ఆయా

113

కాలాలగుండా నవలావికాసం ఎలా జరుగుతూ వచ్చిందో, వాటి పరిణామాలు తెలుస్తాయి. సాహితీ చరిత్ర పరిణామాల క్రమ వికాసాన్ని అర్థం చేసుకోవడానికి ఆయా ప్రక్రియలను మరింత అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు వెళ్లడానికి పద్ధతి ఎంతో అవసరం. దృష్టితో సామాజిక పరిణామాలు, ఉద్యమాల రీత్యా, సాహిత్యంలోని మలుపులు, మైలురాళ్ళ రీత్యా దశాబ్దాల ననుసరించి, సామాజిక పరిణామాలు ఉద్యమాల ననుసరించి, తెలంగాణ నవల (ప్రారంభ వికాసాలను అనుసరించి... 1. 1850-1920, 2. 1920-1940, 3. 1940-1950, 4. 1950-1960 5. 1960-1970, 6. 1970-1980, 7. 1980-1990, 8. 1990-2000, 9. 2000-2013 మధ్య వచ్చిన నవలలుగా వర్గీకరించవచ్చు.

2

తెలంగాణా తొలి నవలలు

ప్రపంచవ్యాప్తంగా ఆధునిక కథానవలా వికాసం 'ప్రింటింగ్‌(పైస్‌, కాగితం ఉత్పత్తి, అభివృద్ధి క్రమంలో ఆవిర్భవించి వికాసం చెందాయి. పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామికవేత్తలు, ప్రజాస్వామ్యం, కార్మికవర్గం, మధ్యతరగతి, ఆధునిక విద్యావంతులు, రచయితలు ఎదుగుతూ వచ్చే క్రమంలో కథానవల ప్రక్రియల్లో అనేక పాయల్లో వికాసం జరిగింది. పరిణామాలు చాలామేరకు కథానవల ప్రక్రియల్లో ఇతర ప్రక్రియల కన్నా ఎంతో నిర్ధిష్టంగా వైవిధ్యభరితంగా, విస్తృతంగా పలు కోణాల్లో చిత్రించబడ్డాయి. విశ్లేషించబడ్డాయి. 18వ శతాబ్దం నుండి ప్రపంచ వ్యాప్తంగా కథా నవల విస్తృతమైంది. దిన, వార, మాస పత్రికలు, పుస్తక ప్రచురణ వేగం పుంచుకుంటున్న క్రమంలో రచయితలు వేగం పుంజుకున్నారు. అక్షరాస్యత పెరుగుతున్న క్రమంలో ఆయా ప్రక్రియలు, వాటి పాఠకులు విస్తరించడం జరిగింది.

చైతన్యంలో, అభివృద్ధిలో రవాణా సౌకర్యాల పాత్ర;

దేశం అభివృద్ధిలోనైనా రవాణా సౌకర్యాలు, సమాచార సౌకర్యాలు, చైతన్యం, ఉత్పత్తి విధానాల, అభివృద్ధిననుసరించి జీవన ప్రమాణాలు, చైతన్యం, సాహిత్యంకళలు అభివృద్ధి చెందాయి. క్రమంలో 1905 దాకా కలకత్తా రాజధానిగా ఆంగ్లేయులు భారతదేశాన్ని పరిపాలిస్తూ కలకత్తానుండి మద్రాసు దాకా గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్డు, రైలు వేయడం ద్వారా రోడ్డు, రైలు వ్యవస్థల ద్వారా మనుషులు వారి భావాలు, సంబంధాలు పెరిగి బెంగాలీ, మద్రాసీ, సీమాంధ్ర ప్రజల జీవితాలు కథానవలల్లో చిత్రించాలనే చైతన్యం పెరిగింది. రవాణా సౌకర్యాలు, సమాచార సౌకర్యాలు, ఆధునిక విద్య విస్తరణ లేనిచోట చైతన్యం ఆలస్యంగా ప్రారంభమైంది.

114

నైజాం రాజ్యంలో భాగమైన తెలంగాణ ఒక ప్రత్యేక దేశంగా, రాజ్యంగా, శతాబ్దాల తరబడి కొనసాగిన ప్రత్యేక చరిత్ర, సంస్కృతి, భాష, అభివృద్ధి పరిణామాలు నిర్దిష్టంగా, ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరముంది. అవసరంలోంచే తెలంగాణ సాహిత్యం, కళలు, సామాజిక పరిణామాలు, చరిత్ర, భాషా విశిష్టత, ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేసే క్రమంలో తెలంగాణ నవల వికాసం కథా వికాసం వంటి విషయాలను ఎప్పటికప్పుడు మరింత విస్తృతంగా నూతన కోణాల్లో అధ్యయనం చేయడం అవసరమౌతున్నది. తద్వారా తెలంగాణ సమాజం తననుతాను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది.

కొన్ని సామాజిక వర్గాల కులాల సాహిత్యం:

తొలిదశలో దేశంలోని అనేక భాషల్లో బ్రాహ్మణుల జీవితాలు కథలుగా, నవలలుగా చిత్రించడం జరిగింది. బ్రాహ్మణేతర జీవితాలు చిత్రించడం తక్కువ. ప్రాచీన సాహిత్య అలంకార శాస్త్ర సిద్దాంతాలు, దృక్పథాలు, వర్ణ వ్యవస్థ, కులవ్యవస్థ వివక్షతలు, అసమానతలు, చిన్నచూపు, ఇతర కులాలను శ్రామిక ఉత్పత్తి కులాలను, సేవాకులాలను, వారి సంస్కృతిని, భాషను, ఉత్పత్తి విధానాలను, కుటుంబ సబంధాలను సమాజంలో వారు నిర్వహిస్తున్న పాత్ర, ప్రాధాన్యతను గుర్తించ నిరాకరించారు. ఒక ఎలైట్‌ళిష్టవర్గం రాజాశ్రిత, ప్రభుత్వాశిత వర్గం రూపుదిద్దుకుంటూ ఆధునిక వ్యవస్థలో ఆధిపత్య స్థానాల్లోకి ఎగబాకి, ఆంగ్లేయులకు, నిజాంకు, 565 సంస్థానాధీశులకు సేవ చేస్తూ, తమ జీవితాలను సాధించుకుంటూ వచ్చారు. వీరు ఒకవైపు ప్రభుతను, ఏలికను, వినయంగా గౌరవిస్తూ, తమ సమాజంలోని ఇతర కులాలను చిన్నచూపు చూస్తూ రావడంవల్ల ఆధునిక సాహిత్యంలో సమాజానికి సమస ఉత్పత్తులను, సేవలను, అందిస్తూ వస్తున్న కార్మికుల గురించి, చేతివృత్తి కులాల గురించి, సేవాకులాల గురించి, ఆదివాసీల గురించి, దళితుల గురించి, వ్యవసాయదారుల గురించి, శూద్రుల గురించి, బాయడాన్ని నిరాకరించారు. అందువల్ల ఆధునిక సాహిత్య ప్రారంభ వికాసాలు ఆధిపత్య, కులాల వర్గాల, సామాజిక జీవితాలను చిత్రించే క్రమం భారతదేశంలో అన్ని భాషల్లో ఏర్పడింది.

భారతీయ నవలా వికాసంలో దేశీయత:

భారతీయ నవలను, తెలుగు నవలను, తెలంగాణ నవలను, వాటి ప్రారంభ వికాసాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. భారతీయ నవలా వికాసంలో (ప్రేంచంద్‌, ఠాగూర్‌, శరత్‌బాబు వంటివారు చిత్రించిన భారతీయ దేశీయతను, దాని ప్రాధాన్యతను విశ్లేషించాల్సి ఉంది. అప్పుడే నిర్దిష్ట దేశీయ, సామాజాన్ని చరిత్రను, పరిణామాలను పరిగణనలోకి తీసుకొని, వాస్తవాలకు అనుగుణంగా విశ్లేషించడం సాధ్యపడుతుంది. కాత్యాయనీ విద్మహే నవలా వికాసంలో కోణాలు లోపించాయి. లోపాలను నా

115

వ్యాసంలో పూరిస్తూ, సమగ్ర, సామాజిక దృక్పథంతో వ్రాసిన 'సమ([గ్ర సామాజిక కథి, సాహిత్య చరిత్రను కొత్త చూపుతో తిరగరాయాలి అనే నా గ్రంథాల సారాంశాన్ని నవల ప్రక్రియ ప్రారంభవికాసాలకు అన్వయిస్తూ, సంశ్లేషించడం వ్యాసం పరిధి, పరిమితి.

“సహవాసి” వందేళ్ళ నవలల్లో 25 నవలల గురించి రాసిన వ్యాసాల సంపుటిలో తెలంగాణ నవలలు మూడే. అవి వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన “ప్రజలమనిషి, దాశరథి రంగాచార్య రాసిన “చిల్లర దేవుళ్ళు”, అంపశయ్య నవీన్‌ రాసిన “అంపశయ్య. వందేళ్ళలో బాగా గుర్తింపు పొందిన ప్రసిద్ధ నవలల పరిచయంలో తెలంగాణ నవలలు మూడే స్వీకరించబడ్డాయి. సహవాసి పుస్తకంలో శతాబ్దిలో వెలువడిన మరికొన్ని చదువదగిన నవలలు అని 55 నవలలను పేర్మాన్నారు. లిస్టులో వట్టికోట ఆళ్వారుస్వామి గంగు’, భాస్కరభట్ల కృష్ణారావు “వెల్లువలో పూచికపుల్లలు’, సింగరాజు లింగమూర్తి, “ఆదర్శాలు - ఆంతర్యాలు), లక్ష్మికాంతమోహన్‌ 'సింహగర్జని, మహీదర రామమోహన్‌రావు “ఓనమాలు, “రథచక్రాలు, బొల్లిముంత శివరామకృష్ణ మృత్యుంజయులు. పోరంకి దక్షిణామూర్తి 'ముత్యాలపందిరి లత “పథవిహీన, 'మోహనవంశీ”, మహానగరంలో స్త్రీ; పోల్కంపల్లి శాంతాదేవి “నాకాగమనంి), దాశరథి రంగాచార్య “'మోదుగపవూలు, “జనపదం” నవలలు పేర్కొనబడ్డాయి. వీటిలో తెలంగాణ ఉద్యమ నవలలు ఎక్కువ. తెలంగాణ సామాజిక పరిణామాల గురించిన నవలలు తక్కువ.

వీరి రచనలతోపాటు తెలంగాణ నవలాకారుల్లో లోకమలహరి, భాస్మరభట్ల కృష్ణారావు, ఇల్లిందల సరస్వతీదేవి, మాదిరెడ్డి సులోచన, పోల్మంపల్లి శాంతాదేవి, నెల్లూరు కేశవస్వామి, బొమ్మ హేమాదేవి, అంపశయ్య నవీన్‌, బోయ జంగయ్య, అల్లం రాజయ్య, బి. ఎస్‌. రాములు, మలయశ్రీ, జాతశ్రీ, కసిరెడ్డి వెంకటరెడ్డి, ముదిగంటి సుజాతారెడ్డి, గీతాంజలి, ఐతా చంద్రయ్య, కాలువ మల్లయ్య, రామా చంద్రమౌళి, పి. చంద్‌ యాదగిరి, వేముల ఎల్లయ్య, ప్రభాకర్‌ జైని, పెద్దింటి అశోక్‌కుమార్‌, ఎస్‌. ఎం. ప్రాణ్‌రావు, నేరెళ్ళ శ్రీనివాసగౌడ్‌, భూతం ముత్యాలు. జాజుల గౌరి మొదలైనవారి నవలలను ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం వుంది.

1. 1850-1920 మధ్య వచ్చిన తెలంగాణ నవలలు.

(ప్రజలగురించి రాసే కథలు, నవలలు ఎంతో చైతన్యవంతమైన రచయితలు మాత్రమే రాయగలిగారు. ఒక (ప్రేంచంద్‌, ఒక శరత్‌బాబు వంటి వారిని పేర్కొనవచ్చు. తెలంగాణ సాహిత్యంలో నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన తడకమల్ల కృష్ణారావు 1860లో 'కంబుకంధర చరిత్ర అనే రచన తొలి నవల అని చెప్పవచ్చు. ఆయనే

116

“కామరూప కథి, 'తెలుగు - వెలుగు ముగ్గకథ' అనే నవలను కూడా రాశారు.

తెలంగాణలో అక్షరాస్యత తక్కువ. వందల ఎకరాలు ఉన్న భూస్వాములు కూడా చదువులవల్ల గుమస్తా నౌకరులు చేయాల్సిన ఖర్మ మాకేమిటని వ్యతిరేకిస్తూ ప్రాథమిక విద్యను జమాఖర్చులెక్కలను తెలుసుకునేమేరకే చదువును పరిమితం చేసుకున్నారు. ఇక మిగితా కులాల సంగతి చెప్పనక్కరలేదు. స్వాతంత్ర్యం వచ్చేదాక ఇదే దృష్టి కొనసాగింది.

2. 1920-1940 మధ్య వచ్చిన తెలంగాణ నవలలు.

1922లో శేషాబట్టరు వెంకటరామాచోర్యులు “ప్రాకృత దాంపత్యం” అనే నవలను రాశారు. 1918లో ఒద్దిరాజుల సోదరులలో ఒకరైన సీతారామచం[ద్రయ్య 'రుద్రమదేవి, 'కౌర్యశక్తి, భ్రమరి, బ్రాహ్మణ సాహసం” మొదలైన చారిత్రక నవలలను, 'స్రై సాహసము), “ముక్తలవి అనే సాంఘిక నవలలను రాశారు. ఒద్దిరాజు రాఘవ రంగారావు “వరాహముధ్రి, “వీరావేశం” అనే చారిత్రక నవలలను రాశారు. ఒద్దిరాజు సోదరుల శతజయంతి సంచికలో బండారు సదాశివ, వనం అరుణ రాసిన వ్యాసాల్లో కొన్ని నవలల ప్రతులు ఉన్నాయని తెలుస్తున్నది.

1930లలో పైడిమర్రి వెంకట సుబ్బారావు కాల భైరవుడు అను నవలను, నల్గొండ జిల్లా దేవరకొండ (ప్రాంతానికి చెందిన సయ్యద్‌ అలీ, అజ్మతుల్లా సోదరులు 1945-60 మధ్య కాలంలో 'సుశీలి, 'సుజాతి, మణి”, 'రంపరాకాసి, “జాహ్నవి” వంటి నవలలు రాశారు. పొట్లపల్లి రామారావు 1954లో “నీలవేణి” అనే నవలను రాశారు. ఇది అసంపూర్తి నవల.

సోమయాజుల లక్ష్మీనరసింహశాస్తి 'గిరిజి, చెవులూరి లక్ష్మీనరసింహారావు 'ఎగిరే పల్లాలు, కొల్లు మధుసూధనరావు “శిక్ష, కొట్ర మల్లిఖార్జున శర్మ 'స్వర్ణలతి, మూడుంబ పురుషోత్తమచార్యులు 'నీడలేని చెట్టు, కొండపల్లి శేషగిరిరావు “చీకటి వెలుగులు” నవలలను రాశారు. చీకటి వెలుగుల్లో స్వాతంత్ర్యం పూర్వం, తర్వాత ఉన్న పరిస్థితులను చిత్రించారు. బోయినపల్లి వెంకటరామారావు, ‘జీవిత బంధాలు, పుల్లాభట్ల వెంకటేశ్వర్లు, కోలహలం లక్ష్మణరాజు కొన్ని నవలలు రాసినట్లు తెలుస్తున్నది. వసంతరాయ్‌ తొమ్మిది నవలలు, ఎం.డి. చైతన్య పేరుతో ప్రసిద్ధిచెందిన మహ్మద్‌

అహ్మదుల్లా పలు నవలలు రాశారు.

8. 1940-1950 మధ్య వచ్చిన తెలంగాణ నవలలు.

1940-50ల మధ్యకాలంలో నిజామాబాద్‌కు చెందిన లోక్‌ మలహరి, 'జగ్గనివిద్దె, “సంగంి అనే నవలలను తెలంగాణ భాషలో రాశారు. సుప్రసిద్ధ కవి దాశరథి

117

కృష్ణమాచార్య “అమరశిల్పి జక్కన్న అనే నవల రాశారు. 1952లో వట్టికోట ఆళ్వారుస్వామి “ప్రజలమనిషి, “గంగు అను నవలలను రాశారు.

1956 వరకు వచ్చిన కథలను, నవలలను ఒక దశగా పరిగణించవచ్చు. ఐతే సామాజికంగా మొత్తం వందేళ్ళు తెలంగాణ సమాజం ఒకే రీతిగా సాగలేదు. సౌలభ్యం రీత్యా మాత్రమే వందేళ్ళను తొలిదశగా పేర్కొనడం జరుగుతుంది. రచయితలను తొలితరం రచయితలుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఆయా కథల్లో, నవలల్లో వందేళ్ళ పరిణామాలు ఏదో ఒక స్థాయిలో, ఎంతోకొంత చిత్రించబడ్డాయి.

1840-1956 దాకా తెలంగాణలో ఎంతో సాహిత్యం వెలువడ్డది. తెలంగాణలో కవులే లేరని ఎవరో రాస్తే సురవరం ప్రతాపరెడ్డి 850 మంది కవుల రచనలతో 1935లో గోల్కొండ కవుల సంకలనం ప్రచురించారు. సంగిశెట్టి శ్రీనివాస్‌ తన పరిశోధన ద్వారా 1956 దాకా రెండువేలకు పైగా కథలు, వందలాది నవలలు తెలంగాణ నుండి వెలువడ్డాయని వాటి వివరాలను, వెలికితెచ్చారు.

లక్షలాది పాఠకులకు చేరిన తెలంగాణ మహిళా రచయితలు:

1960-70 మధ్య మహిళా నవలా దశాబ్దంగా, మహిళా రచయితల స్వర్ణయుగంగా భావించబడిన కాలంలో కాలంలో రాసిన తెలంగాణ మహిళా రచయితలను గురించి... మచ్చుకు పోల్కంపల్లి శాంతాదేవి, మాదిరెడ్డి సులోచన, బొమ్మ హేమాదేవి మొదలైనవారి గురించి కూడా పట్టించుకోలేదు. పాపులర్‌ నవలా రచనలో తెలంగాణ మహిళా రచయితలు ఎవరెవరు అని పరిశీలించలేదు. బతికున్న సాహితీవేత్తలు తమ గురించి గానీ, తమకు తెలిసినవారి గురించి గానీ, ఎందుకు యువతరానికి చెప్పలేదు, లిపిబద్దం చేయలేదు?. ఉదాహరణకు హీరాలాల్‌ మోరియా రచనలను వట్టికోట ఆళ్వారుస్వామి 1958లో ప్రచురించారు. ఆయన బతికి ఉన్నట్టు, ఉద్యోగం చేసి ఖమ్మంలో రిటైరైనట్లు 2004లో ముదిగంటి సుజాతారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో విషయ సేకరణ చేసి, రాసేదాక లోకానికి తెలియలేదు. ఇందులో ఆయా రచయితల నిర్లక్ష్యంతోపాటు సాహితీవేత్తల నిర్లక్ష శం, మరుపు పాత్ర ఎంతో ఉంది.

తెలంగాణ నవలాకారులు ఎందుకు నిర్లక్ష్యానికి గురయ్యారు?:

1970 దాకా విశేష కృషి చేసిన, తెలంగాణ సాహితీవేత్తల కృషి తెలుగు సాహిత్య చరిత్రలో, చర్చలో, సంకలనాల్లో, పునర్ముద్రణల్లో, పాఠ్యపుస్తకాల్లో చేర్చడంలో, ఎందుకు నిర్లక్ష్యం చేయబడ్డాయి?. ప్రశ్నకు జవాబు వెతుక్నోవాల్సి ఉంది. అరసం సాహిత్య కృషిలో ఎంతోమంది తెలంగాణ సాహితీవేత్తలు ఉన్నారు. అయినా ఇలా ఎందుకు జరిగింది?. విప్లవ రచయితల సంఘం వచ్చిన తర్వాత కూడా చాలాకాలం ఇలాగే

118

ఎందుకు సాహితీ చరిత్ర రాయబడింది?.

1977లో విప్లవోద్యమం వేగం పుంజుకొని జగిత్యాల జైత్రయాత్ర, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, దండకారణ్య పోరాటాలు విస్తరిస్తూ, నూతన తరాల సాహితీవేత్తలు ఎదిగే (క్రమంలో విప్లవ సాహిత్యం, తెలంగాణ భాషా, సంస్కృతి తిరిగి చర్చనీయాంశమైంది. అయినప్పటికీ, అంతకుముందే తెలంగాణ భాషలో తెలంగాణ వస్తువు, శిల్పంతో తెలంగాణ సామాజిక పరిణామాలతో రాసిన సాహిత్యం తెలుగు సాహిత్య (ప్రధాన చర్చలోకి ఎందుకు రాలేకపోయింది.

1980లో వరవరరావు తెలంగాణ రైతాంగ ఉద్యమం గురించి రాసిన ఆరు నవలలపై పి. హెచ్‌డి. చేసినప్పటికీ అంతకుముందటి తెలంగాణ సాహిత్యం యొక్క ప్రాధాన్యత ఎందుకు చర్చలోకి తేలేదు?. ముప్పాళ్ళ లక్ష్మణరావు, అల్లం రాజయ్య తెలంగాణ భాషలో కథలు, ముఖ్యంగా 'కొలిమంటుకున్నది' నవల సృజన మాసపత్రికలో సీరియల్‌గా ప్రచురించబడ్డప్పుడే తెలంగాణ భాష అర్థం కావడంలేదని చర్చ ఎందుకు మొదలయ్యింది?. అంతదాకా రాయబడిన తెలంగాణ భాష కథలు, సాహిత్యం ఎందుకు చర్చలోకి తీసుకురాలేదు. ఎందుకు అదంతా మరుపుకు గురైంది?.

ప్రశ్నించేదాకా ఎందుకు పట్టించుకోలేదు?:

1990ల నుండి దళిత బహుజన సాహితీవేత్తల కృషి గురించి, కులసమస్య గురించి, దళిత రచయితల, కళాకారుల, మేధావుల ఐక్యవేదిక నిర్మాణ ప్రయత్నాల నుండి, బహుజన సమాజ్‌ పార్టీ తెచ్చిన నూతన చైతన్యం నుండి దళిత బహుజన జీవితాల సాహిత్యం, కళలు, సాహితీవేత్తల గురించి వెలికితెచ్చేదాక, ప్రశ్నించేదాక, తెలుగు సాహిత్యం, తెలంగాణ సాహిత్యం, సాహిత్యకారులు, సంపాదకులు, పాఠ్యపుస్తక రూపకర్తలు, పట్టించుకోలేకపోయారు. అంతదాకా కులసమస్య, వర్ణ కుల వివక్ష ఒకటి ఉందని, గ్రామీణ స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ అనేది కుల వృత్తుల ఆధారిత, కుల వ్యవస్థ నిర్మాణం తప్ప మరేమీ కాదని, చెప్పలేకపోయారు. నిర్మాణాన్ని పరిణామాలను, మానవ సంబంధాల వివక్షతను, చరిత్ర నిర్మాతలుగా, సామాజిక చరిత్ర, జీవన ప్రమాణాలలో వారి ఉత్పత్తులు, సేవల ప్రాధాన్యతను సాహిత్యంలో చిత్రించలేకపోయారు.

రాష్ట్ర ఉద్యమ చైతన్యంతో తెలంగాణ తనను తాను తెలుసుకునే ప్రయత్నాలు:

1995 నుండి అంబటి సురేందర్‌రాజు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్‌, కె. శ్రీనివాస్‌, ముదిగంటి సుజాతారెడ్డి, పత్తిపాక మోహన్‌, బి.ఎస్‌. రాములు, గూడూరి సీతారాం, నందిని సిధారెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, కాసుల ప్రతాపరెడ్డి, కాలువ మల్లయ్య వంటి తెలంగాణ సాహితీవేత్తలు విస్తృతంగా

119

తెలంగాణ సాహితీ సంస్కృతి అస్థిత్వం, పరిణామం, ప్రాధాన్యత గురించి వెలికితీసి రికార్డ్‌ చేయడం ద్వారా 1840-1960 దాకా సాగిన తెలంగాణ సాహిత్య చరిత్ర సీక్వెల్‌గా రికార్డ్‌ అవుతూ వస్తున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 1995 నుండి అస్థిత్వ వేదన, వెతుకులాట నుండే ప్రారంభమైంది. అంతదాకా ఇది మరుపుకు గురైంది. సుమారు నూటపది సంవత్సరాల తెలంగాణ సాహిత్య చరిత్ర మరుపుకు గురైంది. బతికున్న సాహితీవేత్తలు కూడా తమ జ్ఞాపకాలను, తమ రచనలను గుర్తుచేసి, సాహితీ చరిత్రను తిరగరాయించే ప్రయత్నం జరగలేదు. ప్రశ్నలకు జవాబులు వెతికే క్రమంలో ముదిగంటి సుజాతారెడ్డి తెలంగాణ నవల గురించి ఆంధ్రజ్యోతి 14-08-2010 సాహిత్య పేజీలో రాస్తూ ఇలా పేర్మొన్నారు.

“తెలంగాణ నవలలు పరిమాణంలో, వస్తువులో, శిల్పంలో ఇతర ప్రాంతాలనుండి వచ్చిన నవలలకన్నా తక్కువగా లేవు. అసలు తెలంగాణ నుండి వచ్చిన నవలల గురించి ఇంతవరకు మనం సీరియస్‌గా పట్టించుకోలేదేమో. కొంతవరకు ప్రధాన స్రవంతిగా వచ్చిన కోస్తా ప్రాంతపు నవలలను చదవటంలో వాటిని గురించే చర్చించడంలో మునిగిపోయాం. కానీ సామాజిక, చారిత్రిక, నేపథ్యంలో వికసించిన తెలంగాణ ప్రాంత పరివేక్షణలో రచించబడిన నవలలను మొదలైన ప్రక్రియలను ప్రధాన స్రవంతి సాహిత్యం, సాహిత్య అధ్యయనపరులు పట్టించుకోలేదు.

ప్రాంతీయంగా ముఖ్యంగా నిజామాంధ్రుల చారిత్రక భూమికనుండి వచ్చిన రచనలు, భిన్నమైన అభివ్యక్తి వస్తువులతో రావడంతో ప్రధానస్రవంతి సాహిత్య అధ్యయనం చేసేవాళ్ళకు చారిత్రక భూమిక అనుభవంలో లేకపోవటంచేత వాళ్ల దృష్టికి తెలంగాణ నవలలు పరాయీకరణం పొందుతున్నాయి. ముఖ్యంగా కోస్తా నవలల్లో చిత్రించబడిన బ్రాహ్మణుల జీవితం, సమస్యలకు, వాతావరణం, తెలంగాణ నవలలు లేకపోవటం కూడా పట్టించుకోకపోవడానికి పరాయీకరణ పాలు కావటానికి కారణమని చెప్పాలె.

1956 తర్వాత కూడా అంతకుముందు తెలంగాణ సాహిత్య ఉద్యమ రాజకీయాల్లో సక్రియులై పనిచేసిన వట్టికోట ఆళ్వారుస్వామి, బూర్గుల రంగనాథరావు, నెల్లూరు కేశవస్వామి, కాంచనపల్లి, భాస్కరభట్ల కృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి వంటివాళ్ళు ఎందరో జీవించి ఉన్నారు. అయినా తెలంగాణ సాహిత్యాన్ని ప్రధాన (స్రవంతిలో కలుపలేకపోయారు. ప్రధానస్రనంతిలోని రచయితలతో కలిసి పనిచేయలేకపోయారు. అందుకు కారణాల్లో ఒకటి రచయితల రచనల నేపథ్యం భిన్నమైంది. వీళ్ళు నవలల్లో, కథల్లో, కవిత్వంలో, పాటల్లో చిత్రించే జీవితం, సంస్కృతి వస్తువు, ఇతివృత్తం భిన్నమైనది.

తెలంగాణ చారిత్రక భౌగోళిక సందర్భాన్ని (బిటీషాంధ్ర నుండి వచ్చిన రచయితలు

120

జీర్ణించుకోలేకపోయారు. ఇక్కడికి వచ్చిన ప్రధాన స్రవంతి కవులు, ఇక్కడ సాహిత్య గరిమను గుర్తించలేకపోయారు. స్వీకరించలేకపోయారు. ప్రధాన స్రవంతిలో ఇక్కడి సాహిత్యం ఎక్కడ విధంగా ఇముడుతుందో ఆలోచించలేకపోయారు. రెండవది ఇక్కడి రచయితల్లోగానీ, అక్కడి రచయితల్లోగానీ (బ్రాహ్మణ వర్షానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ పర్‌స్పెక్టివ్‌ - పరిప్రేక్ష్యం వేరేగా ఉంటుంది. బ్రాహ్మణ వర్గాన్ని వాళ్ళ సమస్యలను, వాళ్ళ జీవన విధానాన్ని చిత్రించడం, పాత్రలు, సంభాషణలు అంతా వేరేరకమైన పరివేషణంతో ఉంటాయి. తెలంగాణ రచయితలకు పరివేషణం లేదు. వాళ్ళది ఉద్యమాల్లో మగ్గిన ప్రజాసామాన్యాన్ని చిత్రించే దృష్టి. కానీ ఎప్పుడైతే ఇక్కడ రచయితలకు రచయితలతో సంబంధం ఏర్పడిందో ఇక్కడి బ్రాహ్మణులు ఇన్నాళ్లు తమకు లేని బ్రాహ్మణాధిక్యత భావంలోకి నెట్టబడ్డారు. ఇంతవరకు తాము చేసిన రచనల విషయాన్ని గాని, నడిపిన ఉద్యమాలను, సాహిత్య సంస్థల గురించి గానీ, విస్మరించదలుచుకున్నారు. విస్మరించారు. అక్కడినుండి వచ్చిన కవుల, రచయితల ఆధిపత్యం ఇక్కడి భాషను కించపరచడం చూసి, వీళ్లు ఎదుర్శునేది పోయి వాళ్ల భాషలో మాట్లాడటం, వాళ్లమధ్య పేరు సంపాదించటానికి, వాళ్లలాగా వాళ్లలాంటి వస్తువుతోరాయటం మొదలుపెట్టారు. దాంతో తెలంగాణ ఇన్నాళ్ళ సాహిత్యం విస్మృతమైంది. తెలంగాణ తన అస్థిత్వం కోల్పోయింది. అక్కడివాళ్ళతో మమేకమై, వాళ్ళలాగ సాహిత్య సృష్టి చేయలేదనే న్యూనతా భావంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళముందు తమ ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుకొని గర్వంగా నిలబడలేకపోయారు. 1956ల నుంచి 1980లో విప్లవోద్యమం మధ్యకాలంలో కొంతమంది రచయితలు ఉన్నా వాళ్ళు భాషా నుడికారంలో గానీ, వస్తువు పాత్రల పేర్లు, స్థలాలు గానీ, విషయంలోనూ తెలంగాణ తనాన్ని పాటించలేదు. సమయంలోనే తెలంగాణ తొలితరం రచయితలు, సాహిత్యం అంతా విస్మృతమైంది. తెలంగాణ తన అస్థిత్వం నిలుపుకోవటం, గర్వంగా నిలవటం, 1995 నుండి తెలంగాణ ప్రాంత అస్థిత్వవేదనా ప్రారంభంతో ఆరంభమైంది. ఇది తెలంగాణలో మరో పునరుజ్జీవన ఉద్యమమని చెప్పవచ్చు”.

నిజానికి 1990 నుండి ప్రయత్నం దళిత బహుజన సాహితీవేత్తలు, వారి రచనలు, జీవితం గురించి వెతికే క్రమంలో దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక నుండే బిఎస్పీ ప్రవేశం నుండే వేగం పుంజుకున్నది. అలా సలంద్ర, గూడూరి సీతారాం, జి. రాములు, జి. సురమౌళి, తదితర తెలంగాణ సాహితీవేత్తలను నూతన కోణాల్లో తెలంగాణ అస్థిత్వంతో ముందుకు తీసుకురావడం జరిగింది. బోయ జంగయ్య, కాలువ మల్లయ్య, పెద్దింటి అశోక్‌ కుమార్‌, వేముల ఎల్లయ్య, భూతం ముత్యాలు, జాజుల గౌరి, నేరెళ్ళ శ్రీనివాసగౌడ్‌, ననమాస స్వామి, అంపశయ్య నవీన్‌, పి. చంద్‌

121

యాదగిరి, జాతశ్రీ, శాంతి ప్రబోధ, గూడ అంజయ్య, కంచె అయిలయ్య, స్మైబాబా, ముదిగంటి సుజాతారెడ్డి మొదలైన రచయితలు దరకమే ఐక్య వేదిక ఇచ్చిన స్ఫూర్తితో బహుజన జీవితాలను, సంస్కృతిని మునుపెన్నడూ లేనంత బలంగా చిత్రించారు.

8

నవలా రచనలో రచయితల సంఘాలు, ఉద్యమాలు పత్రికలు, ప్రచురణ సంస్థల, నవలల పోటీ ప్రభావం

సాహిత్య రచనలో సాహిత్య సంఘాల ప్రాధాన్యత:

సాహిత్య వికాసంలో సాహిత్య సంఘాల ప్రాధాన్యత ఎంతో ఉంది. ఆయా ఉద్యమాల ప్రభావంలో ఏయే రచనలు వెలువడ్డాయో చాలామంది చెప్తున్నారు గానీ, వాటి సృజనలో సాహిత్య సంఘాల పాత్ర, ప్రాధాన్యత ఏమిటో చెప్పడం లేదు. ఇది వాస్తవాలను, చరిత్రను వదిలివేయడంతో సమానం.

తెలంగాణ రచయితల సంఘం, అభ్యుదయ రచయితల సంఘం, వివ్లవ రచయితల సంఘం, కరీంనగర్‌ జిల్లా రచయితల సంఘం వంటి జిల్లా రచయితల సంఘాలు, దళిత రచయితల, కళాకారుల, మేధావుల ఐక్యవేదిక, మహిళా రచయితల వేదిక, మాదిగ సాహిత్య పరిషత్‌ వంటి రచయితల సంఘాలు లేకుండా ఆయా సామాజిక వర్గాల, ఉద్యమాల, సాహిత్య సృజనను ఊహించలేము. వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ రచయితల సంఘ నాయకుల్లో ఒకరు. దాని నిర్మాత కూడా. అలాగే ఉద్యమ నవలలు రాసిన వాళ్ళు చాలామంది అభ్యుదయ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులు. అలాగే విప్లవ నవలలు రాసిన రచయితలు విప్లవ రచయితల సంఘంలో (క్రియాశీల సభ్యులు. అలాగే దళిత బహుజన సాహిత్య రచయితలలో చాలామంది దరకమేక ఐక్య వేదికలో క్రియాశీల సభ్యులు. వీరి చొరవతో, స్ఫూర్తితో, కర్తవ్య దీక్షతోనే ఆయా సాహిత్య శాఖలు, ప్రక్రియలు, దృక్పథాలు, సాహిత్యంలో ముందుకు సాగాయి. వాటి చరిత్రను ఆయా రచనల నేపథ్యంలో తప్పనిసరిగా పేర్కొనడం అవసరం. వీలువెంట పనిని ఆయా రచనలు నేపథ్యంలో వెలువడ్డాయో వెలికితీసి రాసే ప్రయత్నం చేస్తాను.

ఉదాహరణకు తెలంగాణ రచయితల సంఘం తరపున కరీంనగర్‌ జిల్లా, సిరిసిల్లకు చెందిన జి. రాములు 1953లో 'పెరటిచెట్టు అనే పెద్ద కథను నవలగా పేర్కొంటూ, వట్టికోట ఆళ్వారుస్వామి ప్రచురించారు. గూడూరి సీతారాం ఒకటి రెండు నవలలు రాసినట్టు చెప్పారు.

122

తెలుగు నవలను మలుపుతిప్పిన అభ్యుదయ ప్రగతిశీల సాహిత్యం:

వామపక్ష ఉద్యమాల ప్రభావంతో వచ్చిన రచనలు, సిద్ధాంత చర్చలు, మహిళా పాఠకుల రచనలనుండి తిరిగి మగ పాఠకులకు, సామాజిక చైతన్యం వైపు నడిపించే రచనలకు మలుపు తిప్పాయి. అయితే ఇవి ఫిక్షన్‌ రైటింగ్‌ కన్నా సాహిత్య విమర్శ, చర్చలు ఎక్కువ. సగటు పాఠకులను ఆకట్టుకోవడం తక్కువ. ఇలా పరిమితిలో 1950-70 మధ్య అనేక ఉద్యమాల నవలలు తెలంగాణ మధ్య తరగతి వికసిస్తున్న నవలలు వెలువడ్డాయి. భాస్మరభట్ల కృష్ణారావు, కందిమల్ల (ప్రతాపరెడ్డి, ఎం.వి. నరసింహారెడ్డి, తడకమళ్ళ వెంకటేశ్వరరావు, బండారి శ్రీనివాసరావు, మాదిరెడ్డి సులోచన, పోల్మంపల్లి శాంతాదేవి, ఇల్లిందల సరస్వతీదేవి, బొమ్మ హేమాదేవి, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య, బి.ఎన్‌. శాస్త్రి, తాడిగిరి పోతరాజు, పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు తదితరులు తెలంగాణ నుండి అనేక నవలలు రాశారు.

మాదిరెడ్డి సులోచన 70కి పైగా, పోల్మంపల్లి శాంతాదేవి 69కి పైగా, ఇల్లిందల సరస్వతీదేవి, బొమ్మ హేమాదేవి 40 కి పైగా నవలలు రాశారని తెలుస్తున్నది. పోల్మంపల్లి శాంతాదేవి మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో నివసిస్తూ, బెంగుళూరు నుండి ఒక కన్నడ దిన పత్రికకు తోడుగా తెలుగులో తీసిన ప్రజామతి అనే వార పత్రికలో అనేక సీరియల్‌ నవలలు రాశారు. ఇల్లిందల సరస్వతీదేవి తెలంగాణ కోడలు. మాదిరెడ్డి సులోచన హైదరాబాదు సమీపంలోని షాద్‌నగర్‌ నివాసి. హైదరాబాదులో స్థిరపడ్డారు. బొమ్మ హేమాదేవి అనే కలం పేరుతో రాసిన రుక్మిణి నిజామాబాద్‌ జిల్లాలో పుట్టి కరీంనగర్‌ జిల్లా కోడలు అయిందని రాజా నర్ఫాగౌడ్‌ మనుమరాలు అని తెలుస్తున్నది.

సామాజిక నేపథ్యంలో, చారిత్రక పరిణామాల క్రమాన్ని అనుసరించి, తెలుగు నవలా వికాసాన్ని కింది విధంగా దశలుగా పేర్మొనవచ్చు.

1. సామాజిక ఉద్యమాల, పరిణామాల, రచయితల సంఘాల స్ఫూర్తితో,

నేపథ్యంతో రాసిన నవలలు.

2. పత్రికలకు సీరియల్‌గా రాసిన నవలలు

3. పత్రికల సైజు పరిమితి అనుసరించి రాసిన నవలలు

4. ఆయా సంస్థల, పత్రికల బహుమతుల పోటీల సందర్భంగా రాసిన నవలలు

5. మద్రాసు, విజయవాడ ప్రచురణ కర్తలకు రాసిన డిటెక్టివ్‌, తదితర వేలాది నవలలు. సినిమాల్లో, పత్రికల్లో, సంస్థల్లో అవకాశాలకోసం చూస్తూ, భుక్తికోసం రాసినవి. 7. 1910 నుండి ప్రేంచంద్‌, కిషన్‌చందర్‌, గోర్కి సాహిత్యంను అనుసరించి

రాసినవి.

రా

123

10.

11. 12.

183. 14. 15. 16. 17. 18.

1925 నుండి నిజామాంధ్ర మహాసభలు, ఆర్యసమాజ్‌ గ్రంథాలయోద్యమం అనుసరించి రాసిన నవలలు.

1946 నుండి తెలంగాణ రైతాంగ ఉద్యమం అరసం, తెలంగాణా రచయితల సంఘం (ప్రభావంతో రాసిన నవలలు.

1960ల నుండి టాగూర్‌, శరత్‌బాబు, బెంగాలీ సాహిత్యం అనుసరించి రచయిత్రులు రాసిన నవలలు.

1970 నుండి విప్లవోద్యమం అనుసరించి విరసం ప్రభావంతో రాసిన నవలలు.

1980 నుండి రాయబడిన దయ్యాలు, భూతాలు, క్షుద్ర సాహిత్యం వగైరా నవలలు.

1960 నుండి 1980 దాకా పత్రికల్లో వచ్చిన పాపులర్‌ నవలలు. సినిమాలుగా వచ్చిన నవలలు, సినిమాలకోసం, సినిమాల స్ఫూర్తితో రాసినవి. 1990నుండి దరకమే ఐక్య వేదిక ప్రభావంతో వెలువడిన నవలలు. 1990నుండి ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ పరిణామాలతో వెలువడినవి. 1995నుండి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం (ప్రభావంతో వెలువడిన నవలలు.

పిల్లల కోసం రాసిన నవలలు.

4

తెలుగు నవలా వికాసంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు,

పరిమితులు

తెలుగు నవలా వికాసంలో కాన్ని ప్రత్యేక క్రమాలను గుర్తుచేసుకోవడం అవసరం. సాహిత్యమే కులవృత్తిగా గల బ్రాహ్మణ కులాలు ప్రాచీన సాహిత్యాన్ని చదివిన అనుభవం, ఇంగ్రీషు, బెంగాలీ సాహిత్యాన్ని చదివిన అనుభవంతో తమ జీవితాలను రాసుకునే క్రమంలో తెలుగు నవల వికాసం చెందింది. అయితే తెలుగు నవల ప్రారంభం సామాజిక చైతన్యంతో “సోనాబాయి పరిణయం” వంటి నవలలతో ప్రారంభమైంది. తర్వాత యధావిధిగా బ్రిటీషాంధ్ర బ్రాహ్మణుల, తర్వాత రెడ్ల, కమ్మల, రాజుల ఆధిపత్యంలోకి వెళ్లిపోయింది.

4. 1950-70 మధ్య తెలంగాణ నవలలు

తెలంగాణ నవలా వికాసంలో తెలంగాణ రచయితల సంఘం, అభ్యుదయ రచయితల సంఘం, విరసం, జాతీయ సాహిత్య పరిషత్తు, నవ్య సాహితీ, సాధన

124

సాహితీ, దరకమే ఐక్యవేదిక వంటి సంస్థల కృషి ఎంతో ఉంది.

1950 నుండి తెలంగాణ ఉద్యమం గురించి కథలు, నవలలు రాయడం వేగం పుంజుకుంది. అణాగ్రంథమాల దేశీ ప్రచురణలు వంటి సంస్థలు (గంథాలయోద్యమంలో భాగంగా అనేక పుస్తకాలు ప్రచురించాయి. వాటిలో నవలలు ఉన్నట్టు కనపడదు. గోర్కీ రాసిన అమ్మ నవల 1935లో తెలుగు అనువాదం వెలువడింది. అమ్మ నవల (ప్రభావంతో తెలంగాణ ఉద్యమాల గురించిన కథలు, నవలలు కొన్ని వెలువడ్డాయి.

1960-70 దశాబ్దాన్ని తెలుగు సాహిత్యంలో మహిళా నవలల దశాబ్దంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ నుండి కూడా పోల్మంపల్లి శాంతాదేవి, బొమ్మ హేమాదేవి, మాదిరెడ్డి సులోచన వంటి రచయిత్రులు తెలుగు నవలా వికాసంలో తాముకూడా ఎన్నో నవలలు రాశారు. 1960-70 దశాబ్దాన్ని తెలుగు సాహిత్యంలో స్థబ్దతకు గురైన దశాబ్దంగా కవులు పేర్కొంటారు. కవులే ప్రపంచమన్నట్లు వందలాది విశ్లేషణల్లో, (గ్రంథాల్లో ఇదేమాట రాస్తూ, దిగంబర కవిత్వం దీన్ని బద్దలు కొట్టిందని, తర్వాత విప్లవకవులు వచ్చారని రాస్తారు. దిగంబర కవులకన్నా ముందు సి. విజయలక్ష్మి పేరుతో సివి రాసిన రచనలు ప్రభావితం చేశాయి. ఐనా కవిత్వమే మొత్తం సాహిత్యాన్ని నడిపించలేదు. కథా నవల విషయానికి వస్తే 60-70 దశాబ్దం మహిళా రచయితల స్వర్ణయుగం అని చెప్పవచ్చు.

భాస్కరభట్ల కృష్ణారావు: 1. యుగసంధి, 1957; 2. వెల్లువలో పూచికపుల్లలు, 1960; 3. వింత ప్రణయం, 1957; 4. భవిష్యత్‌ దర్శనం, 1966 అనే నవలలను రాశారు. 'యుగసంధి నవలలో మనో విశ్లేషణ, చైతన్య (స్రవంతి శిల్పాన్ని అనుసరించి రాశారు. హైదరాబాదు నగర జీవితం ఇందులో చిత్రించబడింది. వీరు తెలంగాణ బ్రాహ్మణ మధ్య తరగతిలో వస్తున్న నూతన సంస్కృతి, సంబంధాలు, లైంగిక సంబంధాలు, మానవ సంబంధాలు, వాటిని సానుభూతిగా శరత్‌బాబువలె చిత్రించారు. నవలలు, వీరి కథలు 2018లో రెండు సంపుటాలుగా విశాలాంధ్రవారు ముద్రించి అందుబాటులోకి తెచ్చారు.

“1921 మొదలు 1948 వరకు తెలంగాణలో జరిగిన ఉద్యమాలన్నీ “యుగసంధి నవలలో రికార్ణయ్యాయి. ఉద్యమాలకూ నవలలోని పాత్రలకు విడదీయరాని సంబంధం ఉండడంతో అంశాలు చొప్పించినట్లుగాకుండా సాఫీగా సాగిపోతాయి. ఆంధ్రమహాసభ మొదలు హైదరాబాద్‌పై పోలీసు చర్య వరకు వివిధ ఉద్యమాలు ఇందులో విస్తృతంగా చర్చకు వచ్చాయి. మారుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సందర్భంలో సంప్రదాయ, అంధ విశ్వాసాల / మూఢనమ్మకాలను ఆచరించే వర్గానికి, ఆధునిక, అభ్యుదయ భావాలు ఆచరించే వారి మధ్యన జరిగే ఘర్షణను “'యుగసంధిగా ఆవిష్కరించాడు రచయిత.

125

“యుగసంధి” నవలలో రెండున్నర దశాబ్దాల తెలంగాణ ఉద్యమాలను ఆంధ్రమహాసభ మొదలు పోలీసు చర్య వరకు సుదీర్ధంగానే చర్చించాడు. ఆంధ్రమహాసభ వారు “వర్తక స్వాతంత్ర్యం), “వెట్టిచాకిరి”, “మగ్గంపన్ను, పేరిట వేసిన చిన్న పుస్తకాలు ఆనాడు ఉద్యమానికి ఎలా ఊతమిచ్చాయో నవల ద్వారా తెలుస్తుంది. అలాగే బహద్దూర్‌ యార్దంగ్‌ మజ్లిస్‌ పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వం వాక్‌, సభా స్వాతంత్రాలను అరిగడుతూ గస్తీనిషాన్‌-58 పేరిట వెలువరించిన జీవో, పాఠశాలలు స్థాపించుకోవాలంటే అనుమతి తప్పనిసరి, వార్షికోత్సవాలు చరుపుకోవాలంటే - లిఖితరూపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానాలు ఉండబోవని రాసివ్వడం, - అన్నీ ఇందులో చర్చకు వచ్చాయి.

నగరానికి జమీందార్లు, దేశ్‌ముఖ్‌ల వలన వారు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడం కూడా నవల ద్వారా మనకు తెలుస్తాయి. వెలమ సామాజిక వర్గం అప్పటికే హైదరాబాద్‌ చేరుకోవడం తమ పిల్లల్ని చదివించడం, వారికి పూర్తి స్వేచ్చనివ్వడం కూడా అర్థమవుతుంది.

భాస్మరభట్ల కృష్ణారావు తెలంగాణలో అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న మధ్యతరగతి జీవితాలను గూడా తన నవలల ద్వారా రికార్డు చేసి వాటికి శాశ్వతత్వం కలిగించాడు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ కోర్టుల్లో వకాలత్‌ చేస్తున్న లాయర్లు, హైదరాబాద్‌ నగరంలోని వివిధ కళాశాలల్లో లెక్చరర్లుగా పనిచేస్తున్నవారు, డాక్టర్లుగా ఎదిగినవారిని, ప్రభుత్వోద్యోగాల్లో ప్రమోషన్లతో పైకి వచ్చినవారి జీవితాలను నవలలో చిత్రిక గట్టిండు. బ్రిటీషాంధ్రలో మాదిరిగా తెలంగాణలో “మధ్యతరగతి” రూపుదిద్దుకోలేదు, అది సాహిత్యంలో ప్రతిఫలించలేదు. అనే వాదనను నవల పూర్వపక్షం చేస్తుంది. లెక్చరర్లు, అడ్వకేట్లు, ఫ్యాక్టరీ మేనేజర్లు, అగ్రికల్చర్‌ కాలేజిలోని ఉద్యోగులు అందరితో తెలంగాణలో మధ్యతరగతి ఏర్పడింది అనడానికి ఆనవాళ్ళు. అలాగే నిజాం ప్రభుత్వ ఉద్యోగులు, సిగరెట్టి, బట్టల మిల్లుల్లోని కార్మికులు కూడా కొంతమేరకు మధ్యతరగతి వర్గంలో చేరినవారే”. (సంగిశెట్టి శ్రీనివాస్‌ 'యుగసంధి, “పూచికపుల్లలు” నవలల 2013 ముద్రణకు రాసిన ముందుమాట).

“వింత ప్రణయం” ఆయన మొదటి నవల ఇది 1957లో (ప్రచురించబడింది. మధ్య తరగతి జీవితాల సమస్యలను, స్త్రీ, పురుష సంబంధాల చిత్రణను, (ప్రేమలను గురించి ఆయన రాసిన మొదటి నవల. నవలలో ముగ్గురు అమ్మాయిలు ప్రధానపాత్రలు. వాళ్ళు కాలేజీలో చదువుతున్నారు. వారిలో సంధ్య, సుధలు అక్కచెళ్లెళ్ళు, మూడో అమ్మాయి కథనం చేస్తుంది. అమ్మాయి పేరు ఎక్కడాలేదు. కథకురాలి అక్క గోదావరి, ఆమె భర్త ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు లెక్చరర్‌. అతని

126

విద్యార్థి మధు. ముగ్గురమ్మాయిలు మధుని ప్రేమిస్తారు. మధుమాత్రం సంధ్య చెల్లెలు సుధను మాత్రం ప్రేమిస్తాడు. యవ్వనారంభంలో ఉన్న ముగ్గురమ్మాయిల (ప్రేమకథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. సుధ ప్రేమ త్యాగంతో “వింత ప్రణయం” ముగుస్తుంది.

భాస్కరభట్ల రచించిన మరో నవల హైదరాబాదులోని స్థలాల ప్రసక్తి కన్పించింది. “భవిష్యద్దర్శనం”లో తెలంగాణాలోని గ్రామాల పేర్లు, హైదరాబాదులోని స్థలాల ప్రసక్తి ఉన్నాయి. రఘునాథరావు జీవితంలో ప్రవేశించిన శ్రీహరి అనే వేశ్య గురించి, శ్రీహరి కొంతకాలం ముస్లిం ఆశ్రయంలో ఉండటం, “జహన్‌ ఆరా” అనే కూతుర్ని కనటం, తర్వాత మళ్ళీ రఘునాథరావు జీవితంలోకి పునర్‌ప్రవేశం చేసి రాధ అనే కూతుర్ని కనటం వంటి వృత్తాంతం రోజుల్లో నైజాంలోని భూస్వాముల. జీవితాలను ప్రతిబింబింపజేస్తుంది. రఘునాథరావు మొదటి భార్యకు సంతానం కలగకపోవడంతో ఆమె తన ఇష్టంతో అతనికి మరో పెళ్ళి జరిపించడం కూడా భూస్వాముల జీవిత ప్రతిబింబ చిత్రణలే... నవలలో నాయకుడు నళినీమోహన్‌, రఘునాథరావు కూతురైన రాధను ప్రేమిస్తాడు. చివరకు కథ ఎన్నో మలుపులు తిరిగి శకుంతలను పెళ్ళీ చేసకుంటాడు. భాస్మరభట్ల బాహిర ప్రపంచం గతి కన్నా మనిషి మనస్సులోని ప్రపంచాన్ని, విచిత్రమైన వింతగతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ “వింత ప్రణయంి, “భవిష్యత్‌ దర్శనం నవలలను రచించారు. (ముదిగంటి సుజాతారెడ్డి ముందుమాట.

రామానుజాచార్యులు: 1. విచిత్ర దాంపత్యం, 2. ముత్యాలు అనే నవలలను రాశారు.

వట్టికోట ఆళ్వారుస్వామి 1. ప్రజలమనిషి 1955; 2. గంగు, 1956. “ప్రజల మనిషిలో 1938కి ముందునాటి తెలంగాణా వాతావరణం నిజామాంధ్ర మహాసభ ఆర్యసమాజ్‌ ఉద్యమం, దొడ్డి కొమురయ్య భూమి పోరాటం, చిత్రింపబడింది. “గంగు” నవల దీని తరువాయి భాగాన్ని రైతాంగ ఉద్యమాలను చిత్రించింది. వీరి నవలల గురించి చాలా విశ్లేషణలు వచ్చాయి.

రైతాంగ ఉద్యమంపై దాశరథి రంగాచార్య ఎనిమిది నవలలు రాశారు. తర్వాత కందిమల్ల ప్రతాపరెడి - బందూక్‌, బి.ఎన్‌. శాస్తి - విప్లవ జ్వాల, ముదిగంటి సుజాతా రెడ్డి - రథచక్రాలు, భాస్మరభట్ల కృష్ణారావు - “యుగసంధి” (1957), ఎస్‌.ఎం. ప్రాణ్‌రావ్‌ - 'మలగని బత్తి (2010), నవల రాశారు.

నిజామాబాద్‌నుండి లోక మలహరి: 1. జగ్గని విద్ద, 1940; 2. సంగం నవలలను హైదరాబాద్‌కు చెందిన నెల్లూరు కేశవస్వామి (1920-1984): 1. వెలుతురులో

127

చీకటి, తెలంగాణ కోడలు - ఇల్లిందల సరస్వతీదేవి 20 నవలలు రాయగా. 1. బాంచెను కాల్మొక్తా, 2. పెళ్ళికూతుళ్ళు నవలల పేర్లు లభించాయి.

జిలాని బాను *ఐవానే గజలొ ఎంతో జాగ్రత్తగా అల్లిన నవల నవలలోని సంఘటనలు కథలోని మార్పులు బ్రిటిష్‌వారి అధికారం పోయి హైదరాబాద్‌ సంస్థానపు రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులతో ముడిపడి ఉన్నాయి. నవల ఫ్యూడల్‌ వ్యవస్థ విలువలపై ఆధారపడిన తన కళను చూసి గర్వపడుతూ క్షీణించిన సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. రచయిత్రి వివిధ పాత్రల మధ్య సంభాషణ, వ్యక్తులు, సంభుటనలను ఎంతో సజీవంగా, సునిశితంగా చిత్రించారు. పరిస్థితులను నిర్మాహమాటంగా, వాస్తవ దృక్పధంతో అంచనా వేయటమే గాక అవసరమైన చోట వ్యంగ్య పద్ధతిలో విమర్శించడానికి వెనుకాడలేదు రచయిత్రి. నవలలోని రెండు ప్రధాన భూమికలైన చాంద్‌, గజల్‌ల విషాధ గాధ కేవలం కుటుంబ పరిధికే పరిమితం చేయబడింది గాని దానిని సార్వత్రిక పరిణామంతోను ముడిపెట్టలేదు. స్త్రీ, పురుషుడు, పశుత్వం - వీటి మధ్యగల నిరంతర త్రిముఖ సంఘర్షణతో మాత్రం దీనిని మేళవించడం జరిగింది. వివిధ పాత్రలు తమ పొరపాట్లు, తప్పటడుగులు, కుత్సితాల ద్వారా తమకు తాముగా తెచ్చుకున్న బాధలను, విషాదాన్ని మన కళ్ళముందు ఉంచబడింది. నవల తెలుగుతోపాటు అనేక భారతీయభాషల్లోకి అనువదించబడింది.

మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తికి చెందిన పోల్కంపల్లి శాంతాదేవి రాసిన 68 నవలల్లో కొన్ని ఇలా ఉన్నాయి. 1. బాటసారి, 2. పుష్యమి, 8. చండీప్రియ, 4. నిషా, 5. నౌకాయానం, 6. ప్రతీక్ష 7. సమర్పణ, 8. కుంకుమ రేఖలు, 9. మరణం అంచున, 10. అష్టదళం, 11. ప్రేమపూజారి, 12. పెళ్ళిమంటలు, 18. కన్నెవాగు - కోడెనాగు, 14. మాయలేడి, 15. మనసు ఒకరికే - మనిషి ఒకరికే, 16. మవూజానువుం, 17. మాూాలవడవ, 18. రాగదీపం, 19. జీవన సంగీతం, 20. (ప్రేమబంధం, 21. అడవిమంట, 22. ఆత్మబంధువు, 23. నైనా నవలల పేర్లు లభించాయి.

1935 సంవత్సరంలో హైదరాబాదు సమీపంలోని శంషాబాదు గ్రామంలో ఒక సాంప్రదాయిక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మాదిరెడ్డి సులోచన ఎం.ఏ., ఎం.ఎడ్‌. చేసి 1971 వరకు సుమారు పది సంవత్సరాల పాటు ఉపాధ్యాయినిగా పనిచేసారు.

మాదిరెడ్డి సులోచన రాసిన 70కి పైగా నవలల్లో కొన్ని ఇలా ఉన్నాయి. 1. అగ్నిపరీక్ష 2. పూలమనసులు, 3. జీవనయాత్ర (తొలి నవల), 4. భిన్నద్భవాలు, 5. పంతులమ్మ, 6. చంద్రగుప్త, 7. వీడని నీడ, 8. జననీజన్మ భూమిశ్చ. వైవిధ్యమైన

128

కథావస్తువు, మెలోడ్రామాలు లేని రచనాశైలి మాదిరెడ్డి సులోచన సొత్తు. 1965లో జీవనయాత్ర పేరుతో మొదటి నవల రాసిన సులోచన దాదాపు 150 కథలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాసారు.

బొమ్మ హేమాదేవి (1931-1996) నిజామాబాదులో రాజానర్భాగౌడ్‌గారి పెద్ద మనుమరాలైన యమున అలియాస్‌ రుక్మిణి 1931న జన్మించి కరీంనగర్‌ జిల్లా మానకొండురుకు చెందిన బొమ్మ నారాయణరావుతో వివాహానంతరం... హైదరాబాదులో స్థిరపడ్డారు.

బొమ్మ హేమాదేవి (రుక్మిణీ, దేవీరమ) రాసిన 40కి పైగా నవలల్లో కొన్ని: 1. నవధాన్యాలు, 2. తపస్వినీ, 8. లవ్‌స్టోరీ, 4. ఉపాసన, 5. కుంకుమపూలు, 6. భావనా - భార్గవి, 7. నవభారతి, 8. కళావతి, 9. నవరసాలు, 10. తరంగాలు, 11. నవోదయం, 12. బంగారుగూడు (పెద్దగూడ), 13. నవధాన్యాలు.

తిరునగరి రామాంజనేయులు 'సంగం' అనే నవలతోపాటు మరో నవల రాశారు. జి. రాములు 'పెరటిచెట్టు' అనే నవలిక 1954లో రాశారు. పోరంకి దక్షిణామూర్తి 'ముత్యాలపందిరి' నవలను 1964లో తెలంగాణ మాండలికంలో చేనేత వృత్తి కులాల, కుటుంబాల గురించి రాశారు.

తెలంగాణ పత్రికలు:

తెలంగాణ పత్రికల చరిత్రపై, రచనలపై, శీర్షికలపై సంగిశెట్టి శ్రీనివాస్‌, కె. శ్రీనివాస్‌ పరిశోధనలు చేసి, పుస్తకాలుగా ప్రచురించారు. తెలంగాణ నుండి గోల్కొండ, మీజాన్‌, సుజాత వంటి దినవార, మాస పత్రికలు తెలంగాణ సాహిత్యంతోపాటు, బిటీషాంధ్ర రచయితల రచనలు కూడా ప్రచురించాయి. చలం రచనలు సుజాత పత్రికలో హెచ్చుగా ప్రచురించబడ్డాయి. కానీ తెలంగాణ రచయితల రచనలు బ్రిటీషాంధ్ర పత్రికల సంపాదకుల ద్వారా నిర్లక్ష్యం చేయబడ్డాయి. తిప్పి పంపబడ్డాయి. తెలంగాణ భాషను తిరగరాసి, పత్రికా భాష పేరిట, కోస్తాంధ్ర భాషకు సవరించిన తర్వాత అచ్చువేశారు.

నైజాం రాజ్యంలో ప్రచురణ కేంద్రాలు:

తెలంగాణాలో కరీంనగర్‌ నుండి, మహబూబ్‌నగర్‌ జిల్లా నుండి, హైదరాబాద్‌ నుండి ఎన్నో ప్రచురణ సంస్థలు ప్రారంభమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌గా మూడు ప్రాంతాలు కలిసిపోవడంతో మద్రాసు, విజయవాడ వంటి ప్రాంతాల ప్రాభవంతో తెలంగాణ ప్రాంత ప్రచురణలు, పత్రికలు తగ్గుతూ వచ్చాయి. తెలంగాణ (ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఉంటే, స్థితి మరోవిధంగా ఉండేది. రచయితలు, ప్రచురణకర్తలు తెలంగాణాలో

129

మద్రాసు, బెంగుళూరు, విజయవాడ కేంద్రాల్లో అభివృద్ధి చెందినట్లుగా విస్తరించి ఉండేవారు. అన్ని రంగాలతోపాటు, సాహిత్య కళారంగాల్లో, పత్రికా రంగాల్లో, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత జరిగిన నష్టం లెక్కలకు అందదు. దశాబ్దాల తరబడి అణచివేతకు, దోపిడీకి, ఆధిపత్యానికి గురై తెలంగాణ సాహితీ చరిత్ర కొనసాగుతూ వచ్చింది.

రచయితల జీవితం అనుసరించి నవలలు:

రచయితల జీవితం, చైతన్యం, అవకాశం, అధ్యయనం, అనుభవం అనుసరించి సాహిత్యం సృజించబడుతుంది. కొందరు రచనలు సామాజిక కర్తవ్యంగా భావించి, సమాజంగురించి, సామాజిక పరిణామాల గురించి రాస్తుంటారు. కొందరు రచనమీద ఆధారపడి జీవించాలని రచనలు చేస్తుంటారు. కొందరు రచనలను పేరుకొరకు హాబీగా రాస్తుంటారు. మరికొందరు ఏధోరణి, ఏరకం రచనలు చదువుతుంటారో, పత్రికల్లో అచ్చు వేస్తుంటారో అలాంటి రచనలను రాస్తుంటారు. ఇలా నవలల్లోని తరతమ స్థాయి భేదాలు కనపడతాయి. రచయిత ఉద్యమాల్లో భాగమైనప్పుడు ఆయా రచనలు ఒక ఆర్గనైజర్‌గా, యాక్టివిస్ట్‌గా, ప్రచార అంశకూడా కలుపుకుని వెలువడుతుంటాయి. వాటిల్లో సాహిత్య విలువలను సాధారణ సాహిత్య తూనికరాళ్ళతో కొలవలేము.

రచనల ప్రభావం:

ఆయా రచనలను, చరిత్రను సామాజిక ఉద్యమాలను, (ప్రజలను, ముందుకు నడుపుతూ ఒక నాయకుడు నిర్వహించే పాత్రను నిర్వహిస్తుంటాయి. పత్రిక ఒక పదివేల సైన్యం అని నానుడి. అలాగే పత్రికల్లో వచ్చే రచన పదివేలసైన్యంతో సమానంగా కూడా ఉంటాయి. అంతకన్నా హెచ్చు ప్రభావం వేసే రచనలు కూడా వుంటాయి. సోవియట్‌ రష్యా నవలలు చదివి, వేలాదిమంది ఉద్యమాల్లోకి ప్రవహించారు. ఎలెక్స్‌ హేలి నవల ఏడు తరాలు (రూట్స్‌) అమెరికా సమాజంలో భూకంపం సృష్టించింది. అమెరికా అవగాహనలో, చట్టాల్లో అనేక మార్పులకు కారణమైంది. నల్లవారిని ప్రధాన సామాజిక స్రవంతిలో కలుపుకుపోవాలని, అన్ని రంగాలలో వారికి 12 శాతంకి పైగా అవకాశాలు కల్పించాలని సంకల్పించింది. ఇండియాలోని రిజర్వేషన్లు ఇన్నేళ్ళయినా సరిగ్గా అమలు జరగడంలేదు. కానీ అమెరికాలో ఇండియాలోని రిజర్వేషన్ల కన్నా ఎన్నోరెట్లు 1985 నుంచి ముప్పైయేళ్ళలో నల్లవారు అన్నిరంగాల్లో పారిశ్రామికవేత్తలుగా, సాహితీవేత్తలుగా, సంపాదకులుగా, చివరకు అమెరికా అధ్యక్షులుగా కూడా ఎదిగారు. ఇలా సాహిత్యం సమాజాన్ని మార్చడంలో నిర్వహించే పాత్ర మహోన్నతమైనది.

ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమ సాహిత్యం, పాటలు, కవితలు, ప్రసంగాలు, ఉద్యమాల్లోకి ప్రజలను ఉరకలెత్తించాయి. నవలలు, కథలు అవగాహనను పెంచి,

130

కర్తవ్యాన్ని నిబద్ధతను పెంచుకోటానికి పనిచేశాయి. అలా గోర్కీ రాసిన “అమ్మి నవల ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఉన్నవ లక్ష్మీనారాయణ తెలుగులో 'మాలపల్లి వంటి నవలలు రాయడానికి ప్రేరణనిచ్చింది. వట్టికోట ఆళ్వారుస్వామి, మహీధర రామమోహనరావు, లక్ష్మీకాంత మోహన్‌, బొల్లిముంత శివరామకృష్ణ తెలంగాణ ఉద్యమ నవలలు రాయడానికి సోవియట్‌ రష్యా సాహిత్యం మార్గదర్శనం చేసింది. 1970ల నుండి వెలువడిన విప్లవ సాహిత్యంలో కూడా సోవియట్‌ రష్యా, చైనా సాహిత్య ప్రభావం, పప్రేంచంద్‌ ప్రభావం ఎంతో ఉంది. అల్లం రాజయ్య, కాలువ మల్లయ్య, నవీన్‌ రచనల్లో వీటి (ప్రభావం గమనించవచ్చు.

విప్లవోద్యమంలో సాహిత్యం నిర్వహించిన పాత్ర:

'కొలిమంటుకున్నది' నవల సృజనలో సీరియల్‌గా వస్తున్నప్పుడు ఎక్కడికక్కడ రైతుకూలీలు కూడి నవలను చదివి వినిపించుకొని స్ఫూర్తి పొంది ఉద్యమంలోకి వచ్చారు. అలాగే “బతుకుపోరు' నవలను చదివించుకొని టేప్‌రికార్డర్‌ద్వారా విని, వేలాదిమంది బీడీ కార్మికులు, కార్మిక ఉద్యమంలో స్ఫూర్తిపొందారు. తమ జీవితంకూడా సాహిత్యానికి అర్హమైనదే. అని సాహిత్య గౌరవంతో ఆత్మాభిమానంతో ఆత్మవిశ్వాసంతో సగర్వంగా ఫీలయ్యారు. నవీన్‌ రాసిన అంపశయ్య నవల చదివి నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నా క్లాస్‌మేట్స్‌లాగ చదువుకోలేకపోయాననే బాధనుండి విముక్తమై నేను యూనివర్శిటీలో చదువుకున్నంత సంతోషాన్ని, ఆనందాన్ని, సమాచారాన్ని, అనుభవాన్ని పొందాను. “అమ్మ” నవల చదివి శ్రీశ్రీ సాహిత్యం చదివి ఎందరో వివ్లవకారులయ్యారు, సాపొతీవేత్తలయ్యారు. ఇలా 1948లో వెలువడిన 'మృత్యుంజయులు, 'సింహగర్జని నవలలు ఆనాటి విప్లవకారులకు, రైతాంగ యోధులకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయి.

మధ్యతరగతి వికాసాన్ని చిత్రించిన మహిళా రచయితలు:

అలాగే 1960-80 మధ్య వెలువడిన మహిళా రచయితల రచనలు అప్పుడే చదువుకొని ఎదుగుతున్న యువతరం బాలబాలికల్లో, స్త్రీలల్లో నూతన జీవితం ఎలా ఉండాలో ఆశలను రగిలించి అందమైన కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి, కాబోయే భర్తను ఎన్నుకోవడానికి, తాము ఉన్నత చదువులు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి స్ఫూర్తినిచ్చాయి. వారి జీవితాలను మలుపు తిప్పాయి. తద్వారా ఆధునిక మధ్య తరగతి రూపొంది స్థిరపడ్డంలో సినిమాలు, మహిళా రచయితల నవలలు నిర్వహించిన పాత్ర ఎనలేనిది.

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో తెలంగాణ వెనుకబాటు: మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతం విడిపోయి 1958లో ఆంధ్ర రాష్ట్రంగా

131

ఏర్పడింది. దానికి ఎలాంటి వనరులు లేక కునారిల్లిపోయింది. దీనికి పరిష్కారం హైదరాబాదు రాజ్యం అని గమనించారు. అలా వారి స్వప్రయోజనాలకోసం తెలుగువారు ఒకటి అనే నినాదాన్ని ముందుకుతెచ్చారు. 1956 నవంబర్‌లో నైజాం రాజ్యంలోని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. నైజాం రాజ్యంలోని కన్నడ ప్రాంతాలు, మైసూరు రాష్ట్రంలో, మరాఠీ ప్రాంతంలో మహారాష్ట్రలో కలిపివేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ (ప్రజలు పడ్డ తిప్పలు ఒకటికాదు, సమస్త ఉద్యోగాలను, సంపదలను, అధికారాలను, వనరులను, ఆకలిగొన్న బ్రిటీషాంధ్ర సామాజిక వర్గాలు ఆక్రమించాయి. తెలంగాణ ప్రజలకు కొసరు వంటి అవకాశాలు వెయిటింగ్‌ లిస్టు వంటి అవకాశాలు మిగిలాయి. అందువల్ల తెలంగాణ ప్రజలు మధ్య తరగతిగా, పత్రికా పాఠకవర్గంగా ఎదగడం సహజస్థాయిలో సాగలేదు. దాని అభివృద్ధిని ఇతర ప్రాంతాలవారు కైవసం చేసుకోవడంవల్ల వెనక్కి నెట్టివేయబడ్డారు. అలా ప్రజలు ఆధునిక అభివృద్ధిలో, విద్యలో, అధికారంలో, సరియైన వాటాను పొందలేని దశలలో వారినుండి రచయితలు, కళాకారులు ఎదగడం కూడా అలాగే కనిష్ట స్థాయిలో కొనసాగుతూ వచ్చింది. ఇలా సామాజిక పరిణామాల కారణంగా తెలంగాణ రచయితలు అనేక పరిమితులకు లోనయ్యారు.

తెలంగాణ రాష్ట్రం, ఆకాంక్ష:

1953లో విశాలాంధ్రలో ప్రజారాజ్యం పేరిట తెలంగాణ ఆంధ్ర ఒక రాష్ట్రంగా ఏర్పాడాలనే నినాదానికి వ్యతిరేకంగా తెలంగాణాలో “గోంగూర గోబ్యాక్‌' అనే ఉద్యమం వేగం పుంజుకుంది. గ్రామ పంచాయితీలు, జిల్లా బోర్డులు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని, తీర్మానాలు చేసి, పార్లమెంటుకు పంపించారు. అయినా అనేక కారణాలవల్ల, కుట్రలు, తప్పుడు భావజాలాల వల్ల తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విలీనం చేయబడింది. దీని పర్యవసానాలను, నష్టాలను గమనించి ప్రజలు ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూనే వచ్చారు.

తెలంగాణవాళ్ళు హైదరాబాదు వెళ్ళాలనుకునేసరికే అంతా జరిగిపోయింది: స్వాతంత్ర్యం వచ్చాక అందుబాటులోకి వచ్చిన నూతన విద్య, అవకాశాలతో నూతన ఉద్యోగ అవకాశాలకోసం 1960-70ల నుండి తెలంగాణవాళ్లు హైదరాబాదుకు వెళ్ళడం వేగం పుంజుకుందని చెప్పవచ్చు. అప్పటికే బ్రిటీషాంధ్రవారు అన్ని రంగాల్లో అన్ని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తెలంగాణ వారికి ఎదురుచూపులే తప్ప సరియైన అవకాశాలు లభించకుండా పోయాయి. దాంతో 1968లో ఆంధ్రా గోబ్యాక్‌ అనే ఉద్యమం 1969లో జై తెలంగాణ ఉద్యమం పెల్లుబికింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యువతరంలో చైతన్యాన్ని రగిలించింది. తెలంగాణ భాషా, సంస్కృతి, ఉద్యోగ అవకాశాలు, విద్యా

132

అవకాశాలు, రాజకీయ అధికారం పట్ల ప్రత్యేకమైన (శ్రద్ధ, దృష్టి పెరిగింది. అయితే అది ఉద్యమం సాగినంత విస్తారంగా కథల్లో, నవలల్లో చిత్రించబడలేదు. పత్రికలు, ప్రచురణ సంస్థలు, బ్రిటీషాంధ్ర అగ్రకుల నాయకత్వంలో కొనసాగడంవల్ల వాటికి అవకాశం లేకుండా పోయింది.

త్‌

తెలంగాణ ఉద్యమ నవలలు

విప్లవోద్యమ నవలలు:

విప్లవోద్యమ నవలల గురించి, వరవరరావు, కాత్యాయనీ విద్మహే, తిరునగరి దేవకీదేవి, ఎన్‌. వేణుగోపాల్‌, కాలువ మల్లయ్య, ముదిగంటి సుజాతారెడ్డి, అనుమాండ్ల భూమయ్య వంటి సాహితీవేత్తలు అనేక కోణాల్లో వ్యాసాలు, పరిశోధనలు, సిద్ధాంత గ్రంథాలు వెలువరించారు. ఒక్కొక్కరు ఇచ్చిన విప్లవోద్యమ నవలల లిస్టులో కొన్ని తేడాలున్నాయి. తిరునగరి దేవకీదేవి తన పి. హెచ్‌డి. లో ఇరవైవొక్క నవలలను పేర్కొన్నారు. వరవరరావు తెలంగాణ రైతాంగ నవలల్లో ఆరు మాత్రమే తీసుకొని పి. హెచ్‌డి. చేశారు. కాత్యాయనీ విద్మహే అనేక నవలలను చర్చకు తెచ్చారు. ఎన్‌. వేణుగోపాల్‌ ఇరవై నవలలను విప్లవ నవలలుగా పేర్కొన్నారు.

విప్లవం గురించి రాసే మరికొన్ని నవలల గురించి కూడా చెప్పుకోవడం అవసరం. నవలలు విప్లవోద్యమం గురించి అవగాహన పెద్దగా లేకపోయినా కొన్ని చదివి, కొన్ని పత్రికల వార్తలు, సంఘటనలు, చూసి, విని తమకు తోచిన కాల్పనిక సంఘటనలతో, సన్నివేశాలతో కాల్పనిక పాత్రలతో రాసిన నవలలు. వీటిని విప్లవోద్యమ (ప్రభావంతో వెలువడిన సాధారణ నవలలు, కాల్పనిక నవలలు అని చెప్పవచ్చు. వీటిలో విప్లవోద్యమాన్ని వ్యతిరేకించే కోణంతో రాసే నవలలు కూడా ఉంటాయి.

నేను రాసిన *'బతుకుపోరు నవల విప్లవోద్యమంలో భాగంగా రాశాను. జగిత్యాలలో విప్లవోద్యమం విస్తృతంగా సాగుతున్న క్రమంలో అందులో విరసం సభ్యుడిగా, పౌరహక్కుల సంఘం కార్యదర్శిగా, క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ, బీడీ కార్మిక రంగంలో విప్లవోద్యమం ప్రవేశించి పనిచేసిన క్రమాన్ని నవలలో చిత్రించాను. ప్రజల జీవితం, సంస్కృతి చిత్రిస్తూ, అందులో భాగంగా సి.పి.ఐ. నాయకత్వంలో ఉన్న కార్మికులను ఎలా విప్లవ నాయకత్వంలోకి తీసుకువచ్చారో చిత్రించడం జరిగింది. అయితే నవలలో ప్రజలు ప్రధానం. వారి జీవితంలో విప్లవ నాయకత్వం, విప్లవ చైతన్యం ప్రవేశించడం పర్యవసానంగా చిత్రించబడింది. “అడవిలో వెన్నెల” కథలో కూడా నేను గోండు గిరిజన జీవితాన్ని సంస్కృతిని చిత్రిస్తూ అందులో భాగంగా ఉద్యమకారులు వారి జీవితాల్లోకి ఎలా ప్రవేశించారో, పర్యవసానంగా చిత్రించాను.

133

విప్లవోద్యమంలో పనిచేసే ఎందరో నాతోపాటు దాశరథి రంగాచార్య, తాడిగిరి పోతరాజు, అంపశయ్య నవీన్‌, ఎం.వి. తిరుపతయ్య, అల్లం రాజయ్య మొదలైన రచయితలెందరికో సహచరులు, క్లాస్‌మేట్స్‌, మిత్రులు, పరిచయస్థులు, ఉండటంవల్ల వారు వారిగురించిన పరిణామాలు చైతన్యం పెంచుకున్న తీరు, ఉద్యమాల్లో పాల్గొన్న తీరు, అతి సమీపంగా పరిశీలించే అవకాశం సహజంగా ఉంటుంది. ఇది వీరి నవలలకు వాస్తవికతను మరింత పెంచుతుంది. సామాజిక పరిణామాల ఉద్యమ పరిణామాల చిత్రణలో సామాజిక చరిత్రగా ఆయా నవలలకు ప్రాధాన్యత పెరుగుతుంది.

దాశరథి, అంపశయ్య నవీన్‌, కాలువ మల్లయ్య, పి. చంద్‌ యాదగిరి మొదలైనవారి నవలలను, నేను రాసిన 'బతుకుపోరు” నవలను, అవి విప్లవోద్యమ ప్రభావంలో వెలువడిన నవలలు అని వర్గీకరించడంతోపాటు సామాజిక పరిణామాల, సామాజిక చరిత్ర, మానవ సంబంధాల పరిణామాలను, చిత్రించిన సామ్యవాద వాస్తవికత నవలలు అని పేర్కొంటారు.

స్త్రీల కోణంలో విప్లవ నవలల గురించి మరికొంచెం:

జయధీర్‌ తిరుమలరావు ఉద్యమ నవలల గురించి, ప్రత్యేకదృష్టితో ఇలా పరిశీలించారు. తెలంగాణా రైతాంగ పోరాటం ప్రభావంతో మొత్తం 21 నవలలు వచ్చాయి. ఒక సంఘటనని ఆధారం చేసుకొని ఇన్ని నవలలు రావడం విశేషమే. అంటే పోరాటం తెలంగాణా, తెలంగాణేతర (ప్రాంత రచయితలను అంతగా ఆకట్టుకొంది. కొన్ని నవలల్లో కొన్ని ఉదంతాలు కల్పితాలు కాగా కొన్ని చాలా వాస్తవికంగా ఉన్నాయి. వాటిలోని సంఘటనలు నిజజీవితంలో జరిగినవే. ఒకటీ అరా నవలలు స్త్రీలు రాయగా మిగిలినవన్నీ పురుషులు రాసినవే. స్త్రీలు రాసిన నవల పూర్తిగా స్త్రీ దృక్పథం నుండి రాసినదని చెప్పలేం. ఇకపోతే నవలల్లో పురుష స్వామ్య దృక్పథమే అధికం. అందుకే పోరాట వీరులలో విద్యాధికులు, ఉన్నత కులవర్లాలకి సంబంధించిన వారే ఎక్కువగా కనిపిస్తారు. ఆనాడు పై చదువులు చదువుకున్న స్త్రీలు ఎక్కువగా లేరు. పైగా పోరాటంలో త్యాగాలు చేసి మరణించినవారు ఎక్కువగా అట్టడుగు వర్ణాల స్త్రీలే. వీరిలో మరణించిన చాలామంది స్త్రీల జీవితాలు అజ్ఞాతమే. అలాంటి వారిలో చిలకమ్మ ఒకరు. ఆవిడ చరిత్ర స్త్రీలు పాడుకునే ఒక ఉయ్యాల పాటవల్ల మాత్రమే తెలుస్తున్నది. ఉజ్జ్వలమైన పోరాటంలో సద్యఃస్ఫూర్తితో పాల్గొన్న అటువంటి అనేకమంది స్త్రీల గురించి ఇంకా సమాచారం సేకరించవలసే ఉంది. ఆయా పార్టీలు / గ్రూపులు / నాయకులు తమకు తెలిసిన లేదా తమకు అందిన సమాచారం మాత్రమే ఇచ్చారు. “అన్వేషి? వంటి సంస్థలు కొద్దిమంది మహిళల వద్దకు వెళ్ళి ఇంటర్వ్యూలు చేసారు. అదొక మంచి ప్రయత్నం. నిజానికి మహిళల సమగ్ర పోరాట చరిత్ర నిర్మించవల సే ఉంది.

134

ఉద్యమంలో ఇలాంటి స్త్రీలు నెరపిన పాత్ర మూడు రకాలుగా కనిపిస్తుంది. 1. వైయక్తిక పోరాటం, 2. సామూహిక పోరాటం, 3. ఆయుధ పోరాటం.

చాలామంది స్త్రీలు భూమి భుక్తి కోసం పోరాడారు. తరతరాల దొరల ఆగడాలను ప్రతిఘటించారు. కరణాల వంటి గ్రామాధికారుల అసలు రూపాన్ని బట్టబయలు చేశారు. సాటి స్త్రీలపై అత్యాచారాల్ని ఆపారు. పదిమంది కలిసి ఐక్యంగా శత్రువుని దెబ్బతీశారు. కొరియర్లుగా పనిచేశారు. డెన్నులు నడిపారు. వంటలు చేసి వడ్డించారు.

స్త్రీలు భూస్వాముల, వారి బంటుల నడ్డి విరిచారు. కాని భూస్వామ్య సంస్కృతిని ఎలా దెబ్బకొట్టాలో వారికి పార్టీ నిర్మాణం గాని, మార్చిస్టు మేధావులు గాని రచనల ద్వారా, కరపత్రికల ద్వారా ఇతరత్రా ఎక్కడా చెప్పలేదు. ఎవరైనా చెప్పి వుంటే ఈనాటికి కొంత ఫలితం సాధించి ఉండేవారు. గ్రామీణ పెత్తందారీ విధానాన్ని ఆచరణరీత్యా బలహీనపరచడానికి ఆస్కారం ఉండేది. కొన్నిచోట్ల ప్రయత్నం అప్రయత్నంగా జరిగినా పురుష రచయితలు వాటిని పట్టించుకోలేదు. పైగా రచయితలు పురుషుల పోరాటానికి కాల్చనికవీరత్వం జోడించారు. స్త్రీల పాత్రని మాత్రం ఉన్నదానికన్నా తగ్గించి రాశారనిపిస్తోంది. అందుకు కారణం - స్త్రీలు నాయకత్వ స్థానంలో ఏనాడూ లేకపోవడం

ప్రజల మనిషిలో బ్రాహ్మల పొలం కౌలు చేసుకుంటుంటే జప్తు చేయాలని ప్రయత్నించినప్పుడు అంతమ్మ చాకలి ఐలమ్మలా ఎదురు తిరిగి పోరాడుతుంది. “చిల్లరదేవుళ్ళు'లో కరణం వెంకటరావు తన భార్య మంగమ్మపై మొదటి మూడు రాత్రులు వరసగా బలత్మారం చేస్తాడు. “భోగం” వాళ్ళతో గడుపుతూ చెడు తిరుగుళ్ళు తిరిగే కరణం లాంటివారు - “ఆనాటి (గ్రామాధికారులు, దొరల విలాసవంతమైన జీవితాన్ని అక్షరాల అనునరించడానికి (గ్రామాధికారులు (శ్రామిక స్రీలను అనుభవించడానికి” ప్రయత్నించేవారు. “కామంతో వేగిపోతున్న కరణం కొత్తగా పెళ్ళై వచ్చిన గౌండ్ల వీరిగాడి భార్య పుల్లితో అక్రమ సంబంధం కొనసాగించాడు. నవలల్లో చిత్రితమైన ఇలాంటి సంఘనలు ఆనాడు గ్రామాల్లో కరణాలు చేసిన దౌర్జన్యాలకి అద్దంపడుతాయి. నిజానికి జమీందార్లు, జాగీర్జార్లు, జాగీర్జార్లలో రెడ్లు, వెలమలే కాదు (బ్రాహ్మలు కూడా ఉన్నారు. వీళ్ళను అంటి పెట్టుకుని ప్రజలపై దౌర్జన్యం చేసిన కరణాలు లెక్కకు మించి ఉన్నారు. భూమి రాతకోతలు, కొలతలు, పన్నుల వసూలు వంటి పనులు చేయడానికి నియుక్తమైన కరణీక వ్యవస్థ తెలంగాణాలో భూస్వామ్యానికి పట్టుగొమ్మలా పనిచేసింది. దొరలపేరుతో వీళ్ళు చేసిన అక్రమాల చిట్టా అనంతం. భూస్వామి కులం అయినా కరణానిది మాత్రం ఒక్కటే కులం. (శ్రామిక వర్గాలని రాచిరంపాన పెట్టడం. భూస్వామి చేసే ప్రతి ఆగడానికి కరణం మద్దతు పూర్తిగా ఉండేది. “భూస్వామి కోపం చారానా కరణం కసి బారానా” వంటి నానుడులు కోకొల్లలు

135

ఉన్నాయి. గ్రామాల్లో భూమిని, స్త్రీని పరాయి పాలు చేయడంలో వీళ్ళ పాత్ర అధికం.

“కమ్యూనిస్టు పార్టీలోని మితవాద బ్రాహ్మణ మేధావులు 'భూస్వామ్య వ్యవస్థ అనే పదాన్ని తెలివిగా సాధరణీకరించి వాడారు. దానిని నిర్దిష్టంగా నిర్వచించకపోవడం వల్ల వ్యవస్థలో విడదీయరాని భాగాలైన కరణాలు, పటేలు, పట్వారీల వాస్తవ పాత్రని పక్కన పెట్టడం జరిగింది. అందువల్ల భూస్వామ్య (గ్రామాధికార వ్యవస్థ దౌష్ట్యాన్ని నిర్దిష్టంగా, లోతుగా అర్థం చేసుకోలేకపోయాం. పెత్తందారీ కులాల స్వభావాన్ని కూడా బేరీజు వేసుకోలేక పోయాం. ఇలాంటి పోకడలకు స్వభావానికి పితృస్వామ్య భావజాలం తోడ్చడింది. శ్రామిక కులాల నుండి వచ్చిన అతికొద్ది నాయకులు కూడా వ్యవస్థలో దాగిన కఠోర వాస్తవాల్ని విప్పి చెప్పలేకపోయారు. రకంగా యథాతథ సామాజిక చట్రం అవగాహన నేటికీ అలాగే కొనసాగుతోంది. కారణాల వల్ల కరణాలకి, గ్రామాధికారులకి వ్యతిరేకంగా జరిపిన స్త్రీల పోరాట చరిత్ర నమోదు కాలేదు. విధంగా ఎన్నో సంఘటనలు నొక్మివేయబడ్డాయి. అజ్ఞాతం చేయబడినాయి. విచిత్రం ఏమంటే కమ్యూనిస్టులుగా, నాయకులుగా, చెలామణి అయిన వర్గాల నాయకులు తమ స్త్రీల పోరుపటిమని కూడా తరువాతి కాలంలో పట్టించుకోలేదు. ఎక్కడ తమ పురుషాధిపత్య అహంకారం గుట్టు బయట పడిపోతుందోనని భయపడ్డారు కూడా.

(ఛమశక్తుల వర్గం నుండి వచ్చిన స్త్రీల పోరాటం ఎంతో సాహసికమైనది. అసమాన త్యాగాలతో కూడినది. పోరాట చరిత్ర శిష్టవర్ణాల వారు నమోదు చేయకున్నా తమ పాటల్లో స్త్రీలే నమోదు చేసుకుని నేటికీ మౌఖికంగా పాడుకుంటున్నారు. రకంగా వీరత్వం మూర్తీభవించిన నారీమణుల గురించి వారే ప్రచారం చేసుకోవలసి వచ్చింది.

రచయితలు, తత్వవేత్తలు, నాయకులు, శిష్టవర్గాల వారే కావడం వల్ల పోరాటాన్ని వాళ్ళ దృక్పథం నుండే ఎక్కువగా వీక్షించారు. సమీక్షించారు. గుణపాఠాలు తీసుకున్నారు. పైన పేర్కొన్న విభాగాల్లో శ్రమశక్తులు చాలా తక్కువ. స్త్రీలు అసలే లేరు. పోరాటం సామాన్య ప్రజల జీవనం బాగుకోసం జరిగిందో వాళ్ళకి సరైన ప్రాధాన్యత లభించలేదు. శక్తులు లేకపోవడం వల్ల సాంఘికరంగంలో విజయం సాధించలేకపోయామనే అతిచిన్న విషయాన్ని ఇంతకాలం తరువాత కూడా నాయకత్వం తెలుసుకోలేకపోయింది.

ఎన్నో పోరాటాల అనంతరం కూడా కమ్యూనిస్టు పార్టీల ధోరణుల్లో మౌలికంగా మార్చులేకపోవడం వల్ల సాధించిన విజయాల సంఖ్య తగ్గిపోతున్నది. ఎక్కడైతే పోరాటాలు జరిగాయో అక్కడే భూస్వామ్యం లోతుగా పాతుకుపోతున్నది. పెట్టుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నది. అక్కడే భూమి పరాయిదైపోతున్నది. లేదా పడావు పడిపోతున్నది. అడవులే గిరిజనేతరుల చేతుల్లోకి పోతున్నది. పోరాడిన స్త్రీలపై లైంగికాంశాల విషవలయాలు ముసురుకుంటున్నాయి. ప్రజలపై అణచివేత మరింత

136

అధికం అవుతున్నది.

విచిత్రం ఏమంటే అంతపెద్ద పోరాటం - ఏడేళ్ళపాటు నడిచినా పై వర్ణాల నాయకులకి వందల ఏళ్ళ నుండి పాతుకుపోయిన దేవదాసి, జోగిని, మాతంగి, శివపార్వతులు, బసివి, అడబాప, దాసి వంటి వ్యవస్థలు కనిపించలేదు. అలాంటి వేలాదిమంది (స్తీల ఆర్తనాదాలు వినిపించలేదు. ఆడబావ విధానాన్ని అంతమొందించడానికి కూడా నాయకులు ఎక్కడా ప్రయత్నించలేదు. రచయితలు నవలల్లో వారిని పాత్రలుగా మాత్రమే అక్కడక్కడ వర్ణించారు. కాని విధానాన్ని ఒక వ్యవస్థగా ఖండించలేదు.

'చిల్లరదేవుళ్ళు' నవలలో వనజ తల్లిని దొర బలవంతంగా ఆడబాప చేశాడు. ఆమె బతుకంతా లైంగికబానిసగా దొర గడిలోనే ఉండిపోయింది. ఆమె కూతురు వనజ కూడా ఆడబాపే. 'గంగు'లో నీలవేణి ఆడబాపే. 'మలుపు తిరిగిన రథచక్రాలు” నవలలో మాలతి, కస్తూరి వీరిద్దరు ఆడబాపలే. వీళ్ళంతా తక్కువ కులం స్త్రీలే. ఏకకాలంలో శ్రమ - లైంగిక హింసిక, దోపిడికి గురికావడం కన్నా మరో హింస ఏముంది. అలాంటి వ్యవస్థను పట్వారీలు, కరణాలు కూడా ప్రోత్సహించారు. 'విప్లవ జ్వాలి నవలలో రజాకారు నాయకులు రాజమ్మ, తాహేరాబీలను బలవంతంగా ఉంపుడు కత్తెలుగా మార్చారు. 'మృత్యుంజయలు” నవలలో తాము వెళ్ళిన ఒక ఊళ్ళో చూడమ్మ అనే ఆవిడని దేశ్‌ముఖ్‌ బలవంతంగా తన ఉంపుడుగత్తెగా చేసుకున్నాడు.

భూస్వామ్య విధానం సృష్టించిన స్తీ వ్యతిరేక వ్యవస్థలని నిర్మూలించడానికి పార్టీలోని ప్రగతిశీల మార్కిస్టు తత్వవేత్తలు, రచయితలు ఎందుకు ముందుకు రాలేదో ఈనాటికీ అర్థంకాదు. పోరాటానికి ముందో, తత్మాలమో, తరువాతో వీటిని సంస్మరించడానికో, తుదముట్టించడానికో లేదా సమస్యపై చర్చించడానికో ప్రయత్నించక పోవడం శోచనీయం. అసలీ వ్యవస్థల వల్ల వేలాది మంది స్త్రీల బతుకులు ఛిద్రమవుతున్నాయన్న ధ్యాస లేకపోవడం మరీ విచిత్రం. సాంఘిక, సామాజిక రంగంలోని పలు సమస్యలను గుర్తించడంలో, పరిష్కరించడంలో ఎందుకు మౌనం వహించాల్సి వచ్చిందో అర్ధం కాదు. ఆర్థిక సమస్యలను చర్చించడంలో, ఉద్యమించడంలో గల సౌలభ్యం సాంఘిక రూపాలలో సాగే శ్రమ - ఆర్థిక దోపిడీ రూపాలను గుర్తించడంలో లేదు.

సాఘింక, సాంస్కృతిక రంగంలోని ఆధిపత్య భావజాల శక్తుల సుదీర్ధ నాయకత్వం భారతీయ గ్రామీణ వ్యవస్థలోని సాంఘిక దోపిడీ వ్యవస్థ రూపాలను పసిగట్టడంలో సఫలం కాలేదు. నిజానికి భూస్వామ్య దోపిడీ చట్రాన్ని అతి తెలివిగా నిర్మించింది. తిరిగి అదే వర్గాలకు చెందిన ప్రగతివాదులు దాన్ని గుర్తించి కూలదోయడానికి ప్రయత్నించలేదు. రాగలిగిన దళిత, శ్రమశక్తులను నయానో భయానో అడ్డుకున్నాయి. వారి ఆలోచనలను అటుగా పోనివ్వలేదు. అలాంటి శక్తుల చేష్టలపై రాజకీయ

137

నాయకులకి ఏనాడూ పట్టులేకపోవడం గుర్తించాలి.

గ్రామీణ రంగంలో పనిచేస్తూ ఇలాంటి అంశాలను పార్టీ దృష్టికి తీసుకురావాల్సిన సాంస్కృతిక రంగ మేధావుల సుదీర్గ నిర్వీర్యతను గుర్తించలేదు. కారణాల వల్ల స్త్రీల సమస్యలని పోరాటానంతరం శిష్ట పరిశోధకులు కూడా గుర్తించడంలో విఫలమయ్యారు. కేవలం అకడమిక్‌ మార్చిస్ట్‌ చట్రంలో మునిగితేలడం వల్ల తెలుగు నవలా వరిశోధనలు రాజకీయ దృక్పథానికే, పైపై సామాజిక కోణాలకే పరిమితమయ్యాయి. ఇటువంటి సామాజిక కోణాలను, సమస్యలను గుర్తించే దార్భనికత శిష్టవర్గ పరిశోధకుల్లో, నవ్య ప్రజాస్వామిక సాంస్కృతిక రంగం గురించి మాట్లాడే శక్తుల్లో కుంటువడింది. అందువల్లే భారతదేశంలో విప్లవం సాఫల్యం కాలేదు. అసలు సిసలు భావవిప్లవం కూడా మొదలు కాలేదు. శక్తుల ప్రమేయం ఉన్నంతకాలం అది సాధ్యం కాదు కూడా”. (తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్తీ చైతన్యం, తిరునగరి దేవకీదేవి పి. హెచ్‌డి., ముద్రణ 2008లోని జయధీర్‌ తిరుమలరావు ముందుమాట. పేజి ౫౪ - 2 నుండి)

తిరునగరి దేవకీదేవి ప్రకారం ఉద్యమ నవలలు:

“కేవలం కథలు, కావ్యాలు, ప్రజాకళారూపాలను వెలువరించటంతోనే ఆనాటి కవులు, కళాకారులు, సాహితీవేత్తలు తృప్తి చెందలేదు. విమోచనోద్యమ నేపథ్యంతో అనేక నవలలను కూడా సృష్టించారు. క్రమంలోనే పోరాటం జరుగుతున్న రోజులలోనే అంటే 1947లో అదే కాలం నాటి పరిస్థితులను చిత్రీకరిస్తూ బొల్లిముంత శివరామకృష్ణ “'మృత్యుంజయులు” నవలను, 1948-51 నేపధ్యంతో లక్ష్మీ కాంతమోహన్‌ 1951లో “'సింహగర్భనిను రాయగా, 1938 నాటి నేపధ్యంతో 1951లో “ప్రజలమనిషి, 1940-45ల మధ్యకాలాన్ని చిత్రీకరిస్తూ “గంగు” నవలలను వట్టికోట ఆళ్వారుస్వామి రాశారు. 1947 నాటి తెలంగాణ పరిస్థితులను చిత్రిస్తూ 1956లో 'ఓనమాలు' నవలను దాని కొనసాగింపుగా “దావానలం” నవలను మహీధర రాంమోహనరావు రాశారు. “దావానలం” నవల విశాలాంధ్ర పత్రికలో సీరియల్‌గా ప్రచురితమైంది. అదే నవల 1962లో 'మృత్యువు నీడల్లో’ అనే పేరుతో తిరిగి ప్రచురితమైంది. తర్వాత 1964లో 1938కి ముందు పరిస్థితులకు అద్దంపడుతూ దాశరథి రంగాచార్య “చిల్లర దేవుళ్ళు” నవలను రాయగా, 1948 వరకు ఉన్న పరిస్థితుల ఆధారంగా 1964లో గొల్లపూడి నారాయణరావు '*తెలుగుగడ్డ” రచించారు. అటుపై 1942-48లో గొల్లపూడి నారాయణరావు తెలుగుగడ్డ' రచించారు.

అటుపై 1942-48ల మధ్య కాలాన్ని ఆధారంగా చేసుకొని 1971లో మోదుగుపూలు”, 1948-1968ల మధ్య కాలాన్ని ఆధారం చేసుకొని “జనపదం” నవలలను దాశరథి రంగాచార్య రచించారు. అటు తర్వాత తిరునగరి రామాంజనేయులు

138

1982 డిసెంబర్‌ నుండి 1984 మే వరకు ప్రజాసాహితిలో 1948 నాటి తెలంగాణ పరిస్థితుల ఆధారంగా 'సంగం” నవలను సీరియల్‌గా పాఠకులకు అందించారు. 1984లో 1946-86ల మధ్యకాలం పరిస్థితుల ఆధారంగా ముదిగంటి సుజాతారెడ్డి మలుపు తిరిగిన రధచక్రాలు' నవలను రచించారు. 1986లో బి.యన్‌. శాస్త్రి 1947-48లలో నల్గొండలో జరిగిన పోరాటం ఆధారంగా 'విప్లవజ్వాలి నవలను, 1996లో కందిమళ్ళ (ప్రతాపరెడ్డి సంఘం ఏర్పడక పూర్వం నుండి పోరాట విరమణానంతరం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో విమోచనోద్యమాలు జరుపుకునే వరకు గల పరిణామాలను చిత్రీకరిస్తూ “బందూక్‌ నవలను రాశారు. ఇవి కాకుండా గొల్లపూడి నారాయణరావు “కొత్తరోజులు పాతరోజులు’ నవలలను, మహీధర రాంమోహనరావు “రథచక్రాలు నవలను, భాస్మరభట్ల కృష్ణారావు “యుగసంధి, సరిపల్లి కృష్ణారెడ్డి “ఉప్పెని నవలను కూడా పేర్మానవచ్చు. ఇటీవలి కాలంలో అంటే 2008లో అంపశయ్య నవీన్‌ తెలంగాణ పోరాటం, దాని అనంతర కాలాన్ని చిత్రిస్తూ కాలరేఖలు” నవలను రచించారు. అంతేకాక కిషన్‌ చందర్‌ ఉర్టూ నవల 'జైత్రయాత్రను పి. శేషగిరిరావు అనువదించారు”.

ఈపై ఇరవై ఒక్క నవలల్లో సర్మారు జిల్లా రచయితల కలం నుండే ఎక్కువ నవలలు వెలువడ్డాయి. విషయాన్ని గమనిస్తే ఉద్యమం ప్రాంతేతర రచయితలపై వేసిన ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణ పోరాట చిత్రణలో 1947లోనే వెలువడిన మొదటి నవల 'మృత్యుంజయులు”. 1984లో అదే పోరాటాన్ని చిత్రిస్తూ ముదిగంటి సుజాతారెడ్డి కలం నుండి 'మలుపు తిరిగిన రథచక్రాలు నవల వెలువడింది. నవల తప్ప మిగిలిన నవలలన్నీ పురుషులే రాశారు. ఆమె తెలంగాణాకు చెందింది. నవల రచనా కాలాలను గమనించినపుడు ఒక రచయిత్రి కలం నుండి నేపథ్యంతో నవల వెలువడడానికి సుమారు నాలుగు దశాబ్దాల కాలం పట్టింది అనే విషయాన్ని గమనించవచ్చు. (తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం, తిరునగరి దేవకీదేవి ఫి. హెచ్‌డి., ముద్రణ 2008లోని పేజి 1% - నుండి)

6

1970-80 మధ్య నవలలు

1960ల నుండి పత్రికల సీరియల్‌ నవలలు పుస్తకాలుగా ప్రచురించడం ద్వారా విజయవాడ, తెనాలి ప్రచురణ సంస్థలు నవలా సాహిత్యాన్ని మరింత పాపులర్‌ చేశాయి. సీరియల్‌గా వచ్చిన నవల అనే పేరు నవల ఎక్కువ అమ్మడానికి సర్టిఫికెట్‌ అయ్యింది. వేలాది పాఠకులు నవలలను కొనేబదులుగా, పత్రికలనుండి ఎప్పటి కప్పుడు కట్‌ చేసి, నవల పూర్తయ్యాక బైండింగ్‌ చేయించి దాచుకున్నారు.

దశనుండి తిరిగి డైరెక్ట్‌ నవలలు రావడానికి కొన్ని ప్రచురణ సంస్థలు

139

పూనుకున్నాయి. అలాంటివాటిల్లో ఎమెస్కో విశాలాంధ్ర కృషిని ప్రత్యేకంగా గుర్తుచేసుకోవడం అవసరం.

1970-1980 దశాబ్దంలో మహిళల నవలలు, విప్లవ నవలలు, సామాజిక చైతన్య నవలలు ఎన్నో వెలువడ్డాయి. పాపులర్‌ నవలల మలి దశాబ్దంగా కూడా దీన్ని చెప్పవచ్చు.

1980-1990 దశాబ్దాన్ని మూడవదశ పాపులర్‌ నవలల దశాబ్దంగా పేర్కొనవచ్చు. దశబ్దాన్ని దయ్యాలు, భూతాలు, సెక్స్‌, క్షుద్ర వ్యాపార నవలల దశాబ్దంగా, వామపక్ష సాహితీవేత్తలు వర్గీకరించారు. అయితే అదే సమయంలో విప్లవ నవలా వికాసం వేగం పుంజుకుంది. సామాజిక చైతన్యంతో రాసే నవలలకు పెద్దపీట వేయడానికి ఇతర నవలలను వ్యాపార నవలలు అని, పాపులర్‌ నవలలు అని “కు పెట్టి ప్రచారం చేయడం జరిగింది.

ఎమెస్కో విశాలాంధ్ర నవలల సిరీస్‌లో వెలువడిన నవలలు:

1970లలో ఎం. శేషాచలం అండ్‌ కో అనే ప్రచురణ సంస్థ పాపులర్‌ నవలలు డైరెక్టుగా అచ్చు వేయడానికి సిరీస్‌ని సంక్షిప్త నామంతో ఎమెస్కో పాకెట్‌ బుక్స్‌ అని పేరు పెట్టింది. అలా ప్రాచీన కావ్యాలను అచ్చువేసింది. ప్రతినెలా నాలుగు నవలలను, రెండు రూపాయలకు ఒకటి చొప్పున ప్రచురించి అందించింది. ప్రతి ఇరవైఐదవ నవల విశ్వనాథ సత్యనారాయణ నవలలను అచ్చువేసింది. పోటీలో చాలామంది రచనలు అచ్చయ్యాయి. తెలంగాణ నవలలు ఇందులో చాలా తక్కువ. ఉద్యమ నవలలు మరీ తక్కువ.

దీని గురించి ఆలోచించిన విశాలాంధ్ర ప్రచురణాలయంవారు ఏటా నవలల పోటీ నిర్వహించి, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇచ్చి అచ్చువేశారు. ఎన్నిక కాని నవలలు ఏదో ఒక రూపంలో, ఎక్కడో ఒకచోట అచ్చయ్యాయి. ఇలా పోటీకి రాయబడిన నవలలు రాత(ప్రతులుగా మిగిలిపోయినవి కూడా కొన్ని ఉండి ఉంటాయి. విశాలాంధ్ర పోటీలో ఎన్నో చక్కటి నవలలు వెలువడ్డాయి. దశరథ్‌, మలయశ్రీ, సుద్దాల అశోక్‌తేజ వంటి వారి నవలలు కూడా సిరీస్‌లో ప్రచురించబడ్డాయి.

సచిత్ర వార పత్రికల్లో తెలంగాణ నవలలు:

సచిత్ర వార పత్రికల్లో దాశరథి రంగాచార్య నవలలు, (ప్రగతిశీల ఉద్యమ నవలలు కొన్ని ప్రచురించబడ్డాయి. వార పత్రికల్లో, మాస పత్రికల్లో తెలంగాణ నవలలు చాలా తక్కువ. అయితే అంపశయ్య నవీన్‌, రామా చంద్రమౌళి, మాదిరెడ్డి సులోచన, పోల్కంపల్లి శాంతాదేవి, ఇల్లిందల సరస్వతీ దేవి, దాశరధి రంగాచార్య, కాలువ మల్లయ్య, సరిపల్లి

140

కృష్ణారెడ్డి నవలలు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ప్రజామత, నవ్య, ప్రగతి, కృష్ణా పత్రిక తదితర పత్రికల్లో సీరియల్‌ నవలలు ప్రచురించబడ్డాయి. నవీన్‌ అంపశయ్య నవల, అల్లం రాజయ్య 'కొలిమంటుకున్నది” మొదలైన నవలలు సృజన మాస పత్రికలో సీరియల్స్‌గా ప్రచురించబడ్డాయి.

స్వాతి, చతుర మాసపత్రికల అనుబంధ నవలలు:

1967 నుండి స్వాతి, తరుణ, జ్యోతి, జయశ్రీ మొదలైన మాసపత్రికలు వెలువడ్డాయి. అంతకుముందే యువ మాసపత్రిక వెలువడింది. వీటిల్లో కొన్ని నవలలు సీరియల్స్‌గా ప్రచురించబడ్డాయి. తర్వాత స్వాతి మాసపత్రిక (ప్రతినెలా అనుబంధ నవలను ప్రచురించడం ప్రారంభించింది. 1977లో ప్రారంభమైన చతుర మాసపత్రిక ప్రతినెలా ఒక నవలను ప్రచురించింది. స్వాతి, చతుర మాసపత్రికలు గత 35 ఏళ్ళలో చెరొక 400లకు పైగా నవలలు ప్రచురించారు. వాటిలో తెలంగాణ నవలలు చాలా తక్కువ. కాలువ మల్లయ్య రాసిన 'భూమిపుత్రుడు”, “సాంబయ్య చదువు), 'గువ్వలచెన్నా; ఎం.వి. తిరుపతయ్య రాసిన “బతుకు” వసంతరావు దేశ్‌పాండే రాసిన “అడవి”, “ఊరు” మొదలైన నవలలు చతుర మాసపత్రికలో ప్రచురించబడ్డాయి. నవీన్‌, కాలువ మల్లయ్య మొదలైన రచయితల నవలలు చతుర, స్వాతి, మాసపత్రికల్లో అనుబంధ నవలలుగా వెలువడ్డాయి.

ఇలా దశాబ్దాల వారీగా తెలంగాణ నవల పరిణామాలను ఈక్రిందివిధంగా పరిశీలించవచ్చు.

1. 1970-80ల మధ్య వెలువడిన తెలంగాణ నవలలు. 2. 1980-90ల మధ్య రాసిన ప్రీవాద, దళితవాద, విప్లవ నవలలు. 3. 1980-90ల మధ్య రాసిన సాంఘిక నవలలు. 4. 1990 నుండి నూతన సామాజిక వర్గాలు, కులాలనుండి ఎదిగిన రచయితలు రాసిన నవలలు. 5. 1990 నుండి ప్రపంచీకరణ, (పైవేటీకరణ పరిణామాల గురించి రాసిన నవలలు. 6. 2000-2012ల మధ్య రాసిన నవలలు. 1970-80లలో దాశరథి, అంపశయ్య నవీన్‌, రామా చంద్రమౌళి, చెరబండరాజు, మలయశ్రీ, పోల్మంపల్లి శాంతాదేవి, మాదిరెడ్డి సులోచన, బొమ్మ హేమాదేవి, వెంపో, సరిపల్లి కృష్ణారెడ్డి, సిహెచ్‌. మధు, దశరథ్‌ పలు నవలలు రాశారు. వీరి ప్రధాన రచనంతా దశాబ్దంలో (ప్రారంభమై వికాసం చెందింది. ఆయా దశాబ్దాల వారీగా నవలల్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రచయితల మొత్తం నవలలను

141

ఈక్రింద పేర్కొంటున్నాము.

దాశరథి రంగాచార్య నవలలు: 1. చిల్లర దేవుళ్ళు, 2. మోదుగపూలు, 3. జీవనయానం, 4. శరతల్బం, 5. పావని, 6. రానున్నది ఏది నిజం, 7. మానవత, 8. జనపదం.

కరీంనగర్‌ జిల్లా, జగిత్యాలకు చెందిన ఎం.వి. నరసింహారెడ్డి 1962లో “పేమజీవుల ఆదర్శ త్యాగాలు, నవల రాశారు., ఎం. తిరుపతయ్య 1. “జీవన సమరంి, 2. “బతుకు నవలలను రాశారు. అంపశయ్య నవీన్‌ రాసిన “చీకటి రోజులు” నవలలో ఎమర్జెన్సీలో చిత్రహింసలు అనుభవించిన కథానాయకుడు శ్రీనివాసరావు తిరుపతయ్యే. చతుర నవలల పోటీలో “బతుకు నవల బహుమతి పొందింది. చివరి గడియల్లో ఉంటూ కూడా జీవన సమరం” అనే గొప్ప నవలను రాశారు. అడవి బాపిరాజు నవల మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి. హెచ్‌డి. చేశారు.

జ్వాలాముఖి రాసిన నవలల్లో “వేలాడిన మందారం బాగా ప్రాచుర్యం పొందింది. నందిగం కృష్ణారావు అనేక నవలలు రాశారు. “చీకట్లో నల్లపిల్లొని ప్రముఖంగా పేర్కొంటారు.

అల్లం రాజయ్య నవలలు: కొలిమి అంటుకున్నది 1978.

అల్లం రాజయ్య నవలల గురించి కాత్యాయనీ విద్మహే, వరవరరావు, ఎన్‌. వేణుగోపాల్‌, మొదలైనవాళ్ళు ఎంతో విపులంగా విశ్లేషించారు. విరసం విప్లవోద్యమ నవలలకు ప్రతినిధిగా వీరి నవలలను పేర్కొంది. అమ్మంగి వేణుగోపాల్‌ రాజయ్య నవలగురించి ఇలా అంటారు. “సాధారణంగా అల్లం రాజయ్య రచనల్లో సామాజిక విభజన రేఖ స్పష్టంగా ఉంటుంది. దీని మూలంగా వర్గ సంబంధాల చిత్రణ మొదలు, సంఘర్షణను సంఘటనాత్మకం చేయటం దాకా ఉండే అంశాలను రచయిత తాను విశ్వసించే భావజాలం వెలుగులో సృజించటం సులభమయింది. సంభాషణల్లోని 'వాక్కు బలమైన ప్రాంతీయతతో, మౌఖిక సంప్రదాయంతో పదునుదేరి ఉంటుంది. కారణాల వల్ల గ్రామీణ దైనందిన జీవన యుద్ధ క్షేత్రంలోకి పాఠకుడిగా అడుగుపెట్టిన వాడు పాత్రగా మారక తప్పదు అంటారు అమ్మంగి వేణుగోపాల్‌.

కొమురం భీము నవల

సాహు, అల్లం రాజయ్య కలిసి రాసిన 'కొమురం భీము నవల గురించి వరవరరావు విశ్లేషిస్తూ ఇలా పేర్కొన్నారు. “ఒక్క మాటలో చెప్పాలంటే 'కొమురం భీము నవల 'దండకారుణ్య పర్‌స్పెక్టివొలో వచ్చింది. జగిత్యాల జైత్రయాత్ర కొనసాగింపుగా వచ్చింది. (ఫ్రెంచి విప్లవం లేకపోతే రెండు మహానగరాలు’ నవల లేనట్లే, జగిత్యాల జైత్రయాత్ర లేకపోతే 'కొలిమంటుకున్నది' నవల లేనట్లే. ఇందటైల్లి సంఘటన లేకపోతే 'కొమురం

142

భీము’ నవల లేదు. ఇంద్రవెల్లి సంఘటన వెలుగులో అల్లం రాజయ్య, సాహులు కొమురం భీము’ నవల రచించారు. దీనికొక గుణాత్మకమైనటువంటి తేడా ఉన్నది. అల్లం రాజయ్యతోపాటు కొమురం భీము నవల రాసిన సాహు ఒక విప్లవ పార్టీ పర్‌స్పెక్టిన్‌ను అమలు చేసే క్రమంలో అడవిలో ప్రవేశించి, అడవిని సర్వే చేసి, అడవిలో పోరాటం నిర్మించిన వారిలో భాగమయ్యాడు....” (కొమురం భీము’ నవల, సాహు, అల్లంరాజయ్య; ఐదవ ముద్రణ, 2013, వరవరరావు ముందుమాట)

చెరబండరాజు విప్లవకవిగా సుప్రసిద్ధులు ఆయన కథలతోపాటు, నాలుగు నవలలు కూడా రాశారు. అవి: 1. మాపల్లె, 1980, 2. ప్రస్థానం, 1980, 3. నిప్పురాళ్ళు,4. దారి పొడుగునా. నవలల్లో గ్రామీణ సన్నకారు రైతుల జీవితం అందులో భూమి సమస్య, భూస్వాముల సమస్య, సంఘర్షణ, వలసలు, ఉద్యమం, మలుపులు, ఎన్‌కౌంటర్‌లు, రాజ్యహింస, సాంఘిక నవలల్లో భాగంగా చిత్రించినంత సహజంగా చిత్రించారు.

'తాడిగిరి పోతరాజు విప్లవ రచయితల్లో ఒకరు. 1964లో రాసిన “మట్టి మనుషులు’ నవలకు ఆంధ్రప్రభ వీక్లీలో బహుమతి ఇచ్చారు. తర్వాత పుస్తకంగా వెలువడింది. తర్వాత “పావురాలు” నవలను అనేక కథలను వెలువరించారు.

నల్లగొండ జిల్లాకు చెందిన వెంపో చాలా నవలలు రాశారు. 'ఈ దేశం నాది” వెలుతురు మలుపు అనే నవలల పేర్లు మాత్రమే తెలిశాయి. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 'రాజీవి కలం పేరుతో రాసే వై. లక్ష్మివాసన్‌, 'నదుస్తున్న కథ, 'రాబోవుతరం స్తీ నవలలను వెలువరించారు.

అంపశయ్య నవీన్‌ 80 నవలలు:

1. అంపశయ్య, 1968; 2. విచలిత, ౩. ముళ్లపొదలు, 4. సౌజన్య, 5. సంకెళ్ళు, 6. చీకటి రోజులు, 7. మౌనరాగాలు 8. దాగుడుమూతలు, 9. కరుణ, 10. ప్రత్యూష 11. ప్రయాణాలలో ప్రమదలు, 12. అంతస్రవంతి, 18. మనోరణ్యం, 14. వుమెన్స్‌ కాలేజి, 15. దృక్కోణాలు, 16. అమెరికా, 17. బాంధవ్యాలు, 18. కాలరేఖలు, 19. చెదిరిన స్వప్నాలు, 20. రక్తకాసారం, 21. ప్రేమోన్మాదులు, 22. అవాస్తవికుడు, 28. ఇల్లు ఇల్లనియేవు, 24. అగాధాలు, 25. తారుమారు, 26. అనురాగస్రవంతి,27. తీరని దాహం మొదలైనవాటితో పాటు అనేక కథలు వెలువరించారు.

నవీన్‌ నవలల గురించి అమ్మంగి వేణుగోపాల్‌ చక్కని మాట ఇలా చెప్పారు. “ఏ వయసులో వున్నవారినైనా యౌవనంలోకి లాక్కుపోయే అయస్కాంత శక్తి కొన్ని రచనలకే

143

వుంటుంది. తెలుగులో నవీన్‌ అంపశయ్య (1969) కొన్నింటిలో ఒకటి. లైంగిక భావాలతో వేడెక్కే సౌందర్యారాధనతో తన్మయం చెందే, సామాజిక స్పృహతో ఉప్పొంగే కథానాయకుడు రవి పాత్రచిత్రణలోనే నవయౌవనం నవల జీవశక్తి. యౌవనం ఎంత శారీరకమో అంత మానసికం. నవలలో నిత్యనూతన చైతన్యం నిండినవాళ్ళు, కుట్రలు కుతంత్రాలతో ఆధిపత్య ధోరణి కనపరచేవాళ్ళు, పైకి ఎగబాకటానికి నిచ్చెనకోసం కాచుకుకూచున్న వాళ్ళు - ఇట్లా అన్నిరకాల యువకులు కనిపిస్తారు. సుమారు నలభై సంవత్సరాల (1967-2007) రచనా జీవితంలో “అంపశయ్య” మొదలు, 2007లో రచించిన “అమెరికా అమెరికా” దాకా నవీన్‌ రచించిన అధిక శాతం జీవితాలను ఇంత అభినివేషంతో చిత్రించిన మరో నవలా రచయిత తెలుగులో లేరంటే అతిశయోక్తి కాదు. దాదాపు ఒకే వయోవర్గం పాత్రలను తీసుకొని వైవిధ్యం సాధించటం చిన్న విషయం కాదు. మొదట్లో 'సృజని పత్రికలో సీరియల్‌గా కొంతభాగం అచ్చయిన తర్వాత “అంపశయ్య 1969 నవంబర్‌లో పుస్తకరూపంలో వచ్చింది. తర్వాత వరుసగా ఏడు ముద్రణలు పొందింది. (ఇది ఎనిమిదోవ ముద్రణకు రాసిన ముందుమాట నుండి) (సాహిత్య సందర్శనం, సమకాలీన స్పందన, అమ్మంగి వేణుగోపాల్‌ వ్యాస సంపుటి - 2012, పేజి 56 నుండి)

సాహిత్యంలో అంపశయ్య నవలకు గల విశిష్టత:

నవీన్‌ నవలలపై ఎందరో ఎన్నో విశ్లేషణలు చేశారు. సహవాసి ఇలా విశ్లేషించారు. “ఆద్యంతం చైతన్యస్రవంతి కథన పద్ధతిలో సాగిన మొదటి నవలగా అంపశయ్యను సాహిత్య విమర్శకులు గుర్తించారు. బుచ్చిబాబు చివరకు మిగిలేది, రావిశాస్త్రి అల్పజీవి, వడ్డెర చండీదాస్‌ హిమజ్వాల వంటి నవలల్లో చైతన్యస్రవంతి కథన పద్ధతి కొంతమేర కనిపిస్తుంది. అయితె మొదటి నుంచి చివర దాకా కథన విన్యాసపు పదును మెరుపులు గోచరమయ్యేది అంపశయ్యలోనే...

అంపశయ్య ఒక రకంగా ఆత్మకథాత్మక నవల కూడా. “నా డైరీ ప్రతి పేజీలోనూ నవలుంది!” అన్న నవీన్‌ వ్యాసం (ఆంధ్రజ్యోతి, 27-12-2004 సంచిక) ఇందుకు సాక్ష్యం. 1964లో తను ప్రతిరోజూ డైరీ రాశానని, డైరీలోని ప్రతి పేజీలో, “అంపశయ్య నవలుందనిపించింది” అని నవీన్‌ వెల్లడించారు”. (నూరేళ్ళ తెలుగు నవల, సహవాసి, పేజి. 156 నుండి)

కరీంనగర్‌ జిల్లా మంథనిలో ఉపాధ్యాయులుగా పనిచేసి అకాల మరణం చెందిన దశరథ్‌ 1. శతాబ్దాల నిశ్శబ్దం (1980), 2. తెగిపోయిన సంకెళ్ళు నవలలు రాశారు. ఇవి విశాలాంధ్ర నవలల పోటీల్లో బహుమతులు పొందిన ఉద్యమ నేపథ్య నవలలు. తిరుకోవలూరు శశిరేఖ “కాలానికి సమాధి” నవల రాసినట్లు తెలుస్తున్నది. సుప్రసిద్ధ

144

సినీకవి సుద్దాల అశోక్‌తేజ 1980లలో రాసిన “వెలుగు రేఖలు’ నవల కూడా ఒక ఉద్యమ నవల. ఇది విశాలాంధ్ర నవలల పోటీలో ఎన్నికై ప్రచురించబడింది.

డా॥ మలయశ్రీ రాసిన 12 నవలలు:

శతాధిక గ్రంథకర్త మలయశ్రీ రాసిన నవలలు కొన్ని విశాలాంధ్ర పోటీలో బహుమతులు పొందాయి. 1978లో స్కైలాబ్‌ పడి ప్రపంచం మునుగుతుందని పుకార్లు వ్యాపించినప్పుడు జరిగిన సంఘటనలను చక్కని నవలగా రూపొందించారు. నాస్తిక హేతువాద దృక్పథంతో ప్రత్యేకంగా నవలలు రాశారు. వీరి తమ్ముడు అంపశయ్య నవీన్‌ తోడల్లుడైన ఎస్‌.ఎల్స్‌ఎన్‌. బాబు *నవత। - 1981, “విషవలయం” - 1983 మొదలైన నవలలు రాశారు.

మలయశ్రీ 12 నవలలు: 1 తిరుగుబాటు - 1982, 2. నిర్ణయం - 2011, 8. కలవారి కష్టాలు - 1978, 4. తాగుబోతు - 1979, 5. విచిత్ర ప్రేమ - 1979, 6. ఏం మగాళ్ళు - 1979, 7. వెన్నెల వాన - 1980, 8. వింత బతుకులు - 1981, 9. మంటల వర్షం - 1982, 10. ఆజాద్‌ చంద్రశేఖర్‌ - 1982, 11. బ్రహ్మంగారి కథ - 1982, 12. ఆగోడపై ఒక కిటికీ ఉండేది (హిందీ అనువాదం).

నాస్తిక హేతువాదియైన రేగులపాటి కిషన్‌రావు అనేక కథా సంపుటాలు, కవితా సంపుటాలతోపాటు కొన్ని నవలలు ప్రచురించారు. 1. “ఆమె వితంతువు కాదు - 1976, 2. పతివ్రత ఎవరు - 1978, 3. సంఘర్షణ - 1981, 4. (ప్రేమకు పెళ్ళి ఎప్పుడు? - 1982, తెలంగాణ ఉద్యమం గురించి సరిపెల్లి కృష్ణారెడ్డి “ఉప్పెన నవల 1978లో రాశారు. నిజామాబాద్‌కు చెందిన సిహెచ్‌. మధు “తూర్పు ఎరుపులో మహిళ, 1978, స్వాతి మాసపత్రికలో రాశారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన పాపిరెడ్డి, అంకాల వీరేశం కథలతో పాటు ఒకటి అర నవలలు రాసినట్టుగా తెలుస్తున్నది.

రామా చంద్రమౌళి 18 నవలలు:

1. శాపగ్రస్తులు, 1974, 2. చూడునీళ్లు, 8. ప్రవాహం, 4. శాంతివనం, 5. తెలిసి చేసిన తప్పు, 6. అమృతం తాగిన రాక్షసులు, 7. వక్రరేఖలు, 8. చదరంగంలో మనుషులు, 9. పిచ్చిగీతలు, 10. రాగధార, 11. నిన్ను నీవు తెలుసుకో, 12. పొగమంచు, 18. మజిలీ, 14. దారితప్పిన మనుషులు, 15. ఎడారిలో చంద్రుడు, 16. ఎక్కడినుండి ఎక్కడిదాక, 17. పరంపర, 18. మొదటి చీమ.

నవలలను వాటి వస్తు, శిల్ప వైవిధ్యాన్ని సామాజిక పరిణామాలు వీటిలో ఏమేరకు చిత్రించబడ్డాయో పరిశీలించడం అవసరం. ప్రస్తుతం ఇందులో చర్చ దీని

145

పరిమితికి మించినది. అయితే ఒకమాట. నవలల్లో తెలంగాణ కుటుంబ జీవితాలు, మధ్య తరగతి జీవితాలు, ఉద్యమాల చిత్రణ, ఉమ్మడి కుటుంబాలు శిథిలమౌతూ వ్యక్తి కుటుంబాలుగా మారుతున్న క్రమం, ఆధునిక విద్య, ఉద్యోగాలు అందుకుంటూ ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలు, మధ్యతరగతిగా స్థిరపడిన తీరు చిత్రించబడ్డాయి.

అయితే చాలా రచనల్లో శరత్‌బాబు నవలల ప్రభావంతో రాసిన ట్రిటీషాంధ్ర మహిళా రచయితల రచనలు కొనసాగిన క్రమానికి కొనసాగింపుగా తెలంగాణ నవలలు కూడా స్వస్వరూప జ్ఞానం కోల్పోయి పరాయీకరించిన సంస్కృతిని, జీవన విధానాన్ని సామాజిక విలువలను ప్రతిపాదించి, ఆదర్శీకరించిన నవలలు తక్కువేమీకాదు.

స్వయంగా తెలంగాణ భాషను, సంస్కృతిని పాత్రలను, సంఘటనలను చిత్రించడంలో దాశరథి, నవీన్‌ తదితరులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే దాశరథి, నవీన్‌, రామాచంద్రమౌళి, అల్లం రాజయ్య, మలయశ్రీ జీవితంలో కులం నిర్వహిస్తున్న పాత్ర, కుల వివక్ష ఆయా కులాల ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం గురించి ఏమేరకు రాశారో పరిశీలించాల్సిన అవసరం ఉంది. వీరు కులాన్ని అది జీవితంలో నిర్వహిస్తున్న పాత్రను పెద్దగా పట్టించుకోలేదు. మధ్యతరగతిగా, ఉద్యమకారులుగా ఎదిగే క్రమాన్ని మాత్రమే ఎక్కువగా పట్టించుకున్నారు. బోయ జంగయ్య, బి. ఎస్‌. రాములు, కాలువ మల్లయ్య మొదలైనవారు కుల సమస్యను, కుల సంస్కృతిని, కుల వృత్తులను తమ నవలల్లో పలుకోణాల్లో చిత్రించారు.

1980-90 మధ్య తెలంగాణ నవలలు

1977 నుండి తెలంగాణ సాహిత్యంలో ఒక మలుపును గమనించవచ్చు. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఎమర్జెన్సీ చీకటి రోజులను గురించి నవీన్‌ అనేక నవలల సీక్వెల్స్‌ రాశారు. భారతీయ సాహిత్యంలో ఎమర్జెన్సీ అత్యాచారాల గురించి, అనేక రచనలు వెలువడ్డాయి. ఎమర్జెన్సీ కన్నా ముందు తెలంగాణలో విప్లవ ఉద్యమం విద్యార్థి యువకుల్లో ప్రాణం పోసుకున్నది. గ్రామంలోకి అప్పుడప్పుడే చేరుకునే సమయంలో ఎమర్జెన్సీ విధించబడింది. 1970-74 మధ్య సాగిన విప్లవోద్యమంలో భూమయ్య, కిష్టాగౌడ్‌లు అరెస్టయ్యి ఎమర్జెన్సీలో ఉరి తీయబడ్డారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత గ్రామాలకు తరలండి అనే పిలుపుతో రైతుకూలీ సంఘాలను, యువజన సంఘాలను, జననాట్య మండలి బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాల్లో భూమికోసం సాగే ఉద్యమం గురించి, అనేక కథలు, నవలలు వెలువడ్డాయి. సృజనలో అల్లం

146

రాజయ్య రాసిన 'కొలిమంటుకున్నది నవల 1978లో సీరియల్‌గా ప్రచురించబడింది. తెలంగాణ ముఖ్యంగా కరీంనగర్‌ జిల్లా మంథని ప్రాంత మాండలికంలో నవల మొత్తం నడిచింది. నవల వెలువడిన కాలంలో తెలంగాణ భాషకు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చర్చ సాగింది. తెలంగాణ భాషలో